news18-telugu
Updated: December 1, 2020, 1:09 PM IST
Karthika Deepam: మోనిత చెంప పగులగొట్టిన వంటలక్క..
Photo : Star maa
కార్తీకదీపం.. ఈ సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతిరోజు ఓ సరికొత్త ట్విస్ట్‌తో ప్రజల ముందుకు వచ్చి టాప్ రేటింగ్ టీఆర్పీతో దూసుకుపోతుంది. ఇక ఈ సీరియల్లో చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు నటించమంటే జీవించేస్తున్నారు. అందరూ కూడా నిజంగా వారికే ఆ ఘటనలు జరుగుతున్నాయనే రేంజ్లో నటిస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో కొంచం సాగదీస్తున్నప్పటికీ ఈ సీరియల్లో ఈరోజు అదిరిపోయే ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎప్పుడెప్పుడు వంటలక్కను తరిమికొడదామా.. కార్తీక్ ని పెళ్లి చేసుకొని సౌందర్య కోడలు అవుదామా అని గుంటనక్కలా ఎదురు చూస్తున్న మోనితకు ఈరోజు వంటలక్క చుక్కలు చూపించింది. ఎవరూ ఊహించని రేంజ్లో వంటలక్క ఆమె ప్రతాపాన్ని చూపించింది. గత కొన్ని ఎపిసోడ్స్ లో వంటలక్కే తన తల్లి అని తెలుసుకున్న హిమ పోయి పోయి మోనితను సహాయం అడుగుతుంది. ఆ సహాయాన్ని అడ్డుపెట్టుకున్న మోనిత ఈరోజు ఎపిసోడ్లో ఓ రేంజ్లో యాక్ట్ చేస్తుంది.

వంటలక్క.. Photo : Star maa
''నువ్వే నీ చేజేతులారా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు దీప.. పద నిన్ను డాక్టర్ బాబుని కలుపుతాను'' అంటూ వంటలక్క దగ్గర డ్రామా ప్లే చేస్తుంది మోనిత. అది డ్రామా అని తెలిసిన వంటలక్క మోనిత చెంప చెల్లుమనిపించి ఇంటి బయటకు తరిమేస్తుంది. అది అంత కిటికీ వద్ద మొబైల్ పెట్టి రికార్డు చేసిన మోనిత ఏం చేస్తుంది? సౌందర్య, వంటలక్కను మళ్లీ కలిసి ఏం మాట్లాడుతుంది.. మోనితను వారు ఇద్దరు ఎందుకు మెచ్చుకుంటారు? అనేది తెలియాలి అంటే ఈరోజు రాత్రి స్టార్ మాలో ప్రసారం అయ్యే సీరియల్ చూడాల్సిందే. ఏది ఏమైనా మోనిత ప్లాన్స్, వంటలక్క దెబ్బలకు కొదవే లేదు. వంటలక్క ఎంత కొట్టిన ఆ మోనిత ప్లాన్స్ వెయ్యడం అపాదు.. మరి ఈరోజు జరగబోయే ఎపిసోడ్‌తో అయినా సీరియల్లో సరికొత్త ట్విస్ట్ చోటుచేసుకుంటుందేమో చూడాలి.
Published by:
Suresh Rachamalla
First published:
December 1, 2020, 1:09 PM IST