Home /News /movies /

KARTHIKA DEEPAM VANTALAKKA SERIAL RATINGS BEATEN BY SOME OTHER PROGRAMMES TA

కార్తీక దీపంకు అనుకోని షాక్.. వంటలక్కకు తొలి దెబ్బ మాములుగా లేదుగా..

కార్తీక దీపం (Image: Hotstar)

కార్తీక దీపం (Image: Hotstar)

స్మాల్ స్క్రీన్  బాహుబలి కార్తీక దీపం సీరియల్ ఫ్రెష్ ఎపిసోడ్స్ రెండు వారాల నుంచి ప్రసారమవుతోంది. తాజాగా ఈ సీరియల్‌కు అనుకోని షాక్ తగిలింది.

    స్మాల్ స్క్రీన్  బాహుబలి కార్తీక దీపం సీరియల్ ఫ్రెష్ ఎపిసోడ్స్ రెండు వారాల నుంచి ప్రసారమవుతోంది. ఇప్పటికే ఈ సీరియల్ లాక్ డౌన్ కారణంగా 3 నెలల పాటు నిలిచిపోయింది. ఇంటిల్లిపాది ఆదరించే ఈ సీరియల్ అటు మహిళా ప్రేక్షకులనే కాదు...పురుషులను కూడా ఆకట్టుకుంది. ఐపీఎల్, వరల్డ్ కప్ ఇలా ఏ సీజన్ లో అయినా టీఆర్బీ రేటింగ్స్ లో దూసుకెళ్లిన కార్తీక దీపం  జూన్ 29 రెగ్యులర్‌గా ప్రసారమవుతోంది.  ఐతే.. రేటింగ్స్ విషయంలో ఎపుడు ముందుండే ఈ సీరియల్‌కు గత రెండు వారాలుగా రేటింగ్స్ బాగానే ఉన్నా.. నెంబర్ వన్ స్ఠాయిలో మాత్రం లేదు. ఒకప్పుడు మన దేశంలోనే నెంబర్ స్థాయిలో ఉన్న సీరియల్‌ను ఈ టీవీలో ప్రసారమయ్యే ఈటీవీ న్యూస్‌తో పాటు మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా క్రాస్ చేసింది. మొత్తంగా చూసుకుంటే.. మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఓవరాల్‌గా మాత్రం స్టార్ మా ఛానెల్ మాత్రం నెంబర్ వన్ స్థానంలో కొనసాగడం విశేషం. చాలా రోజుల తర్వాత కార్తీక దీపం సీరియల్ ప్రసారమైన తర్వాత రేటింగ్స్‌లో వెనకబడటం విశేషం. తెలుగు ఛానెల్స్‌లో ప్రసారమయ్యే టీవీ సీరియల్స్‌లలో ఇప్పటికీ కార్తీక దీపం సీరియల్‌ దే హవా.

    కార్తీక దీపంలో వంటలక్క (Twitter/Photo)


    ’కార్తీక దీపం’ సీరియల్ ప్రసారమయ్యే సమయంలో టీవీల్లో మరో ప్రోగ్రామ్స్‌ చూడాలంటే మగవాళ్లే  భయపడే పరిస్థితి దాదాపు అందరి ఇళ్లలోను తయారైంది. అంతలా ఈ డైలీ సీరియల్ తెలుగు మహిళ  ప్రేక్షకుల మనుసుల్లో చొచ్చుకుపోయింది. అంతగా తెలుగు స్మాల్ స్క్రీన్ ప్రేక్షకుల్ని అలరిస్తోంది కార్తీ దీపం ‌. ఈ సీరియల్ గత యేడాదిన్నరగా నెంబర్ వన్ టీఆర్పీ రేటింగ్ సాధిస్తూ వస్తోంది. మధ్యలో  తోపు లాంటి సినిమాలు ఎన్ని ప్రసారమైన కార్తీక దీపిం సీరియల్ రేటింగ్‌ను మాత్రం దాటలేక కళ్లు తేలేసాయి. కానీ లాక్ డౌన్ తర్వాత మాత్రం పరిస్థితుల్లో తేడాలొచ్చాయి. మొత్తంగా ఇపుడు మూడో స్థానంలో కొనసాగుతున్న ఈ సీరియల్.. త్వరలో నెంబర్ వన్ పొజిషన్‌లోకి వచ్చి తీరుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Karthika deepam, Mahesh babu, Sarileru Neekevvaru, Tollywood, Vantalakka deepa

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు