వంటలక్కకు ప్రమోషన్.. ఆయనతో దిగిన ఫోటో వైరల్..

Premi Vishwanath: ప్రేమీ విశ్వనాథ్.. ఈ పేరు చెబితే ఎవరు అంటారు. కానీ వంటలక్క అంటే మాత్రం అందరికీ తెలుసు. ఎందుకంటే సొంత పేరు కంటే కూడా స్క్రీన్ నేమ్‌తోనే ఎక్కువగా ఫేమస్ అయింది ప్రేమీ.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 29, 2020, 7:50 PM IST
వంటలక్కకు ప్రమోషన్.. ఆయనతో దిగిన ఫోటో వైరల్..
ప్రేమి విశ్వనాథ్ ( Premi Vishwanath/Instagram)
  • Share this:
ప్రేమీ విశ్వనాథ్.. ఈ పేరు చెబితే ఎవరు అంటారు. కానీ వంటలక్క అంటే మాత్రం అందరికీ తెలుసు. ఎందుకంటే సొంత పేరు కంటే కూడా స్క్రీన్ నేమ్‌తోనే ఎక్కువగా ఫేమస్ అయింది ప్రేమీ. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా రేటింగ్స్‌లో సంచలనాలు సృష్టిస్తున్న 'కార్తీక దీపం' సీరియల్‌లో మెయిన్ లీడ్ చేస్తుంది ప్రేమీ. ఈమె తెలుగింటి ఆడపడుచులకు వంటలక్కలా పరిచయం అయింది. అందరూ ఈమెను సొంతింటి బిడ్డలానే చూసుకుంటున్నారు కూడా. ముఖ్యంగా వంటలక్క ఏడ్చిందంటే చాలు రేటింగ్స్ ధారాళంగా వస్తుంటాయి. ఆమె కన్నీళ్లకు అంత వ్యాల్యూ ఉంది. ఈ ఏడుపుతోనే ఆమె ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది కూడా. ఈమె కోసమే ఈ సీరియల్ చూసేవాళ్లు చాలామంది ఉన్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు వంటలక్కకు ప్రమోషన్ వచ్చింది.

ఇప్పటి వరకు బుల్లితెరపై మాత్రమే సందడి చేస్తూ వచ్చిన ఈమె ఇప్పుడు వెండితెర వైపు పరుగులు తీస్తుంది. కార్తీకదీపం సీరియల్‌తో తిరుగులేని గుర్తింపు సంపాదించుకున్న ప్రేమీ.. తెలుగమ్మాయి కాదు. మళయాలి అందం. ఇప్పుడు అక్కడ ఓ సినిమాలో నటిస్తుంది ఈ బ్యూటీ. ఆమె మలయాళంలో 'సాల్మన్' అనే సినిమాతో పరిచయం అవుతుంది. ప్రస్తుతం సీరియల్స్‌లో నటిస్తూనే ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటుంది. ఈ చిత్ర సెట్ నుంచి నటుడు రాజివెట్టన్‌తో కలిసి దిగిన ఫోటోలను ఆమె తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వంటలక్కకు తిరుగులేదంటూ అభిమానులు కూడా పండగ చేసుకుంటున్నారు.
Published by: Praveen Kumar Vadla
First published: February 29, 2020, 7:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading