కార్తీక దీపం వంటలక్క తీవ్ర ఆగ్రహం.. వారిపై కేసు వేస్తానని వార్నింగ్..

Karthika Deepam Vantalakka : వంటలక్క ప్రేమి విశ్వనాథ్ ఆ సీరియల్‌ను వీడుతున్నారని, ఆమె స్థానంలో మరో నటిని తీసుకోబోతున్నారనే వార్త నెట్టింట్లో చక్కర్లు కొట్టింది.

news18-telugu
Updated: March 2, 2020, 2:37 PM IST
కార్తీక దీపం వంటలక్క తీవ్ర ఆగ్రహం.. వారిపై కేసు వేస్తానని వార్నింగ్..
కార్తీక దీపం వంటలక్క ప్రేమి విశ్వనాథ్ (Hot Star/Photo)
  • Share this:
Karthika Deepam Vantalakka : కార్తీక దీపం.. ఈ సీరియల్ పేరు వినిపిస్తే చాలు తెలుగు నాట టీవీ ప్రేక్షకులు అటెన్షన్ అవుతారు. ఈ డైలీ సీరియల్ తెలుగు మహిళ  ప్రేక్షకుల మనుసుల్లో చొచ్చుకుపోయింది. కార్తీక దీపం అంటే వంటలక్క అనేంతగా ప్రేక్షకుల నోళ్లలో ఈ సీరియల్ నానింది. ఈ సీరియల్ పాత్రధారి ప్రేమి విశ్వనాథ్.. ఎంతో పాపులర్ అయింది. మేని ఛాయ నలుపైనా తన చిరునవ్వుతోనూ తన అభినయంతోనూ ప్రేక్షకులను కట్టిపడేసే అందం ఆమె సొంతం. మలయాళం టీవీ తెర పరిశ్రమకు చెందిన ప్రేమి విశ్వనాథ్ అదే భాషలో కరుతముత్తు సీరియల్ ద్వారా పరిచయం అయ్యింది. 2014లో ప్రారంభమైన కరుతముత్తు సీరియల్ తెలుగు కార్తీక దీపం సీరియల్ కు మాతృక. కరుతముత్తులో ప్రేమి కారక్టర్ పేరు కార్తీక అలియాస్ కార్తు అదే పేరుతో అక్కడ చాలా ఫేమస్ అయ్యింది. 2017లో తెలుగులో ప్రారంభమైన కార్తీక దీపంలో కూడా ప్రేమి విశ్వనాథ్ నట విశ్వరూపం ప్రదర్శించింది. వంటలక్కగా ప్రతీ తెలుగు ఇంటిని పలకరించింది.ఈ సీరియల్ దేశంలోనే నెంబర్ వన్ సీరియల్‌గా టీఆర్పీ రేటింగ్స్ బద్దలు కొట్టింది.

అయితే, వంటలక్క ప్రేమి విశ్వనాథ్ ఆ సీరియల్‌ను వీడుతున్నారని, ఆమె స్థానంలో మరో నటిని తీసుకోబోతున్నారనే వార్త నెట్టింట్లో చక్కర్లు కొట్టింది. ఏడు వందలకు పైగా ఎపిసోడ్‌లను పూర్తి చేసుకొని కీలకదశకు చేరుకున్న ఈ సీరియల్‌లో లీడ్ రోల్‌ను మార్చడం ఏంటని అనుకున్నారు ప్రేక్షకులు. కానీ, ఆ పాత్ర నుంచి తప్పుకోవడం లేదని స్పష్టం చేసింది ప్రేమి. ఫేక్‌ న్యూస్‌ ఎందుకు ప్రచారం చేస్తున్నారో తనకు తెలియదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫేస్‌బుక్‌లో తన ఫాలోయర్లతో లైవ్‌లో మాట్లాడుతూ.. కార్తీక దీపం సీరియల్‌‌ను తాను వదిలేసి వెళ్లిపోతున్నానంటూ వస్తున్న వార్తలను ఖండించింది.

ఓ యూట్యూబ్ ఛానల్ ఫేక్ న్యూస్‌ ప్రచారం చేసిందని, దానిపై కేసు వేసేందుకు తమ సీరియల్‌ బృందం ప్రయత్నిస్తోందని చెప్పింది. ‘ఇలాంటి న్యూస్‌ ప్రచారం చేస్తే ఏం వస్తుంది? నా ఫ్యాన్స్‌ చాలా బాధపడుతున్నారు. చాలా మంది నాకు మెసేజ్‌ చేసి చెబుతున్నారు. కొందరు ఎందుకిలా అసత్య ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదు.’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం తాను కేరళలో ఉన్నానని, సీరియల్‌ షూటింగ్‌లోనే పాల్గొంటున్నానని ప్రీతి విశ్వనాథ్ స్పష్టం చేసింది. తాజా ప్రకటనతో వంటలక్క అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: March 2, 2020, 2:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading