• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • KARTHIKA DEEPAM VANTALAKKA FAME PREMI VISHWANATH WITHOUT MAKEUP VIDEO GOING VIRAL IN SOCIAL MEDIA PK

Karthika Deepam Vantalakka: మేకప్ లేకపోతే కార్తీక దీపం వంటలక్క ఇలా ఉంటుందా..?

Karthika Deepam Vantalakka: మేకప్ లేకపోతే కార్తీక దీపం వంటలక్క ఇలా ఉంటుందా..?

ప్రేమీ విశ్వనాథ్ (Premi Vishwanath)

Karthika Deepam Vantalakka: వంటలక్క.. ఈ ఒక్క పేరు చాలు తెలుగు రాష్ట్రాలు రెండూ అభిమానంతో తడిసిపోవడానికి. ఓ సీరియల్‌కు ఇంత పాపులారిటీ వస్తుందా.. ఓ సీరియల్ నటిని ఇంత సీరియస్‌గా అభిమానిస్తారా అని అంతా ముక్కున వేలేసుకునేలా క్రేజ్..

  • Share this:
వంటలక్క.. ఈ ఒక్క పేరు చాలు తెలుగు రాష్ట్రాలు రెండూ అభిమానంతో తడిసిపోవడానికి. ఓ సీరియల్‌కు ఇంత పాపులారిటీ వస్తుందా.. ఓ సీరియల్ నటిని ఇంత సీరియస్‌గా అభిమానిస్తారా అని అంతా ముక్కున వేలేసుకునేలా క్రేజ్ సంపాదించుకుంది ప్రేమీ విశ్వనాథ్. ఈమె పేరు ఇది అని చాలా మందికి తెలియదు. ఎందుకంటే అందరికీ ఈమె వంటలక్కగానే పరిచయం కాబట్టి. ఈమె మేకప్‌లో ఎలా ఉంటుందో సీరియల్ చూస్తే అర్థమైపోతుంది. అలాగే ఆ మేకప్ తీసి నార్మల్ మేకప్ వేసుకుంటే ఎలా ఉంటుందో కూడా అందరికీ తెలుసు. కానీ ఒరిజినల్‌గా వంటలక్క మొహం మేకప్ లేకుండా ఎలా ఉంటుందో తెలుసా..? దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. అందులో చిన్న పిచ్చుకతో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తుంది ప్రేమీ. కార్తీక దీపం సీరియల్‌తో తెలుగులో కూడా చాలా గుర్తింపు సంపాదించుకుంది దీప ఉరఫ్ ప్రేమీ విశ్వనాథ్. మలయాళీ అమ్మాయి అయినా కూడా తెలుగులో ఈమెకు వచ్చిన క్రేజ్ చూసి చాలా మంది సీరియల్ హీరోయిన్లు కుళ్లుకుంటారేమో మరి..? తెలుగు రాష్ట్రాల్లో టీఆర్పీ పరంగా చూసుకున్నా కూడా కార్తీక దీపం నెంబర్ వన్ అంతే. దాని దరిదాపుల్లోకి కూడా మరో సీరియల్ రాదంటే అతిశయోక్తి కాదేమో..? ఆ మధ్య వరదలు వచ్చి ఇంట్లోకి మోకాళ్ళ లోతు నీళ్ళొస్తే కూడా కార్తీక దీపం సీరియల్ చూసుకుంటూ కూర్చున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ సీరియల్ ఇంటింటికీ ఎలా చేరిపోయిందో..?

మరోవైపు టీవీ లేదంటే ఓ అభిమానికి తన సొంత డబ్బులతో టీవీ కొనిచ్చింది వంటలక్క. అలా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న ఈమె.. ఇప్పుడు వెండితెరపై అరంగేట్రం చేస్తుంది. ఈమె క్రేజ్ చూసి కొందరు దర్శకులు ఏరికోరి సినిమాల్లో ఛాన్సులు ఇస్తున్నారు. వంటలక్క త్వరలోనే వెండితెరపై దర్శనమివ్వబోతుంది. మరోవైపు బుల్లితెరపై కూడా వంటలక్క జోరు మామూలుగా లేదు. ఈమె రెమ్యునరేషన్స్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోదు.

ప్రేమి విశ్వనాథ్ ( Premi Vishwanath/Instagram)
ప్రేమి విశ్వనాథ్ ( Premi Vishwanath/Instagram)


కార్తీక దీపం కోసం ఒక్కో ఎపిసోడ్‌కు లక్షకు పైగానే తీసుకుంటుందనే ప్రచారం జరుగుతుంది. పైగా మలయాళ సినిమాల్లోనూ నటిస్తుంది ప్రేమీ. అక్కడా ఈమెకు లక్షల్లోనే పారితోషికం అందుతుంది. ఇక ఈమె ఆస్తుల విషయానికి వస్తే.. 2020 లెక్కల ప్రకారం 36 కోట్లకు పైగానే ఉందని తెలుస్తుంది. సీరియల్స్ చేసుకుంటూ ఈ రేంజ్‌లో సంపాదించింది అంటూ వంటలక్క రేంజ్‌కు అంతా ఫిదా అయిపోవాల్సిందే.
Published by:Praveen Kumar Vadla
First published:

అగ్ర కథనాలు