హోమ్ /వార్తలు /సినిమా /

Karthika Deepam Vantalakka Deepa: తనను సావిత్రితో పోల్చిన ఫ్యాన్.. ఆనందంతో పొంగిపోయిన కార్తీక దీపం వంటలక్క..

Karthika Deepam Vantalakka Deepa: తనను సావిత్రితో పోల్చిన ఫ్యాన్.. ఆనందంతో పొంగిపోయిన కార్తీక దీపం వంటలక్క..

వంటలక్కను అలనాటి మహానటి సావిత్రితో పోలుస్తున్న అభిమానులు (File/Photos)

వంటలక్కను అలనాటి మహానటి సావిత్రితో పోలుస్తున్న అభిమానులు (File/Photos)

Karthika Deepam Vantalakka Deepa: కార్తీక దీపం వంటలక్క గురించి తెలుగు టీవీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. ఆమె కార్తీక దీపం రేటింగ్‌ ముందు మిగతా సీరియల్స్ అన్ని దిగదుడుపే. తాజాగా ఆమెను స్మాల్ స్క్రీన్ సావిత్రి అంటూ అభిమానులు పోలుస్తున్నారు.

ఇంకా చదవండి ...

  Karthika Deepam Vantalakka Deepa: కార్తీక దీపం వంటలక్క గురించి తెలుగు టీవీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. ఆమె కార్తీక దీపం రేటింగ్‌ ముందు మిగతా సీరియల్స్ అన్ని దిగదుడుపే. గత రెండేళ్లుగా ఈ సీరియల్ టాప్ రేటింగ్‌లో కొనసాగుతూనే ఉంది. కార్తీక దీపం దూకుడు ఆపే సీరియల్ ఎపుడు వస్తుందో కానీ.. ఇప్పటికైతే.. కార్తీక దీపం సీరియల్ తెలుగులో నెంబర్ వన్ పొజిషన్‌లోనే కొనసాగుతూనే ఉంది. స్టార్ మా ప్రసారమైన రియాలిటీ షో కూడ కార్తీక దీపం రేటింగ్.. ఫ్యాన్ ఫాలోయింగ్ ముందు దిగదుడుపే. ఈ సీరియల్‌లో వంటలక్క అలియాస్ దీప.. హీరోయిన్స్ మించి పాపులారిటీ సంపాదించుకుంది. ఓ సీరియల్‌తో ఇంత అభిమానం పొందిన నటి ఎవరైనా ఉన్నారంటే.. అంది వంటలక్కే. ఈమె క్రేజ్‌ను బడా హీరోలను సైతం విస్తుపోయేలా చేస్తోంది. అందరికీ ఈమె వంటలక్కగానే పరిచయం కాబట్టి. కార్తీక దీపం సీరియల్‌తో తెలుగులో కూడా చాలా గుర్తింపు సంపాదించుకుంది దీప ఉరఫ్ ప్రేమీ విశ్వనాథ్.

  మలయాళీ అమ్మాయి అయినా కూడా తెలుగులో ఈమెకు వచ్చిన క్రేజ్ చూసి చాలా మంది సీరియల్ హీరోయిన్లు కుళ్లుకుంటారేమో మరి..? ఆ మధ్య వరదలు వచ్చి ఇంట్లోకి మోకాళ్ళ లోతు నీళ్ళొస్తే కూడా కార్తీక దీపం సీరియల్ చూసుకుంటూ కూర్చున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ సీరియల్ ఇంటింటికీ ఎలా చేరిపోయిందో..అర్ధమైంది. ఆ మధ్య కార్తీక దీపం సీరియల్‌లో వంటలక్కను మారుస్తున్నారని రూమర్ బయలు దేరితే....అలా చేస్తే.. స్టార్ మా ఛానెల్‌ను బాయ్ కాట్ చేస్తామని సోషల్ మీడియా వేదికగా అభిమానులు హెచ్చరించిన సందర్భాలున్నాయి. అంతలా జనం గుండెల్లో వంటలక్కగా ప్రేమి విశ్వనాథ్ పాతకుపోయింది.


  తాజాగా కొంత మంది అభిమానులు.. కార్తీక దీపం వంటలక్కను అలనాటి మహానటి సావిత్రితో పోలుస్తున్నారు.అంతేకాదు కొంత మంది మీరు స్మాల్ స్క్రీన్ సావిత్రి అని. టీవీ మహానటి అని రకరకాలుగా కంపెర్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు.  దీంతో వంటలక్క ఆనందంతో ఉబ్బితబ్బివుతుంది. మహానటితో తనను పోల్చడంపై మాట్లాడుతూ.. ఆమె నటనలో కొంచెం చేసినా.. నా జన్మ ధన్యమంటోంది వంటలక్క. మహానటి సావిత్రితో తనను పోల్చినందుకు అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేసింది. మొత్తంగా ఇప్పట్లో  తెలుగు స్మాల్ స్క్రీన్  మహానటి అలియాస్ వంటలక్క దూకుడును ఆపడం అంత ఈజీకాదనే చెప్పాలి.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Karthika deepam, Premi Vishwanath, Star Maa, Tollywood, Vantalakka deepa

  ఉత్తమ కథలు