• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • KARTHIKA DEEPAM VANTALAKKA DEEPA FAME PREMI VISWANATH LATEST ADD SHOOT WITH CHOTA K NAIDU TA

Vantalakka Deepa Fame Premi Viswanath: వంటలక్క క్రేజ్ మాములుగా లేదుగా.. సీరియల్స్, యాడ్ షూటింగ్స్‌తో ప్రేమి విశ్వనాథ్ బిజీ బిజీ..

కెమెరా మెన్‌ ఛోటా కే నాయుడుతో వంటలక్క ప్రేమి విశ్వనాథ్ (Instagram/Photo)

Vantalakka Deepa Fame Premi Viswanath |  కార్తీక దీపం వంటలక్క దీప గురించి తెలుగు టీవీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. తాజాగా ఈమె ఓ యాడ్ షూటింగ్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా కెమెరామెన్ ఛోటా కే నాయుడుతో దిగిన ఫోటోను అభిమానులతో పంచుకుంది.

  • Share this:
    Vantalakka Deepa Fame Premi Viswanath |  కార్తీక దీపం వంటలక్క దీప గురించి తెలుగు టీవీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. ఆమె కార్తీక దీపం రేటింగ్‌ ముందు మిగతా సీరియల్స్ అన్ని దిగదుడుపే. గత రెండేళ్లుగా ఈ సీరియల్ టాప్ రేటింగ్‌లో కొనసాగుతూనే ఉంది. కార్తీక దీపం దూకుడు ఆపే సీరియల్ ఎపుడు వస్తుందో కానీ.. ఇప్పటికైతే.. కార్తీక దీపం సీరియల్ తెలుగులో నెంబర్ వన్ పొజిషన్‌లోనే కొనసాగుతూనే ఉంది. స్టార్ మా ప్రసారమైన రియాలిటీ షోస్  కూడ కార్తీక దీపం రేటింగ్.. ఫ్యాన్ ఫాలోయింగ్ ముందు దిగదుడుపే. ఈ సీరియల్‌లో వంటలక్క అలియాస్ దీప.. హీరోయిన్స్ మించి పాపులారిటీ సంపాదించుకుంది. ఓ సీరియల్‌తో ఇంత అభిమానం పొందిన నటి ఎవరైనా ఉన్నారంటే.. అంది వంటలక్కే. ఈమె క్రేజ్‌ను బడా హీరోలను సైతం విస్తుపోయేలా చేస్తోంది. అందరికీ ఈమె వంటలక్కగానే పరిచయం కాబట్టి. కార్తీక దీపం సీరియల్‌తో తెలుగులో కూడా చాలా గుర్తింపు సంపాదించుకుంది దీప ఉరఫ్ ప్రేమీ విశ్వనాథ్. పండగల సందర్భంలో టీవీ ఛానెల్స్‌లో ప్రసారమయ్యే కార్యక్రమాల్లో ఈమెను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు.

    మలయాళీ భామ అయినా కూడా తెలుగులో ఈమెకు వచ్చిన క్రేజ్ చూసి చాలా మంది సీరియల్ హీరోయిన్లు కుళ్లుకుంటారేమో మరి..? ఆ మధ్య వరదలు వచ్చి ఇంట్లోకి మోకాళ్ళ లోతు నీళ్ళొస్తే కూడా కార్తీక దీపం సీరియల్ చూసుకుంటూ కూర్చున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ సీరియల్ ఇంటింటికీ ఎలా చేరిపోయిందో..అర్ధమైంది. ఆ మధ్య కార్తీక దీపం సీరియల్‌లో వంటలక్కను మారుస్తున్నారని రూమర్ బయలు దేరితే....అలా చేస్తే.. స్టార్ మా ఛానెల్‌ను బాయ్ కాట్ చేస్తామని సోషల్ మీడియా వేదికగా అభిమానులు హెచ్చరించిన సందర్భాలున్నాయి. అంతలా జనం గుండెల్లో వంటలక్కగా ప్రేమి విశ్వనాథ్ పాతకుపోయింది.



    ప్రస్తుతం తెలుగు ఆడపడుచులకు ఈమె ఎంతలా చేరువయ్యేందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె క్రేజ్‌ను ఇపుడు కార్పోరేట్ కంపెనీలు కూడా గుర్తించాయి. అందుకే హీరోయిన్స్‌ను ఒదిలిపెట్టి చాలా మంది ఆమెతో యాడ్ షూట్స్ చేస్తున్నారు. తాజాగా డబుల్ హార్ట్స్ మినపగుళ్లు వాళ్లు కార్తీక దీపం ఫేమ్ వంటలక్కతో యాడ్ చేసారు. ఈ యాడ్‌ను ఛోటా కే నాయుడు షూట్ చేసారు. ఈ సందర్భంగా ఛోటా కే. నాయుడుతో దిగిన ఫోటోను పోస్ట్ చేసింది. ఈ ఫోటో సోషల మీడియాలో వైరల్ అవుతోంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: