టెలివిజన్ చరిత్రలోనే ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. తెలుగు టీవీ సీరియల్ చరిత్రలో అత్యధిక జనాదరణతో దూసుకెళ్తున్న కార్తీక దీపం సీరియల్ ముందు అగ్రహీరోలు కూడా చేతులెత్తేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా టీవీలో ప్రసారమైంది. అయితే దీనికి సంబంధించిన టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. ఎంతో ప్రతిష్టాత్మకమైన సైరా సినిమాను తెలుగు రాష్ట్రాల మెగా అభిమానులు పండగలా చూశారు. కానీ టీఆర్పీ రేటింగ్స్ లో వెనుకబడింది. తాజాగా వచ్చిన బార్క్ రేటింగ్స్ లో సైరా 5వ స్థానంలో ఉంటే, కార్తీక దీపం సీరియల్ మాత్రం తొలిస్థానంలో దూసుకెళ్లింది. బార్క్ రేటింగ్స్ ప్రకారం జనవరి 11 నుంచి జనవరి 17 రెండో వారం రేటింగ్స్ లో కార్తీక దీపం ఎప్పటిలాగే 14534 పాయింట్లు సాధించగా, సైరా నరసింహా రెడ్డి కేవలం 8741 పాయింట్లతో 5వ స్థానంలో నిలిచింది. ఇది ఒక రకంగా వంటలక్క అభిమానులకు పండగనే చెప్పాలి. అయితే ఆసక్తికరంగా గద్దలకొండ గణేష్ సినిమా సైతం సైరాను దాటి 4వ స్థానంలో నిలిచింది. ఇక రెండో స్థానంలో వదినమ్మ, మూడో స్థానంలో గోరింటాకు సీరియల్స్ నిలిచాయి.
ఇదిలాఉంటే ఇప్పటికే పలు టీవీ సీరియల్స్ కార్తీక దీపం సీరియల్‌కు వచ్చే రేటింగ్స్ లో సగం మాత్రమే తెచ్చుకొని సంతృప్తి చెందుతుంటే, ఇప్పుడు ఏకంగా అగ్రహీరోల సినిమాలను సైతం తోసి రాజని నెంబర్ వన్ స్థాయిలో నిలిచింది కార్తీక దీపం . అయితే సాధారణంగా అగ్రహీరోల హిట్ సినిమాలు టీవీలో ప్రసారం చేసినప్పుడు వాటికి టీఆర్పీ రేటింగులు భారీ స్థాయిలో వస్తాయి. ఇంత కాంపిటీషన్ ఉన్నప్పటికీ కార్తీక దీపం సీరియల్ మాత్రం నెంబర్ వన్ స్థానంలో నిలవడం అటు బుల్లితెర పరిశ్రమతో పాటు టాలివుడ్ పరిశ్రమను కూడా షాక్ కు గురిచేస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Karthika deepam, Telugu tv serials, Vantalakka, Vantalakka deepa