ప్రోమో చూసిన వంటలక్క అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మహిషాసుర మర్దిని అవతారంలో దీప అదిరిపోయిందని మెచ్చుకుంటున్నారు. ఎపిసోడ్ కోసం వెయిటింగ్ అని కామెంట్స్ పెడుతున్నారు.
వంటలక్క..! దీప..! తెలుగింటి గృహిణిలకు పరిచయం అక్కర్లేని పేరు ఇది. కార్తీక దీపం సీరియల్ ద్వారా అందరికీ ఇంటి మనిషి అయిపోయింది దీప. ఆ క్యారెక్టర్‌ను తెలుగు ప్రేక్షకులకు అంతగా ఆదరిస్తున్నారు. కార్తీక దీపం రేటింగ్‌కు బిగ్ బాస్ షో కాదు కదా.. పెద్ద పెద్ద సినిమాలు సైతం బీట్ చేయలేకపోయాయి. రేటింగ్ పరంగా అంతలా దూసుకెళ్లింది కార్తీక దీపం. అందులో దీప క్యారక్టర్లో నటించిన ప్రేమి విశ్వనాథ్‌కు తెలుగునాట పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. టాప్ సినిమా హీరోయిన్ స్థాయిలో ఆమెకు యూత్‌లో ఫాలోయింగ్ ఉంది. సీరియల్‌తో తప్ప పెద్దగా బయట కనిపించని ప్రేమి విశ్వనాథ్.. తొలిసారి ఓ ఎంటర్టైన్మెంట్ షోలో మెరవబోతోంది.
తెలుగింట పండగ వచ్చిదంటే బుల్లితెరపై సరికొత్త సందడి కనిపిస్తుంది. అన్ని ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెళ్లన్నీ ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేస్తాయి. సీరియల్ నటులు, కమెడియన్స్, డాన్స్ మాస్టర్లు, యాంకర్లతో నవ్వు పూయిస్తూ..స్పెప్పులు వేస్తూ.. వినోదం పంచుతాయి. ఇక దసరా సందర్భంగా 'అక్కా ఎవరే అతగాడుస, జీ తెలుగులో చి. ప్రదీప్‌కి, చిలసౌ శ్రీముఖి నమస్కరిస్తూ రాయునది..', మా టీవీలో ,జాతరో జాతర, ఈవెంట్ ప్రసారం కానున్నాయి. వాటికి సంబంధించిన ప్రోమోలను ఇప్పటికే ఆయా చానెళ్లు విడుదల చేశాయి. ఐతే మా టీవీలో ప్రసారం కానున్న జాతరో జాతర ఈవెంట్లో కార్తీక దీపం వంటలక్క కూడా పాల్గొంది. అందులో డాక్టర్ బాబుతో కలిసి సందడి చేసింది.
జాతరో జాతర కార్యక్రమంలో అభిమానులు ఎప్పుడూ చూడని గెటప్‌లో కనిపించి అలరించబోతోంది దీప. మహిషాసుర మర్దిని అవతారంతో అభిమానులకు కనువిందు చేయబోతోంది. ఇప్పటికే విడుదలైన ప్రోమోలో.. దీప దుర్గ అవతారంలో నాలుక బయటపెట్టి.. త్రిశూలం ధరించి.. నాట్యమాడింది. ఈ కార్యక్రమానికి బిగ్ బాస్ ఫేమ్ శివజ్యోతి యాంకర్‌గా వ్యవహరించింది. ''కరోనా, వానలు, గ్యాస్ లీక్ ఈ ఏడాదిలో ఏం జరుగుతుందో ఏమీ అర్ధం మవడం లేదు. జాతరంటే ఎంతో సందడిగా ఉండేది. కరోనా వల్ల ఈసారి ఐతదో లేదో అని ఎంత భయమవుతుందో తెలుసా..'' అని శివజ్యోతి అనగానే.. దుర్గాదేవి ప్రత్యక్షమవుతుంది. ''ఎందుకమ్మ అంత భయపడుతున్నావు. అమ్మోరు జాతర చేస్తామని మొక్కుకున్నావుగా.. ఘనంగా జాతర జరిపిస్తే అంతా మంచి జరుగుతుంది.'' అని అంటుంది దుర్గమ్మ గెటప్లోని వంటలక్క.
ఈ ప్రోమో చూసిన వంటలక్క అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మహిషాసుర మర్దిని అవతారంలో దీప అదిరిపోయిందని మెచ్చుకుంటున్నారు. ఎపిసోడ్ కోసం వెయిటింగ్ అని కామెంట్స్ పెడుతున్నారు. కాగా, జాతరో జాతర కార్యక్రమంలో మా టీవీ సీరియల్ నటీనటులతో పాటు శివజ్యోతి, యాంకర్ రవి, బాబా భాస్కర్, కమెడియన్లు యాదమ్మ రాజు, బుల్లెట్ భాస్కర్, నరేష్, రాకింగ్ రాకేష్, లోబో, గబ్బర్ సింగ్ విలన్ గ్యాంగ్, బిగ్ బాస్ ఫేమ్ గంగవ్వ పాల్గొంటున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.