కార్తీక దీపం సీరియల్ మంచి ట్విస్టులతో ముందు దూసుకెళ్తోంది. ఇప్పటికే దీప దగ్గర పెరుగుతున్నసౌర్యకు తన తండ్రి డాక్టర్ కార్తీక్ అన్న విషయం తెలిసిపోయింది. మరోవైపు కార్తీక్ దగ్గర పెరుగుతున్న హిమకు సైతం వంటలక్క దీపతో డాక్టర్ బాబును ఇచ్చి పెళ్లి చేయాలని గట్టి ప్రయత్నం చేస్తోంది. అలాగే అటు కోర్టు ఇచ్చిన గడువు సైతం పూర్తి కావొస్తోంది. ఈ నేపథ్యంలో సీరియల్ ఒక అనుకోని మలుపు తిరుగుతుందని టాక్ వినిపిస్తోంది. అయితే అటు స్కూల్ ఫంక్షన్లో రెండో కూతురు హిమ తన తండ్రికి వంటలక్కను ఇచ్చి పెళ్లి చేయాలని ఉందని అందరి ముందు కోరిక కోరింది. అదే స్టేజీ మీద ఉన్న డాక్టర్ మోనిత షాక్ కు గురైంది. దీంతో వంటలక్క ఫ్యాన్స్ నెట్టింట ఖుషీ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే మలయాళ మాతృకలో కార్తీక్, దీపలకు ఒక్క కూతురే ఉంటుంది. అయితే తెలుగులో మాత్రం కవల పిల్లలు అని చూపించారు.
దీంతో తెలుగులో కథలో మార్పులు ఉండవచ్చని టాక్ వినిపిస్తోంది. మరోవైపు వంటలక్క దీపను ఎలాగైనా కార్తీక్ తో కలిపేయాలనే సౌర్య, హిమ పంతం నెగ్గడం ఖాయమని ప్రస్తుతం సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియోల ద్వారా తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Karthika deepam, Telugu tv anchors, Telugu tv serials, Vantalakka, Vantalakka deepa