హోమ్ /వార్తలు /సినిమా /

Karthika Deepam: అప్ప‌టి వ‌ర‌కు హిమ‌పై మీకు ఏ హ‌క్కులు ఉండ‌వు.. కార్తీక్‌కి తెగేసి చెప్పిన దీప‌

Karthika Deepam: అప్ప‌టి వ‌ర‌కు హిమ‌పై మీకు ఏ హ‌క్కులు ఉండ‌వు.. కార్తీక్‌కి తెగేసి చెప్పిన దీప‌

తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం(Karthika Deepam) సీరియ‌ల్ మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతోంది. త‌మ అమ్మ‌, నాన్న‌ను క‌ల‌పాల‌ని హిమ మౌనిత ఇంటికి వెళ్ల‌డం.. హిమ అక్క‌డ ఉంద‌ని తెలుసుకున్న కార్తీక్.. నేను కావాలో..? అమ్మ కావాలో తేల్చుకో అని హిమ‌ను ప్ర‌శ్నించ‌డం జ‌రిగాయి.

తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం(Karthika Deepam) సీరియ‌ల్ మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతోంది. త‌మ అమ్మ‌, నాన్న‌ను క‌ల‌పాల‌ని హిమ మౌనిత ఇంటికి వెళ్ల‌డం.. హిమ అక్క‌డ ఉంద‌ని తెలుసుకున్న కార్తీక్.. నేను కావాలో..? అమ్మ కావాలో తేల్చుకో అని హిమ‌ను ప్ర‌శ్నించ‌డం జ‌రిగాయి.

తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం(Karthika Deepam) సీరియ‌ల్ మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతోంది. త‌మ అమ్మ‌, నాన్న‌ను క‌ల‌పాల‌ని హిమ మౌనిత ఇంటికి వెళ్ల‌డం.. హిమ అక్క‌డ ఉంద‌ని తెలుసుకున్న కార్తీక్.. నేను కావాలో..? అమ్మ కావాలో తేల్చుకో అని హిమ‌ను ప్ర‌శ్నించ‌డం జ‌రిగాయి.

ఇంకా చదవండి ...

  Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతోంది. త‌మ అమ్మ‌, నాన్న‌ను క‌ల‌పాల‌ని హిమ మౌనిత ఇంటికి వెళ్ల‌డం.. హిమ అక్క‌డ ఉంద‌ని తెలుసుకున్న కార్తీక్.. నేను కావాలో..? అమ్మ కావాలో తేల్చుకో అని హిమ‌ను ప్ర‌శ్నించ‌డం జ‌రిగాయి. ఇక‌ ఇవాళ్టి ఎపిసోడ్‌లో వెంక‌టేష్‌ని మౌనిత ఇంటి నుంచి పంపార‌ని వార‌ణాసి ద్వారా తెలుసుకున్న దీప‌.. హిమను డాక్ట‌ర్ బాబు అట్నుంచి అటే ఇంటికి తీసుకువెళ‌తాడా..? అని అనుకుంటూ ఉంటుంది. ఇక సౌర్య కూడా హిమ వెళ్తుందా అమ్మా..? నాన్న ర‌మ్మంటే ఇక్క‌డ‌కు రాకుండా ఆ ఇంటికే వెళ్లిపోతుందా..?అని అడుగుతుంది. ఇక వార‌ణాసి నువ్వేం టెన్ష‌న్ ప‌డ‌కు అక్కా అలాంటిదేం జ‌ర‌గ‌దులే అని అంటాడు. దానికి దీప‌.. నీకు తెలీదు వార‌ణాసి.. నేను ఆయ‌న ఊరు వ‌దిలి వెళ్లిపోతార‌ని హిమ‌ను తీసుకొచ్చానే త‌ప్ప పంతంతో కాదు. కానీ ఆయ‌న నేను హిమ‌ను అడ్డుపెట్టుకొని ఆయ‌న‌ను దిగి వ‌చ్చేలా చేయ‌డానికే తీసుకొచ్చాను అనుకుంటున్నారు. ఇప్పుడు హిమను తీసుకెళ్ల‌డానికి ఒక సాకు దొరుకుతుంది. పెంచిన ప్రేమ గెలిచిందా.? ఓడిందా..? అన్న‌ది ప‌క్క‌న‌పెడితే క‌న్న ప్రేమ ఓడిపోయింది అని వాదించ‌డం మొద‌లుపెడ‌తారు. అన‌వ‌స‌రంగా మా ఇద్ద‌రి మ‌ధ్య హిమ ప‌సి మ‌న‌సు న‌లిగిపోవ‌డం నాకు ఇష్టం లేదు అని అంటుంది. దానికి సౌర్య బాధ‌ప‌డ‌దు అమ్మా.. హిమ వెళ్ల‌దులే. హిమ బ‌ట్ట‌ల‌న్నీ ఇక్క‌డే ఉన్నాయిగా అని అంటుంది. వెంట‌నే దీప‌.. వాళ్ల‌కేం అత్త‌మ్మా అన్నీ ఎక్కువే. న‌న్ను సాధించ‌డానికి మీ నాన్న‌కు అన్ని అవ‌కాశాలు కూడా ఎక్కువే అని అంటుంది.

  ఇక మౌనిత ఇంట్లో కార్తీక్ నేను ఒక మాట అడ‌గ‌డం మ‌ర్చిపోయాను అని అంటాడు. దానికి మౌనిత ఎవ‌రిని అన‌గా.. నిన్నే అని కార్తీక్ అంటాడు. ఏమై ఉంటుంది అని మౌనిత ఆలోచిస్తుండ‌గా.. దీప‌కు మ‌న కాలేజీ విష‌యాలు ఎలా తెలుసు. ఎవ‌రు చెప్పి ఉంటారు..? అన్నీ ప‌క్క‌నే ఉండి చూసినంత స్ట్రాంగ్‌గా చెబుతోంది. ఆ ఇన్ఫ‌ర్మేష‌న్ అంతా ఎవ‌రు చెబుతుంటారు అని కార్తీక్ అడుగుతాడు. దానికి మౌనిత‌.. ఇంకెవ‌రు ఆ విహారే చెబుతూ ఉంటాడు అని అంటుంది. వాడు ఎక్క‌డో అమెరికాలో ఉంటున్నాడ‌ని తుల‌సి చెప్పింది అని కార్తీక్ అన‌గా.. ఏ కాలంలో ఉన్నా అమెరికా నుంచి ఇండియాకు ఫోన్లు చేసుకోవ‌చ్చు అని మౌనిత అంటుంది. వెంట‌నే కార్తీక్.. న‌న్ను మ‌రీ అంత ఫూల్‌ని చేయ‌కు మౌనిత‌.. నీకు తెలిస్తే చెప్పు, తెలీక‌పోతే లేద‌ను. దీప మాట్లాడే మ‌న కాలేజీ విష‌యాల‌కు, అమెరికా నుంచి ఎవ‌డో ఇచ్చే స‌ల‌హాల‌కు సంబంధం ఏమైనా ఉందా..? పైగా దీప మాట్లాడేది హిమ‌కు జ‌రిగిన అన్యాయం గురించి, త‌న ప‌ర్స‌న‌ల్ స‌మ‌స్య గురించి కాదు అని అంటాడు.

  దీంతో మౌనిత.. దీప చెప్పిన విష‌యాలు కార్తీక్ బుర్ర‌లో స్ట్రాంగ్‌గా రిజిస్ట‌ర్ అయిన‌ట్లు ఉన్నాయి. అవి బుర్ర‌లో పురుగుల్లా తొలుస్తూనే ఉంటాయి అని మ‌న‌సులో అనుకుంటుంది. ఇక కార్తీక్.. నిజంగా హిమ‌ను చంప‌డానికే యాక్సిడెంట్ చేసి ఉంటారా..? అని అడుగుతాడు. దానికి మౌనిత టెన్ష‌న్ ప‌డుతూ.. స్టాపిట్ కార్తీక్.. యాక్సిడెంట్‌లో నువ్వు ఉన్నావు ఆ సంగ‌తి మ‌ర్చిపోకు. నువ్వు హిమ ప‌క్క‌న ఉండి ఉండ‌క‌పోతే ఎవ‌రి ఊహాగానాలు న‌మ్మాల్సి వ‌చ్చేది. యాక్సిడెంట్ ఎలా జ‌రిగిందో నీకు తెలుసు. హిమ ఎలా చనిపోయిందో నీకు తెలుసు. ఇప్పుడొచ్చి ఆ వంట‌ల‌క్క.. గ‌రిటెతో స‌మాధి త‌వ్వి.. గంట‌కో మాట చెబుతుంటే నువ్వెందుకు తాపీగా వింటూ ఎంట‌ర్‌టైన్ చేస్తున్నావు. అవ‌న్నీ తీసుకొచ్చి ఇక్క‌డ ఎందుకు చెబుతున్నావు. దీప చాలా తెలివిగా త‌న గ‌తాన్ని ప‌క్క‌న‌పెట్టి, నీ గ‌తం మీద ప‌డింది అని అంటుంది. దానికి కార్తీక్.. దీప చెప్పిన మాట‌ల‌ను గుర్తు చేసుకుంటాడు.

  ఇక మౌనిత మాట్లాడుతూ..తెలివిగానే కాదు చాలా చాక‌చ‌క్యంగా నీకు ఇష్ట‌మైన నీ ప్రేయ‌సి హిమని అడ్డం పెట్టుకొని నీ ద‌గ్గ‌ర మంచిత‌నం ముద్ర వేసుకోవాల‌ని చూస్తుంది. అది తెలీక నువ్వు ఆవిడ ట్రాక్‌లో ప‌డిపోతున్నావు. అస‌లు అని అంటూ ఉండ‌గా. వెంట‌నే కార్తీక్ క‌ల‌గ‌జేసుకొని అస‌లు అని ఏదో చెప్ప‌బోతుంటాడు. వెంట‌నే లోప‌లి నుంచి వ‌చ్చిన హిమ‌.. డాడీ వెళ్దామా అని అడుగుతుంది. దాంతో మౌనిత కొంచెం ఫ్రీ అయ్యి.. అమ్మ‌య్యా హిమ ర‌క్షించింది లేదంటే కార్తీక్ ఇంకా లోతుగా హిమ డెత్ విష‌యాన్ని త‌వ్వేవాడు అని మ‌న‌సులో అనుకుంటుంది. ఇక హిమ‌ను రా వెళ‌దాం అని కార్తీక్ అన‌గా.. దీప ఎంట్రీ ఇస్తుంది. ఎక్క‌డికి అని అడుగుతుంది.

  వెంట‌నే హిమ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన దీప‌.. ఇలా అమ్మ‌కు చెప్సకుండా రావొచ్చా హిమ. అందులోనూ నువ్వు ఇలాంటి చోటుకు రావ‌డం నాకు అస‌లు ఇష్టం ఉండ‌దు. రామ్మా మ‌న ఇంటికి వెళ్లిపోదాం అని హిమ‌ను తీసుకొని వెళుతూ ఉంటుంది. వెంట‌నే కార్తీక్.. ఆగు.. నిన్నే ఆగు అని ఆపుతాడు. ఇక నువ్వెళ్లి ఆటోలో కూర్చో హిమ అని దీప చెప్ప‌గా.. హిమ, కార్తీక్‌ని చూస్తూ ఉంటుంది. దాంతో దీప‌.. ఏం ప‌ర్వాలేదు. మీ నాన్న‌తో నేను మాట్లాడేవ‌స్తాను అని దీప అన‌గా.. హిమ‌ను అని కార్తీక్ ఏదో అడ‌గ‌బోతాడు. వెంట‌నే దీప‌, నాతో పాటు మా ఇంటికి తీసుకువెళుతున్నాను అని అంటుంది. ఇక హిమ బ‌య‌ట‌కు వెళ్లిపోతుంది. త‌రువాత చెప్పండి అని దీప అన‌గా.. ఏంటి బ‌ల‌వంతంగా తీసుకెళుతున్నావు అని కార్తీక్ అడుగుతాడు. ఇప్పుడు నేను ఏం బ‌ల‌వంతం చేశాను. ర‌మ్మ‌న్నాను. మారు మాట్లాడ‌కుండా బ‌యలుదేరింది అని దీప అంటుంది. ఇక కార్తీక్.. అస‌లు నువ్వు ఏమ‌నుకుంటున్నావు..? అని అన‌గా.. త‌ల్లిని అనుకుంటున్నాను. క‌న్న‌త‌ల్లిని అనుకుంటున్నాను అని చెబుతుంది.

  ఇక్క‌డుంటే ఏమైంది అని కార్తీక్ అన‌గా.. ఇది ఎవ‌రి ఇల్లు అని దీప అడుగుతుంది. నా ఇల్లే క‌దా అని మౌనిత అన‌గా.. హిమ‌తో నేను ఇలాంటి చోటికి రాకూడ‌దు అని గౌర‌వ‌నీయ‌మైన భాష‌లో చెప్పాను. మా బ‌స్తీ భాష‌లో ఇలాంటి కొంప‌కు రాకూడ‌దు అని అన‌లేదు అని అంటుంది. ఇక ప్రియ‌మ‌ణిని చూసి.. నువ్వేంటే చోద్యం చూస్తున్నావు చెంచా.. లోప‌లికి వెళ్లి చావు అని అంటుంది. దాంతో ప్రియ‌మ‌ణి లోప‌లికి వెళుతుంది. ఇక కార్తీక్ అస‌లు నీ గురించి నువ్వు ఏమ‌నుకుంటున్నావే అని అని అంటాడు. వెంట‌నే దీప‌.. నా గురించి నాకు చాలా క్లారిటీ ఉంది డాక్ట‌ర్ బాబు. మీకే.. మీ గురించి మీకు అస్స‌లు క్లారిటీ లేదు. మీకు తెలీదు. చెప్పినా అర్థం కాదు అని అంటుంది. దానికి కార్తీక్.. హిమ గురించి మాట్లాడుతున్నాను నేను అని అంటాడు. మాట్లాడండి. వింటాను నేను అని దీప అంటుంది. వెంట‌నే కార్తీక్.. హిమ‌తో పాటు నేను ఉన్నాను క‌దా ఇక్క‌డ. తీసుకెళ్లేముందు నా ప‌ర్మిష‌న్ అడ‌గాల్సిన అవ‌స‌రం లేదా..? అని ప్ర‌శ్నించ‌గా.. లేదు అని దీప స‌మాధానం చెబుతుంది. వెంట‌నే కార్తీక్.. ఏంటి అన‌గా.. మీ ప‌ర్మిష‌న్ అడ‌గాల్సిన ప‌ని లేదు అంటున్నాను డాక్ట‌ర్ బాబు. మీరు హిమ‌ను చూడ‌టానికి నా ఇంటికి వ‌స్తే ఎక్క‌డ పెంచిన ప్రేమ గెలిచింది అని ఒప్పుకోవాల్సి వ‌స్తుందోన‌ని సంద‌ర్భం కుదిరింది క‌దా అని, స‌మ‌యం క‌లిసి వ‌చ్చింది క‌దా అని ఈ కొంప‌.. సారీ.. ఈ చోట్లే క‌లుసుకొని మీ ప్రేమ‌ను చూపించి, ఆ త‌రువాత పంపించేయాల‌నుకున్నారు. ఇది కాదు ప‌ద్ద‌తి. మీరు దాని క‌న్న‌తండ్రి ఆ విష‌యాన్ని ఒప్పుకోండి. అప్పుడు ఈ దొంగ‌చాటు ప్రేమ‌లు ఉండ‌వు. ఈ త‌ల్లిచాటు దోబుచులాట అస‌లే ఉండ‌దు. ద‌ర్జాగా హిమ‌ను ద‌గ్గ‌ర‌కు తీసుకోవచ్చు. తండ్రి హోదాలో.. క‌న్న తండ్రి హోదాలో ఎక్క‌డికైనా తీసుకెళ్ల‌చ్చు అని అంటుంది.

  దానికి కార్తీక్ నువ్వు నా ఎమోష‌న్స్‌తో ఆడుకుంటున్నావు అన‌గా.. మీరే దాని ఎమోష‌న్స్‌తో ఆడుకుంటున్నారు. తండ్రి ప్రేమ అంద‌ని ద్రాక్ష పండు అయ్యింది దానికి. ఈ సంగ్ధిగ్ధం, ఈ సంఘ‌ర్ష‌ణ‌, ఈ అస్తిమిత‌మైన ఊగిస‌లాట ఆ పసి మ‌న‌సు భ‌రించ‌లేదు డాక్ట‌ర్ బాబు అని అంటుంది. ఏంటే.. చిల్డ్ర‌న్ సైకాల‌జీ తెలిసిన‌ట్లు మాట్లాడుతున్నావు. క‌న్నావులే మ‌హా.. హిమ పుట్టిన‌ప్ప‌టి నుంచి నా చేతుల్లో పెరిగింది. దాని మ‌న‌సులో ఏముందో నాకు తెలీదా.? నువ్వు భార్య‌గా గెల‌వ‌డం కోసం త‌ల్లివ‌న్న సంగ‌తి మ‌ర్చిపోతున్నావేమో గానీ.. నేను పెంచిన తండ్రిగా నా బాధ్య‌త‌ను ఏనాడు వ‌దులుకోవాల‌నుకోలేదు. హిమ‌కు ఆలోచించే అవ‌కాశం కూడా ఇవ్వ‌కుండా నీతో పాటు తీసుకెళ్లావు అని కార్తీక్ అంటాడు. వెంట‌నే దీప‌.. స‌రే నేను బ‌ల‌వంతంగానే తీసుకెళ్లిపోయాను. స‌రే నాది త‌ప్పే.. మ‌రి ఏ మాత్రం బ‌ల‌వంతం చేయ‌కుండా ప్రేమ‌తో మీరు మీ ద‌గ్గ‌రికి హిమ‌ను ర‌మ్మ‌నండి వ‌స్తుందా.. రానందిగా.. అది నా త‌ప్పా.. నేను మీ పెంచిన ప్రేమ‌ను ఎప్పుడూ త‌ప్పు ప‌ట్ట‌లేదు డాక్ట‌ర్ బాబు. నిజానికి మీ స్థానంలో ఎవ్వ‌రు ఉన్నా కూతురిని అంత ప్రేమ‌గా పెంచ‌లేరు. ఇప్పుడు మీ బ‌ల‌హీన‌త మీ కూతురు అని తెలిసి, అది అడ్డం పెట్టుకొని నేను అడ్వాంటేజ్‌గా కూడా తీసుకోవ‌డం లేదు అని అంటుంది.

  మ‌రేంటి ఇదంతా అని కార్తీక్ అడ‌గ్గా.. నా కూతురు నా ద‌గ్గ‌ర ఉండాల‌నే త‌పన అని దీప అంటుంది. మ‌రి నేను.. నేను ఏమైపోయినా ప‌ర్వాలేదా..? అని కార్తీక్ అడుగుతాడు. మీరు ఏదైనా ఎందుకు అయిపోవాలి.? త‌ండ్రి అయిపోండి. తండ్రిని అని ఒప్పుకోండి. అప్పుడు అంద‌రం క‌లిసే ఉంటాము క‌దా అని దీప అంటుంది. దానికి కార్తీక్.. నేను ఎప్పటికీ హిమ‌కు పెంచిన తండ్రిగానే ఉంటాను అని అంటాడు. అప్పుడు క‌న్న‌తండ్రికి ఉండే హ‌క్కులు మీకు ఉండ‌వు. నేను నా కూతురికి త‌ల్లిగానే ఉంటాను. క‌న్న‌త‌ల్లిగానే ఉంటాను. దాన్ని మీకు అప్ప‌జెప్పి మ‌ళ్లీ వంట‌ల‌క్కలాగా మారిపోలేను. అని దీప అంటుంది. దానికి కార్తీక్.. అంతా నీ ఇష్ట‌మేనా అన‌గా.. అంతే అని దీప అంటుంది. అంతా నా ఇష్ట‌మే ఇప్పుడు. ఎందుకంటే త‌ల్లి అనేదే నిజం. తండ్రి అనేది న‌మ్మ‌కం. మీకు ఆ న‌మ్మ‌కమే లేన‌ప్పుడు నిజం అయితేనే క‌దా ప్ర‌పంచ‌మంతా నిల‌బ‌డేది. నిజంవైపే క‌దా న్యాయం నిల‌బ‌డేది. స‌మాజం అయినా మ‌నస్సాక్షి అయినా న‌మ్మ‌కాలు అయినా నిజాల‌కే విలువ‌ను ఇస్తున్నాయి డాక్ట‌ర్ బాబు అని అంటుంది.

  అంటే.. ఇంత‌కాలం నేను హిమ‌ను పెంచింది, ప్రేమ‌ను పెంచుకుంది, ఆరాట‌ప‌డింది, త‌ప‌న‌ప‌డింది. అంతా వృధా అయిపోయిన‌ట్లేనా అని కార్తీక్ అనగా.. నేను మీ ప్రేమ‌ను కాద‌న‌డం లేదు. మీరు దాని క‌న్న‌తండ్రి. అది నాకు తెలుసు. మీరు తెలుసుకోలేక‌పోతున్నారు. అది మీరు తెలుసుకునేదాకా.. దాన్ని తీసుకెళ్లే హ‌క్కు మీకు ఉండ‌దు అని దీప అంటుంది. ఇక తరువాత కార్తీక్ ద‌గ్గ‌ర‌కు వెళ్లే దీప‌.. అత‌డిపై చెయ్యి వేసి న‌న్ను క్ష‌మించండి డాక్ట‌ర్ బాబు మిమ్మ‌ల్ని బాధ‌పెట్టినందుకు స‌దా మీ చ‌ర‌ణ‌దాసినే అది మాత్రం నిజం, న‌ట‌న కాదు అని చెప్పి వెళుతుంది. ఇక దీప వెళ్లిన వెంట‌నే కార్తీక్.. చూశావా నా కూతురిని నాకు కాకుండా చేసింది అని చెబుతూ ఆవేశంతో బాధ‌ప‌డుతూ ఉంటాడు. అలాగే దీప చెప్పిన మాట‌ల‌ను గుర్తుచేసుకుంటూ ఉంటాడు. ఇక హిమ‌ను దీప ఆటోలో తీసుకెళుతూ ఉంటుంది.

  మ‌రోవైపు అంజి దేవత‌ను వేడుకుంటూ.. నేను ఇన్ని రోజులుగా వెతికిన శ‌త్రువు నా క‌ళ్లెదుటే ఉన్నా ఏం చేయ‌లేక‌పోతున్నాను. దేవుడి లాంటి డాక్ట‌ర్ బాబును, ఏ పాపం తెలియ‌ని దీప‌ను ప‌ట్టి పీడిస్తోన్న ఆ బ్ర‌హ్మ‌ రాక్షసిని త‌లుచుకుంటే క్ష‌ణాల్లో చంపేయ‌గ‌ల‌ను. కానీ దాని వ‌ల్ల నిజం కూడా చ‌చ్చిపోతుంది. క‌ళ్లెదుటే దీప‌మ్మ కాపురం కూలిపోతుంటే ఏ సాక్ష్యం చూపించ‌లేక.. మౌనంగా ఉండిపోవాల్సి వ‌స్తుంది. సాక్ష్యం కోస‌మైనా మౌనిత బ్ర‌తికే ఉండాలి. ఇక్క‌డ‌దాకా వ‌చ్చిన త‌రువాత డాక్ట‌ర్ బాబుతో చెప్ప‌కుండా దాచ‌డం అన‌వ‌సం. ఎవ‌రు చెప్పినా డాక్ట‌ర్ బాబు వినే స్థితిలో లేడు. నేను చెప్తాను. ఆధారాల‌తో స‌హా నేను చెబుతాను. ఇప్ప‌టినుంచి ప్ర‌తి క్ష‌ణం మౌనిత చేసే ప‌నుల‌ను క‌నిపెడుతూ ఉంటాను. దానికి నీ స‌హాయం అవ‌స‌రం త‌ల్లి అని వేడుకుంటాడు. ఇక బ‌య‌ట‌కు వెళుతుండగా.. మౌనిత కారులో రావ‌డం చూసి.. ఇంత త్వ‌ర‌గా నన్ను క‌నుక‌రిస్తావ‌ని అనుకోలేదు తల్లి అంటాడు.ఈ క్ర‌మంలో మౌనిత కారును ఫాలో అవుతూ వెళ‌తాడు అంజి. ఇక రేప‌టి ఎపిసోడ్ ప్రోమోలో అంజి, దీప మాట్లాడుతుండ‌గా.. అక్క‌డ‌కు వెళ్లిన మౌనిత‌.. నా కార్తీక్‌ని ద‌క్కించుకునేందుకు ఎంత దూర‌మైనా వెళ‌తా అని అంటుంది. దానికి దీప నా లెక్క‌లు నాకు ఉన్నాయి అంటుంది. ఇలా కార్తీక దీపం మ‌రింత ఆస‌క్తిక‌రంగా మారింది.

  First published:

  Tags: Karthika deepam, Karthika deepam telugu serial, Television News

  ఉత్తమ కథలు