Bigg Boss 5 Telugu Uma Devi - Anee Master: బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 5 రోజురోజుకు బాగా హైలెట్‌గా మారుతుంది. ఈ సీజన్ లో మొత్తం 19 మంది కంటెస్టెంట్ లు ఎంట్రీ ఇవ్వగా ఏ ఒక్కరు కూడా అస్సలు తగ్గేలా లేరు. షో ప్రారంభం రోజు నుండి ఇప్పటివరకు రచ్చ జరగని రోజే లేదు. లేడీ కంటెస్టెంట్ లు బూతు మాటలతో బాగా రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా ఉమాదేవి మాత్రం తన బూతు మాటలతో కంటెస్టెంట్ లనే కాకుండా ప్రేక్షకులను కూడా ఆశ్చర్యపరిచింది.
ఈ షోను చూసిన ప్రేక్షకులు మాత్రం ఏ రోజు కూడా ఎటువంటి హైలెట్ సీన్ లను మిస్స్ అవ్వకుండా చూస్తున్నారు. ఇక ట్రోల్లర్స్ కి మాత్రం ట్రోల్స్ బాగానే దొరుకుతున్నాయి. నెటిజన్లు ఈ షోలో ఇటువంటి వాళ్ళే ఉండాలి అంటూ.. మీరు మమ్మల్ని ఇంకా ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఎలిమినేషన్ సమయంలో మాత్రం కంటెస్టెంట్ ల మధ్య జరుగుతున్న యుద్ధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరమే లేదు.
నిన్నటి ఎపిసోడ్ లో ఇంకా రెచ్చిపోయారు కంటెస్టెంట్‌లు. రోజు రోజుకి ఎపిసోడ్ లలో కొత్త కొత్త మార్పులే కాదు కంటెస్టెంట్ ల మధ్య కూడా మంచి ఘాటైన డైలాగులు వినిపిస్తున్నాయి. ఇక నిన్నటి ఎపిసోడ్ లో కెప్టెన్ కోసం కొన్ని టాస్క్ లు ఇచ్చాడు బిగ్ బాస్. అందులో దొంగలున్నారు జాగ్రత్త, సాగర సోదరా టాస్క్ లు ఇవ్వగా అందులో భాగాలైన రెండు టీమ్ లు గట్టిగానే పోరాడారు. చివరిలో ఈ టాస్క్ కాస్త అడ్డం తిరగడంతో ఈ టాస్క్ ను రద్దు చేశాడు బిగ్ బాస్.
మరో టాస్క్ మొదలవగా.. అందులో ప్రియ నుండి వివాదం మొదలైంది. పిల్లోస్ తీసుకోవాలనే భాగంలో ప్రియ ఉమాదేవిని ఓ వస్తువుతో కొట్టింది. ఇంక వెంటనే ఉమాదేవి రెచ్చిపోయి కోపాన్ని ప్రదర్శించింది. నన్ను కొడితే డ్రెస్సు చింపేస్తాను అనడంతో అంతలోనే యానీ మాస్టర్ ఫైర్ అవుతూ.. ఒసేయ్ ఉమా! చింపుతావా అంటూ కోపంగా అరుస్తుంది. సిగ్గు లేదా నీకు సిగ్గు లేదా అంటూ కోపంతో రగిలి పోగా.. నీకు సిగ్గు ఉంది కదా అంటూ ఉమా మరింత ఫైర్ అయ్యింది. తూ.. తూ.. అంటూ బాగా గొడవకు దిగారు. చిల్లర అంటూ ఇద్దరి మధ్యల మాటల యుద్ధం బాగానే జరిగింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anee master, Bigg boss season 5 telugu, Dance Plus, Karthika deepam, Uma devi