• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • KARTHIKA DEEPAM TV SERIAL COMING TO AN END IS IT REAL MK

Karthika deepam: కార్తీక దీపం సీరియల్ ఒరిజినల్ మళయాళంలో ఎలా ముగిసిందో తెలిస్తే...షాక్ తింటారు...

కార్తీక దీపం దీప

ఈ సీరియల్ త్వరలో తొలి సీజన్ పూర్తి అవుతుందని, తర్వాతి సీజన్ కాస్త గ్యాప్ తీసుకొని ప్రసారం అవుతుందనే వార్తలు వస్తున్నాయి. మూడేళ్ల పాటు విజయవంతంగా ప్రసారమైన ఈ సీరియల్ ను మంచి టీఆర్పీ రేటింగ్స్ తోనే ముగించాలని ఈ సీరియల్ నిర్మాతలు భావిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

  • Share this:
    తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం 7.30 నిమిషాలకు ప్రతీ ఇంట్లో ప్రసారమయ్యే సీరియల్ ఏదైనా ఉందంటే అది స్టార్ మాలో ప్రసారం అయ్యే కార్తీక దీపం అనే చెప్పాలి. బుల్లితెరపై నంబర్ 1 సీరియల్ కార్తీకదీపం సీరియల్ ఒకటి కాదు రెండు కాదు. ఏకంగా గత మూడేళ్లుగా ఈ సీరియల్ నెంబర్ వన్ టీఆర్పీ రేటింగులతో దూసుకెళ్తోంది. ముఖ్యంగా పెద్ద పెద్ద సినిమా నటుల కొత్త సినిమా ప్రీమియర్లకు సైతం రాని టీఆర్పీ రేటింగులు కార్తీక దీపం సీరియల్ కు వస్తాయంటే అతిశయెక్తి కాదు. స్టార్ మా ఛానెల్ లో ప్రేమీ విశ్వనాథ్, నిరుపమ్ ప్రధాన పాత్రల్లో ప్రసారమవుతున్న ఈ సీరియల్ కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళలో కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. గత కొన్నేళ్లుగా స్టార్ మా ఛానల్ ను నంబర్ 1 స్థానంలో నిలబెట్టింది కార్తీక దీపం సీరియల్ అనే చెప్పాలి. నిజానికి ఈటీవీలో ప్రసారం అయ్యే జబర్దస్త్, సహా ఇతర షోస్ కు మంచి రేటింగ్స్ వస్తుంటాయి. కానీ కార్తీక దీపం సీరియల్ మాత్రం ఒంటి చేత్తో స్టార్ మాను నెంబర్ వన్ స్థానంలో నిలబెడుతుంది.

    2017 సంవత్సరం అక్టోబర్ నుంచి ప్రసారమవుతున్న ఈ సీరియల్ లో వంటలక్క అలియాస్ దీపగా నటిస్తున్న ప్రేమి విశ్వనాథ్ అభినయం పెద్ద అసెట్ అనే చెప్పాలి. నిర్విరామంగా ఎంత సేపైనా బాధ కలిగించే ఎక్స్ ప్రేషన్స్ ఇవ్వడంలో ప్రేమి విశ్వనాథ్ ఆ విషయంలో మహానటి అనే చెప్పాలి. అయితే ఈ సీరియల్ త్వరలో తొలి సీజన్ పూర్తి అవుతుందని, తర్వాతి సీజన్ కాస్త గ్యాప్ తీసుకొని ప్రసారం అవుతుందనే వార్తలు వస్తున్నాయి. మూడేళ్ల పాటు విజయవంతంగా ప్రసారమైన ఈ సీరియల్ ను మంచి టీఆర్పీ రేటింగ్స్ తోనే ముగించాలని ఈ సీరియల్ నిర్మాతలు భావిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

    నిజానికి మళయాళ మాతృక అయిన కారుముత్తు సీరియల్ ఏడు సంవత్సరాలు ప్రసారమై ముగిసిపోయింది. ఆ సీరియల్ లో కూడా దీప కేరక్టర్ ప్రేమి విశ్వనాథ్ పోషించింది. కానీ ఆ సీరియల్ లో దీప, డాక్టర్ బాబుకు కవల పిల్లలు ఉండరు. ఒక్క కూతురే ఉంటుంది. మళయాళ మాతృకలో వంటలక్క యాక్సిడెంట్ అయ్యి అదృశ్యమై పోయి గతం మరిచిపోయి మరో కుటుంబం చేరదీస్తుందని, అటు డాక్టర్ బాబు అనారోగ్యం పాలై అమెరికా వెళ్లిపోగా, వారి కుమార్తె ( మళయాళంలో ఒక్క పాపే ఉంటుంది) పెరిగి పెద్ద అయ్యాక కలెక్టర్ అవుతుంది. అలా సెకండ్ సీజన్ మళయాళంలో మొదలై వంటలక్క కుటుంబం అంతా ఒక్క దగ్గరకు చేరడంతో ఆ సీరియల్ ముగిసింది.

    అయితే తెలుగులో ఇంకా మొదటి సీజన్ పూర్తి కాలేదు. ఇప్పుడే దీప కుమార్తెలు హిమ, సౌర్యలకు నిజాలు తెలుస్తున్నాయి. డాక్టర్ బాబుకు పూర్తి నిజం ఇంకా తెలియలేదు. అయితే మరోవైపు ప్రేమీ విశ్వనాథ్ త్వరలో ఒక సినిమాలో నటించబోతోందని అందుకే గ్యాప్ తీసుకునేందుకు మొదటి సీజన్ ముగించి రెండో సీజన్ లో పిల్లలు పెద్దవాళ్లు అయినట్లు చూపిస్తారనే ప్రచారం నడుస్తోంది. ఈ లోగా దీప సినిమా కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత మళ్లీ రెగ్యులర్ గా కేరక్టర్ కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఛానల్ నిర్వాహకుల నుంచి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే కార్తీకదీపం సీరియల్ ను గ్యాప్ తీసుకుంటే మాత్రం వంటలక్క అభిమానులకు అది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.
    Published by:Krishna Adithya
    First published: