Top Telugu Serials: ఈ ఏడాది బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న తెలుగు సీరియల్స్ ఇవే
Top Telugu Serials: ఈ ఏడాది బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న తెలుగు సీరియల్స్ ఇవే
తెలుగు సీరియల్స్
ఇంట్లోనే ఉండే వారికి కాలక్షేపం అంటే వెంటనే గుర్తొచ్చేవి సీరియల్స్. పేరుకు బుల్లితెరనే అయినప్పటికీ.. వెండితెరకు ఏ మాత్రం తీసిపోవు కొన్ని సీరియల్స్. అందులో నటీనటులు అవ్వొచ్చు, వచ్చే ట్విస్ట్‌లు కావొచ్చు, ఎమోషనల్ సన్నివేశాలు కావొచ్
ఇంట్లోనే ఉండే వారికి కాలక్షేపం అంటే వెంటనే గుర్తొచ్చేవి సీరియల్స్. పేరుకు బుల్లితెరనే అయినప్పటికీ.. వెండితెరకు ఏ మాత్రం తీసిపోవు కొన్ని సీరియల్స్. అందులో నటీనటులు అవ్వొచ్చు, వచ్చే ట్విస్ట్‌లు కావొచ్చు, ఎమోషనల్ సన్నివేశాలు కావొచ్చు.. కొన్ని సినిమాలకంటే చాలా బావుంటాయి. ఇక కొన్ని సీరియల్స్‌కి వచ్చే టీఆర్పీ రేటింగ్ స్టార్ హీరోల సినిమాలకు కూడా రాదు. అలా ఈ ఏడాది తెలుగు బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న సీరియల్స్ ఏంటంటే
ఇప్పుడున్న జనరేషన్లో సీరియల్ అంటే వెంటనే గుర్తొచ్చేది కార్తీక దీపం. స్నేహితురాలు నాటిన అనుమాన భీజాన్ని గుర్తించలేని స్థితిలో ఉన్న డాక్టర్ కార్తీక్, ఆత్మగౌరవానికి కేరాఫ్‌గా ఉండే వంటలక్క దీప మధ్య జరిగే కథ కార్తీక దీపం. స్టార్ మాలో ప్రసారం అయ్యే ఈ సీరియల్లో తన కుమారుడు, కోడలిని కలిపే అత్తగా సౌందర్య పాత్ర చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సీరియల్ ఇప్పుడు కాదు.. కొన్ని సంవత్సరాలుగా టాప్ 1లో నడుస్తోంది. అంతేకాదు ఎంత పెద్ద సినిమాలు వచ్చినా, రియాలిటీ షోలు అయినా టీఆర్పీలో వంటలక్కను దాటలేకపోవడం విశేషం. ఇందులో ప్రేమి విశ్వనాథ్, పరిటాల నిరుపమ్, ఆచార్య అనంత్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
వంటలక్క సీరియల్ తరువాత అందరినీ బాగా ఆకట్టుకుంటోన్న మరో సీరియల్ ఇంటింటి గృహలక్ష్మి. ఇంట్లో వారి కోసం ఎప్పుడూ తపించే ఓ భార్య, అయితే ఆమెకు చదువులేదని ఇంట్లో వాళ్లు సరిగా విలువ ఇవ్వకపోవడం, సంసారంలో తన భార్త గాడి తప్పడం నేపథ్యంలో ఈ సీరియల్ తెరకెక్కింది. ప్రముఖ నటి కస్తూరి ఇందులో తులసిగా అందరి చేత మన్ననలు పొందుతోంది.
తన తమ్ముల కోసం తాపత్రపడే ఓ అన్నయ్య.. భర్త మనోభావాలను అర్థం చేసుకొని కుటుంబాన్ని కంటికి రెప్పలా చూసుకునే అత్యున్నత భావాలు కలిగిన వదిన. వీరి అన్యోన్య కథగా వదినమ్మ తెరకెక్కింది. స్టార్ మా లో వచ్చే ఈ సీరియల్ ఒకానొక సమయంలో కార్తీక దీపంకు గట్టి పోటీని ఇచ్చింది. కానీ టీఆర్పీలో మాత్రం కార్తీక దీపంను మాత్రం ఎప్పుడూ దాటలేకపోయింది. ఇందులో ప్రబాకర్, సుజిత, మధు నాయుడు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఒకరంటే ఒకరికి ప్రాణంగా బతికే అక్కా చెల్లెలు. ఒకరినే ఇష్టపడితే అన్న కథాంశంతో ఈ సీరియల్ తెరకెక్కింది. ఇందులో సుహాసిని, అర్జున్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. పల్లెటూరి కథతో తెరకెక్కుతోన్న ఈ సీరియల్ చాలా మందిని ఆకట్టుకుంటోంది.
మధ్య వయసులో ఉన్న ఓ వ్యాపారవేత్తతో 16 ఏళ్ల అమ్మాయి ప్రేమలో పడితే ఎలా అన్న కథాంశంతో ఈ సీరియల్ తెరకెక్కింది. జీ తెలుగులో ప్రసారం అయ్యే ఈ సీరియల్లో శ్రీరామ్ వెంకట్, వర్ష ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
జరగబోయే ప్రమాదాలను ముందే చూడగలిగే అతీత శక్తులు ఉన్న ఓ యువతి.. పరిస్థితులను ఎలా చక్కబెడుతుంది అన్న కథాంశంతో ఈ సీరియల్ తెరకెక్కింది. సూపర్ నాచురల్‌గా తెరకెక్కిన ఈ సీరియల్ జీ తెలుగులో ప్రసారం అవ్వనుండగా.. అషిక గోపాల్, చందు గౌడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
సంగీతమే ప్రాణంగా బతికే కోయిలమ్మ పుట్టినప్పటి నుంచి ఎన్ని కష్టాలను ఎదుర్కొంది. తన కన్నతండ్రి సైతం ఆమెను దూరంగా పెడితే అన్ని కష్టాలను అధిగమించి.. తండ్రికి తగ్గ తనయగా ఎలా పేరు తెచ్చుకుంది అన్న కథాంశంతో ఈ సీరియల్ తెరకెక్కింది. స్టార్ మాలో ప్రసారమైన ఈ సీరియల్ ఆ మధ్యనే పూర్తైంది.
నిజాయితీ కలిగిన ఓ మహిళ తనకు ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కొంటుంది అన్న కథాంశంతో ఈ సీరియల్ తెరకెక్కింది. ఈటీవీలో వచ్చే ఈ సీరియల్లో నవ్య స్వామి ప్రముఖ పాత్రలో నటిస్తోంది.
మాటలు రాని ఓ యువతి. ఆమెను అసహ్యించుకునే తండ్రి. దీంతో చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డ ఆ యువతి.. తన తండ్రి ప్రేమను ఎలా పొందింది..? ప్రేమించిన వాడిని ఎలా పెళ్లి చేసుకుంది..? అన్న కథాంశంతో ఈ సీరియల్ తెరకెక్కింది. స్టార్ మాలో వచ్చే ఈ సీరియల్ టైమింగ్ మారినా.. ఇప్పటికీ మంచి రేటింగ్‌ను సంపాదిస్తోంది.
మహిళల్ని ఉన్నతంగా, సమాజం లో ఒక బలమైన స్త్రీగా చూపించే ఒక అద్భుతమైన కథతో నంబర్ వన్ కోడలు తెరకెక్కింది. అత్తా-కోడళ్ల మధ్య వుండే అసలైన అనుబంధాన్ని ఈ సీరియల్ ద్వారా చూపిస్తున్నారు. జీ తెలుగులో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ లో మయూరి సుధా చంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.