KARTHIKA DEEPAM TO HAVE A NEW TWIST IT IS A BIG SHOCK TO KARTHIK AND DEEPA BA
కార్తీకదీపం సీరియల్లో భారీ ట్విస్ట్.. డాక్టర్ బాబు, వంటలక్క ఇద్దరికీ షాకింగ్
కార్తీక దీపంలో దీప, కార్తీక్
కార్తీక్ బాబు హిమని వంటలక్క దీప ఇంట్లో వదిలి పెట్టాడు. కుమార్తెను తీసుకురావడం కోసం వెళ్లినప్పుడు కార్తీక్ ఇన్నాళ్లూ ఎదురు చూస్తున్న సీక్రెట్ బయటపడనుంది.
కార్తీక దీపం సీరియల్లో భారీ ట్విస్ట్ ప్లాన్ చేశారు దర్శక నిర్మాతలు. ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న వారికి మొత్తానికి నరాలు తెగే సీక్రెట్‌ను బయట పెట్టనున్నారు. డాక్టర్ బాబు దగ్గరున్న కుమార్తె హిమ ప్రవర్తన ఈ మధ్య కాలంలో మారింది. ఆ మార్పునకు కారణం ఏంటనే అంశానికి సంబంధించి సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలని కార్తీక్ తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో కార్తీక్ హిమని వంటలక్క దీప ఇంట్లో వదిలి పెట్టాడు. కుమార్తెను తీసుకురావడం కోసం వెళ్లినప్పుడు కార్తీక్ ఇన్నాళ్లూ ఎదురు చూస్తున్న సీక్రెట్ బయటపడనుంది. తాను ఎవరిని అయితే అసహ్యించుకుంటున్నాడో, ఎవరినైతే తాను దీపే హిమకి కూడా కన్నతల్లి అనే సీక్రెట్ డాక్టర్ బాబుకి తెలిసిపోతుంది. తులసి వల్లే దీపకి కష్టం రానుంది. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ కార్తీక్‌కి మాత్రమే తెలీదు. ఆ సీక్రెట్ ఇన్నాళ్లకు బయటపడనుంది. ఈ విషయం తెలిసిన వెంటనే కార్తీక్ రియాక్షన్ కూడా చాలా సీరియస్‌గా ప్లాన్ చేశారు దర్శక నిర్మాతలు. ఆ చేదు నిజాన్ని తట్టుకోలేక ఏకంగా మందు కొట్టడం మొదలు పెడతాడు. దీనికి సంబంధించిన ప్రోమో చూస్తే ఈ విషయం తెలుస్తుంది.
సౌర్య, హిమ ఇద్దరు పుట్టినప్పుడు సౌందర్యే దీప దగ్గరి నుంచి హిమను విడదీస్తుంది. ఆ చిన్న పిల్లను ఇంటికి తీసుకొస్తుంది. అనాథ బాలిక అని చెబుతుంది. అప్పటి నుంచి వారిద్దరి మధ్య బాండింగ్ పెరిగింది. అయితే, దీప తన తల్లి అని తాజాగా హిమకు కూడా తెలిసింది. తన తల్లిదండ్రులను కలపాలని మోనితను సాయం కోరుతుంది. దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుని డాక్టర్ బాబు, వంటలక్కను మరింత విడదీయాలని చూస్తుంది. కార్తీక్‌ను తప్పుదారి పట్టిస్తూ ఉంటుంది.
ఇక తాజాగా ఆనంద్ రావు మళ్లీ సీరియల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. కరోనా వల్ల కొన్నాళ్లు షూటింగ్‌కు దూరంగా ఉన్నట్టు తెలిసింది. ఇక ఈ సీరియల్ టీఆర్పీ రేటింగ్స్‌లో దుమ్మురేపుతోంది. లాక్ డౌన్ కాలంలో కూడా టాప్ రేటింగ్ సీరియల్‌గా నిలిచింది. ప్రస్తుతం తెలుగులో వస్తున్న అన్ని సీరియల్స్‌లోనూ టాప్ రేటింగ్ వస్తున్న సీరియల్ కూడా కార్తీక దీపం అని టీఆర్పీ రేటింగ్స్ చెబుతున్నాయి.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.