కార్తీక దీపం సీరియల్‌లో అనుకోని ట్విస్ట్ ఇదే...వంటలక్క, డాక్టర్ బాబు కలిసిన తర్వాత...

మొత్తం 650 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న కార్తీకదీపం ప్రస్తుతం ఒక కీలక దశకు చేరుకుంది. అయితే ఈ దశలోనే సీరియల్‌లో మొదటి సీజన్ ముగింపునకు వచ్చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి.

news18-telugu
Updated: November 17, 2019, 7:08 PM IST
కార్తీక దీపం సీరియల్‌లో అనుకోని ట్విస్ట్ ఇదే...వంటలక్క, డాక్టర్ బాబు కలిసిన తర్వాత...
కార్తీక దీపం (Image: hotstar)
  • Share this:
కార్తీక దీపం సీరియల్ తెలుగులో అత్యంత ప్రజాదరణతో దూసుకుళ్తోంది. ఇప్పటికే తెలుగు టెలివిజన్ రేటింగ్స్ లో అత్యధిక పాయింట్లు సాధించి బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోను సైతం తోసి రాజని టాప్ పొజిషన్ లో నిలిచిన కార్తీక దీపం బుల్లితెరపై ఓ సంచలనం అనే చెప్పవచ్చు. మొత్తం 650 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న కార్తీకదీపం ప్రస్తుతం ఒక కీలక దశకు చేరుకుంది. అయితే ఈ దశలోనే సీరియల్‌లో మొదటి సీజన్ ముగింపునకు వచ్చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. కథలో ఇఫ్పటికే కార్తీక్, దీపలను కలిపేందుకు కవల పిల్లలు సౌర్య, హిమ తీవ్రంగా ప్రయత్నం చేయడం, ఆ దిశగానే కథ ముందుకు కదలడం, దీప, కార్తీక్ ల మధ్య అపోహలు తొలగిపోయిన కలిసిపోవాలని తీర్మానించుకోవడంతో అసలు కథ సుఖాంతం అవుతుందనే వార్తలు వస్తున్నాయి. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ చోటుచేసుకుంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అందులో దీప వంటలక్క ఒక దుర్ఘటన వల్ల గతం మర్చిపోతుందని, పిల్లలు పెద్దవాళ్లయిపోతారని, కార్తీక్ అమెరికా వెళ్లిపోతాడని, దీప వేరే వ్యక్తి దగ్గరకు  చేరుతుందని, అతడిని పెళ్లిచేసుకోవాలని అనుకునే సమయంలో గతం గుర్తుకు వచ్చి మళ్లీ కార్తీక్ దీప కలుస్తారనే టాక్ వినిపిస్తుంది.

ఇప్పటికే ఈ సీరియల్ మలయాళం వెర్షన్ పూర్తి అయ్యింది. అయితే రెండు భాషల్లో కథలు కాస్త వేర్వేరుగా ఉన్నాయి. ఎందుకంటే తెలుగులో వంటలక్కకు ఇద్దరు కూతుళ్లు ఉంటే మలయాళంలో ఒక్కతే కూతురు ఉంది. మరి ముందు ముందు ఈ సీరియల్ ఎలాంటి మలుపులు తీసుకుంటుందా అని మహిళా ప్రేక్షకులు ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు.

First published: November 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...