• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • KARTHIKA DEEPAM TELUGU SERIAL UPDATES 29 JUNE 2020 DEEPA ARGUES WITH MONITHA MK

నేటి నుంచి బుల్లితెరపై వంటలక్క దండయాత్ర...కార్తీక దీపం స్టార్ట్...అదిరిపోయే ట్విస్ట్ ఇదే...

కార్తీక దీపంలో వంటలక్క (Twitter/Photo)

వంటలక్క, మౌనిత మధ్య ఒక ఆసక్తికరమైన సీన్ ఉందని తెలుస్తోంది. అంతేకాదు డాక్టర్ బాబుకు కూడా వంటలక్క షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి పిల్ల, పెద్దలందరూ ఆదరించే వంటలక్క బుల్లితెరపై రీఎంట్రీ ఇవ్వడంతో ఈ రోజు నుంచి అందరి ఇంట్లో కార్తీక దీపం మొదలవ్వనుంది. ఇక టీఆర్బీలు మరోసారి స్టార్ మా వైపే పరిగెత్తడం ఖాయంగా కనిపిస్తోంది.

  • Share this:
    బుల్లితెర బాహుబలి కార్తీక దీపం సీరియల్ ఫ్రెష్ ఎపిసోడ్స్ నేటి నుంచి ప్రసారం కానున్నాయి. ఇప్పటికే ఈ సీరియల్ లాక్ డౌన్ కారణంగా 3 నెలల పాటు నిలిచిపోయింది. ఇంటిల్లిపాది ఆదరించే ఈ సీరియల్ అటు మహిళా ప్రేక్షకులనే కాదు...పురుషులను కూడా ఆకట్టుకుంది. ఐపీఎల్, వరల్డ్ కప్ ఇలా ఏ సీజన్ లో అయినా టీఆర్బీ రేటింగ్స్ లో దూసుకెళ్లిన కార్తీక దీపం ఈ రోజు ( జూన్ 29) నుంచి ఫ్రెష్ ఎపిపోడ్స్ తో స్టార్ట్ కానుంది. అయితే 766వ ఎపిసోడ్ దగ్గర ఆగిపోయిన కార్తీక దీపం...నేడు 767 ఎపిసోడ్ ప్రారంభంతో రీఎంట్రీ గ్రాండ్ గా ప్రారంభం కానుంది. గత ఎపిసోడ్ లో హిమని డాక్టర్ బాబు స్కూల్ మార్చాలని అనుకోవడం, హిమ ప్రిన్సిపాల్ తో మాట్లాడటం వరకూ సాగింది. అయితే ఈ రోజు ఎపిసోడ్ ఎలా సాగుతుంది అనేది ఆసక్తిగా మారింది. అయితే హాట్ స్టార్ యాప్ లో ఈ రోజు ఎపిసోడ్ ఇప్పటికే అప్ లోడ్ చేసేశారు.

    అయితే అందులో వచ్చిన లీకుల సమాచారం ప్రకారం వంటలక్క, మౌనిత మధ్య ఒక ఆసక్తికరమైన సీన్ ఉందని తెలుస్తోంది. అంతేకాదు డాక్టర్ బాబుకు కూడా వంటలక్క షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి పిల్ల, పెద్దలందరూ ఆదరించే వంటలక్క బుల్లితెరపై రీఎంట్రీ ఇవ్వడంతో ఈ రోజు నుంచి అందరి ఇంట్లో కార్తీక దీపం మొదలవ్వనుంది. ఇక టీఆర్బీలు మరోసారి స్టార్ మా వైపే పరిగెత్తడం ఖాయంగా కనిపిస్తోంది.

    First published: