కార్తీక దీపం సీరియల్ ఎఫెక్ట్...వీధులకెక్కిన వంటలక్క ఫ్యాన్స్ అభిమానం...

ఆమె అభిమానులు ఏకంగా టీస్టాల్స్ కు దీప టీ స్టాల్ అని పెట్టుకొని ఆమె పేరుని తమ పబ్లిసిటీకి వాడేస్తున్నారు. గతంలో సినిమా తారల పేర్లను ఇలా వాడుకునేవారు. అయితే తాజాగా సీిరియల్ నటుల పేర్లను కూడా ఇలా కమర్షియల్ వాడుకోవడం హాట్ టాపిక్ గా మారింది.

news18-telugu
Updated: November 22, 2019, 3:20 PM IST
కార్తీక దీపం సీరియల్ ఎఫెక్ట్...వీధులకెక్కిన వంటలక్క ఫ్యాన్స్ అభిమానం...
వంటలక్క టీస్టాల్
  • Share this:
Karthika Deepam : తెలుగు సీరియల్స్‌లో విశేష ఆదరణ పొందుతున్న సీరియల్ కార్తీక దీపం, అయితే ఈ సీరియల్ లో దీప కేరక్టర్ అంటే మహిళలకు బాగా ఇష్టమనే చెప్పవచ్చు. కార్తీక్, దీప దాంపత్య జీవితంలో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా తీసిన ఈ సీరియల్ తెలుగులో దాదాపు మూడేళ్లుగా నడుస్తోంది. విశేషమైన ప్రేక్షాకాదరణ పొందిన కార్తీక దీపం మాతృక మళయాళంలోని కారుముత్తు నుంచి తీసుకొని తెలుగులో రీమేక్ చేశారు. అయితే దీపగా, వంటలక్కగా ప్రేక్షకుల ఆదరణ పొందిన ప్రేమి విశ్వనాథ్, ప్రతీ మహిళను కదిలించేలా నటించింది. అయితే వంటలక్కగా పేరొందిన ప్రేమి విశ్వనాథ్ అంటే ఇప్పుడు ఓ స్టార్ సెలబ్రిటీ అనే చెప్పవచ్చు. ఆమె అభిమానులు ఏకంగా టీస్టాల్స్ కు దీప టీ స్టాల్ అని పెట్టుకొని ఆమె పేరుని తమ పబ్లిసిటీకి వాడేస్తున్నారు. గతంలో సినిమా తారల పేర్లను ఇలా వాడుకునేవారు. అయితే తాజాగా సీిరియల్ నటుల పేర్లను కూడా ఇలా కమర్షియల్ వాడుకోవడం హాట్ టాపిక్ గా మారింది.
Published by: Krishna Adithya
First published: November 22, 2019, 3:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading