హోమ్ /వార్తలు /సినిమా /

Karthika Deepam: కార్తీక దీపం సౌంద‌ర్య‌కు టాలీవుడ్‌లో ఆ స్టార్ హీరో అంటే చాలా ఇష్ట‌మ‌ట‌

Karthika Deepam: కార్తీక దీపం సౌంద‌ర్య‌కు టాలీవుడ్‌లో ఆ స్టార్ హీరో అంటే చాలా ఇష్ట‌మ‌ట‌

మరీ ముఖ్యంగా కార్తీక్ తల్లి పాత్రలో నటిస్తున్న అర్చన ఆనంత్ మన ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయిపోయింది. ఒంటి నిండా నగలతో ఎప్పుడూ ఫుల్ మేకప్‌తో ఉండే అర్చనకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.

మరీ ముఖ్యంగా కార్తీక్ తల్లి పాత్రలో నటిస్తున్న అర్చన ఆనంత్ మన ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయిపోయింది. ఒంటి నిండా నగలతో ఎప్పుడూ ఫుల్ మేకప్‌తో ఉండే అర్చనకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.

తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న సీరియ‌ల్ కార్తీక దీపం(Karthika Deepam). ఈ సీరియ‌ల్‌లో అత్త సౌంద‌ర్య పాత్ర‌లో న‌టి అర్చ‌నా ఆనంత్‌ అంద‌రినీ మెప్పిస్తున్నారు. క‌ట్టుబొట్టు మాత్ర‌మే కాదు.. కోడ‌లికి మ‌ద్దతిచ్చే అత్తగా ఆమె అద్భుత‌ న‌ట‌న అంద‌రినీ బాగా ఆక‌ట్టుకుంటోంది. ఇక ఈ సీరియ‌ల్‌తో అర్చ‌నాకు తెలుగు ప్రేక్ష‌కుల్లోనూ క్రేజ్ పెరిగింది.

ఇంకా చదవండి ...

  Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న సీరియ‌ల్ కార్తీక దీపం. ఈ సీరియ‌ల్‌లో అత్త సౌంద‌ర్య పాత్ర‌లో న‌టి అర్చ‌నా ఆనంత్‌ అంద‌రినీ మెప్పిస్తున్నారు. క‌ట్టుబొట్టు మాత్ర‌మే కాదు.. కోడ‌లికి మ‌ద్దతిచ్చే అత్తగా ఆమె అద్భుత‌ న‌ట‌న అంద‌రినీ బాగా ఆక‌ట్టుకుంటోంది. ఇక ఈ సీరియ‌ల్‌తో అర్చ‌నాకు తెలుగు ప్రేక్ష‌కుల్లోనూ క్రేజ్ పెరిగింది. ఈ క్ర‌మంలో కేరాఫ్ అన‌సూయ అనే మ‌రో సీరియల్‌లోనూ న‌టిస్తున్నారు అర్చ‌నా. కాగా క‌ర్ణాట‌క‌కు చెందిన ఈ న‌టికి టాలీవుడ్‌లో ఓ స్టార్ హీరో అంటే చాలా ఇష్ట‌మ‌ట‌. ఇంత‌కు ఎవ‌రా ఆ హీరో అంటే.. సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు. మ‌హేష్ అంటే త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని అర్చ‌నా గ‌తంలో ఓ సంద‌ర్భంలో తెలిపారు. అలాగే బుల్లితెర న‌టి హ‌రిత అంటే త‌నకు ఇష్ట‌మ‌ని సౌంద‌ర్య అలియాస్ అర్చ‌నా తెలిపారు.

  కాగా సీరియ‌ళ్లలోకి రాక‌ముందు అర్చ‌నా.. బ్యూటీషియ‌న్‌గా ప‌నిచేశారు. అలాగే ఫ్యాష‌న్ డిజైనింగ్‌లోనూ ఆమెకు ప్రావీణ్యం ఉంది. ఈ క్ర‌మంలో త‌న పాత్ర‌ల‌కు తానే ఫ్యాష‌న్ డిజైనింగ్ చేసుకుంటున్న‌ట్లు స‌మాచారం. ఇక కార్తీక దీపం సీరియ‌ల్ ప్రారంభం అయ్యే స‌మయంలోనూ సౌందర్య కాస్త బొద్దుగా ఉండేది.

  ఆ త‌రువాత అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో డైట్ చేసిన అర్చ‌నా 10 కేజీల బ‌రువు త‌గ్గారు. ఇక ఇప్పుడు బుల్లితెర‌కు మాత్ర‌మే ప‌రిమితం అయిన ఈ నటి.. వెండితెర‌పై కూడా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోవాల‌నుకుంటున్నార‌ట‌. ముఖ్యంగా తెలుగు సినిమాల్లో క‌నిపించాల‌నుంద‌ని సౌంద‌ర్య ఒక స‌మ‌యంలో తెలిపారు. అలాగే హిందీ బుల్లితెర‌పై కూడా న‌టించాల‌ని ఆమె మ‌న‌సులో ఉంద‌ట‌. ఇక సీరియళ్లలో గంభీర పాత్రలో నటించే ఈ నటికి నిజ జీవితంలో బల్లులు అంటే చాలా భయమట. వాటిని చూస్తే అంతదూరం పరుగెత్తుతారట ఈ అందమైన అత్త.

  Published by:Manjula S
  First published:

  Tags: Karthika deepam, Karthika deepam telugu serial

  ఉత్తమ కథలు