Home /News /movies /

KARTHIKA DEEPAM SERIEL DID DOCTOR BABU PARITALA NIRUPAM ROLE CLOSE IN THIS SERIEL THIS IS THE TWIST TA

Karthika Deepam: ‘కార్తీక దీపం’లో కొత్త ట్విస్ట్.. డాక్టర్ బాబు పాత్రకు స్టార్ మా ఎండ్ కార్డ్.. ?

‘కార్తీక దీపం’ సీరియల్ డాక్టర్ బాబు అలియాస్ పరిటాల నిరుపమ్(Star Maa/Photo)

‘కార్తీక దీపం’ సీరియల్ డాక్టర్ బాబు అలియాస్ పరిటాల నిరుపమ్(Star Maa/Photo)

Karthika Deepam: ‘కార్తీక దీపం’ సీరియల్‌లో డాక్టర్ బాబు అలియాస్ పరిటాల నిరుపమ్ పాత్రకు ఎండ్ కార్డ్ వేసారా అంటే ఔననే అంటున్నాయి స్టార్ మా వర్గాలు.

    Karthika Deepam: ‘కార్తీక దీపం’ సీరియల్‌లో డాక్టర్ బాబు అలియాస్ పరిటాల నిరుపమ్ పాత్రకు ఎండ్ కార్డ్ వేసారా అంటే ఔననే అంటున్నాయి స్టార్ మా వర్గాలు. డాక్టర్ బాబుకు ఈ సీరియల్ వాళ్లకు ఏమైనా అభిప్రాయ బేధాల కారణంగా ఆయనను కావాలనే తప్పించారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రీసెంట్‌గా ఓ ఎపిసోడ్‌లో హిమ తల్లిదండ్రులను వెతకాడానికి వెళుతున్నాను. వాళ్లు దొరికితే.. ఇంటికి వస్తాను. లేకపోతే రాను అంటూ డాక్టర్ బాబు తల్లికి ఓ వీడియో మెసెజ్ పెట్టినట్టు ఓ ట్విస్ట్ ఇచ్చారు. మొత్తంగా డాక్టర్ బాబు హిమ వాళ్లను వెతకడం కోసం వెళ్లి మాయమై పోయినట్టు ట్విస్ట్ ఇచ్చారు. మన దగ్గర సీరియల్స్ విషయానికొస్తే.. దూరదర్శన్‌లో ముందుగా ‘ఋతురాగాలు’ అనే డేలి సీరియల్ కథ ప్రారంభమైంది. ఈ మధ్య ఓ సీరియల్ మొదలైతే.. మినిమం ఐదారాళ్లు జీడి బంకలో సాగడం కామన్ అయిపోయింది. దీంతో ఆడియన్స్‌కు బోర్ కొట్టకుండా.. సీరియల్ మధ్యలో పాత్రధారాల్ని మార్చేయడం, లేదంటే క్యారెక్టర్స్‌‌ను ఛేంజ్ చేయడం  డేలీ సీరియల్స్ చూసే వాళ్లకు కామన్ అయిపోయింది. కథ, సీరియల్, అలా స్క్రిప్ట్ రైటర్స్ చేతుల్లో లేకపోతే.. యాక్టర్లు నిర్మాతలను ఇబ్బందుల పాలు చేయడం చూస్తేనే ఉన్నాం.

    కార్తీక దీపంలో డాక్టర్ బాబు, వంటలక్క (Star Maa/Photo)


    గత కొన్ని ఎపిసోడ్స్ చూస్తుంటే. .డాక్టర్ బాబు (నిరుపమ్) పాత్రకు ఆయన వాయిస్ లేదు. ఆయన పాత్రకు వేరే వాళ్లతో డబ్బింగ్ చెప్పించారు. ఓ తెలుగు టీవీ సీరియల్‌లో తెలుగు నటుడు వాయిస్ కాకుండా.. వేరే వాళ్లతో డబ్బింగ్ చెప్పడం చాలా అరుదు. సినిమాలకైతే.. ఏదో అనుకోవచ్చు కానీ.. సీరియల్స్‌లో ఇలా జరగడం అరుదు. కొంత మంది లేడీ క్యారెక్టర్స్ కు మాత్రం డబ్బింగ్ వేరే వాళ్లతో చెప్పిస్తుంటారు.

    కార్తీక దీపంలో డాక్టర్ బాబు (Twitter/Photo)


    డాక్టర్ బాబు (నిరుపమ్ పరిటాల) కేవలం కార్తీక దీపం సీరియల్ కాకుండా.. కుంకుమ పువ్వు, హిట్లర్ గారి పెళ్లాం వంటి సీరియల్స్ చేస్తున్నాడు.  ఈ సీరియల్స్ అన్నింటిలోను అతని పాత్రకు వేరే వాళ్లే డబ్బింగ్ చెప్పడం కొసమెరుపు. వరుసగా సీరియల్స్ అన్ని ఒప్పుకోవడంతో కార్తీక దీపంకు డేట్స్ కేటాయించలేక అతను ఈ సీరియల్ నుంచి తప్పుకున్నాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ.. తనకు ఎంతో పేరు తీసుకొచ్చిన కార్తీక దీపం నుంచి డాక్టర్ బాబు (నిరుపమ్) అంత ఈజీగా తప్పుకోలేడు. అతనికేదైనా పర్సనల్ ప్రాబ్లెమ్‌తో  షూట్ చేసినవాటికి డబ్బింగ్ చెప్పలేదా అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే కార్తీక దీపంలో ఎన్నో పాత్రలు మిస్ అయ్యాయి. డైెరెక్టర్ రైటర్ కలిసి ఒక్కో పాత్రకు ప్రాధాన్యత లేకుండా లేపేసారు.

    karthika deepam serial,karthika deepam latest episode,karthika deepam telugu serial,karthika deepam heroes episode,karthika deepam tik tok,karthika deepam serialyesterdayepisode,karthika deepam serial song,karthika deepam songs,karthika deepam serial heroine,karthika deepam serial live,karthika deepam actors,karthika deepam april,karthika deepam actress,karthika deepam all episodes,karthika deepam archana,karthika deepam april 1st episode
    కార్తీక దీపం (Image: HOTSTAR)


    కానీ స్టార్ మాలో ఎన్ని మంచి సినిమాలు వచ్చినా.. కార్తీక దీపం సీరియల్ రేటింగ్ దాటడం అంత ఈజీ కాదన్నారు. స్టార్ మాకు ఈ సీరియల్‌తోనే రన్ అవుతుంది. ఈ సీరియల్ ప్రతి రోజు 17 నుంచి 18 రేటింగ్ సాధిస్తుంది. ఎన్నో సినిమాలు కూడా కార్తీక దీపం సీరియల్ టీఆర్పీని దాటలేకపోయాయి. ఏవో ఒకటి రెండు తప్ప మిగిలినవేవి ఈ సీరియల్‌ను బీట్ చేయలేకపోయాయి. మరి స్టార్ మా యాజమాన్యం తనకు ఎంతో రేటింగ్ తీసుకొచ్చే ఈ  సీరియల్ మెయిన్ లీడ్ నిరుపమ్ అలియాస్ డాక్టర్ బాబును ఒదులుకునే సాహసం చేస్తుందా అనేదా చూడాలి. మొత్తంగా కార్తీక దీపంలో డాక్టర్ బాబు ఎంట్రీ ఉంటుందా.. లేదా అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Karthika deepam, Paritala Nirupam (Doctor Babu), Tollywood, Vantalakka deepa

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు