హోమ్ /వార్తలు /సినిమా /

Karthika Deepam: మోనితకు గన్నుతో గురి పెట్టిన దీప.. త్వరలోనే కార్తీకదీపం సీరియల్ కు శుభం కార్డు?

Karthika Deepam: మోనితకు గన్నుతో గురి పెట్టిన దీప.. త్వరలోనే కార్తీకదీపం సీరియల్ కు శుభం కార్డు?

karthika deepam

karthika deepam

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమౌతున్న కార్తీకదీపం సీరియల్ ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో సాగుతుంది. సామాన్యులే కాకుండా ప్రేక్షకులు కూడా ఈ సీరియల్ ను బాగా ఇష్టపడుతున్నారు

  Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమౌతున్న కార్తీకదీపం సీరియల్ ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో సాగుతుంది. సామాన్యులే కాకుండా ప్రేక్షకులు కూడా ఈ సీరియల్ ను బాగా ఇష్టపడుతున్నారు. రేటింగ్ కూడా మొదటి స్థానంతో దూసుకుపోతుంది. ఇక మోనితను చూసిన దీప వెంటాడుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు కార్తీక్ ను రోషిణి కోర్టుకు తీసుకెళ్ళింది. ఇక దీప కారు మధ్యలో ఆగిపోవడంతో మోనిత దీప దగ్గరికి గన్ పట్టుకొని చంపడానికి వస్తున్నాను అని తనలో తాను అనుకుంటూ వస్తుంది. ఇక కోర్టులో కార్తీక్ బోను లో నిల్చోగా ఓ లాయర్ కార్తీక్ గురించి మోనితతో ఉన్న సంబంధం గురించి మొత్తం జడ్జితో చెబుతాడు. మొత్తం కార్తీక్ కు వ్యతిరేకంగా మాట్లాడుతాడు. అక్కడ ముద్దాయి, నిందితుడు అనే మాటలు వినిపించడంతో సౌందర్య, ఆనందరావు, ఆదిత్య లు తట్టుకోలేకపోతారు.

  డాక్టర్ మోనితను కాదని ఆమెను చంపి ఆమె బాడీనీ దాచాడని అతనికి శిక్ష ఇవ్వాలని కోరుతాడు లాయర్. ఇక మరో లాయర్ కార్తీక్ తరఫున మాట్లాడడానికి ముందుకు వస్తాడు. రోషిణిని పిలిపించి తన ప్రశ్నలతో విచారణ జరుపుతారు. మొత్తానికి ప్రశ్నల మీద ప్రశ్నలతో రోషిణి తో బాగానే వాదిస్తున్నాడు ఆ లాయర్.

  ఇది కూడా చదవండి:నువ్వు చచ్చిపో వంటలక్క.. నీ భర్తను నాకు ఇచ్చేసి పో అంటూ మోనిత రాక్షసత్వం?

  ఇక సౌందర్యను కూడా పిలిపించి తన లైసెన్స్ రివాల్వర్, మోనిత గురించి ప్రశ్నలు వేస్తాడు. ఇక మధ్యలో మరో లాయర్ ప్రశ్నలు వేస్తుంటాడు. మోనిత.. దీపకు గన్ గురి పెట్టి వారణాసి కారులో ఊరు చివరలో బ్రిడ్జి దగ్గరికి తీసుకెళ్ళమని వారణాసితో బెదిరించి చెబుతుంది. ఇదంతా కార్తీక్ ను పెళ్లి చేసుకోవడానికి అని.. నువ్వు చచ్చిపో బంగారం మీ ఆయన్ని నాకు ఇచ్చిపో అంటూ నవ్వుతుంది.

  ఇది కూడా చదవండి:మోనితను పట్టేసుకున్న వంటలక్క.. ఒక్కసారిగా నేలకేసి కొట్టి షాక్ ఇచ్చిన దీప

  మరోవైపు సౌందర్య కోర్టులో న్యాయం గురించి మాట్లాడుతుంది. నా కొడుకు నిర్దోషి అంటూ తన బాధలను వినిపిస్తుంది. కార్తీక్ ను అలా పెంచలేదు అంటూ అన్ని విలువలు నేర్పించి పెంచానని చెబుతుంది. మోనిత.. దీపను తన ఇంటికి తీసుకెళ్లి చంపేస్తానని బెదిరించగా వెంటనే దీప ఆ గన్ తీసుకొని మోనిత వైపు గురి పడుతుంది. ఈ సీన్ బాగా హైలెట్ గా కనిపించింది.

  Published by:Navya Reddy
  First published:

  Tags: Archana ananth, Doctor babu, Karthika deepam, Monitha, Nirupam paritala, Premi Viswanath, Shobashetty, Soundarya, Vantalakka

  ఉత్తమ కథలు