హోమ్ /వార్తలు /సినిమా /

Karthika Deepam Vantalakka: అప్పడాలు వేయించిన వంటలక్క.. వీడియో వైరల్

Karthika Deepam Vantalakka: అప్పడాలు వేయించిన వంటలక్క.. వీడియో వైరల్

స్టార్ హీరోయిన్లకు కూడా లేని ఇమేజ్ ఈమె సొంతం ఇప్పుడు. ప్రతీ ఇంట్లోనూ దీప కష్టాల గురించి మాట్లాడుకుంటున్నారు. అంత ప్రేమ వస్తుందని తాను నిజంగా ఊహించలేదని చెప్పింది ప్రేమీ. ఈ మధ్యే ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టింది ప్రేమీ విశ్వనాథ్.

స్టార్ హీరోయిన్లకు కూడా లేని ఇమేజ్ ఈమె సొంతం ఇప్పుడు. ప్రతీ ఇంట్లోనూ దీప కష్టాల గురించి మాట్లాడుకుంటున్నారు. అంత ప్రేమ వస్తుందని తాను నిజంగా ఊహించలేదని చెప్పింది ప్రేమీ. ఈ మధ్యే ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టింది ప్రేమీ విశ్వనాథ్.

Premi Viswanath: తెలుగు బుల్లితెర‌పై కార్తీక దీపం సీరియ‌ల్ ఓ సంచ‌నల‌నం. కొన్ని నెల‌లుగా రేటింగ్‌లో టాప్‌లో కొన‌సాగుతున్న ఈ సీరియ‌ల్‌కి తెలుగు నాట చాలా మంది అభిమానులే ఉన్నారు. సాధార‌ణ ప్రేక్ష‌కులే కాదు ప‌లువురి సెల‌బ్రిటీల ఇళ్ల‌లోనూ రాత్రి 7.30గంట‌ల‌కు కార్తీక దీపం ప్ర‌సారం అవుతూ ఉంటుంది. ఇక ఈ సీరియ‌ల్‌లో దీప పాత్ర‌లో మ‌ల‌యాళ న‌టి ప్రేమి విశ్వ‌నాథ్ ఇక్క‌డి వారికి బాగా ద‌గ్గ‌ర‌య్యారు

ఇంకా చదవండి ...

  Premi Viswanath: తెలుగు బుల్లితెర‌పై కార్తీక దీపం సీరియ‌ల్ ఓ సంచ‌నల‌నం. కొన్ని నెల‌లుగా రేటింగ్‌లో టాప్‌లో కొన‌సాగుతున్న ఈ సీరియ‌ల్‌కి తెలుగు నాట చాలా మంది అభిమానులే ఉన్నారు. సాధార‌ణ ప్రేక్ష‌కులే కాదు ప‌లువురి సెల‌బ్రిటీల ఇళ్ల‌లోనూ రాత్రి 7.30గంట‌ల‌కు కార్తీక దీపం ప్ర‌సారం అవుతూ ఉంటుంది. ఇక ఈ సీరియ‌ల్‌లో దీప పాత్ర‌లో మ‌ల‌యాళ న‌టి ప్రేమి విశ్వ‌నాథ్ ఇక్క‌డి వారికి బాగా ద‌గ్గ‌ర‌య్యారు. స్వ‌స్థ‌లం కేర‌ళ అయిన‌ప్ప‌టికీ.. అక్క‌డికంటే ఇక్క‌డే ఆమె ఎక్కువ క్రేజ్‌ని సంపాదించుకున్నారు. సీరియ‌ల్ మొద‌ట్లో దీప‌గా.. ఆ త‌రువాత వంట‌లక్క‌గా ప్రేమి బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. తెలుగులో ఆమె క‌నిపించేది ఈ ఒక్క సీరియ‌ల్ అయిన‌ప్ప‌టికీ.. మిగిలిన బుల్లితెర న‌టీన‌టుల‌క‌ కంటే ఎక్కువ ఫేమ్‌ని సంపాదించుకున్నారు ప్రేమి విశ్వ‌నాథ్. అంతేకాదు స్టార్ హీరో సినిమాలు, రియాలిటీ షోలు కూడా వంట‌ల‌క్క‌తో పోటీ ప‌డ‌లేక‌పోతున్నాయంటే ఆమె క్రేజ్ ఎంతో అర్థం చేసుకోవ‌చ్చు.

  ఇక వంట‌ల‌క్క పేరిట ప్రేమికి ఇక్క‌డ అభిమాన సంఘాలు కూడా ఉన్నాయి. అంతేనా వంట‌ల‌క్క పేరు మీద సోష‌ల్ మీడియాలో వ‌చ్చే మీమ్స్‌కి అయితే లెక్క‌లేదు. క‌రోనా, ఐపీఎల్‌, సినిమాలు టాపిక్ ఏదైనా.. వంట‌ల‌క్క‌ను జ‌త చేసి కామెంట్లు క‌నిపిస్తూనే ఉంటాయి. గతేడాది ఐపీఎల్ జ‌రిగే స‌మ‌యంలో వంట‌ల‌క్క కోసం ఐపీఎల్ జ‌రిగే స‌మ‌యాన్ని మార్చ‌మ‌ని ఓ అభిమాని పెట్టిన కామెంట్ బాగా వైర‌ల్‌గా మారింది. అంతేనా.. ఈ మ‌ధ్య‌న విడుద‌లైన ఉప్పెన టీజ‌ర్‌కి వంట‌ల‌క్క మీద ఒట్టు. ఈ సినిమా సూప‌ర్ హిట్టు అంటూ ఓ నెటిజ‌న్ పెట్టిన కామెంట్ వైర‌ల్ అవ్వ‌గా.. స్టార్ మా సైతం ఆ కామెంట్‌ని లైక్ చేయ‌డం విశేషం.


  ఇదంతా ప‌క్క‌న‌పెడితే సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ప్రేమి విశ్వ‌నాథ్.. తాజాగా ఓ వీడియోను విడుద‌ల చేశారు. కార్తీక దీపం సీరియ‌ల్ బ్రేక్ స‌మ‌యంలో ప్రేమి అప్ప‌డాలు వేయిస్తూ క‌నిపించారు. ఇక ఆ వీడియోకు కుకింగ్ టైమ్ అని కామెంట్ పెట్ట‌డం విశేషం. ఇక ఈ వీడియో ఆమె అభిమానుల‌ను బాగా ఆక‌ట్టుకుంటోంది. అయితే ఆ మ‌ధ్య‌న ఓ ఇంట‌ర్వ్యూలో తాను వంట‌లు బాగా చేస్తాన‌ని ప్రేమి చెప్పిన విష‌యం తెలిసిందే.

  Published by:Manjula S
  First published:

  Tags: Karthika deepam, Karthika Deepam serial, Premi Viswanath

  ఉత్తమ కథలు