• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • KARTHIKA DEEPAM SERIAL VANTALAKKA PREMI VISWANATH CLICKS PHOTO OF DOCTOR BABU PARITALA NIRUPAM MNJ

Vantalakka- Doctor Babu: షూటింగ్ మ‌ధ్య‌లో త‌న క‌ళను చూపించిన వంట‌ల‌క్క‌.. కోప్ప‌డ్డ డాక్ట‌ర్ బాబు

డాక్రర్ బాబు, వంటలక్క

Premi Viswanath- Nirupam: కార్తీక దీపం సీరియ‌ల్‌లో దీప‌, వంట‌ల‌క్క‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంత‌గానో ద‌గ్గ‌రైన మ‌ల‌యాళ న‌టి ప్రేమి విశ్వ‌నాథ్ ద‌గ్గ‌ర చాలా క‌ల‌లే ఉన్నాయి. న‌టిగా అవ్వ‌క‌ముందే మోడ‌ల్‌గా చేసింది ప్రేమి. అంతేకాదు త‌న సొంత ఊర్లో ప్రేమికి ఒక స్టూడియో కూడా ఉంది. ఆమె త‌మ్ముడు త‌న‌కు ఫొటోలు తీస్తూ ఉంటాడ‌ని ఆ మ‌ధ్యన ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపారు దీప‌. అంతేకాదు ప్రేమి 'లా' కూడా చ‌దివారు

  • Share this:
    Premi Viswanath- Nirupam: కార్తీక దీపం సీరియ‌ల్‌లో దీప‌, వంట‌ల‌క్క‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంత‌గానో ద‌గ్గ‌రైన మ‌ల‌యాళ న‌టి ప్రేమి విశ్వ‌నాథ్ ద‌గ్గ‌ర చాలా క‌ల‌లే ఉన్నాయి. న‌టిగా అవ్వ‌క‌ముందే మోడ‌ల్‌గా చేసింది ప్రేమి. అంతేకాదు త‌న సొంత ఊర్లో ప్రేమికి ఒక స్టూడియో కూడా ఉంది. ఆమె త‌మ్ముడు త‌న‌కు ఫొటోలు తీస్తూ ఉంటాడ‌ని ఆ మ‌ధ్యన ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపారు దీప‌. అంతేకాదు ప్రేమి 'లా' కూడా చ‌దివారు. కాగా న‌టిగా ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకున్న ప్రేమి ఒక మంచి ఫొటోగ్రాఫ‌ర్ కూడా. ఈ విష‌యం గ‌తంలో చాలా సార్లు నిరూపితం కాగా.. తాజాగా మ‌రోసారి తాను ఎంత మంచి ఫొటోగ్రాఫ‌ర్ రుజువు చేసింది దీప‌. షూటింగ్ గ్యాప్‌లో కార్తీక్(ప‌రిటాల నిరుప‌మ్‌) ఫొటోను తీసింది దీప‌.

    అత‌డు ఒక చోట కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉండ‌గా.. త‌న ఫోన్‌కి ప‌ని చెప్పిన దీప‌.. త‌న ఫొటోలో కార్తీక్ ఫొటోను తీసింది. దాన్ని త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేసి మై క్లిక్ అని కామెంట్ పెట్టింది. ఇక ఈ ఫొటోకు డాక్ట‌ర్ బాబు అలియాస్ కార్తీక్ స్పందించాడు. నువ్వు నాకు ఈ ఫొటో పెట్ట‌లేదంటూ కోపంగా ఉండే ఎమోజీలు పెట్టాడు. ఇక దీప తీసిన ఈ ఫొటో అభిమానుల‌ను బాగా ఆక‌ట్టుకుంటోంది.




    కాగా కార్తీక దీపం సీరియ‌ల్ ప్ర‌స్తుతం ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుండ‌గా.. త్వ‌ర‌లో ఈ సీరియ‌ల్‌కి ముగింపు చెప్ప‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఇక ఈ సీరియ‌ల్ ఎండింగ్ విష‌యంలో ఇటీవ‌ల ఒక స్ప‌ష్ట‌త‌ను ఇచ్చాడు కార్తీక్. అంద‌రూ ఊహించిన విధంగానే ఎండింగ్ ఉంటుంద‌ని.. అలాగే దీప‌, కార్తీక్ క‌లిసే వ‌ర‌కు మాత్రం సీరియ‌ల్ ఉండ‌నుంద‌ని తెలిపారు. ఇదిలా ఉంటే డాక్ట‌ర్ బాబు, వంట‌ల‌క్క క‌లిస్తే చూడాల‌ని ప్రేక్ష‌కులు ఎప్ప‌టినుంచో ఎదురుచూస్తోన్న విష‌యం తెలిసిందే.
    Published by:Manjula S
    First published: