హోమ్ /వార్తలు /సినిమా /

Karthika deepam: కార్తీకదీపం వంటలక్క సంచలన నిర్ణయం...షాక్‌లో ఆమె రియల్ భర్త...ఏం జరిగిందంటే..

Karthika deepam: కార్తీకదీపం వంటలక్క సంచలన నిర్ణయం...షాక్‌లో ఆమె రియల్ భర్త...ఏం జరిగిందంటే..

Karthika deepam

Karthika deepam

గత ఏడాది కాలంగా కార్తీక దీపం సీరియల్ నెంబర్ వన్ స్థానంలోనే కొనసాగుతోంది. దీని వెనుక ఒక రీజన్ ఉంది. అదే వంటలక్క అలియాస్ దీప అలియాస్ ప్రేమి విశ్వనాథ్. తన అభినయం, అందంతో సింగిల్ హ్యాండ్ తో సీరియల్ ను నడిపిస్తోంది.

  కార్తీక దీపం సీరియల్ అంటే అన్ని వర్గాల ప్రజలకు ఎంతో ఇష్టం, తెలుగు టెలివిజన్ చరిత్రలోనే ఈ సీరియల్ సాధించిన రేటింగ్స్ మరే సీరియల్ సాధించలేదు. బార్క్ రేటింగ్స్ ప్రకారం గత ఏడాది కాలంగా కార్తీక దీపం సీరియల్ నెంబర్ వన్ స్థానంలోనే కొనసాగుతోంది. దీని వెనుక ఒక రీజన్ ఉంది. అదే వంటలక్క అలియాస్ దీప అలియాస్ ప్రేమి విశ్వనాథ్. తన అభినయం, అందంతో సింగిల్ హ్యాండ్ తో సీరియల్ ను నడిపిస్తోంది. ఇప్పటికే మళయాళంలో కారుముత్తు సీరియల్ ద్వారా మంచి పేరు సాధించిన ప్రేమి, ప్రస్తుతం అదే సీరియల్ తెలుగు రీమేక్ కార్తీక దీపంలో సైతం అంతకు మించిన ఆదరణతో దూసుకెళ్తోంది. అయితే కార్తీక దీపం సాధించిన సక్సెస్ తర్వాత ప్రేమి విశ్వనాథ్ కు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సినిమా రంగం నుంచి ఆమెకు ఆఫర్స్ కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోకి వంటలక్క వెళ్లిపోయింది. అటు సీరియల్ డేట్స్ అలాగే సినిమా డేట్స్ అడ్జస్ట్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఏదో ఒకదాన్ని మాత్రమే తన కెరీర్ ఆప్షన్ గా ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా కార్తీక దీపం వైపే వంటలక్క మొగ్గు చూపింది. ఎందుకంటే తన కెరీర్ ఇంకొంత కాలం సాగాలంటే కార్తీక దీపం సీరియల్ కొనసాగాల్సిందే. అయితే కార్తీక దీపం కోసం ప్రేమీ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

  ఏంటంటే...సీరియల్ కొనసాగినంత కాలం తాను పెద్ద పెద్ద సినిమాలు అంగీకరించే వీలులేదని, కేవలం తన డేట్స్ అడ్జస్ట్ అయ్యేలా సినిమాల్లో మాత్రమే నటిస్తానని చెప్పిందనే టాక్ వనిపిస్తోంది. దీంతో ఆమె కేవలం చిన్న సినిమాలకు మాత్రమే పరిమితం అయ్యే చాన్స్ కనిపిస్తోంది. ముఖ్యంగా కార్తీక దీపం సీరియల్ కోసం ఆమె ఇప్పటికే హైదరాబాద్ లో ఓ స్థిర నివాసం సైతం ఏర్పాటు చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అదే కనుక నిజం అయితే కార్తీక దీపం సీరియల్ కు ఇక వేరే చూసుకోవాల్సిన ఢోకా ఉండదు. ఇక కార్తీక దీపం సీరియల్ ప్రేక్షకులకు అటు స్టార్ హాట్ స్టార్ మాత్రం షాక్ ఇస్తోంది. ఇప్పటికే ఈ సిరయల్ కోసం వీఐపీ సబ్ స్రిప్షన్ తీసుకున్న ప్రేక్షకులు తెల్లవారుఝామున 6 గంటల నుంచే కార్తీక దీపం సీరియల్ చూడటం అలవాటు. కానీ ఆ సమయంలో అన్ని సీరియల్స్ అప్ లోడ్ అయినప్పటికీ, కార్తీక దీపం మాత్రం అప్ లోడ్ కావడం లేదు. దీంతో ప్రేక్షకులు హర్ట్ అవుతున్నారు. దీని వెనుక కారణం లేకపోలేదు. ముందుగానే స్టోరీ లీక్ అవ్వడంతో సాయంత్రం సీరియల్ ప్రసారం అయ్యేనాటికి సస్పెన్స్ మెయిన్ టెయిన్ కావడం లేదు. దీంతో స్టార్ మా వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

  Published by:Krishna Adithya
  First published:

  Tags: Karthika deepam, Karthika Deepam serial

  ఉత్తమ కథలు