‘కార్తీకదీపం’ ప్రస్తుతం టాప్ ట్రెండింగ్‌లో నడుస్తున్న తెలుగు సీరియల్. ఈ సీరియల్‌కు ఉన్న ప్రేక్షక ఆదరణ మామూలుగా ఉండదు. సాయంత్రం 7.30 గంటలుఅ అయితే చాలు ఆడవాళ్లంతా టీవీ ముందు వాలిపోతున్నారు. వంటలక్క క్యారెక్టర్‌లో కేరళకు చెందిన ప్రేమి విశ్వనాథ్ తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకుంది. అందుకే ఇప్పుడు ఈ సీరియల్ ఇండియాలోనే టాప్ వన్‌లో ఉంది. అయితే కార్తీకదీపంలో వంటలక్క కూతురు క్యారెక్టర్ చేసిన సౌర్య పాత్రలో బేబీ క్రితిక యాక్ట్ చేస్తోంది. అయితే సౌర్యకు ఇప్పుడు అదిరిపోయే ఆఫర్ వచ్చింది. ఏకంగా సూపర్‌స్టార్ మహేష్ బాబు సినిమాలో సౌర్య ఛాన్స్ కొట్టేసింది. మహేష్ నటిస్తోన్న చిత్రంలో ఓ పాత్రలో క్రితిక కూడా నటిస్తోంది.
మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరులో నటిస్తుండగా.. తాజాగా ఈ మూవీ యూనిట్ కేరళకు వెళ్లింది. అక్కడ టీమ్ తీసుకున్న గ్రూఫ్ ఫొటోలో క్రితిక కూడా ఉంది. ఆమెతో పాటు రాజేంద్రప్రసాద్ మనవరాలు(చిన్నప్పటి మహానటి) కూడా ఈ మూవీలో ఒక పాత్రలో కనిపిస్తోంది. ఈ చిత్రంలో ఆ చిన్నారి పాత్ర ఎంత ఉన్నా.. మహేష్ సినిమాలో ఛాన్స్ కొట్టడం అంటే ఒక రకంగా అది క్రితిక కెరీర్‌కు కొంతైనా ఉపయోగపడుతుందనడంలో ఎలాంటి సందేహం ఉండదు. మొత్తం మీద కార్తీకదీపం సీరియల్‌తో భవిష్యత్‌లో కూడా క్రితికకు మరిన్ని మంచి ఆఫర్లు రావాలని ఆశిద్దాం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Karthika deepam, Mahesh babu, Mahesh Babu Latest News, Sarileru Neekevvaru, Tollywood, Tollywood Movie News, Vantalakka deepa