హోమ్ /వార్తలు /సినిమా /

Karthika Deepam: అస‌లు నిజం చెప్పేందుకు సిద్ధ‌మైన తుల‌సి.. కన్న ప్రేమ‌నే గెలిచింద‌న్న దీప‌

Karthika Deepam: అస‌లు నిజం చెప్పేందుకు సిద్ధ‌మైన తుల‌సి.. కన్న ప్రేమ‌నే గెలిచింద‌న్న దీప‌

అప్పటికే తన పిల్లలు హిమ,శౌర్యలను తన భర్త దగ్గరికి చేరుస్తుంది వంటలక్క. సీరియల్‌కు మెయిన్ విలన్ అయిన మోనిత డాక్టర్ బాబు దక్కలేదనే బాధతో ఆత్మహత్య చేసుకుంటుందని ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పట్లో ఈ సీరియల్ ముగింపు ఊహించడం కష్టమే.

అప్పటికే తన పిల్లలు హిమ,శౌర్యలను తన భర్త దగ్గరికి చేరుస్తుంది వంటలక్క. సీరియల్‌కు మెయిన్ విలన్ అయిన మోనిత డాక్టర్ బాబు దక్కలేదనే బాధతో ఆత్మహత్య చేసుకుంటుందని ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పట్లో ఈ సీరియల్ ముగింపు ఊహించడం కష్టమే.

Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆకట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతోంది. ఇవాళ్టి ఎపిసోడ్‌లో రెస్టారెంట్‌లో ఉన్న హిమ‌, సౌర్య‌ల‌ను తీసుకొచ్చేందుకు ఆదిత్య‌, శ్రావ్య బ‌య‌లుదేర‌గా.. సౌంద‌ర్య అడ్డుకుంటుంది. పిల్ల‌లు కంగారు ప‌డతార‌ని ఆదిత్య అన‌గా.. అవ‌స‌రం లేదు. మేనేజ‌ర్‌తో చెప్పే వ‌చ్చాను చూస్తూ ఉండ‌మ‌ని సౌంద‌ర్య అంటుంది. అయినా అంద‌రికంద‌రు అలా వ‌దిలేసి రావ‌డం ఏంటి మ‌మ్మీ అని ఆదిత్య అడ‌గ్గా.. తీసుకెళ్లింది ఎవ‌రు మీ అన్న‌య్య‌.

ఇంకా చదవండి ...

  తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆకట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతోంది. ఇవాళ్టి ఎపిసోడ్‌లో రెస్టారెంట్‌లో ఉన్న హిమ‌, సౌర్య‌ల‌ను తీసుకొచ్చేందుకు ఆదిత్య‌, శ్రావ్య బ‌య‌లుదేర‌గా.. సౌంద‌ర్య అడ్డుకుంటుంది. పిల్ల‌లు కంగారు ప‌డతార‌ని ఆదిత్య అన‌గా.. అవ‌స‌రం లేదు. మేనేజ‌ర్‌తో చెప్పే వ‌చ్చాను చూస్తూ ఉండ‌మ‌ని సౌంద‌ర్య అంటుంది. అయినా అంద‌రికంద‌రు అలా వ‌దిలేసి రావ‌డం ఏంటి మ‌మ్మీ అని ఆదిత్య అడ‌గ్గా.. తీసుకెళ్లింది ఎవ‌రు మీ అన్న‌య్య‌. మేము అక్క‌డికి దీప‌ను తీసుకెళ్లామ‌న్న కోపంతో వాడు పిల్ల‌ల‌ను వ‌దిలేసి వెళ్లాడు. మీరెందుకు వెళ్ల‌డం నేనే వెళ్తాన‌ని దీప వెళ్లింది. ఇది ఆ భార్య భ‌ర్త‌ల స‌మ‌స్య‌, పిల్లలిద్ద‌రు అక్క‌డ ఉన్నార‌ని తెలిస్తే వాళ్లే దిగి వ‌చ్చి తీసుకెళతారు. చూద్దాం. క‌న్న ప్రేమ గెలుస్తుందా.. పెంచిన ప్రేమ గెలుస్తుందా.. అని సౌంద‌ర్య అంటుంది. వెంట‌నే ఆదిత్య‌.. ఇదేం పందెం మ‌మ్మీ మ‌ధ్య‌లో పిల్ల‌ల‌ను పెట్టి అని అడ‌గ్గా.. నువ్వెందుకు రా అంత ఆందోళ‌న ప‌డుతున్నావు. వాళ్లు వాళ్లు చూసుకుంటారు అని ఆనంద‌రావు అంటాడు. అంత సింపుల్‌గా తీసేస్తున్నారేంటి డాడీ అని ఆదిత్య అన‌గా.. సింపుల్‌గా తీసుకుంటున్న‌ది నువ్వురా అని ఆనంద‌రావు అంటాడు. అదేంటి అని ఆదిత్య మ‌ళ్లీ అడ‌గ్గా.. సౌర్య‌ను మీ అన్న‌య్య ఇక్క‌డ‌కు తీసుకొచ్చాడు. హిమ‌ను మీ వ‌దిన అక్క‌డికి తీసుకెళ్లింది. ఇద్ద‌రినీ వాడు రెస్టారెంట్‌కి తీసుకెళ్లాడు. ఇప్పుడు ఆ ఇద్ద‌రిని ఈ ఇద్ద‌రు వ‌దిలేసి వెళ్లిపోయారు. ఇద్ద‌రిలో ఎవ‌రు తొంద‌ర‌గా స్పందిస్తారో చూద్దాం. తల్లి వెళ్తుందా.. తండ్రి వెళ్తాడా.. ఇద్ద‌రు ఒకేసారి వెళ్లారా.. ఇంకోసారి కూడా అలాగే వ‌దిలేసి వెళ‌తారా.. ఇవ‌న్నీ కాసేపు ఓపిక ప‌డితే తెలుస్తుందిరా అని ఆనంద‌రావు అంటాడు. ఇక ఆదిత్య‌.. చూస్తుండండి క‌చ్చితంగా అన్న‌య్య‌నే వెళ‌తాడు అని అన‌గా.. బావ‌గారే తీసుకెళ్లి బావ‌గారే వ‌దిలేశారు క‌దా కాబ‌ట్టి మా అక్క‌నే వెళుతుంది అని శ్రావ్య అంటుంది. ఇక ఆనంద‌రావు చూద్దాం.. మీ అన్న‌య్య వెళ‌తాడో, మీ అక్క‌య్య వెళుతుందో.. వెయిట్ అండ్ సీ అని చెప్పి సౌంద‌ర్య‌తో లోప‌లికి వెళ‌తాడు.

  ఇక దీప ఇంట్లో హిమ చెప్పిన మాట‌ల‌ను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అది గ‌మ‌నించిన ముర‌ళీకృష్ణ ఏంట‌మ్మా ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. దానికి దీప‌.. మ‌నిషికి మంచిత‌నం మాత్ర‌మే ఉండే స‌రిపోదు నాన్న‌. ఎదుటివాళ్లు ఎలాంటి వాళ్లో బేరీజు వేయ‌గ‌లిగే విచ‌క్ష‌ణ కూడా ఉండాలి. మా ఆయ‌న బంగార‌మే. కానీ ప‌క్క‌న మౌనిత ఉన్నంత‌కాలం ఆ బంగారానికి విలువే లేకుండా చేస్తుంది అని అంటుంది. దానికి ముర‌ళీకృష్ణ‌.. మ‌నిషి ఎంత చ‌దువుకున్న వాడైనా, విఙ్ఞాన‌వంతుడైనా ప‌రిస్థితుల‌కు అనుగుణంగానే మారిపోతార‌మ్మా. ఏ సాధువుల‌కో, జోగుల‌కో త‌ప్ప మిగ‌తా మ‌నుషులంద‌రూ మామూలు మ‌నుషులే. కానీ మంచిత‌నం ఉన్న మ‌నిషిలో వివేకం ఎప్ప‌టిక‌ప్పుడు మేలుకుంటూనే ఉంటుంది. విచ‌క్ష‌ణ అంత‌రాత్మ‌ను హెచ్చ‌రిస్తూనే ఉంటుంది అని అంటాడు. ఇక దీప‌.. నేను మొద‌టి నుంచి చాలా స‌హ‌నంతో ఉన్నాను. కానీ ఆ మౌనిత నా స‌హ‌నానికి హ‌ద్దులు చూపిస్తోంది. అది దాటితే మౌనిత‌ను బ్ర‌త‌క‌నివ్వ‌ను. అది జ‌రిగితే మ‌ళ్లీ నా బిడ్డ‌ల‌కు అన్యాయ‌మే జ‌రుగుతుంది. అందుకు నేను వెన‌క్కి త‌గ్గుతున్నాను. ఇది ఆ మౌనిత‌కు అలుసుగా మారుతుంది అని అంటుంది. వెంట‌నే ముర‌ళీకృష్ణ‌.. ఇంత‌కుముందు మీ అత్త గారు అంటే భ‌యం ఉండేది.. ఇప్పుడు అది కూడా లేదా.. అని ప్ర‌శ్నించ‌గా.. ఆ భ‌యం పోయింది. దానికి కార‌ణం డాక్ట‌ర్ బాబు. ఎక్కువ మాట్లాడితే ఆ మౌనిత‌ను పెళ్లి చేసుకుంటాడేమోన‌ని భ‌యం. అదే జ‌రిగితే నాకు, నా బిడ్డ‌ల‌కు అన్యాయం జ‌రుగుతుంద‌నే టెన్ష‌న్. అందుకే ఆవిడ కూడా వెన‌క్కి త‌గ్గారు. అందువ‌ల్ల ఆ మౌనిత మ‌రీ బ‌రి తెగించిపోతుంది అని అంటుంది. ఇక ముర‌ళీకృష్ణ‌.. ఎంత‌కాలం మౌనిత‌కు క్ష‌మిస్తూ పోతావ‌మ్మా అని ప్ర‌శ్నించ‌గా.. లేదు నాన్న. దాని పాపం పండింది. తొంద‌ర‌లోనే దాని బ‌తుకేంటో బ‌య‌ట‌పెట్ట‌డానికి ఒక‌డు త‌యార‌య్యాడు అని చెబుతుంది. దానికి ముర‌ళీకృష్ణ‌.. అది తొంద‌ర‌గా జ‌ర‌గాలి అని అంటాడు. ఇక హిమ వాళ్లు ఇంకా రాలేదేంటి అని దీప ప్ర‌శ్నిస్తుంది.

  మ‌రోవైపు కార్తీక్, మౌనిత‌తో క‌లిసి కారులో వ‌స్తూ.. అన‌వ‌స‌రంగా పిల్ల‌ల‌ను రెస్టారెంట్‌లో వ‌దిలేసి వ‌చ్చాను అంటాడు. ఇప్ప‌టికీ ప‌ది సార్లు అన్నావు ఆ మాట అని మౌనిత అన‌గా.. చికాకుగా ఉంది మ‌రి. నేను తెలిసి కూడా త‌ప్పు చేయ‌డం మొద‌లు పెట్టాను. ఒక‌రి త‌ప్పు వ‌ల్ల్ల ఇంకొక‌రు హ‌ర్ట్ అవుతుంటే చూస్తూ ఉండిపోతున్నాను. ఇప్పుడు ఆ రౌడీనీ వాళ్ల‌మ్మ తీసుకెళ్లిందో, మా అమ్మ తీసుకెళ్లిందో అర్థం కావ‌డం లేదు అని అంటాడు. ఇక మౌనిత‌.. ఏంటి హిమ కంటే ఎక్కువ ఆ రౌడీని త‌లుచుకుంటున్నావు అని ప్ర‌శ్నించ‌గా.. అదేం త‌ప్పు చేసింది మ‌ధ్య‌లో అందుకే అదంటే నాకు జాలి అని అంటాడు. ఇక మౌనిత‌.. దీప‌ను కూడా జాలితోనే చేసుకున్నావు ఏం ఒరిగింది, కొంచెం జాగ్ర‌త్త అని అన‌గా.. దేనికి జాగ్ర‌త్త‌, ఎందుకు జాగ్ర‌త్త్త‌.. ఏం జ‌రిగింది ఇప్పుడు.. ప‌సిపిల్లల విష‌యంలో జాగ్ర‌త్త అంటే ఏంటి.. అస‌లేంటి నీ బాధ అని కార్తీక్ ఫైర్ అవుతాడు. నేను ఏమ‌న్నాను అని మౌనిత అన‌గా.. సౌర్య విష‌యంలో జాగ్ర‌త్త అన్నావు ఎందుకు.. అస‌లు నీ ప్రాబ్ల‌మ్ ఏంటి.. నేను మ‌నిషిలా ప్ర‌వ‌ర్తించ‌కూడ‌దా.. అంద‌రిలాగే పిల్ల‌ల విష‌యంలో స్పందించ‌కూడ‌దా.. నా నుంచి ఒక్క రూపాయి ఆశించ‌కుండా, మా అమ్మ ఎంత ఇస్తాఅన్నా తీసుకోకుండా.. దీప త‌న కూతురిని క‌ష్ట‌ప‌డి పోషించుకుంటుంది. ఆ రౌడీ కూడా తిన్నా, తిన‌క‌పోయినా.. ఉన్నా లేక‌పోయినా త‌ల్లిలాగే గుట్టుగా బ‌తుకుతుంది. చూడు మ‌న‌కు న‌చ్చ‌ని వాళ్ల‌కి ఎథిక్స్ ఉండ‌వ‌ని ఎప్పుడూ అనుకోకు. ఒక విష‌యంలో త‌ప్పు చేశాన‌ని మిగ‌తా అన్ని విష‌యాల‌ను తుల‌నాడ‌టం త‌ప్పు.. ఒక్కోసారి నీ మాట‌లు నాకు చెప్పుడు మాట‌ల్లా వినిపిస్తుంటాయి. చెప్పుడు మాట‌లు వినేవాడికి వ్య‌క్తిత్వం ఉండ‌ద‌ని న‌మ్మేవాడిని నేను అంటాడు. దాంతో మౌనిత షాక్‌కి గురి అవుతుంది. ఇక కార్తీక్ కారును ఆపేయ‌గా.. ఏంటి ఇప్పుడు దింపేస్తావా అని మౌనిత అడుగుతుంది. దానికి కార్తీక్.. ఎలా క‌నిపిస్తున్నా నీకు..రౌడీ ఎక్కుడుందో తెలుసుకోవ‌డానికి మా అమ్మ‌కు ఫోన్ చేయాల‌ని సౌంద‌ర్య‌కు కాల్ చేస్తాడు.

  ఇక కార్తీక్ ఫోన్‌ని సౌంద‌ర్య లిఫ్ట్ చేయ‌గా.. రౌడీ ఎక్క‌డుంద‌ని అడుగుతాడు. దానికి సౌంద‌ర్య త‌న‌కు తెలీదంటుంది. మీరేగా అక్క‌డుంది అని కార్తీక్ ప్రశ్నించ‌గా.. ఎవ‌రు చెప్పారు. మేము వ‌చ్చేశాము. ఇంట్లో ఉన్నాము అని సౌంద‌ర్య అంటుంది. మ‌రి పిల్ల‌లు అని కార్తీక్ అడగ్గా.. తెలీదు అని సౌంద‌ర్య అంటుంది. ఇక కార్తీక్.. అది(దీప‌ను ఉద్దేశించి) ఉందా అక్క‌డ అని అడ్గ‌గా.. నీతో పాటే వెళ్లిపోయిందిగా అని సౌంద‌ర్య అంటుంది. ఆ త‌రువాత ఎలా వ‌దిలేసి వ‌స్తారు అని కార్తీక్ ప్ర‌శ్నించ‌గా.. స్టుపిడ్. ఎవ‌రురా రెస్టారెంట్‌కి తీసుకెళ్లింది అని సౌంద‌ర్య తిరిగి ప్ర‌శ్నిస్తుంది. మ‌రి మీ ఇద్ద‌రు ఎందుకు వ‌దిలి వెళ్లారు అని కార్తీక్ అడ‌గ్గా.. త‌ల్లికి, తండ్రికి లేని ప‌ట్టింపు మాకెందుకు అని సౌంద‌ర్య అంటుంది. నిజం చెప్పు మ‌మ్మీ అని కార్తీక్ అడ‌గ్గా.. నీ మీద ఒట్టు. ఇద్ద‌రు అక్క‌డే ఉన్నారు అని సౌంద‌ర్య చెబుతుంది. ఆ త‌రువాత మ‌న‌సెలా ఒప్పింది మ‌మ్మీ అని కార్తీక్ ప్ర‌శ్నించ‌గా.. నీకెలా ఒప్పింది అని సౌంద‌ర్య ప్ర‌శ్నిస్తుంది. దానికి కార్తీక్.. నాకు కోపం వ‌చ్చింది అని చెబుతాడు. వెంట‌నే సౌంద‌ర్య‌.. దానికి సెల్ఫ్ రెస్పెక్ట్ వ‌చ్చింది అని అంటుంది. మ‌రి మీకేం వ‌చ్చింది అని కార్తీక్ ప్ర‌శ్నించ‌గా.. ఆవేశం వ‌చ్చింది అని సౌంద‌ర్య చెబుతుంది. ఇక పిల్ల‌లు బ‌య‌ప‌డరా అని కార్తీక్ అన‌గా.. నీ ఙ్ఞానం ఎక్క‌డికి పోయింది అని సౌంద‌ర్య అంటుంది. దానికి కార్తీక్.. థ్యాంక్స్ క‌ళ్లు తెరిపించినందుకు అని అంటాడు. మాది అదే ప్ర‌య‌త్నం అని సౌంద‌ర్య అన‌గా.. ఇంకెప్పుడు మిమ్మ‌ల్ని న‌మ్మి పిల్ల‌ల‌ను అప్ప‌గించ‌ను అని కార్తీక్ అంటాడు. ఇక హ్యాపీ జ‌ర్నీ అంటూ సౌంద‌ర్య ఫోన్ పెట్టేస్తుంది. ఆ త‌రువాత మౌనిత ఎక్క‌డికి అని అడ‌గ్గా.. రెస్టారెంట్‌కి అని కార్తీక్ అంటాడు. ఎందుకు అని మౌనిత మ‌ళ్లీ ప్రశ్నించ‌గా.. వ‌స్తావా, దిగిపోతావా అని కార్తీక్ అంటాడు. ఆ త‌రువాత ఇద్ద‌రు రెస్టారెంట్‌కి బ‌య‌లుదేరుతారు.

  ఇక ముర‌ళీకృష్ణ ఇంటికి తుల‌సి వెళుతుంది. ఆమెను చూసిన ముర‌ళీకృష్ణ ర‌మ్మ‌ని పిలుస్తాడు. మీరు వంట చేస్తున్నారు ఏంటి అంకుల్, ఆంటీ లేరా అని తుల‌సి ప్ర్ర‌శ్నించ‌గా.. ఆంటీ ఊరేళ్లిందమ్మా.. అందుకే దీప‌కు, హిమ‌కు నేనే వంట చేస్తున్నాను అని మురళీకృష్ణ అంటాడు. ఇక హిమ‌ని డాక్ట‌ర్ బాబు అని తుల‌సి ఆగిపోగా.. ఒక రకంగా అమ్మ ద‌గ్గ‌ర వ‌దిలిన‌ట్లేన‌మ్మా. ప్రేమించిన కూతురు కాద‌ని తెలిశాక‌, ప్రేమ త‌గ్గ‌క‌పోయినా అంద‌రినీ వ‌దిలి దూరంగా వెళ్లిపోవాల‌నుకున్నాడు. అప్పుడు దీప‌నే త‌న‌తో పాటు తీసుకెళ్లింది అని ముర‌ళీకృష్ణ అంటాడు. దానికి తుల‌సి మ‌న‌సులో అస‌లు విష‌యం తెలీక డాక్ట‌ర్ బాబు, విహారి మీద అనుమానం పెంచుకున్నారు. దీప‌తో పాటు అభం, శుభం తెలియని పిల్ల‌లు కూడా న‌లిగిపోతున్నారు. అని అనుకుంటుంది. ఇక కూర్చో అమ్మా అని ముర‌ళీకృష్ణ అన‌గా.. దీప లోప‌ల ఉందా అంకుల్ అని తుల‌సి అడుగుతుంది. దానికి ముర‌ళీకృష్ణ‌.. లేద‌మ్మా బ‌య‌ట‌కు వెళ్లింది. ఏదైనా అర్జెంటా, ఫోన్ చేయ‌క‌పోయావా అని అడుగుతాడు. దానికి తుల‌సి ఫోన్‌లో చెప్పేది కాదు అంకుల్. డైరెక్ట్‌గా మాట్లాడేది అని అంటుంది. వెంట‌నే ముర‌ళీకృష్ణ‌.. ఏదైనా నాతో చెప్పు. నేను చెప్తా అని అంటాడు. దానికి తుల‌సి మ‌న‌సులో.. నా భ‌ర్త‌కు లోపం ఉంద‌ని.. దీప‌కు, డాక్ట‌ర్ బాబుకు త‌ప్ప ప్ర‌పంచంలో మ‌రెవ్వ‌రికీ చెప్ప‌కూడ‌దు. అన‌వ‌స‌రంగా నా భ‌ర్త గౌర‌వం నేను త‌గ్గించుకున్న దాన్ని అవుతాను అని అనుకుంటుంది. మ‌రి దీప వ‌చ్చే వ‌ర‌కు ఎదురుచూడ‌మ‌ని ముర‌ళీకృష్ణ అన‌గా.. ప‌ని ఉంద‌ని. రాగానే ఫోన్ చేయ‌మ‌ని దీప‌కు చెప్పండి అని చెప్పి అక్క‌డి నుంచి వెళుతుంది. వెళుతూ వెళుతూ.. అన్నేళ్లుగా ప్రేమ‌గా పెంచుకున్న హిమ‌ను కూడా దీప ద‌గ్గ‌ర వ‌దిలేశాడంటే, డాక్ట‌ర్ బాబులో అనుమానం ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతోంది. విహారి వ‌ల్ల పిల్ల‌లు పుట్టలేద‌ని తెలిస్తే త‌ప్ప దీప‌ను అనుమానించ‌డం ఆప‌డు. దీప కాపురం చ‌క్క‌బ‌డ‌టానికి, ఆ ఇద్ద‌రి కాపురం నిల‌బ‌డ‌టానికి.. ఏ విహారి అయితే కార‌ణం అయ్యాడో , ఇప్పుడు ఆ విహారే సాక్ష్యం అవుతున్నాడు అని మ‌న‌సులో అనుకుంటుంది.

  ఇక రెస్టారెంట్లో హిమ‌, సౌర్య ఎదురుచూస్తూ ఉంటారు. నాన్న వ‌స్తాడ‌ని సౌర్య అన‌గా.. అమ్మే వ‌స్తుంది అని హిమ అంటుంది. దానికి సౌర్య.. అమ్మే వ‌స్తుంద‌ని ఎలా తెలుసు. మ‌న‌ల‌ను నానమ్మ వ‌దిలేసింద‌ని అమ్మ‌కు తెలీదుక‌దా అంటుంది. అయితే ఎవ‌రు రారా అని హిమ ప్రశ్నించ‌గా.. రాక‌పోతే ఏంటి మ‌న‌మిద్ద‌రం ఆటో ఎక్కి వెళ్లిపోలేమా అని అంటుంది. ఇక హిమ ఎక్క‌డికి వెళ‌దాం అన‌గా.. నాన్న రాలేదు, అమ్మ రాలేదు, నానమ్మ వాళ్లు వ‌దిలేసి వెళ్లారు. మ‌నం చెప్పుకుండా వెళ్లి ఎక్క‌డైనా దాక్కుందాం. అప్పుడు అంద‌రూ క‌లిసి వెత‌క‌డం మొద‌లుపెడ‌తారు అని సౌర్య అంటుంది. దానికి హిమ‌.. అమ్మో అలాంటి మాట‌లు చెప్ప‌కు నాకు భ‌యం వేస్తుంది అని అంటుంది. ఇక సౌర్య‌.. లేక‌పోతే మ‌నమంటే ఇంత కేర్‌లెస్ వీళ్ల‌కి అని అన‌గా. అవున‌నుకో. నిజంగానే ఎవ‌రు రారంటావా అని హిమ అంటుంది. ఆ వెంట‌నే దీప వ‌చ్చి.. నేను వ‌చ్చాను అని అంటుంది. ఇక హిమ‌.. నాకు ఎంత భ‌యం వేసిందో తెలుసా అని అన‌గా.. నాకేం భ‌యం వేయ‌లేదు కోపం వ‌చ్చింది అని సౌర్య అంటుంది. ఇక దీప‌.. మీ నాన్న వెన‌క్కి వ‌చ్చి తీసుకెళ్లిపోయారేమో అనుకున్నాను అని అంటుంది. దానికి సౌర్య‌.. నాన్న కూడా నువ్వు వ‌చ్చి తీసుకెళ్లిపోయావేమో అని రాలేదు అంటుంది. నాన‌మ్మ వాళ్లైనా తీసుకెళ్ల‌చ్చు క‌దా అని దీప అన‌గా.. మీ ఇద్ద‌రిలో ఎవ‌రు వ‌స్తారో చూద్దామ‌ని వ‌దిలేసి వెళ్లారు అని సౌర్య అంటుంది. ఇక దీప‌.. కాసేపు ఆగితే మీ నాన్న కూడా వ‌స్తారు. ఇంకాసేపు ఆగితే మీ నానమ్మ‌, తాత‌య్య‌లు కూడా వస్తారు. బంగారు త‌ల్లుల‌ను భ‌య‌పెట్టి, ఏడిపించేంత పంతం ఎవ్వ‌రికీ లేదు అని చెబుతుంది. ఇక ప‌దండి వెళ‌దాం అని దీప అన‌గా.. స్కూటీలో ముగ్గురుం ఎలా వెళ‌తాం అని హిమ అడుగుతుంది. దానికి సౌర్య‌.. నాన‌మ్మ ఇల్లు ద‌గ్గ‌రే క‌దా ముందు న‌న్ను డ్రాప్ చేసి వెళ్లండి అని చెబుతుంది. ఇక హిమ‌.. మ‌నం వెళ్లాక డాడీ వ‌స్తే అని అడ‌గ్గా.. వ‌స్తే ఫోన్ చేస్తారులే అని సౌర్య అంటుంది. ఇక దీప‌.. మీ నాన్న వ‌స్తే కాసేపు కంగారు ప‌డ‌నిద్దాం. నేను ఒక్క‌దాన్నేనా కంగారు ప‌డాలి. ప‌దండి అని ఆ ఇద్ద‌రినీ తీసుకెళుతుంది.

  అదే స‌మ‌యంలో పిల్ల‌ల‌తో వ‌స్తోన్న దీప‌కు కార్తీక్ ఎదురుప‌డ‌తాడు. కారు నుంచి కార్తీక్, మౌనిత దిగ‌గా.. స్కూటీ నుంచి దీప‌, హిమ‌, సౌర్య‌లు దిగుతారు. హిమ‌.. కార్తీక్ ద‌గ్గ‌ర‌గా వెళ్లి మ‌ళ్లీ దీప ద‌గ్గ‌ర‌కు వ‌స్తుంది. ఇక సౌర్య‌.. అమ్మ నేను అని అన‌గా.. దీప కార్తీక్ ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌మ‌ని చెబుతుంది. ఇక హిమ‌.. నువ్వు ఎందుకు వ‌దిలేసి వెళ్లావు డాడీ అని ప్రశ్నిస్తుంది. మీ అమ్మ తీసుకెళుతుంద‌నుకున్నాన‌మ్మా అని కార్తీక్ అన‌గా.. అమ్మ వెళ్లిపోవ‌డం నువ్వు చూడ‌లేదా అని హిమ మ‌ళ్లీ ప్ర‌శ్నిస్తుంది. దానికి కార్తీక్.. నాన‌మ్మ వాళ్లు ఉన్నార‌నుకున్నాను అని అంటాడు. ఇక దీప.. మౌనితతో ఏదో అర్జెంట్ ప‌ని ఉండి ఉంటుందిలే హిమ అని అంటుంది. ఇక కార్తీక్.. వ‌స్తాను హిమ అన‌గా.. రామ్మా డాడీ వెళ్లాళంట అని హిమ అంటుంది. దానికి కార్తీక్.. అంటే రోడ్డు మీద ఏం మాట్లాడ‌దామ‌ని అంటాడు. వెంట‌నే దీప‌.. రెస్టారెంట్ రోడ్డు మీద లేదు, రోడ్డు ప‌క్క‌న ఉంది. అక్క‌డున్న‌ప్పుడు మాత్రం ఏం మాట్లాడారు. ఏదో ప‌ని ఉన్న‌ట్లు వెళ్లిపోయి ఇప్పుడు ఇలా వ‌స్తున్నారు అని అంటుంది. ఇక కార్తీక్.. నేను పిల్లల కోసం ఇక్క‌డ‌కు వ‌స్తున్నాన‌ని నీకు తెలుసు అన‌గా.. ఎప్పుడు డాక్ట‌ర్ బాబు. ఎన్ని గంట‌ల త‌రువాత‌, నేను రాక‌పోయి ఉంటే ఏంటి ప‌రిస్థితి అని ప్ర‌శ్నిస్తుంది. దానికి కార్తీక్.. ఈ ముక్క మీ అత్త‌గారికి ఫోన్ చేసి అడుగు అని అంటాడు. వెంట‌నే దీప‌.. ఆవిడ చాలా మంచిప‌ని చేశారు అని అంటుంది. ఇక కార్తీక్.. మీ ఇద్ద‌రికి ఇద్ద‌రు ఏం ప‌నిచేసినా మంచిగానే క‌నిపిస్తుంది అని అంటాడు. వెంట‌నే మౌనిత‌.. కార్తీక్ వెళ‌దామా అని అడుగుతుంది. ఇక దీప‌.. మేడ‌మ్ వెయిటింగ్, పాపం హాస్పిట‌ల్ త‌ప్ప బోలెడు రాచ‌కార్యాలు ఉంటాయి మేడ‌మ్‌కి, వెళ్లండి అని అంటుంది. ఇక సౌర్య నిల్చోని ఉండ‌గా.. నువ్వెందుకు అలా నిల‌బ‌డ్డావు, కారు ఎక్క‌వే అని అంటాడు.

  ఆ త‌రువాత కార్తీక్ కారు డోర్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన దీప మీతో పర్స‌న‌ల్‌గా మాట్లాడాలి అని అంటుంది. దానికి కార్తీక్.. నీకు, నాకు మ‌ధ్య వ్య‌క్తిగ‌త విష‌యాలు ఏమీ లేవు అని అంటాడు. పిల్ల‌ల‌కు నా మీద వ్య‌తిరేకంగా నూరిపోసింది చాలు. నేను వెళ్లాలి అని అంటాడు. ఇక దీప‌.. ఒక్క‌టే ఒక మాట‌. క‌న్న ప్రేమ‌నే న‌న్ను ర‌ప్పించింది, పెంచిన ప్రేమ రావ‌డానికి ఆల‌స్య‌మైంది. ఏది గెలిచిందో మీ విఙ్ఞత‌కే వ‌దిలేయ‌డం జరిగింది అని అంటుంది. ఆ త‌రువాత ఎవ‌రి దారిన వారు వెళ‌తారు. కార్తీక దీపం కొన‌సాగుతోంది.

  Published by:Manjula S
  First published:

  Tags: Karthika deepam, Karthika Deepam serial, Television News

  ఉత్తమ కథలు