హోమ్ /వార్తలు /సినిమా /

Karthika Deepam: నా జీవితంలో రెండో మ‌గాడు లేడు.. ఒక్క మ‌గాడు కార్తీక్ మాత్ర‌మే.. మౌనిత ఆవేశం

Karthika Deepam: నా జీవితంలో రెండో మ‌గాడు లేడు.. ఒక్క మ‌గాడు కార్తీక్ మాత్ర‌మే.. మౌనిత ఆవేశం

తెలుగు రాష్ట్రాలలో కార్తీక దీపం సీరియల్‌కు ఉన్న క్రేజ్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. గ్రంథాలు రాయాల్సి వస్తుంది. అంత గుర్తింపు తెచ్చుకుంది ఈ సీరియల్. 2017 అక్టోబర్‌లో మొదలైన కార్తీక దీపం సీరియల్ టిఆర్పీ రేటింగ్స్‌లో అగ్రస్థానంలో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు దీన్ని బీట్ చేసే సీరియల్ మరోటి రాలేదంటే వంటలక్క రేంజ్ ఏంటో అర్థం అయిపోతుంది. మరి ఇంతటి పాపులర్ సీరియల్‌లో ఉన్న నటుల స్క్రీన్ నేమ్స్ అందరికీ తెలుసు. మరి వంటలక్క నుంచి మోనిత వరకు వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ ఏంటో ఓ సారి చూద్దాం.

తెలుగు రాష్ట్రాలలో కార్తీక దీపం సీరియల్‌కు ఉన్న క్రేజ్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. గ్రంథాలు రాయాల్సి వస్తుంది. అంత గుర్తింపు తెచ్చుకుంది ఈ సీరియల్. 2017 అక్టోబర్‌లో మొదలైన కార్తీక దీపం సీరియల్ టిఆర్పీ రేటింగ్స్‌లో అగ్రస్థానంలో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు దీన్ని బీట్ చేసే సీరియల్ మరోటి రాలేదంటే వంటలక్క రేంజ్ ఏంటో అర్థం అయిపోతుంది. మరి ఇంతటి పాపులర్ సీరియల్‌లో ఉన్న నటుల స్క్రీన్ నేమ్స్ అందరికీ తెలుసు. మరి వంటలక్క నుంచి మోనిత వరకు వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ ఏంటో ఓ సారి చూద్దాం.

Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. నిన్న‌టి ఎపిసోడ్‌లో సౌర్య‌ను ఇంటికి తీసుకొచ్చిన కార్తీక్.. నా బాధ ఏంటో ఆ దీప‌కు ఇప్పుడు అర్థ‌మ‌వుతుంద‌ని సౌంద‌ర్య‌తో అంటాడు. ఇక ఇవాళ్టి ఎపిసోడ్‌లో దీప ఇంటి ముందు ముగ్గు పెడుతుండ‌గా.. ఆటోలో స‌రోజ‌క్క, వార‌ణాసి వ‌స్తుంది.

ఇంకా చదవండి ...

  Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. నిన్న‌టి ఎపిసోడ్‌లో సౌర్య‌ను ఇంటికి తీసుకొచ్చిన కార్తీక్.. నా బాధ ఏంటో ఆ దీప‌కు ఇప్పుడు అర్థ‌మ‌వుతుంద‌ని సౌంద‌ర్య‌తో అంటాడు. ఇక ఇవాళ్టి ఎపిసోడ్‌లో దీప ఇంటి ముందు ముగ్గు పెడుతుండ‌గా.. ఆటోలో స‌రోజ‌క్క, వార‌ణాసి వ‌స్తుంది. ఇంత పొద్దున్నే వీడి ఆటోలో వ‌చ్చావేంటి అక్కా అని దీప అడ‌గ్గా.. రాత్రి మా అల్లుడు ఇంటికి వెళ్లాను. పొద్దున న‌డిచివస్తుంటే వార‌ణాసి నీ ఇంటికే వ‌స్తున్నాన‌ని ఆటోలో ఎక్క‌మ‌న్నాడు అని స‌రోజ‌క్క అంటుంది. ఇక వార‌ణాసి రెడీ అయ్యారా అక్క అన‌గా.. అయ్యాను. ఒక గంట‌లో బ‌య‌లుదేరుదాము. రెడీగా ఉండు అని దీప చెబుతుంది. ఇక స‌రోజ‌క్క కూడా దీప‌తో క‌లిసి ముగ్గు పెడుతుండ‌గా.. బ‌య‌లుదేరుదామంటున్నావు ఎక్క‌డికి దీప అని స‌రోజ‌క్క అడుగుతుంది. మా నాన్న ర‌మ్మ‌న్నాడు అక్క. పిన్ని ఊర్లో లేదంటా. వ‌చ్చి రెండు రోజులు ఉండ‌మ‌న్నాడు. న‌న్ను, హిమ‌ను తీసుకెళ్తాను రెడీగా ఉండ‌మ‌న్నాడు అని దీప చెబుతుంది. మ‌రి సౌర్య అని స‌రోజ‌క్క‌ అడ‌గ్గా.. న‌న్ను మా నాన్న తీసుకెళుతున్న‌ట్లే రెండు రోజులు అత్త‌మ్మ‌ను వాళ్ల నాన్న తీసుకెళ్లాడు అని దీప చెబుతుంది.

  ఇక స‌రోజ‌క్క‌.. సౌర్య‌మ్మ‌ను, డాక్ట‌ర్ బాబు తీసుకెళ్లాడా.. హిమ‌ను తీసుకెళ్ల‌కుండా అని స‌రోజ‌క్క అడుగుతుంది. హిమ రానందిగా. అంద‌రినీ తీసుకెళ్లిన రోజే వ‌స్తాన‌ని పంతం ప‌ట్టింది అని దీప చెబుతుంది. దానికి స‌రోజ‌క్క సౌర్య అనుకున్నాను. హిమ కూడా గ‌ట్టి పిండ‌మే అని చెబుతుంది. ఇద్ద‌రు ఒకే క‌డుపున ఒకే సారి పుట్టిన క‌వ‌ల‌లు క‌దా అని దీప అంటుంది. ఇక స‌రోజ‌క్క మ‌రి ఇంత మంచి డాక్ట‌ర్ బాబు అలా ఎందుకు త‌ప్పు చేస్తున్నాడు అని స‌రోజ‌క్క అంటుంది. ఎలా అని దీప అడ‌గ్గా.. ఏం లేదు అరుణ వాళ్లింటి ప‌క్క పోర్ష‌న్‌లో డాక్ట‌ర్ బాబు ఆసుప‌త్రిలో ప‌నిచేసే న‌ర్సు సుజాత ఒక మాట చెప్పింది అని స‌రోజ‌క్క‌ అంటుంది. ఏమ‌ని అని దీప అడ‌గ్గా.. డాక్ట‌ర్ బాబు, మౌనిత పెళ్లి చేసుకోబోతున్నార‌ట క‌దా. ఇది నీ దాకా వ‌చ్చిందా..? అని స‌రోజ‌క్క అడుగుతుంది. ఆ పెళ్లి జ‌రిగితే క‌దా... దీప బ‌తికి ఉండ‌గా అంత దూరం వెళ్ల‌దులే స‌రోజ‌క్క‌. ఆ మౌనిత‌ను జైలుకు పంపించే రోజు ఎంతో దూరంలో లేదు అని దీప చెబుతుంది.

  ఇక మౌనిత త‌న ఇంట్లో ప్రియ‌మ‌ణితో మాట్లాడుతూ.. ఒప్పించేస్తే బంగారం నేను, నా కార్తీక్ ఇద్ద‌రం దండ‌ల‌తో కారు దిగుతాము. లోప‌ల సౌంద‌ర్య‌మ్మ కోపంతో పాత సినిమాలో వాణిశ్రీలా ప‌ట్టుచీర న‌ల‌గ‌కుండా అటూ ఇటూ కాలుకాలిన పిల్లిలా తిరుగుతూ ఉంటుంది. మేము ఎంట‌ర్ అవుతాము. అంతే కార్తీక్ అని సౌంద‌ర్య అర‌వటం. య‌థావిధిగా న‌న్ను లాగి చెంప కేసి కొడుతుంది అనుకుంటారు కానీ ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ సౌంద‌ర్య నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి నా నుదురు పెట్టుకొని ముద్దు పెట్టి.. శ్రావ్య కొత్త కోడ‌లికి దిష్టి తీయ్ అంటుంది. శుభం కార్డు ప‌డుతుంది. ఎలా ఉంది సినిమా అని న‌వ్వుతూ.. ఏంటే ఆలోచిస్తున్నావు..? అని అడుగుతుంది.

  దానికి ప్రియ‌మ‌ణి మీ గురించేన‌మ్మా అని అంటుంది. నా గురించా..? నా గురించి ఆలోచించ‌డానికి ఏముందే.. ఇప్పుడు చెప్పానుగా అదే జ‌రుగుతుంది అని అంటుంది. ఇక ప్రియ‌మ‌ణి.. నిన్ను మ‌న‌స్ఫూర్తిగా ఇష్ట‌ప‌డేది ఎవ‌రు అంటే కార్తీక్ అయ్య అంటారు. మొన్న ఆయ‌న కాళ్లు ప‌ట్టుకొని ఐ ల‌వ్ యూ అని చెప్ప‌డం నేను విన్నాన‌మ్మా.. నేను చూశాను. నువ్వు అంత బ్ర‌తిమ‌లాడిన ఆయ‌న‌లో ఏ మార్పు లేదు. ఏ మాత్రం క‌ద‌లిక లేదు. ఎందుక‌మ్మా.. నీకు ఏం త‌క్కువ‌ని..? అందం ఉంది, ఆస్తి ఉంది. హీరోయిన్‌లా ఉంటావు, హోదా కూడా ఉంది. నువ్వు త‌లుచుకుంటే కార్తీక్ అయ్య‌ను మించిన వాళ్లు నీ పాదాల ద‌గ్గ‌ర వాలిపోతార‌మ్మా అని అంటుంది. దాంతో మౌనిత ఆవేశంలో ప్రియ‌మ‌ణిని కొడుతుంది.

  నేను ఇంత కాలం కార్తీక్ కోస‌మే బ్ర‌తికాను, కార్తీక్ కోస‌మే చ‌స్తాను. చ‌చ్చి చ‌రిత్ర‌లో నిలిచిపోతాను. నా జీవితంలో ఏ రెండో మ‌గాడే లేడే., ఒక్క మ‌గాడే నా కార్తీక్ గుర్తించుకో. మొగుడు వ‌దిలేసిన ఆ దీపలాగా చ‌రిత్ర‌హీనురాలిగా మిగిలిపోను. మైండ్ ఇట్ అని చెప్పి అక్క‌డి నుంచి వెళుతుంది.

  ఒక సౌర్య పొద్దున్నే కార్తీక్ రూమ్‌లోకి కాఫీ తీసుకొని వ‌చ్చి గుడ్‌మార్నింగ్ నాన్న అని అంటుంది. ఆ త‌రువాత కాఫీ తీసుకోండి డాక్ట‌ర్ బాబు అని ఇస్తుంది. ఇక కార్తీక్ పాలు తాగావా అని సౌర్య‌ను అడ‌గ్గా.. తాగా.. వ‌ద్ద‌న్నా నాన‌మ్మ‌, తాత‌య్య ముక్కు మూసి మ‌రీ తాగించారు. నాకు పాల వాస‌న అంటే యాక్.. కానీ దౌర్జ‌న్యంగా తాగిస్తే ఏం చేస్తాము అని అంటుంది. వాళ్లిద్ద‌రు నీ క‌న్నా పెద్ద రౌడీలే అని కార్తీక్ అన‌గా.. సౌర్య న‌వ్వుతుంది. హిమ‌కు ఫోన్ చేసి మాట్లాడావా అని కార్తీక్ అడ‌గ్గా.. హిమ‌నే ఫోన్ చేసింది డాక్ట‌ర్ బాబు. అమ్మా దీప అంటాడే.. ఆ తాత‌య్య ఇంటికి అమ్మ‌తో క‌లిసి వెళుతుందంట అని సౌర్య చెబుతుంది. అక్క‌డికి ఎందుకు అని కార్తీక్ అడ‌గ్గా.. అర్ధ‌పావు ఉప్మా తిన‌డానికేమో అని సౌర్య అంటుంది. దానికి న‌వ్విన కార్తీక్.. నీకు తెలుసా మీ అమ్మమ్మ సంగ‌తి అని అడుగుతాడు. మా అమ్మ క‌న్నా నాకే బాగా తెలుసు. పాపం అమ్మా దీప తాత‌య్య అని అంటుంది.

  ఆ త‌రువాత నేను ఒక‌టి అడ‌గొచ్చా అని సౌర్య అంటుంది. ఇక కార్తీక్.. ఈ మ‌ధ్య ప్ర‌శ్న‌లు వేయ‌డం త‌గ్గించావ‌నుకున్నాను. మ‌ళ్లీ మొద‌లుపెట్టావ‌టే అని అంటాడు. దానికి సౌర్య‌.. ఇది వేరే ప్ర‌శ్నలేండి అని చెబుతుంది. ఏంటో అడుగు అని కార్తీక్ అన‌గా.. నాన‌మ్మ, పిన్ని కోసం చాలా పెద్ద ఇల్లు కొనిచ్చింది క‌దా అని అడ‌గ్గా.. అవును అని కార్తీక్ అంటాడు. మ‌రి మా అమ్మ‌కు ఎందుకు కొనివ్వ‌లేదు అని సౌర్య‌ అడుగుతుంది. అది నువ్వు మా అమ్మ‌నే అడుగు అని కార్తీక్ చెబుతాడు. ఆ త‌రువాత మ‌ళ్లీ సౌర్య డాక్ట‌ర్ బాబు అన‌గా.. నో మోర్ క్వ‌శ్చ‌న్స్ ప్లీజ్. అవ‌న్నీ నాన‌మ్మ‌ను అడ‌గాల్సిన‌వి. అయినా మీ అమ్మ‌కు సెల్ఫ్ రెస్పెక్ట్ క‌దానే. ఎవ‌రు ఏం ఇచ్చినా తీసుకోదు అంటాడు. ఇక టిఫెన్ చేశావా అని కార్తీక్ అడ‌గ్గా.. లేదు ఇవాళ ఇవాళ అని నీళ్లు న‌లుముతూ ఒక‌టి అడ‌గొచ్చా అని సౌర్య అంటుంది. మ‌ళ్లీ ఒక‌టా అడుగు, ఏమైనా కావాలా అని కార్తీక్ అన‌గా.. ఇవాళ మీతో క‌లిసి టిఫెన్ చేయొచ్చా అని సౌర్య అడుగుతుంది. దాంతేముందిలే ప్ర‌త్యేకంగా అడ‌గాలా..? స్నానం చేసి వ‌స్తాను క‌లిసే టిఫిన్ తిందాం అని చెబుతాడు. మ‌ళ్లీ సౌర్య డాక్ట‌ర్ బాబు ఇంకొక‌టి అన‌గా.. మ‌ళ్లీ ఏంటే అని కార్తీక్ అడుగుతాడు. ఈ గోడ మీద హిమ మీ గురించి రాసిన పోస్ట‌ర్లు ఉండాలి క‌దా. లేవేంటి అని అడుగుతుంది. అది ఆ మెంట‌ల్ మొహంది వ‌చ్చి తీసింది అని కార్తీక్ అంటాడు. అంటే మౌనితా అని సౌర్య అడ‌గ్గా.. ఛీ ఛీ కాదు మీ అమ్మ అని అంటాడు.

  ఇక సౌర్య‌.. మా అమ్మ‌. మా అమ్మ మౌనిత‌లాగా మెంట‌ల్ మొహంది కాదే అని అంటుంది. ఇక కార్తీక్.. ఏయ్ ఏం తెలుసే మీ అమ్మ గురించి నీకు. ఇలా క‌నుబొమ్మ‌లు పైకెత్తి చూడ‌టం ఎప్పుడైనా చూశావా.? అని అడుగుతాడు. అవునా ఎప్పుడూ చూసిన‌ట్లు లేదే అని సౌర్య చెప్ప‌గా.. నువ్వెందుకు చూస్తావు. ఆ క‌నుబొమ్మ‌లు న‌న్ను చూస్తేనే పైకి లేస్తాయి. దానికి అప్పుడ‌ప్పుడు దెయ్యం పూనుతుంది. అందుకే వ‌చ్చి హిమ రాసిన పోస్ట‌ర్లు పీకేసి తీసుకెళ్ల్లిపోయింది అని అంటాడు. దానికి సౌర్య‌.. అయితే మా అమ్మ నిజంగా పిచ్చిదే. లేక‌పోతే ఇలాంటి ప‌నులు ఎలా చేస్తుంది అని అంటుంది. ఇక కార్తీక్.. బాగా అన్నావే.. పిచ్చిది క‌న్నా. మెంట‌ల్ మొహంది అంటే ఇంకా క‌రెక్ట్‌గా సూట్ అవుతుంది. లేక‌పోతే హిమ ఫొటో కూడా లేకుండా తీసుకెళ్లిపోతుందా..? అని వెళ్లిపోతాడు. ఇక అద్దం ముందు నిల్చుని సౌర్య క‌నుబొమ్మ‌లు పైకి ఎత్త‌డం చేస్తుంటుంది. అది కార్తీక్ చూసి.. ఓయ్ రౌడీ.. నువ్వు కూడా మొద‌లుపెట్టావా..? అని అడ‌గ్గా.. అయ్యో నాకు రావ‌డం లేదులే డాక్ట‌ర్ బాబు అని సౌర్య చెబుతుంది. ఇక ఇప్పుడు నేను డాక్ట‌ర్ బాబుకు ద‌గ్గ‌ర‌వ్వాలంటే అమ్మ‌ను తిట్టాలా..? అని సౌర్య అనుకుంటుంది.

  ఇక దీప‌, హిమ‌ల‌ను ఇంటికి తీసుకొచ్చిన ముర‌ళీకృష్ణ‌..ఇన్నాళ్లు డాక్ట‌ర్ బాబు పెంచుకున్న కూతురిలా వ‌చ్చావు. ఇవాళ నా కూతురు పెంచుకున్న కూతురిలా వ‌చ్చావు. ఇది మీ అమ్మ‌మ్మ ఇల్లు, తాత‌య్య ఇల్లు. సొంత మ‌న‌వ‌రాలిగా మొద‌టిసారి వ‌చ్చావు క‌దా. నీకు ఏం కావాల‌న్నా మొహ‌మాటం లేకుండా అడుగు. ఈ తాత‌య్య‌ను అడుగు అని అంటాడు. దానికి హిమ‌.. అలాగే అమ్మ దీపా తాత‌య్య అని న‌వ్వుతుంది. ఇక ముర‌ళీకృష్ణ.. అమ్మ గ‌డుగ్గాయ్.. ఆ రౌడీనే అనుకున్నాను. నువ్వు తాత‌య్యను ఎక్కిరుస్తున్నావే అని అంటాడు.

  ఆ త‌రువాత ఇవాళ్టి నుంచి రెండు రోజులు నేను ఇంట్లోనే ఉంటాను. లీవ్ పెట్టేశాన‌మ్మా అని ముర‌ళీకృష్ణ, దీపతో అంటాడు. రెండు రోజులు ఎందుకు నాన్న అని దీప అడ‌గ్గా.. నీతో మ‌న‌సు విప్పి మాట్లాడాల‌నుంద‌మ్మా. మీ పిన్ని లేదు కాబ‌ట్టి ప్ర‌శాంతంగా గ‌డిపేద్దాం అని ముర‌ళీకృష్ణ అంటాడు. నేను అంత ఆనందంగా గ‌డిపే ప‌రిస్థితుల్లో లేను నాన్న‌. ప్ర‌మాదం ముంచుకొస్తున్న‌ట్లు అనిపిస్తోంది. అందుకే నా వంతు పోరాటం నేను మొద‌లుపెట్టాను. ఒక ముఖ్య‌మైన ప‌ని మీద వెళుతున్నాను నాన్న‌. ఆ ప‌ని పూర్తి అయ్యాక చెబుతాను. హిమ‌కు తోడుగా ఉంటావ‌నే ఇక్క‌డ‌కు వ‌చ్చాను అని దీప చెబుతుంది. అలాగేన‌మ్మా. నేను చూసుకుంటాను అని ముర‌ళీకృష్ణ అంటాడు. ఇక బ‌య‌టి నుంచి పూల‌ను కోసుకొచ్చిన హిమ‌.. అమ్మా చూడు ఎన్ని పువ్వులు పూశాయో అని అంటుంది. ఇక దీప‌.. నేను బ‌య‌ట‌కు వెళుతున్నాను. నీకేం కావాల‌న్న తాత‌య్య‌ను అడుగు అని చెబుతుంది. స‌రేన‌మ్మా నేను, సౌర్య వీడియో కాల్‌లో మాట్లాడుకుంటాము అని హిమ చెబుతుంది.

  ఇక దీప, ముర‌ళీకృష్ణ‌ను స్కూటీ తాళాలు ఇవ్వ‌మ‌ని అడ‌గ్గా.. అమ్మా నువ్వు స్కూటీ కూడా న‌డుపుతావా..? అని హిమ అడుగుతుంది. కారు కూడా న‌డుపుతాన‌మ్మా.. మీ డాడీ నేర్పించాడు అని దీప చెబుతుంది. అవునా.. అయితే మ‌న‌మంద‌రం క‌లిశాక నీ డ్రైవింగ్‌లో బ‌య‌ట‌కు వెళ‌దాం అని అంటుంది. ఇక అలాగేన‌మ్మా అని హిమ‌కు ముద్దుపెట్టి దీప బ‌య‌ట‌కు వెళుతుంది.

  ఇక సౌర్య ఇళ్లంతా క‌ల‌య‌తిరుగుతూ ఉంటుంది. అది గ‌మ‌నించిన సౌంద‌ర్య‌.. సౌర్య వెన‌కాలే న‌వ్వుతూ వెళుతూ ఉంటుంది. ఇక సౌర్య స‌డ‌న్‌గా వెన‌క్కి చూడ‌గా.. సౌంద‌ర్య ఉంటుంది. దాంతో సౌర్య‌.. మీరేంటి నాన‌మ్మా నాలాగా తిరుగుతున్నారు అని అడుగుతుంది. నువ్వేంటి మ‌రి నాలాగా తిరుగుతున్నావు అని సౌంద‌ర్య అన‌గా.. మీరు నాలాగా తిరిగారు క‌దా సౌర్య చెబుతుంది. దానికి సౌంద‌ర్య కాదు ఈ స్టైల్ నాది. నేను ఎవ‌రికోసమైనా ఎదురుచూస్తే ఇలానే తిరుగుతాను. నా మ‌న‌వరాలివి క‌దా నా స్టైల్ నీకు వ‌చ్చింది అని అంటుంది. అవునా.. అందుకేగా మా అమ్మ న‌న్ను అత్త‌మ్మా అనేది అని సౌర్య అంటుంది. ఇక సౌంద‌ర్య‌.. ఇంత‌కు త‌మ‌కు ఎవ‌రి కోసం ఎదురుచూస్తున్నారో తెలుసుకోవ‌చ్చా అని సౌంద‌ర్య అడ‌గ్గా.. త‌ప్ప‌కుండా తెలుసుకోవ‌చ్చు. మా నాన్న గారి కోసం ఎదురుచూస్తున్నాను అని సౌర్య అంటుంది. దానికి సౌంద‌ర్య‌.. అబ్బో ఏంటో విశేషం అని అడ‌గ్గా.. ఇవాళ మా నాన్న‌గారు, నేను క‌లిసి టిఫెన్ చేయ‌బోతున్నాము అని సౌర్య చెబుతుంది. మ‌రి మ‌మ్మ‌ల్ని పిలుస్తారా..? అని సౌంద‌ర్య అడ‌గ్గా.. పిలుస్తాము. ఎందుకంటే వండించాల్సింది మీరే క‌దా అని అంటుంది. దాంతో సౌంద‌ర్య‌.. ఒసేయ్ అంటూ సౌర్య చెవి ప‌ట్టుకుంటుంది. ఇక కార్తీక్ కిందికి రాగా.. మ‌నం అన్నీ రెడీ చేద్దాం రావే అంటూ సౌర్య‌ను తీసుకెళుతుంది సౌంద‌ర్య‌.

  ఇక కార్తీక్, మౌనిత‌కు ఫోన్ చేస్తాడు. అప్పుడు మౌనిత గుడ్ మార్నింగ్ చెప్పి, బ‌య‌లుదేరావా..? అని అడుగుతుంది. ఎక్క‌డికి అని కార్తీక్ అన‌గా.. అదేంటి అప్పుడే మ‌ర్చిపోయావా..? మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి ర‌మ్మ‌న్నాను క‌దా. అన్ని చేసి నేను ఎదురుచూస్తుంటే ఇప్పుడు ఎక్క‌డికి అని అడుగుతావేంటి..? అని మౌనిత అంటుంది. ఇక సౌర్య‌కు ఇచ్చిన మాట‌ను గుర్తు చేసుకునే కార్తీక్.. పాపం.. రౌడీ నాతో టిఫెన్ అని చెప్ప‌బోతాడు. ఇక మౌనిత కోపంతో.. ఇవ‌న్నీ నేల‌కేసి కొడ‌తాను కార్తీక్. యు క్యారీ ఆన్ అంటుంది. దానికి కార్తీక్ ఆగు అన‌గా.. వ‌స్తున్నావా..? లేదా..? అని మౌనిత మ‌ళ్లీ అడుగుతుంది. అంత‌టితో ఆగ‌కుండా రాక‌పోతే ఆ వంట‌ల‌క్క మాట నువ్వు వింటున్నావు అనుకోవాల్సిందే అని చెబుతుంది. ఇక కార్తీక్.. నువ్వు ఇలాంటి చీఫ్ ట్రిక్స్ నా ద‌గ్గ‌ర ప్లే చెయ్య‌కు. నేను వ‌స్తానంటే క‌చ్చితంగా వ‌స్తాను అని చెబుతాడు. అయితే రా మ‌రి అని మౌనిత అన‌గా.. స‌రే వ‌స్తున్నాను అని అంటాడు. ఇక మౌనిత సంతోషంలో ఉండిపోతుంది. ఇక కార్తీక్ బ‌య‌ట‌కు వెళుతూ.. ఈ పూట‌కు నాన‌మ్మ‌తో క‌లిసి తినేసేయ్ రౌడీ. రేపు ఇద్ద‌రం క‌లిసి తిందాంలే అని చెప్పి వెళుతూ.. ఛీ ఛీ ఈ మౌనిత మ‌రీ ఎమోష‌న‌ల్ బ్లాక్‌మెయిల్ చేస్తుంది అని మ‌న‌సులో అనుకుంటాడు.

  ఇక కారులో కార్తీక్ వెళుతుండా.. ఎదురుగా దీప ఉంటుంది. ఆమెను చూసి పొద్దున్నే ఇది ఇక్క‌డ త‌యారైందేంటి.?? దీనికి అస్స‌లు దొర‌క‌కూడ‌దు అనుకొని వెళ‌తాడు. ఇక వెంట‌నే దీప కూడా కార్తీక్‌ని ఫాలో అవుతూ వెళుతుంది. ఇక దీప ఫాలో అవ్వ‌డం గ‌మ‌నించిన కార్తీక్.. ఇప్పుడు గానీ నేను మౌనిత ఇంటికి వెళితే టిఫిన్ తిన‌డం కాదు. మౌనిత‌ను ప‌చ్చ‌డి చేసినా చేస్తుంది. చ‌చ్చిన‌ట్లు ఆసుప‌త్రికే వెళ‌తాను అని అనుకుంటాడు. ఇక రేప‌టి ఎపిసోడ్ ప్రోమోలో మౌనిత ద‌గ్గ‌ర‌కు వెళ్లిన కార్తీక్.. దీప నిన్ను జైలుకు పంపిస్తాను అంటోంది. మీ ఇద్ద‌రి మ‌ధ్య ఏం ర‌హ‌స్యం ఉంది. నా వెన‌కాల ఏం జ‌రుగుతోంది అని అడుగుతాడు.

  Published by:Manjula S
  First published:

  Tags: Karthika deepam, Karthika Deepam serial

  ఉత్తమ కథలు