తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియల్ రసవత్తరంగా కొనసాగుతోంది. ఇవాళ్టి ఎపిసోడ్‌లో దీప ఇంటికి వెళ్లిన సౌందర్య.. హిమను బయటకు తీసుకెళ్లమని వారణాసికి చెబుతుంది. ఆ తరువాత మీరేదో చెప్పాలని వచ్చారు అని దీప అడగ్గా.. నీకు తెలిసిపోయిందా అని సౌందర్య అడుగుతుంది. ఇక కార్తీక్ కోర్టు కేసు వాపసు తీసుకున్న విషయాన్ని సౌందర్య, దీపకు చెప్పగా ఆమె షాక్‌కి గురి అవుతుంది. ఏంటి అని దీప అడగ్గా.. హిమ కోసం కోర్టుకు వెళ్లాలనుకున్న వాడు ఇప్పుడు వెళ్లదలుచుకోవడం లేదు అంటున్నాడు అని సౌందర్య అంటుంది. ఇక అదేంటత్తయ్యా లాయర్ చుట్టూ ఆయన, మౌనిత అంతగా తిరిగారు కదా, ఇప్పుడు ఏమైంది, ఎందుకు డ్రాప్ అయ్యారు అని దీప అడగ్గా.. అదే తెలియడం లేదు. ఎందుకు మానేశాడో అర్థం కావడం లేదు అని సౌందర్య అంటుంది. ఆ తరువాత నువ్వేమైనా మౌనితతో మాట్లాడావా అని సౌందర్య, దీపను ప్రశ్నిస్తుంది. ఏమని అని దీప అడగ్గా.. నువ్వెందుకు ఇన్ని రోజులు అంత కాన్ఫిడెంట్‌గా ఉన్నావో ఆ విషయం మౌనితతో చెప్పావా అని సౌందర్య అడుగుతుంది. దానికి దీప.. నేను మీతోనే చెప్పలేదు కదా. పోయి పోయి దాంతో ఎందుకు చెబుతాను. కోర్టుకు వెళితేనే న్యాయం జరుగుతుందన్న ఉద్దేశ్యంతో పిల్లలిద్దరికి మనమంతా కలిసి ఉండబోతున్నామని ధైర్యం చెప్పాను. ఇప్పుడు ఏం చెప్పాలి అత్తయ్యా అని అంటుంది.
ఆ తరువాత నువ్వు, మౌనిత ఇద్దరు తులసి ఇంటికి ఎందుకు వెళ్లారని సౌందర్య ప్రశ్నిస్తుంది. ఇక మౌనిత తనకు పంపిన వీడియోను దీపకు చూపిస్తూ.. అది నాకు పంపించడమే కాకుండా కార్తీక్‌కి కూడా చూపించింది అని సౌందర్య చెబుతుంది. అప్పుడు దీప, తులసి మాటలను గుర్తు చేసుకుంటూ ఉండగా.. ఏం జరిగింది అని సౌందర్య ప్రశ్నిస్తుంది. దానికి దీప.. నేను మామూలుగానే వెళ్లాను. తులసి, విహారి దగ్గరకు వెళ్లిపోతున్నానని చెబితే కలిసి వద్దామనుకొని వెళ్లాను. ఈ లోపు మౌనిత కూడా అక్కడకు వచ్చింది. అక్కడ గొడవ జరిగింది అంతే అని చెబుతుంది. ఆ తరువాత దీప మనసులో ఇప్పుడు కోర్టు అనే ద్వారం మూసిపోయింది. ఇప్పటిదాకా కోర్టు ఉంది కాబట్టి అక్కడ న్యాయం జరుగుతుందనుకున్నాను. అందుకే తులసి విషయం అసలు బయట పెట్టకూడదు అనుకున్నాను. ఇప్పుడు నేను తులసి విషయం అత్తయ్య దగ్గర, ఆయన దగ్గర చెప్పొచ్చా. అత్తయ్యకు చెబితే కచ్చితంగా ఆయనకు చెబుతుంది. నా స్వార్థం కోసం ఈ నిజం బయటపెట్టాలా అని ఆలోచిస్తూ ఉంటుంది.
ఇక మౌనిత ఇంట్లో కార్తీక్.. అన్నీఆలోచిస్తూ ఉంటాడు. ఏమీ ఆలోచిస్తున్నావు అని మౌనిత అడగ్గా.. ఏంటో అని కార్తీక్ అంటాడు. దేని గురించి అని మౌనిత మళ్లీ ప్రశ్నించగా.. దాని గురించే అని చెబుతాడు. దీప గురించా అని మౌనిత ప్రశ్నించగా.. ఆ కోర్టు వ్యవహారం గురించి అని కార్తీక్ అంటాడు. దానికి మౌనిత ఇంకేం కోర్టు అని అంటుంది. వెంటనే కార్తీక్.. దీప జడ్జిమెంట్ ముందే చెప్పేసింది అని అంటాడు. ఇక మౌనిత అవన్నీ మీ అమ్మ తెలివి తేటలే అని అంటుంది. మా అమ్మకు కూడా నాతో పాటు తెలిసింది అని కార్తీక్ అనగా.. ఆ ట్రైనింగ్‌కి కారణం అంటున్నాను అని మౌనిత అంంటుంది. మధ్యలో మా అమ్మను తీసుకురాకు అని కార్తీక్ చెబుతాడు. ఇక మౌనిత.. మీ ఆవిడకు బోలెడు తెలివి తేటలు ఉన్నాయి. చాలా అని అంటూ ఉండగా.. ఇప్పుడు కోర్టుకు వెళ్లకుండా చేసింది. హిమ రాకుండా చేసింది. నేను అనవసరంగా పంతానికి పోయానేమో. పెంచిన ప్రేమ గొప్పదా.. కన్న ప్రేమ గొప్పదా.. అని ఏదో పనికిమాలిని స్లోగన్ మొదలుపెడితే నేనే గెలుస్తాను అని విర్రవీగాను. నేను అనుకున్నది ఒకటి, ఆశ పడింది ఒకటి, ఇప్పుడు జరిగింది ఒకటి అని కార్తీక్ అంటాడు.
ఇక మౌనిత.. వారంతా కలిసి దీపకు ఓటేసి గెలిపించారు. విచిత్రం ఏంటంటే, ప్రతిపక్షం కూడా దీపకు ఓటేసి గెలిపించింది. అంటే నువ్వు.. నువ్వు కూడా దీపను గెలిపించడానికి నీ వంతు సహకారంగా హిమను అక్కడకు పంపించావు కదా అని అంటుంది. వెంటనే కార్తీక్.. దానికి ఇన్ని తెలుసని నాకేం తెలుసు అని అంటాడు. దానికి మౌనిత.. దానికే తెలుసు. దీపకే తెలుసు, నీకు, నాకు ఈ లిటికేషన్స్ ఏం తెలుసు. ఇప్పుడు జరిగిపోయినవన్నీ పెన్సిల్ రాతలు కాదు. ఎరేజర్‌తో తుడిపేయడానికి.. ఇప్పుడు ఏం చేద్దామో ఆలోచించు అని అంటుంది. వెంటనే కార్తీక్.. ఆలోచించడానికి ఏం లేదు మౌనిత. నాకు హిమ కావాల్సిందే. దట్సాల్ అని అంటాడు. దానికి మౌనిత.. హిమ మనసు మార్చి నేను నీ దగ్గరకు తీసుకొస్తాను. అది నాకు వదిలేయ్ కార్తీక్ అని అంటుంది. వెంటనే కార్తీక్.. అది నువ్వు అనుకున్నంత ఈజీ ఏం కాదు. పదేళ్లు పెంచిన నాకే కన్నతల్లిని మరిపించడం కష్టంగా ఉంది. నువ్వేం చేస్తావు అని అడుగుతాడు. దానికి మౌనిత.. నేను మారు తల్లిగా ప్రయత్నిస్తాను అని అంటుంది. దాంతో షాక్‌కి గురైనా కార్తీక్.. నాకు కొంచెం టైమ్ ఇవ్వు మౌనిత అని అక్కడి నుంచి వెళతాడు.
ఇక ఇంట్లో కార్తీక్ వెళ్లగా.. సౌర్య పరిగెత్తుకుంటూ వెళ్లి.. వచ్చావా నాన్న నీ కోసమే వెయిటింగ్ రారా అని తీసుకెళుతుండగా.. ఎక్కడికి హిమ అని కార్తీక్ అడుగుతాడు. దాంతో కార్తీక్ చెయ్యిని సౌర్య వదిలేస్తుంది. ఆ తరువాత చెప్పు హిమ ఎక్కడికి.. నిన్నే.. ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతాడు. ఇప్పుడు ఏమన్నావు అని సౌర్య అడగ్గా.. ఏమన్నాను అని కార్తీక్ ప్రశ్నిస్తాడు. దానికి సౌర్య హిమ అన్నావు అని అంటుంది. వెంటనే కార్తీక్.. ఓహ్ సారీ సారీ ఏదో అలా వచ్చేసింది అని చెబుతాడు. దానికి సౌర్య.. అలా ఏం రాలేదు. మీ మనసులో ఉన్నదే వచ్చింది అని చెబుతుంది. ఇక సారీ అని చెప్పా కదా అని కార్తీక్ అనగా.. నాకు కో్పం వచ్చిందంటూ సౌర్య సోఫాలో కూర్చుంటుంది. ఆ తరువాత సౌర్య దగ్గరకు వెళ్లిన కార్తీక్.. సారీ చెప్పాను కదా అనగా.. నేను కోపం వచ్చినట్లు నటించానులే అని సౌర్య నవ్వుతుంది. దానికి కార్తీక్ నవ్వుతూ.. అంతేనా అయితే ఓకేలే అని అంటాడు. ఇక కార్తీక్.. ఏం లేదు రౌడీ. ఎప్పుడు హిమతోనే ఉండేదాన్ని కదా. ప్రతి దానికి హిమ అని పిలవడం అలవాటు అయిపోయింది. తను లేదుగా ఇప్పుడు తన గురించే ఆలోచిస్తూ అనుకోకుండా హిమ అనేశాను అని అంటాడు.
వెంటనే సౌర్య.. హిమ ఎప్పుడు నీతోనే ఉంటే, అప్పుడు నా పేరుతోనే నన్ను పిలుస్తావు అంతేనా అని అంటుంది. ఇక హిమ అక్కడ ఉందిగా ఎప్పుడు ఇక్కడ ఎలా ఉంటుంది అని కార్తీక్ అనగా.. ఉంటుంది అని సౌర్య చెబుతుంది. ఎలా అని కార్తీక్ అడగ్గా.. దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది అని సౌర్య అంటుంది. ఆ తరువాత హిమ నాతో పాటు ఉండాలంటే నాదో కండిషన్ అని కార్తీక్ అనగా.. ఏంటది అని సౌర్య ప్రశ్నిస్తుంది. దానికి కార్తీక్.. హిమతో పాటు నువ్వు నాతోనే ఉండాలి అని అంటాడు. ఆ మాటతో సౌర్య సంతోషంలో థ్యాంక్యు నాన్న అని అంటుంది. థ్యాంక్స్ ఎందుకురా అని కార్తీక్ అడగ్గా.. నన్ను ఉండమన్నందుకు. హిమ అంటే మీకు చాలా చాలా ఇష్టం కదా. ఆ ఇష్టాన్ని నా మీద కూడా కాస్త చూపిస్తున్నారు కదా అందుకు అని సౌర్య అంటుంది. ఇక ఈ మాటలను వింటూ ఉన్న శ్రావ్య మనసులో.. నువ్వు నిజంగా గ్రేట్ సౌర్య. ఇన్నాళ్లు అక్క, అత్తయ్య చేయలేని పని నువ్వు చేస్తున్నావు. హిమతో పాటు మీ అమ్మను కూడా తీసుకురా అని అనుకుంటుంది. ఇక సౌర్య సంతోషంలో కన్నీళ్లు పెట్టుకోగా.. ఎందుకు ఆ కన్నీళ్లు అని కార్తీక్ తుడుస్తాడు.
ఆ తరువాత ఏదో చెప్పాలని లాకొచ్చావు అని కార్తీక్ అడగ్గా.. ఇంక చెప్పడానికి ఏం లేదు నాన్న. ఎంత హ్యాపీగా ఉందో తెలుసా. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు నేను నీ మీద చెయ్యి వేసి పడుకున్నా నువ్వు చేయి తీసేయవు కదా సౌర్య అంటుంది. దానికి కార్తీక్ నవ్వుతాడు. తరువాత సౌర్య.. తీసుకొస్తా. హిమను కచ్చితంగా తీసుకొస్తాను నాన్న అంటుంది. ఇక ఐడియా ఏదో చెప్తావు ఏంటది అని కార్తీక్ అడగ్గా.. చెప్తానులే. ముందు నువెళ్లి స్నానం చేసిరా. కలిసి భోజనం చేద్దాం అని అంటుంది. దాంతో కార్తీక్ తన రూమ్‌లోకి వెళతాడు. ఆ తరువాత సౌర్య దగ్గరకు వచ్చిన శ్రావ్య.. రౌడీ అంటే దోచుకెళ్లేవాళ్లు. నువ్వు నిజంగా దోచుకుంటున్నావు అని అంటుంది. నువ్వేం చెబుతున్నావో అర్థం కావడం లేదు అని సౌర్య అడగ్గా.. ముద్దు పెట్టి, ఐ లవ్యూ అని చెప్పి, ఇది అర్థమైతే చాలు అని చెబుతుంది. ఆ తరువాత శ్రావ్య మనసులో.. నాకు తెలుసే. నువ్వు చెల్లితో పాటు తరువాత తల్లిని తీసుకొస్తావని అనుకొని అక్కడి నుంచి వెళుతుంది.
ఇక ఇంట్లో దీప అన్నీ ఆలో్చిస్తూ ఉంటుంది. కోర్టు ద్వారా డాక్టర్ బాబుకు నిజం తెలుస్తుందని ఆశ పడ్డాను. ఆ విషయంలో ఆయన వెనక్కి తగ్గి నాకు ఆ దారి లేకుండా చేశాడు. ఇప్పుడు దేవుడు నాకు రెండో అవకాశం తులసి రూపంలో ఇచ్చాడు. ఈ అవకాశాన్ని నేను ఉపయోగించుకోలేకపోతే డాక్టర్ బాబు నన్ను ఎప్పటికీ నమ్మడు. కానీ తులసి విషయం బయట పెట్టడం కరెక్టేనా. ఏం చేయాలి. ఇది నా ఒక్క దాని ఆలోచనతో ముడిపడేలా లేదు. రేపు అత్తయ్యకు గుడికి రమ్మని చెప్పి అక్కడ మాట్లాడాలి అని అనుకుంటుంది.
ఇక తన ఇంట్లో మౌనిత.. దీప, సౌందర్యకు తులసి సంగతి చెప్పేసి ఉంటుందా. అబ్బే చెప్పేసి ఉండదు. చెప్పేసి ఉంటే సౌందర్య నాకు కాల్ చేసి ఉండేది . ఒకవేళ చెప్పేసి ఉంటే.. సౌందర్య, కార్తీక్ చెవిన వేసి ఉంటుంది కదా. వేసి ఉండదు. అలా వేసి ఉంటే కార్తీక్ నాకు చెప్పేవాడు కదా. ఏమో కార్తీక్‌కి తెలిసి కూడా నాకు తెలీకుండా తులసి మ్యాటర్ కనుక్కుందాం అనుకున్నాడేమో.. కార్తీక్ అలా చెయ్యడు. చెప్పలేము. ఒకవేళ అలాగే అనుకొని ఉంటే. ఆ వంటలక్క సామాన్యమైనది కాదు. అత్తతో చెప్పేసి ఉంటుంది. సౌందర్య తక్కువదా.. అది కార్తీక్‌తో చెప్పాలని చూస్తుంటుంది. చెప్పినా కార్తీక్ పట్టించుకోడని ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఇంతకు ఏమై ఉంటుంది. కార్తీక్‌కి తెలిసినట్లా, తెలీనట్లా అని అంటూ ఉండగా.. ప్రియమణి వచ్చి అది తెలుసుకోవాలనుకుంటే గులాబీ రేకులు పీకాలా అమ్మ అని అంటుంది. దానికి మౌనిత.. టెన్షన్‌తో ఏం చేయాలో తెలీక ఈ పని చేస్తున్నా ప్రియమణి అని అంటుంది. ఇక ప్రియమణి.. మీరు ఇలా లాక్కోలేక, పీక్కోలేక చేయడం కన్నా ఒక పని చేయండి అని చెబుతుంది. దాంతో ఏంటి అని మౌనిత అడగ్గా.. మీకు అలవాటు లేని పని అయినా తలస్నానం చేసి గుడికి వెళ్లండి. మీ కష్టాలన్నీ ఆయనకు చెప్పుకోండి. ఏదో దారి ఆయనే చూపిస్తాడు అని అంటుంది. ఇక మౌనిత.. గుడికా మనకు అలవాటు లేదు అని చెబుతుంది. ఇక ప్రియమణి.. ఇదొక్క సారి నా మాట వినండి. నాకెందుకో మీరు గుడికి వెళితే మీరు ఊహించనిదేదో జరుగుతుంది అనిపిస్తోంది అని అంటుంది. అంతేనంటావా అన్న మౌనిత.. సరే అని ఒప్పుకుంటుంది.
ఇక ఇంట్లో ఆనందరావు పాట పాడుతూ ఉండగా.. సౌందర్య వచ్చి మీకంటే నేను బాగా పాడుతాను అని చెబుతుంది. ఆ తరువాత తన గాత్రం బావుంటుందని.. చిన్నప్పుడు సంగీతం నేర్చుకొని ఉంటే ఈ పాటికి పెద్ద సింగర్‌ని అయిపోయి ఉండేదాన్నిని అంటుంది. దానికి ఆనందరావు నవ్వుతూ.. నువ్వు చిన్నప్పుడు పెద్దోడిని పడుకోబెట్టడం కోసం పాట పాడావు. అది విని నేనేదో నిన్ను కొడుతున్నానని పక్కింటి వాళ్లు వచ్చారు. గుర్తుందా అని చెబుతాడు. ఇక వారిద్దరు నవ్వుకుంటూ ఉండటం సౌర్య చూస్తూ ఉండగా.. ఏంటే అలా చూస్తున్నావు అని ఇద్దరు అడుగుతారు. దానికి సౌర్య.. నాన్న ఇలా గట్టిగా నవ్వడం నేను ఎప్పుడూ చూడలేదు. ఒక్కసారి చూశాను. మౌనితతో మాట్లాడుతూ ఉన్నప్పుడు.. మీరు, బాబాయ్, పిన్ని హ్యాపీగా ఉండటం చూశాను. మరి మీలా నాన్న ఎప్పుడూ గట్టిగా ఎందుకు నవ్వరు. మా అమ్మ ముందు ఎలాగో నవ్వడు. మీరు అమ్మా, నాన్నలు కదా కనీసం మీ ముందు అయినా నాన్న ఎందుకు నవ్వడు నానమ్మ అని అడుగుతుంది.
దానికి ఆనందరావు.. ప్రశ్న చాలా చిన్నది. కానీ జవాబు చాలా పెద్దది. సమాధానం చెప్పు అని సౌందర్య వైపు చూస్తాడు. నన్ను అడుగుతారేం అని సౌందర్య అనగా.. నువ్వే చెప్పాలి కాబట్టి. చిన్నప్పుడు బిడ్డ ఏడిస్తే ఆకలి అని అర్థం అవుతుంది. పెద్దయ్యాక నవ్వితే ఏదో కావాలనిపిస్తుంది. పెళ్లైన కొడుకు మనసారా నవ్వడం లేదంటే ఎందుకో కన్నతల్లి మనసుకే తెలియాలి. నవ్వడం, ఆలోచించడం సృష్టిలో దేవుడు మనుషులకు ఇచ్చిన వరాలు. ఒక మనిషి నవ్వడం లేదంటే ఆపుకోలేని బాధ అయినా ఉండాలి. అందుకోలేని అభిమానం అయినా ఉండాలి అని ఆనందరావు అంటాడు.
దానికి సౌందర్య మనసులో వాడి గుండెల్లో ఆపుకోలేని బాధ ఉంది. అభిమానం అందించడం లేదా.. నిజమే వాడు మనస్ఫూర్తిగా నవ్వి ఎన్నేళ్లు అయ్యింది. ఏదో పిల్లల ముందు చిరునవ్వు చిందిస్తాడు అంతే. మౌనిత ముందు మాత్రం నవ్వుతూ, ఇంట్లో నవ్వడం మర్చిపోయాడంటే తప్పు ఎవరిది.. మాటలతో వాడిని చిత్రవధ చేస్తున్నానా.. మనశ్శాంతి లేకుండా చేస్తున్నామా. తప్పు మాలో కూడా ఉందా అని అనుకుంటూ ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Karthika deepam, Karthika Deepam serial, Television News