• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • KARTHIKA DEEPAM SERIAL UPDATE SOURYA FIRE ON DEEPA ELSEWHERE KARTHIK SHOCK WITH HIMA QUESTIONS MNJ

Karthika Deepam: త్వ‌ర‌లోనే డాక్ట‌ర్ మౌనిత కార్తీక్ అయిపోతా.. సంతోషంలొ తేలిపోతున్న మౌనిత

Karthika Deepam: త్వ‌ర‌లోనే డాక్ట‌ర్ మౌనిత కార్తీక్ అయిపోతా.. సంతోషంలొ తేలిపోతున్న మౌనిత

కార్తీక దీపం సీరియల్ (Karthika Deepam)

Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతోంది. ఇవాళ్టి ఎపిసోడ్‌లో హిమ‌ను తీసుకొని బ‌య‌ట‌కు వెళ్దామ‌ని సౌర్య‌, కార్తీక్‌కి చెబుతుంది. ఇక సౌర్య మాట‌ల‌తో దీప ఏం మాట్లాడ‌కుండా మార్కెట్‌కి వెళుతుంది. ఇక సౌంద‌ర్య ఇంట్లో.. ఆదిత్య‌కు శ్రావ్య కాఫీ తీసుకొని రాగా.. అటుగా సౌంద‌ర్య వ‌స్తుంది.

  • Share this:
    Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతోంది. ఇవాళ్టి ఎపిసోడ్‌లో హిమ‌ను తీసుకొని బ‌య‌ట‌కు వెళ్దామ‌ని సౌర్య‌, కార్తీక్‌కి చెబుతుంది. ఇక సౌర్య మాట‌ల‌తో దీప ఏం మాట్లాడ‌కుండా మార్కెట్‌కి వెళుతుంది. ఇక సౌంద‌ర్య ఇంట్లో.. ఆదిత్య‌కు శ్రావ్య కాఫీ తీసుకొని రాగా.. అటుగా సౌంద‌ర్య వ‌స్తుంది. ఏరీ ఈ తండ్రి కూతుళ్లు ఇంత పొద్దున్నే ఎక్క‌డికి వెళ్లారు అని అడుగుతుంది. దానికి శ్రావ్య‌.. కారులో వెళ్ల‌డం చూశాన‌త్త‌య్యా. ఎక్క‌డికి అని అడ‌గ‌లేదు. వాళ్లు చెప్ప‌లేదు అని చెబుతుంది. ఇక కాఫీ తీసుకురానా అత్త‌య్యా అని శ్రావ్య అడ‌గ్గా.. వ‌ద్ద‌మ్మా అని చెప్పి.. ఈ సారి ఆ రౌడీ ఏం నేర్పిస్తుందో అని అంటుంది. ఇంత‌కుముందు ఏం నేర్పించింది మ‌మ్మీ అని ఆదిత్య అడ‌గ్గా.. వ‌ద్దులే ఎందుకు అడుగుతావు. వాడేనా అనిపించేట్టు వాడికి ఇష్టం లేనివి కూడా చేస్తున్నాడు అని సౌంద‌ర్య చెబుతుంది.

    ఇక శ్రావ్య‌.. సౌర్య‌కు అన్ని మీ పోలిక‌లే వ‌చ్చాయి. బావ‌గారిని బాగా క‌మాండ్ చేస్తుంది క‌దా అని అంటుంది. దానికి ఇద్ద‌రు అలా క‌లిసిపోతే సంతోష‌మే క‌దా అని సౌంద‌ర్య అన‌గా.. ఇద్ద‌రు క‌లిసిపోతే సంతోష‌మే మ‌మ్మీ. కానీ సౌర్య ఉంది క‌దా అని హిమ‌ను మ‌ర్చిపోతాడేమో. అది ఆలోచించండి అని ఆదిత్య అంటాడు. వెంట‌నే సౌంద‌ర్య అది ఎప్ప‌టికీ జ‌ర‌గ‌దు. వాడు హిమ‌ను మ‌ర్చిపోవాలంటే మ‌తి త‌ప్పితే తప్ప మ‌ర్చిపోలేడు అని సౌంద‌ర్య చెప్పింది. అంత క‌చ్చితంగా ఎలా చెప్తావు అని ఆదిత్య అడ‌గ్గా.. సౌర్య‌ను తీసుకొచ్చాడు క‌దా అని హిమ‌ను మ‌ర్చిపోతాడ‌ని ఎలా అనుకున్నావురా అని సౌంద‌ర్య అడుగుతుంది. హిమ‌ను ర‌మ్మంటే రావ‌ట్లేదు క‌దా మ‌మ్మీ. అందుకే హిమ‌ను మ‌ర్చిపోవ‌డానికి సౌర్య‌తో టైమ్ స్పెండ్ చేస్తున్నాడేమో అనుకుంటున్నాను అని ఆదిత్య అంటాడు. దానికి సౌంద‌ర్య‌.. లేదు. దీనికి, దానికి అస్స‌లు సంబంధ‌మే లేదు. వాడు పైకి చెప్ప‌డం లేదు కానీ హిమ కోసం గ‌ట్టి ప్ర‌య‌త్నాలే చేస్తున్నాడు అని చెబుతుంది.

    వెంట‌నే ఆదిత్య‌.. అన్న‌య్యా... ఏం చేస్తున్నాడు అని ప్ర‌శ్నించ‌గా.. కోర్టు ద్వారా హిమ‌ను రప్పించుకోవ‌డానికి మీ వ‌దిన‌కు కోర్టు ద్వారా నోటీసు పంపాడు అని సౌంద‌ర్య చెబుతుంది. దాంతో ఆదిత్య‌, శ్రావ్య షాక్‌కి గురి అవుతారు. ఆ త‌రువాత సౌంద‌ర్య‌.. అవును దీప కూడా నోటీసు అందుకుంంది అని చెబుతుంది. ఇక ఆదిత్య‌.. హిమ పంతం ప‌ట్టి, అంద‌రినీ తీసుకెళ్తేనే వ‌స్తాన‌ని చెప్పింద‌ని అన్న‌య్య ఇలా చేశాడా అని ప్ర‌శ్నిస్తాడు. మ‌రోవైపు శ్రావ్య‌.. కానీ హిమ‌కు ఇష్టం లేకుండా ఎలా వీలు అవ‌తుంది అత్త‌య్యా అని అంటుంది. వెంట‌నే సౌంద‌ర్య‌.. ఈ విష‌యంలో దీప అస్స‌లు బ‌య‌ప‌డటం లేదు. న్యాయం జ‌రుగుతుంది అన్న ధీమాతో ఉంది. దాని మ‌న‌సులో ఏముందో తెలీడం లేదు. చూద్దాం అని అంటుంది.

    మ‌రోవైపు హిమ‌కు పండ్లు తీసుకొచ్చిన కార్తీక్.. తీసుకో అమ్మ అంటాడు. దానికి హిమ ఎందుకు డాడీ. తాత‌య్య రోజూ ఏదో ఒక‌టి తీసుకొస్తూనే ఉంటాడు క‌దా అని అంటుంది. వెంట‌నే సౌర్య‌.. డాడీ నీ కోసం తీసుకొస్తే అలానేనా మాట్లాడేది. తాత‌య్య ఇవాళ తెస్తాడు. రేపు తెస్తాడు. త‌రువాత మ‌న ఇంటికే క‌దా వెళ్తాం. నువ్వు రాక‌పోయినా డాడీ నీ కోసం ఇవ‌న్నీ తీసుకొస్తే అలా మాట్లాడొచ్చా అని కోప్ప‌డుతుంది. ఇక హిమ‌.. సారీ డాడీ నేను అలా అన‌లేదు అని అంటుంది. ఇక ముర‌ళీకృష్ణ టిఫెన్ చేస్తున్నా తినేసి వెళ్లండి అని చెప్ప‌గా.. లేదు బ‌య‌ట తింటామ‌ని కార్తీక్ చెబుతాడు. ఆ త‌రువాత హిమ‌ను రెడీ అవ్వ‌మ‌ని చెప్ప‌గా.. అమ్మ వ‌చ్చాక అంద‌రం క‌లిసి వెళ్దాం డాడీ అని అంటుంది.

    ఇక సౌర్య‌.. ఏం మాట్లాడుతున్నావు నువ్వు. నాలుగు రోజుల‌కే డాడీనీ మ‌ర్చిపోయావా.. నీ కోసం స్వీట్స్ తీసుకొస్తే ఎందుకు అంటావు. బ‌య‌ట‌కు వెళ్దామంటే అమ్మ కావాలి అంటావు.. అమ్మ‌కు మ‌న‌కైనా ముఖ్య‌మైన ప‌నులు బోలెడు ఉంటాయి. మ‌న‌తో ఎందుకు వ‌స్తుంది. ఎప్పుడూ అమ్మ‌తోనే క‌దా ఉంటున్నాము. నాన్న‌తో వెళ్దాం. నాన్న నీ కోసం పొద్దున ఏం తిన‌కుండా వ‌స్తే బాధ‌పెడ‌తావా అని మ‌ళ్లీ కోప్ప‌డుతుంది. ఇక హిమ‌.. నేను ఇప్పుడు ఏం అన్నాను. నీకు ఎందుకు అంత కోపం వ‌స్తుంది. డాడీ అంటే నాకు ఇష్టం లేదా.. అందరం క‌లిసి వెళ్దామ‌న్నాను. అది కూడా త‌ప్పేనా అని అంటుంది. ఇక కార్తీక్.. పోనీలే అమ్మా నీ ఇష్టం మేము వెళ్తాములే. నువ్వు ఏం ఫీల్ అవ్వ‌కు అని అంటుంది.

    ఆ త‌రువాత హిమ‌.. అయ్యో డాడీ నేను రాను అన‌లేదు డాడీ అని చెబుతుంది. ఇక సౌర్య‌.. ఇప్పుడు ఏమ‌న్నావు అని అడ‌గ్గా.. అమ్మ వ‌చ్చాక వెళ్దామ‌న్నాను అని హిమ అంటుంది. వెంట‌నే సౌర్య‌.. అమ్మ ఎప్పుడు వ‌స్తా అనిందో నీకు చెప్పిందా అని ప్ర‌శ్నిస్తుంది. ఇక కార్తీక్.. రౌడీ ఎందుకే దాన్ని అలా బెద‌ర‌గొడ‌తావు. నా బంగారు త‌ల్లిని నేనే ఏం అన‌ను అంటాడు. వెంట‌నే హిమ‌.. సారీ డాడీ. నిజంగా సారీ. నువ్వు ఎక్క‌డికి తీసుకెళ్తే అక్క‌డికి వ‌స్తాను అని అంటుంది. ఇక సౌర్య‌.. ఇదేదో ముందు అనొచ్చుగా అని చెబుతుంది. వెంట‌నే హిమ‌.. సౌర్య చూడు డాడీ ఎలా అరుస్తుందో అని అన‌గా.. ఊరుకే అనిందిలేమ్మా. ఇదుగో రౌడీ ఇక ఆపుతావా అని కార్తీక్ అంటాడు. దానికి సౌర్య‌.. ఇప్పుడు నేను ఏం అన్నాను.

    మీరు హిమ కోస‌మే క‌దా వ‌చ్చింది అని కోపంగానే ఉంటుంది. ఇక హిమ‌ను రెడీ అయ్యి ర‌మ్మంటాడు. ఆ త‌రువాత ఎందుక‌లా అరిచావు. హిమ ఎంత బెదిరిపోయిందో చూశావుగా అని కార్తీక్, సౌర్య‌ను అడగ్గా.. కాసేప‌ట్లో అన్ని మ‌ర్చిపోతుంది నాలాగే అని సౌర్య న‌వ్వుతూ అంటుంది. దానికి కార్తీక్ కూడా న‌వ్వుతాడు. ఇక గోడ‌కు ఉన్న ఫొటో చూస్తూ(కార్తీక్, దీప క‌లిసి ఉన్న‌ది) కార్తీక్ మ‌న‌సులో కోపం తెచ్చుకుంటాడు. ఆ త‌రువాత సౌర్య‌ను హిమ దగ్గ‌ర‌కు పంపి.. ఏమండి ముర‌ళీకృష్ణ గారు. మ‌రి ఆవిడ(దీప త‌ల్లిది) ఫొటో ఏదండి. ఏ గోడ‌కు త‌గిలించారు అని అడుగుతాడు. లోప‌ల పెట్టాను బాబు. మా భాగ్యం సంగ‌తి మీకు తెలుసు క‌దా అని ముర‌ళీకృష్ణ అన‌గా.. మ‌రి నా సంగ‌తి తెలీక ఈ ఫొటో ఇక్క‌డ పెట్టారా అని అంటాడు. మాదొక కాపురమ‌ని, అదొక సంసార‌మ‌ని, మేము నిండు దంప‌తుల‌మ‌ని ప్ర‌ద‌ర్శ‌నుకు పెట్టారా ఈ ఫొటోను. తీసేయండి. పిల్ల‌లు రాక‌ముందే తీసేయండి. మీరు తీసేస్తే లోప‌ల ఉంటుంది. నేను తీసేస్తే అది ఎక్క‌డా క‌నిపించ‌దు అని అంటాడు. ఆ మాట‌ల‌ను హిమ‌, సౌర్య విని బాధ‌ప‌డ‌తారు. ఇక సౌర్య‌, హిమ‌ల‌ను తీసుకు వెళ్తూ.. టిఫిన్ చేశాక హిమ‌ను డ్రాప్ చేస్తాన‌ని చెప్పండి. వాళ్ల అమ్మ‌ను ఏదేదో ఊహించుకోవ‌ద్ద‌ని చెప్పండి అని అంటాడు.

    ఇక దీప, సౌర్య మాట‌ల‌ను గుర్తు చేసుకుంటూ అత్త‌మ్మ ఏంటి అలా అరిచింది. నిజంగా కోప‌మేనా. న‌టించిన‌ట్లు ఏమీ అనిపించ‌లేదే. దానికి కూడా డాక్ట‌ర్ బాబు మీద నేను కోపాన్ని చూపిస్తున్న‌ట్లే అనిపిస్తోంది. ఇంకెలా ఉండాలి. ఇంత‌కన్నా ఏం చేయాలి. నేను ఆయ‌న‌కు దూరం అయిపోయి, నా పిల్ల‌లు దూరం అయిపోయి ఏం సాధించాల‌ని నేను ఇదంతా చేస్తున్నాను. నా కోస‌మా..? నా ఒక్క దాని కోస‌మా.. పిల్ల‌ల కోసం కాదా అని మ‌న‌సులో అనుకుంటూ ఉండ‌గా.. సౌంద‌ర్య కాల్ చేసి ఎక్క‌డున్న‌వే అని అడుగుతుంది. న‌డి రోడ్డు మీద అని దీప అన‌గా.. అక్క‌డెందుకు ఉన్నావే అని సౌంద‌ర్య ప్ర‌శ్నిస్తుంది. మీ కొడుకు నిల‌బెట్టింది ఇక్క‌డే క‌దా అని దీప అన‌గా.. ఏమైందే అని సౌంద‌ర్య ప్ర‌శ్నిస్తుంది. ఇక దీప‌.. ఏం అవుతుంది నా మొహం. ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే ఉంది అని చెబుతుంది. ఇంత ఫ్ర‌స్టేష‌న్ ఎందుకు అని సౌంద‌ర్య అడ‌గ్గా.. నా ప్లేస్‌లో ఇంకొక‌తి ఉంటే తెలిసేది మీకు. నేను కాబ‌ట్టి లోప‌ల లోప‌లే గింజుకొని చ‌స్తున్నాను. మీ కొడుక్కి మీరు కోరుకున్న సంబంధ‌మే చేసి ఉంటే దాన్ని ఇలాగే అనుమానించి వ‌దిలేస్తే. అది ఇలాగే స‌ర్వే ఆఫీస‌ర్‌లాగా రోడ్డు ప‌ట్టుకొని తిరిగేదా. మీ అబ్బాయిని రోడ్డు మీదికి ఈడ్చేదా అని కోపంగా అరుస్తూ ఉంటుంది.

    దానికి సౌంద‌ర్య‌.. నువ్వు చ‌రిత్ర తిర‌గ‌రాస్తానంటే కాద‌ని నేను ఎందుకు అంటానే. నీకు అలా ప్ర‌వ‌ర్తిస్తే తృప్తిగా ఉంటుంది అంటే నేనేం కాద‌న‌ను అని అంటుంది. వెంట‌నే దీప‌.. నాకు అలాంటి ఆలోచ‌న‌లు ఏం లేవు. మాట వ‌రుస‌కు చెబుతున్నాను. మంట మీద మాట్లాడుతున్నాను. ఆయ‌న కూతురిని నేను తెచ్చిపెట్టుకున్నాన‌న్న క‌సితో నా కూతురిని ఆయ‌న తీసుకెళ్లి దానికి ఏవేవో నూరిపోసి నా మీద‌కు ఉసి గొల్పుతున్నారు అని అంటుంంది. దానికి సౌంద‌ర్య‌.. ఏయ్ స్టుపిడ్. వాడు చిన్న పిల్ల‌ల‌కు ఏం నేర్పుతాడే. త‌ప్పు నా కొడుకు అలాంటి వాడు కాదు. వాడి గురించి నువ్వు బాగా నెగిటివ్‌గా ఆలోచిస్తున్నట్లు ఉన్నావు దీప అని అంటుంది. ఇక ఆనంద‌రావు ఫోన్ తీసుకొని.. నీ ఆవేశంలో అర్థం ఉంది. నీ మాట‌ల్లో అంతులేని బాద ఉంది. కానీ నీకు మా ఇద్ద‌రి మ‌ద్ద‌తు పూర్తిగా ఉంది అది మ‌ర్చిపోకు అమ్మా. పెద్ద‌వాడిగా ఒక మాట చెబుతున్నా విను. చ‌ల్ల చిలికి వెన్న పేరుకోగానే కుండ ప‌గ‌లగొట్ట‌డం వివేక‌వంతులు చేసే ప‌ని కాదు అమ్మా. నీ వివేకం మా కుటుంబ ప‌రువు ప్ర‌తిష్ట‌ల‌ను ఇంత‌కాలం కాపాడుకుంటూ వ‌స్తుంది. ఇంకొంత కాలం నీ స‌హనానికి ప‌రీక్షలాగే ఉండొచ్చు. కానీ నీ ప్ర‌య‌త్నాల‌న్నీ ఒక కొలిక్కి వ‌చ్చే సమ‌యంలో తొంద‌ర‌పాటు త‌నం మాత్రం వ‌ద్ద‌మ్మా. ఆచితూచి అడుగేయాల్సిన స‌మ‌యం ఇది. నీ కుటుంబాన్ని నువ్వు మ‌ళ్లీ నిర్మించుకుంటున్నావు. ఈ క్ర‌మంలో నీకు మా వ‌ల్ల ఏ సాయం కావాల్సి వ‌చ్చినా స‌రే త‌ప్ప‌కుండా చేస్తాం ధైర్యంగా ఉండు అని చెబుతాడు. ఇక సౌంద‌ర్య ఫోన్ తీసుకొని .. కోపంలో ఉన్న‌ట్లు ఉన్నావు. ఎక్క‌డ ఉన్నావో చెప్పు మేము వ‌చ్చి పిక‌ప్ చేసుకుంటాము. మేము నీ ద‌గ్గ‌ర‌కే బ‌య‌లుదేరావు. నువ్వు ఉన్న అడ్ర‌స్ చెప్పు అక్క‌డికే వ‌స్తాం అని చెబుతుంది. దాంతో దీప అడ్ర‌స్ చెబుతుంది.

    మ‌రోవైపు మౌనిత ఇంట్లో హ్యాపీగా అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. అప్పుడు ఇల్లు తుడుస్తూ ఉండే ప్రియ‌మ‌ణి.. మీరు ఒక చోట కుదురుగా ఉండండి అని చెబుతుంది. దానికి మౌనిత‌.. నా మ‌న‌సే కుదురుగా ఉండ‌టం లేదు. ఏటోటో పోతుంది. ఇంక నేను ఎలా కుదురుగా ఉండ‌గ‌ల‌ను అని అంటుంది. ఏమైంది అని ప్రియ‌మ‌ణి అడ‌గ్గా.. నువ్వు ముందు తుడువు. నేను రూమ్‌లోకి వెళ‌తాను అని చెప్పి అక్క‌డి నుంచి వెళుతుంది. ఇక లోప‌లికి వెళ్లి.. ఈ గుడ్‌న్యూస్ నేను వెంట‌నే నాన్న‌తో షేర్ చేసుకోవాలి అని ఫోన్ తీస్తుంది. ఆ త‌రువాత కార్తీక్‌కి వాయిస్ మెసేజ్ పెడుతూ.. నీకొక గుడ్‌న్యూస్. హిమ నీ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేందుకు ఫైల్స్ అన్నీ రెడీ అయ్యాయి. సుజాత గారు చెప్పారు. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఓకే. వెంట‌నే రిప్లై ఇవ్వు. నీతో మాట్లాడాలి. బై కార్తీక్ అని పెడుతుంది. ఇక ఆ మాట‌ల‌ను విన్న ప్రియ‌మ‌ణి, మౌనిత‌ను చూసి న‌వ్వుతూ ఉంటుంది. ఏంటే అలా ఉన్నావు అని మౌనిత అడ‌గ్గా.. ఏం లేద‌మ్మా. మీరు ఎప్పుడు ఇలానే న‌వ్వుతూ ఉండాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెబుతుంది. ఇక మౌనిత్ ప్లీజ్.. నువ్వు న‌న్ను పొగ‌డ‌ద్దు.అలా అని తిట్టొద్దు. అస‌లు ప‌ని కావ‌డం లేదే. వెళ్లి నీ ప‌ని చూసుకో అని చెబుతుంది. ఆ త‌రువాత ప్రియ‌మ‌ణి అక్క‌డి నుంచి వెళ్లగా.. హమ్మ‌య్య నాకు ఇప్పుడు సంతోషంగా ఉంది. దీప కోర్టులో ఎలాగూ స్వ‌చ్ఛంద్ధంగా ఒప్పుకుంటుంది కాబ‌ట్టి హిమ కార్తీక్ ద‌గ్గ‌ర‌కు వ‌స్తుంది. ఇక బ్యాలెన్స్ మా పెళ్లి. నేను, కార్తీక్, హిమ ముగ్గురుం చాలా హ్యాపీగా ఉంటాము. ఇంత‌కాలం ఊహ‌ల్లో విహ‌రించాను కానీ ఆ ఊహే వాస్త‌వానికి ఇంకొన్ని అడుగుల దూరంలో ఉంద‌ని త‌లుచుకుంటే చెప్ప‌లేనంత థ్రిల్‌గా ఉంది. మౌనిత నువ్వు సూప‌రే. ఇక డాక్ట‌ర్ మౌనిత త్వ‌ర‌లో డాక్ట‌ర్ మౌనిత కార్తీక్ అవుతుంది. ఆహా ఆ పేరు వింటుంటేనే నా బాడీలో వైబ్రేష‌న్స్ మొద‌ల‌వుతున్నాయి అని సంతోషంలో తేలిపోతూ ఉంటుంది.

    ఇక హిమ‌, సౌర్య‌ల‌ను తీసుకొని ఓ రెస్టారెంట్‌కి తీసుకెళ‌తాడు. రోడ్డు ప‌క్క‌న తిందాం అనుకున్నాం క‌దా నాన్న అని సౌర్య అడ‌గ్గా.. పోవే నీ వ‌ల్ల మా అమ్మ నన్ను చాలా తిట్టింది. ఈ వ‌య‌సులో నాకు ఆ తిట్లు అవ‌స‌ర‌మా. ఎప్పుడో ఒక‌సారి అంటే బావుంటుంది. ఎప్పుడూ అంతే బావుండ‌దు అని కార్తీక్ అన‌గా.. హిమ న‌వ్వుతుంది. ఆ త‌రువాత బండి మీద టిఫిన్ బావుండ‌దా డాడీ అని హిమ అడ‌గ్గా.. ఇదే టిఫిన్ ఇంకాస్త బావుంటుంది. అక్క‌డ రేటు త‌క్కువ ఇక్క‌డ రేటు ఎక్కువ అంతే తేడా అని కార్తీక్ అంటాడు. ఆ త‌రువాత సౌర్య త‌న‌కు నేర్పిన విధానాన్ని హిమ‌కు చెప్పి అలా తిన‌మంటాడు. ఇక హిమ‌.. ఎంతైనా అమ్మ చేసేదే బావుంటుంది అని అంటుంది. ఇక కార్తీక్.. ఇది మ‌న పార్టీ కాదే రౌడీ. వంట‌ల‌క్క పార్టీ అని కార్తీక్ అంటాడు. వెంట‌నే హిమ‌.. ఏం కాదు నాకు నువ్వంటేనే చాలా ఇష్టం అని చెబుతుంది. అందుకేనా మీ అమ్మ ద‌గ్గ‌రే ఉంటాన‌న్నావు అని కార్తీక్ అడ‌గ్గా.. అందుకేనా అమ్మ‌కు కోర్టు నోటీసులు పంపావు అని హిమ అంటుంది. దాంతో కార్తీక్ షాక్‌కి గురి అవుతాడు. న‌న్ను అప్ప‌గించ‌మ‌ని కోర్టు నుంచి అమ్మ‌కు నోటీసు పంపించావు క‌దా డాడీ అని హిమ అన‌గా.. ఏంటి హిమ అని సౌర్య అడుగుతుంది. ఇక అది అని కార్తీక్ నీళ్లు న‌లుముతాడు. కార్తీక దీపం కొన‌సాగుతుంది.
    Published by:Manjula S
    First published: