• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • KARTHIKA DEEPAM SERIAL UPDATE SOUNDARYA STRIAGHT QUESTIONS TO KARTHIK MNJ

Karthika Deepam: ఎవ‌రు ఇచ్చారు నీకు ఈ అధికారం.. కార్తీక్‌కి సౌంద‌ర్య సూటి ప్ర‌శ్న‌లు

Karthika Deepam: ఎవ‌రు ఇచ్చారు నీకు ఈ అధికారం.. కార్తీక్‌కి సౌంద‌ర్య సూటి ప్ర‌శ్న‌లు

కార్తీక దీపం సీరియల్

బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం(Karthika Deepam) సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా మారింది. గురువారం నాటి ఎపిసోడ్‌లో దీపపై ప‌డ్డ నింద అబ‌ద్ధ‌మ‌ని నిరూపించురా అని ఆదిత్య‌కు చెబుతాడు కార్తీక్.

  • Share this:
    Karthika Deepam: బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా మారింది. గురువారం నాటి ఎపిసోడ్‌లో దీపపై ప‌డ్డ నింద అబ‌ద్ధ‌మ‌ని నిరూపించురా అని ఆదిత్య‌కు చెబుతాడు కార్తీక్. ఒక‌వేళ ఆ నింద‌ నిజ‌మ‌ని తేలితే నేను మౌనిత‌ను పెళ్లి చేసుకుంటానంటూ ఇంట్లో పెద్ద బాంబ్ పేలుస్తాడు. ఇక ఇవాళ్టి ఎపిసోడ్‌లో కార్తీక్ ఇంట్లో భోజ‌నం చేస్తుండగా.. కార్తీక్ మౌనంగా ఉంటాడు. దాన్ని గ‌మ‌నించిన సౌంద‌ర్య‌. మౌనంగా ఉండ‌కురా. ప్ర‌శాంతంగా తిను అని చెబుతుంది. దానికి కార్తీక్.. గొంతు దిగట్లేదు మ‌మ్మీ అని అంటాడు. ఆక‌లిగా లేదా..? అని ఆనంద‌రావు అడ‌గ్గా.. ఏదో లేదు అని కార్తీక్ స‌మాధానం ఇస్తాడు. వెంట‌నే సౌంద‌ర్య‌.. అంత మ‌న‌సులోనే ఉంటుంది. ఉన్న‌ది ఉంటుంది. లేనిది ఉంటుంది. మ‌న‌సును అడిగితే అదే జ‌వాబు చెబుతుంది. అంత‌రాత్మ మ‌న‌సును నిల‌దీస్తూనే ఉంటుంది అని అంటుంది.

    వెంట‌నే కార్తీక్.. నువ్వు ఇప్పుడు ఫిలాస‌ఫీలు బాగానే చెబుతావు మమ్మీ. అది భోజనం చేయ‌డానికి ప‌నికొస్తుంది. కానీ క‌డుపు నిండ‌ద‌నిపిస్తుంది అంటాడు. దానికి సౌంద‌ర్య నిర్ణ‌యాల‌న్నీ నీవే అయిన‌ప్పుడు నిమిత్త‌మాత్రులం మేమేం చేయ‌గ‌లం రా అని అంటుంది. ఇప్పుడు నిమిత్త‌మాత్రులు ఎవరు ఉన్నారు మ‌మ్మీ.. అంద‌రూ ద‌ర్శ‌కులే. ఇప్పుడే ప్రేక్ష‌కులు అయ్యారు అని అంటాడు కార్తీక్. దానికి ఆనంద‌రావు.. మా త‌ప్పు ఉందో ఒప్పు ఉందో కాలానికే వ‌దిలేద్దాం అని చెప్తాడు. వెంట‌నే కార్తీక్.. వ‌దిలేద్దాం. కాలానికి వ‌దిలేద్దాం. గ‌తానికి వ‌దిలేద్దాం. గాలికి వ‌దిలేద్దాం. క‌డుపు నిండా భోజ‌నం చేద్దాం. ఇది ముఖ్యం క‌దా. అత‌క‌డానికి ప‌నికి రాక‌పోయినా, బ‌త‌క‌డానికి ప‌నికొస్తుంది. నేను ప్ర‌శాంతంగా తింటాను. మీరు మ‌న‌శ్శాంతిగా భోజ‌నం చేయండి అని కార్తీక్ అంటాడు.

    ఇక కార్తీక్ ఫోన్‌కి ఓ మెసేజ్ వ‌స్తుంది. అందులో దీప ఇద్ద‌రు పిల్ల‌ల‌తో ఉన్న ఫొటోలు వ‌స్తాయి. దాన్ని కార్తీక్ చూస్తుండ‌గా.. పెంచిన ప్రేమ గొప్ప‌దైతే మీరు హిమ ద‌గ్గ‌ర‌కు వ‌స్తారు. క‌న్న‌ప్రేమ గొప్ప‌దైతే హిమ నా ద‌గ్గ‌రే ఉంటుంది అని దీప అన్న మాట‌లు అత‌డికి గుర్తు వ‌స్తాయి. వెంట‌నే ఆనంద‌రావు ఏంట్రా అది అని అడుగుతాడు. ఏది గొప్ప‌ది అని చెప్ప‌డానికి ఒక గొప్ప నిద‌ర్శ‌నం అని కార్తీక్ అంటాడు. అంటే అని ఆనంద‌రావు అడ‌గ్గా.. చేయిని క‌డిగేసుకొని చేయిని క‌డిగేసుకున్నాను అని కార్తీక్ చెబుతాడు. దీంతో ఆనంద‌రావు, సౌంద‌ర్య బాధ‌ప‌డుతారు.

    మ‌రోవైపు మౌనిత అన్నం ముందు పెట్టుకొని కార్తీక్ మాట‌ల‌ను గుర్తుచేసుకుంటూ ఉంటుంది. ఆ త‌రువాత మ‌న‌సులో ఆ విహారి గాడు ఇప్పట్లో రాడ‌ని తెలిసింది. ఆ అబ‌ద్దాన్ని నిజం చేసి నా కార్తీక్‌ని ఎలా ద‌క్కించుకోవాలో అర్థం కావ‌డం లేదు. టైమ్ గ‌డిచిపోతోంది. ఏం చేయాలో, ఎలా చేయాలో, ఏం చేసి నా క‌థ‌ను సుఖాంతం చేసుకోవాలో అర్థం కావ‌డం లేదు అని అనుకుంటూ ఉంటుంది. వెంట‌నే అక్క‌డ‌కు ప్రియ‌మ‌ణి రాగా.. అక్క‌డి లేచి సోఫాలోకి వెళ్లి.. అయినా స‌డ‌న్‌గా కార్తీక్‌కి ఈ ఆలోచ‌న ఎందుకు వ‌చ్చింది అని ఆలోచిస్తూ ఉంటుంది. ప్రియ‌మ‌ణి అమ్మా.. అమ్మా.. అని పిల‌వ‌గా.. ఈ లోకంలోకి వ‌చ్చి ఏంటి ప్రియ‌మ‌ణి అంటుంది. ఏమైంది మీకు ఇప్పుడు కార్తీక్ అయ్య దీప‌మ్మని ఇంటికి తీసుకువ‌చ్చాడా..? ఏంటి అని ప్రియ‌మ‌ణి అడుగుతుంది.. దానికి మౌనిత అదేంలేద‌ని స‌మాధాన‌మిస్తుంది.

    వెంట‌నే ప్రియ‌మ‌ణి ఉంది. అది లేక‌పోతే ఇంకొక‌టి ఉంటుంది. తిన‌డం మానేసి, చెయ్యి క‌డుక్కోవ‌డం కూడా మ‌రిచిపోయి, ఎంగిలి చేత్తో ఇక్క‌డ ఎందుకు కూర్చున్నారు అని అంటుంది. వెంట‌నే బౌల్ తీసుకుర‌మ్మ‌ని మౌనిత చెబుతుంది. ఏది ఎక్కువ‌గా ఆలోచించ‌కండి అమ్మా. వ‌దిలేయండి. ఏది జ‌రిగితే అది జరుగుతుంది. కానీ ఒక్క‌టి మాత్రం జ‌ర‌గ‌ద‌మ్మా.. దీప‌ను మాత్రం కార్తీక్ అయ్య ఇంటికి తీసుకురాడు. ఇది ఫిక్స్ అయిపోండి అంటుంది. అంతేనంటావా..? అని మౌనిత అడ‌గ్గా.. నా నాలిక మీద మ‌చ్చ‌లు ఉన్నాయ‌మ్మా.. ఏదంటే అది జ‌రిగిపోతుంది అని ప్రియ‌మ‌ణి చెబుతుంది. దానికి మౌనిత సంతోష‌ప‌డుతుంది. వెంట‌నే మౌనిత ఫోన్‌కి సౌంద‌ర్య కాల్ చేసి.. రేపు మార్నింగ్ ఇంటికి రా నీతో ఒక‌సారి మాట్లాడాలి అని చెబుతుంది. దానికి మౌనిత ఇప్పుడే మాట్లాడండి రేపటి దాకా ఎందుకు అని అంటుంది. ప్ర‌తి దానికి ఒక స‌మ‌యం, సంద‌ర్భం ఉంటుంది. రేపు ఉద‌యం 10 గంట‌ల‌కు ఇక్క‌డ‌కు వ‌చ్చెయ్ అని చెప్పి కాల్ క‌ట్ చేస్తుంది. నేను రాను ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేదాన్ని. కానీ ఆ ముద‌నుష్ట‌పు స‌చ్చినోడు అంజి గాడిని ఇక్క‌డ‌కు తీసుకువ‌స్తార‌ని భ‌యం. రేపు ఏం జ‌రుగుతుందో ఏమో..? వ‌ద్దు ఏది ఎక్కువ ఆలోచించ‌కూడ‌దని ఇప్పుడే ప్రియ‌మ‌ణి చెప్పింది. చూద్దాం రేపు ఏం జరుగుతుందో అని అంటుంది.

    అటు దీప ఇంటి ముందు తిరుగుతూ పూజారి, ఆదిత్య, సౌర్య‌ చెప్పిన మాట‌ల‌ను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఆ మౌనిత, డాక్ట‌ర్ బాబుకు నూరిపోసిన‌ట్లు పిల్ల‌ల‌కు నూరిపోస్తే.. నా పిల్ల‌లు న‌న్ను చెడుగా అనుకుంటే.. అది డాక్ట‌ర్ బాబు నా మీద వేసిన నింద కంటే ఎక్కువ క‌దా. దేవుడు న‌న్ను క‌రుణించి, ఏదో రూపంలో నా మీద వేసిన నింద‌ను చెరిపేస్తే బావుండు. అస‌లు డాక్ట‌ర్ బాబు హిమ‌ను చూడ‌టానికి రాడా..? అని అనుకుంటూ ఉండ‌గానే కార్తీక్ కారులో నుంచి వ‌స్తాడు. ఛ‌.. చాటు నుంచో, కిటికిలో నుంచి హిమ‌ను చూసి వెళ్దాము అనుకుంటే గుమ్మంలోనే దాప‌రించింది రాక్ష‌సి అని కార్తీక్ అనుకుంటాడు. మ‌న‌సులో అనుకున్నానో లేదో అప్పుడే వ‌చ్చాడు. హిమ‌ను చూడ‌టానికి అయ్యుంటుంది అని దీప అనుకుంటుంది. మ‌రోవైపు కార్తీక్. హిమ‌ను చూడ‌టానికే వ‌చ్చాన‌నుకుంటుంది. చూశారా.. క‌న్న ప్రేమ‌నే గొప్ప‌ది. అందుకే చూడటానికి వ‌చ్చారు అని చాలెంజింగ్‌గా మాట్లాడుతుందో ఏమో అని డాక్ట‌ర్ బాబు.. ఇక్క‌డ‌కు వ‌చ్చి లోప‌లికి రావ‌డానికి త‌ట‌ప‌టాయిస్తున్నారు. నేనే వెళ్లి తీసుకొస్తాను అని దీప అనుకుంటూ ముందుకు వెళుతుంది. వ‌చ్చేస్తుంది. ఇప్పుడు ఇది పొగ‌రుగా, త‌ల‌బిసురుగా క‌నుబొమ్మ‌లు పైకెత్తి మాట్లాడే మాట‌లు నేను విన‌లేను అని అనుకుంటూ ఉంటాడు.

    లోప‌లికి రండి డాక్ట‌ర్ బాబు.. ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాను. మీ గురించి ఆలోచిస్తూ.. ఇప్పుడే హిమ నిద్ర‌పోయింది. నిద్ర‌లో కూడా డాడీ డాడీ అని క‌ల‌వ‌రిస్తుంది అని చెబుతూ ఉంటుంది. నువ్వు త‌లుచుకుంటే ఏంటి..? త‌లుచుకోక‌పోతే ఏంటి..? హిమ న‌న్ను త‌లుచుకుంటుంద‌ని చెప్పావు అది చాలు అని కార్తీక్ మ‌న‌సులో అనుకుంటాడు. రండి డాక్ట‌ర్ బాబు హిమ‌ను నిద్ర లేపుతాను అని దీప చెప్తుండ‌గా.. అది కాదు నా మాట నెగ్గింద‌ని నువ్వు సంబ‌ర‌ప‌డ‌తావు అని కారు ఎక్కి రిట‌ర్న్ వెళతాడు కార్తీక్. అస‌లు ఎందుకు వ‌చ్చాడు.. ఎందుకు వెళ్లాడు.. నా మీద దుమ్ము వేయ‌డానికా..? న‌న్ను దుమ్మెత్తిపోయ‌డానికా..?కాదులే మాట మాట్లాడ‌కుండా వెళ్లాడుగా. హిమ కోసం వ‌చ్చి ఉంటాడు. నా ముందు ఓడిపోవ‌డం ఇష్టం లేక వెళ్లిపోయి ఉంటాడు. ఎంత పంత‌మో..? ఈ పంతాలే జీవితాల‌ను నాశ‌నం చేస్తాయి. మంచి రోజులు ఎప్పుడు వ‌స్తాయో అని దీప అనుకుంటుంది.

    అటు భాగ్యం.. అస‌లు ఈ నిందకు కార‌ణమైన వాడిని తీసుకొచ్చి తంతే అప్పుడు నిజం భ‌య‌ట‌ప‌డుతుంది. అయినా తండ్రిగా నువ్వేం చేశావయ్య దీప కాపురం చ‌క్క‌ప‌డ‌టానికి. సౌంద‌ర్య‌కు కొడుకు మీద కంటే కోడ‌లు మీదే న‌మ్మ‌కం ఎక్కువ. అందుకే ఇది ఇలా సాగుతూనే ఉంది అని అని అంటుంది. దానికి ముర‌ళీకృష్ణ ఆలోచ‌న‌లో ప‌డుతాడు. ఇక నిద్ర‌లో కార్తీక్‌.. హిమ వ‌చ్చిన‌ట్లు క‌ల కంటాడు. అది చూసిన సౌంద‌ర్య బాధ‌ప‌డుతూ కార్తీక్‌ని లేపుతుంది. పోని హిమ‌ను నేను తీసుకురానా..? అని సౌంద‌ర్య అంటే వ‌ద్దు అని అంటాడు కార్తీక్. మ‌రి నువ్వైనా వెళ్లు అని సౌంద‌ర్య అంటే కుద‌ర‌దు అంటాడు. మ‌రి నీకు ప్రేమ లేదా అంటే అంత ధైర్యం లేదు అంటాడు. దాన్నే మూర్ఖ‌త్వం అంటార‌ని సౌంద‌ర్య అంటుంది. ఎవ‌రంటారు.. నిజం తెలిసిన వాళ్లా..? అబ‌ద్ధం న‌మ్మించిన వాళ్లా.? మోసం చేసిన‌వాళ్లా..? నన్ను ఇలా ద‌గా చేసిన‌వాళ్లా..? ఎవ‌రంటారు..? ఇది మూర్ఖ‌త్వం అని అంటాడు. నిజం దాచారు.. మోసం చేశారు.. అబ‌ద్దాన్ని కొన్నేళ్ల‌పాటు మెయింటెన్ చేశారు..హిమ మీద నేను పెంచుకున్న ప్రేమ వ‌ల్ల ఆ వంట‌ల‌క్క‌ను కూడా క్ష‌మిస్తాన‌నుకున్నారు. ఇప్పుడేమైంది. అంద‌రూ బావున్నారు. హిమ‌కు శిక్ష ప‌డింది. నాకు ప‌రీక్ష మొద‌లైంది. నేనేం చేసేది. ర‌మ్మ‌న‌లేక, పొమ్మ‌న‌లేక‌, ఉండ‌మ‌న‌లేక‌, రావొద్దు అన‌లేక‌.. హిమ‌ను చూడాల‌నున్నా చూడ‌లేక ఆ పేద‌రికంలో మ‌గ్గుతుంటే భ‌రించ‌లేక‌, అక్క‌డి వాతావ‌ర‌ణంలో వ‌దిలేయ‌లేక‌, అప్పుడు ర‌మ్మ‌న‌లేక, తీసుకురాలేక.. నాకీ న‌రకం ఎందుకు అని అడుగుతాడు.

    వెంట‌నే సౌంద‌ర్య నువ్వు పెద్ద మ‌న‌సు చేసుకుంటే ఈ న‌ర‌క‌మే స్వ‌ర్గంలా కనిపిస్తుంది. దానికి నాకు అంత విశాల‌మైన మ‌న‌సు లేదు అని కార్తీక్ అంటాడు. పెంచిన ప్రేమ‌ను కూడా మ‌ర్చిపోతావా..? అని సౌంద‌ర్య అడ‌గ్గా..మ‌రిచిపోలేకే క‌దా..? ఇలా క‌ల‌లో చూసుకునేది అని కార్తీక్ చెబుతాడు. నీ అపోహ‌ల‌కు, నీ అనుమానాల‌కు, నీ అహంకారానికి ఇప్ప‌టికీ దీప శిక్ష అనుభ‌విస్తుంది. దాని కూతురు శిక్ష అనుభ‌విస్తుంది. ఇప్పుడు నీ కూతురు అదే శిక్ష‌ను అనుభ‌విస్తుంది. ఎక్క‌డిది నీకు ఈ అధికారం.. స్త్రీత్వాన్ని అనుమానించావు. మాతృత్వాన్ని అవ‌మానించావు..? దాని ఆత్మ‌గౌర‌వాన్ని చంపావు. అవ‌త‌ల‌కి వెళ్ల‌గొట్టావు. ఎవ‌రు ఇచ్చార‌య్య నీకు ఈ అధికారం..? ఇప్పుడు కూడా నీలో అంత‌ర్మ‌ధ‌నం మొద‌లు కాలేదు.. ఇప్ప‌టికీ నీలో ఆత్మ‌ప‌రిశోధ‌న ప్రారంభం కాలేదు. ఇంకా అలాగే ఉన్నావు. నీలాగే ఉన్నావు. మార్పు లేదు. ఎప్ప‌టికీ రాదు. అందుకే రా ఎప్ప‌టికీ హిమ నీ క‌ల‌లోకి త‌ప్ప మ‌నింట్లోకి రాదు, రాలేదు అని సౌంద‌ర్య అంటుంది. దానికి మ‌మ్మీ అని కార్తీక్ కోప్ప‌డ‌తాడు.

    విన‌లేక‌పోతున్నావా..? భ‌రించ‌లేక‌పోతున్నావా..? అయితే ప‌ద‌. వెళ్లు. పురుషాహంకారాన్ని త‌రిమికొట్టు. తండ్రిగా మారిపోయి నీ బిడ్డ‌ను నువ్వు తీసుకురా. నీలో ఈ అస్థిమిత‌మైన ఆలోచ‌న‌లు అన్నీ పోతాయి. క్ష‌మించు. దీప‌ను క్ష‌మించు. ఆ మ‌హా ఇల్లాలిని క్ష‌మించు అని సౌంద‌ర్య చెబుతుంది. వెంట‌నే కార్తీక్.. క్ష‌మిస్తాను, దీప‌ను క్ష‌మిస్తాను, త‌ప్ప‌కుండా క్ష‌మిస్తాను. కానీ అది త‌ప్పు చేసింద‌ని నా ముందు ఒప్పుకోమ‌ను అని అంటాడు. ఇక రేప‌టి ఎపిసోడ్‌లో అంజి, మౌనిత ఒక‌రికొరు ఎదురుప‌డ‌నుండ‌గా.. కార్తీక‌దీపం మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మార‌నుంది.
    Published by:Manjula S
    First published:

    అగ్ర కథనాలు