KARTHIKA DEEPAM SERIAL UPDATE SOUNDARYA REVEALS TRUTH TO KARTHIK AND ANAND RAO MNJ
Karthika deepam: మీ నాన్నను మర్చిపోండన్న దీప.. కండిషన్ పెట్టిన సౌర్య.. రాత్రంతా మోనిత ఇంట్లో కార్తీక్
కార్తీక దీపం
Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియల్ రసవత్తరంగా కొనసాగుతోంది. నిన్నటి ఎపిసోడ్లో పిల్లలను తీసుకొని దీప ఊరు విడిచి వెళుతుంటుంది. వారణాసి కూడా వారి వెంట వెళతాడు. ఇక ఇవాళ్టి ఎపిసోడ్లో మోనిత, కార్తీక్ని హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది.
Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియల్ రసవత్తరంగా కొనసాగుతోంది. నిన్నటి ఎపిసోడ్లో పిల్లలను తీసుకొని దీప ఊరు విడిచి వెళుతుంటుంది. వారణాసి కూడా వారి వెంట వెళతాడు. ఇక ఇవాళ్టి ఎపిసోడ్లో మోనిత, కార్తీక్ని హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇదే గనుక నువ్వు నమ్మేసి ఉంటే నా ప్రేమ అంతా అబద్దం అయ్యి ఉండేది. నీ దృష్టిలో నేను హంతకురాలిని అవుతానన్న భయం కన్నా నా ప్రేమను అనుమానించే పరిస్థితి వచ్చి ఉండేది. ఇప్పుడు అర్థం అయ్యిందా. నా వెనుక ఎంత భయంకరమైన కుట్ర జరుగుతుందో అని మోనిత దొంగ ఏడుపులు ఏడుస్తుంది. ఆ తరువాతర ఇది చాలు కార్తీక్. నీకు నా మీద ఎంత నమ్మకం ఉందో ఇవాళ పూర్తిగా తెలిసింది. ఈ ప్రపంచం మొత్తం నమ్మకపోయినా పర్వాలేదు. నువ్వు నమ్మితే చాలు. రా పైకి వెళ్లి కూర్చొని మాట్లాడుకుందాం అని పైకి తీసుకెళుతుంది.
మరోవైపు దీప వేరే ఊరికి వెళుతుంది. వారిని అక్కడ వారణాసి బాబాయ్ కొడుకు రిసీవ్ చేసుకుంటాడు. ఏరా ఎలా ఉన్నావు అని వారణాసి అతడిని అడగ్గా.. నేను బావున్నా అని అతడు సమాధానం చెబుతాడు. ఆ తరువాత అతడు తన బాబాయ్ కొడుకు అని దీపకు పరిచయం చేస్తాడు. అతడు మాట్లాడుతూ.. దీపక్క గురించి ఎప్పుడు చెబుతుంటాడు మా వారణాసి అని అంటాడు. ఇక సౌర్య.. ఇదేనా మేము ఉండబోయే ఇల్లు అని అడగ్గా.. అవునమ్మా అని వారణాసి సమాధానం చెబుతాడు. మరి నువ్వు అని సౌర్య అడగ్గా.. నేను మా బాబాయ్ వాళ్ల ఇంట్లో ఉంటానమ్మా. ఈ ఇల్లు కూడా వాళ్లదే. అద్దె ఆలస్యం అయినా కూడా అడగరు అని చెబుతాడు. ఇక వారణాసి తమ్ముడు దీపతో.. అక్కా. నీకు ఇక్కడ ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారక్కా అని చెబుతాడు. ఇక పిల్లలను తీసుకొని దీప లోపలికి వెళుతూ గుమ్మం దగ్గర ఆగుతారు. దీప పిల్లలతో.. కొత్త ఊరు, కొత్త ఇల్లు, కొత్త మనుషులు. ఇక్కడ మన కోసం ఏ భవంతులు లేవు. మనం తిరగడానికి ఏ కార్లు రావు. ఇక్కడ మనం ఎవరో వస్తారని ఎదురుచూడాల్సిన పరిస్థితి రాదు. ఎవరో వచ్చి తీసుకెళతారన్న వెర్రి నమ్మకం ఉండదు. మీకు నేను, నాకు మీరు. కొత్త జీవితం మొదలుపెట్టడానికి ఒక పాత ఇల్లు. బతకడానికి ఒక చిన్న దారి. ఆశలు లేవు, అడియాశలు లేవు. నమ్మకాలు లేవు దగా పడటాలు లేవు. ఆత్మగౌరవాన్ని చంపుకోవడం అసలే లేదు. మీ అమ్మ మీ కోసం బతకడానికి మళ్లీ మరో ప్రస్తానం మొదలుపెట్టింది అని చెబుతుంది.
ఆ తరువాత పిల్లలు చూస్తుండగా.. ఏంటి అలా చూస్తున్నారు అని అడుగుతుంది. దానికి సౌర్య.. నువ్వు కొత్తగా కనబడుతున్నావమ్మా అని చెబుతుంది. దాంతో కొత్త దీపను అయ్యానమ్మా. పాత వంటలక్క ఆ ఊర్లోనే ఆవిరి అయిపోయింది అని అంటుంది. ఇక వారణాసి సామాను అంతా సర్దేశాం. నువ్వు చెప్పినవన్నీ ఏర్పాటు చేసి మళ్లీ వస్తాము అని తమ్ముడిని తీసుకొని అక్కడి నుంచి వెళతాడు. ఇక పిల్లలను లోపలికి తీసుకెళుతుంది దీప.
ఇక మోనిత ఇంట్లో నిద్రపోతూ ఉండగా.. ఆమె పక్కన కూర్చొని ప్రియమణి కాఫీ తాగుతూ ఉంటుంది. ఇక పైనుంచి కిందికి వచ్చిన కార్తీక్.. మోనిత సోఫాలో పడుకొని ఉండటం చూస్తాడు. మనసులో రాత్రి చాలా సేపు నా బాధ చెప్పుకున్నాను. నిద్ర సరిపోనట్లు ఉంది అని అనుకుంటాడు. ప్రియమణిని కాఫీ తీసుకురమ్మని చెబుతాడు. ప్రియమణి, మోనితను లేపుతుంది. గుడ్మార్నింగ్ అని మోనిత చెప్పగా.. సారీ రాత్రి బాగా బోర్ కొట్టించినట్లు ఉన్నాను అని కార్తీక్ అంటాడు. దాంతో మోనిత అదేం ప్రాబ్లమ్ కాదు. నువ్వు మాట్లాడుతుంటే వినడానికి నాకు బోర్ ఎందుకు కొడుతుంది. కానీ వద్దన్నా వినకుండా చాలా ఎక్కువ తాగేశావు అని చెబుతుంది. దానికి కార్తీక్.. నేను ఉన్న పరిస్థితుల్లో నిద్ర సరిగా పట్టదు అనిపించి ఎక్కువ తాగేశాను అని అంటాడు. అదే సమయానికి ప్రియమణి లోపలి నుంచి ఇద్దరికీ కాఫీ తీసుకొస్తుంది. ప్రియమణి ఏదో చెబుతుండగా.. మోనిత సైగలు చేస్తుంది. ఏంటి అని కార్తీక్ అడగ్గా.. ఏం లేదు. రాత్రి గదిలోనే పడుకున్నాను. ఇందాకే ఇక్కడకు వచ్చి పడుకున్నాను అని మోనిత చెబుతుంది. ఇక ప్రియమణివైపు కోపంగా చూస్తుండగా.. ఆమె లోపలికి వెళుతుంది.
ఇక ఊర్లో హిమ, సౌర్య ఇద్దరు సామాన్లు సర్దుతుంటారు. దీప ఏదో ఆలోచిస్తూ ఉండగా.. అమ్మా అని సౌర్య పిలుస్తుంది. ఏంటి అత్తమ్మా అని దీప అనగా.. ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉందా అని అడుగుతుంది. ఎందుకు అత్తమ్మా అని దీప అడగ్గా.. నాన్న రావాలనుకుంటే మనలాగా రైళ్లో రాలేడు కదమ్మా. ఎప్పుడైనా నేను, హిమ గుర్తు వచ్చి రావాలి అనుకుంటే ఫ్లైట్లోనే కదా వస్తాడు అని సౌర్య చెప్పగా.. నాన్న రాడు సౌర్య అని హిమ అంటుంది. ఎందుకు రాడు అని సౌర్య అడగ్గా.. వచ్చేటప్పుడు ఏమన్నాడు ఉండిపోండి అన్నాడా.. అనలేదు కదా. పోనీ అప్పుడప్పుడు నేను వచ్చి చూస్తాను అన్నాడా అనలేదు కదా. ఎప్పుడైనా ఎక్కడైనా కనబడితే నవ్వుతూ మాట్లాడమన్నాడు. నవ్వుతూ ఎలా మాట్లాడుతాం. ఎప్పుడైనా ఎక్కడైనా కనబడితే మనకు ఏడుపే కదా వచ్చేది అని హిమ అంటుంది.
దానికి దీప మీరు ఏడవాల్సిన పరిస్థితి రాదు. మీకు మీ నాన్న కనపడడు. అందుకే నేను ఇంటి దగ్గరే ఆయన ముందే స్పష్టంగా అడిగాను. అమ్మో, నాన్నో ఎవరో తేల్చుకోండి అన్నాను. మీరు నాతో వచ్చారు. మన ఇంటి దగ్గర కూడా ఇప్పుడు కావాలన్నా వెళ్లిపోండి అన్నాను. కానీ మీరు నాతోనే ఉన్నారు. అదే నిర్ణయం మీద ఉండండి. మీ జీవితంలో నాన్న అధ్యాయం ముగిసిపోయింది. అమ్మ మాత్రమే ఉంది. అందుకు అలవాటు పడండి. భార్య, బిడ్డలు అక్కర్లేదన్న మనిషి ప్రసక్తి మర్చిపోండి. మనం ఎవ్వరికీ అక్కర్లేదు. అప్పుడు మనకు ఎవ్వరూ అక్కర్లేదు. ఏం మనం బతకలేమా. మీ ఇద్దరినీ నేను ఆ మాత్రం పోషించుకోలేనా.. మాటిమాటికి నాన్న నాన్న అని అనకండి. నాన్న రాడు. ఒకవేళ మీకోసం వచ్చినా మనకు వద్దు. మనం వద్దు అని మనిషి మనకు వద్దు. బాగా గుర్తుపెట్టుకోండి అని చెబుతుంది.
వెంటనే సౌర్య.. అప్పుడు నువ్వు కూడా ఒక మాట వింటావా అమ్మా అని అడగ్గా.. ఏంటి అని దీప అడుగుతుంది. నువ్వు కూడా నన్ను అత్తమ్మా అని పిలవడం మానేయ్ అమ్మా. నాన్నే లేనప్పుడు నానమ్మను మాత్రం గుర్తు చేసుకోవడం ఎందుకు. నన్ను పేరు పెట్టి పిలువు అని సౌర్య చెప్పి అక్కడి నుంచి వెళుతుంది.
ఇక సౌందర్య ఇంట్లో కార్తీక్ అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆదిత్య రాగా.. ఏమైనా తెలిసిందా. ఏమైందిరా అని సౌందర్య అడుగుతుంది. చాలా జాగ్రత్తపడింది మమ్మీ. వారణాసి ఇంటికి వెళ్లాను. ఇంకో డ్రైవర్ వెంకటేష్ ఇంటికి వెళ్లాను. సరోజక్కను కూడా ఎంక్వైరీ చేశాను. ఎవ్వరికీ తెలీకుండా జాగ్రత్త పడింది అని ఆదిత్య అంటాడు. వెంటనే పైనుంచి వచ్చిన ఆనందరావు ఏం జాగ్రత్త పడింది అని అడుగుతాడు. ఏదో జాగ్రత్తపడ్డారు అంటున్నారు ఎవరు అని ఆనందరావు మళ్లీ అడగ్గా.. సౌందర్య తడబడుతూ శ్రావ్య, దీపు గాడికి జ్వరం వస్తే ముందే మందులేసి అని చెబుతుండగా.. అవునా జ్వరమా. ఎక్కడుంది శ్రావ్య, వాడితోనే ఉందా, ఎలా ఉంది ఇప్పుడు అని ఆనందరావు టెన్షన్ పడుతుంటాడు. దాంతో సౌందర్య.. ఏమండి. ఏమైంది ఇప్పుడు చిన్న విషయానికే గాబరా పడిపోతారేంటి అని సోఫాలో కూర్చోబెడతారు. ఆ తరువా ఏమైందండి. ఎందుకు అంత రియాక్ట్ అవుతున్నారు అని సౌందర్య అడగ్గా.. తెలీదు సౌందర్య. ఈ గుండె అలిసిపోయిందేమో. జరిగేవన్నీ చూసి చూసి ఈ గుండె తట్టుకునే శక్తిని పోగొట్టుకుందేమో. అందుకేనేమో ఈ ఆందోళన అని అంటాడు. దాంతో సౌందర్య మనసులో.. దీప వెళ్లిపోయిన విషయం దాచడమే మంచిదైంది అనుకుంటుంది.
ఇక కార్తీక్ ఎక్కడా అని ఆనందరావు అడగ్గా.. రాత్రి వెళ్లాడు. ఇంకా రాలేదు అని ఆదిత్య అంటాడు. వెంటనే సౌందర్య ఆందోళన పడుతుండటం గమనించి. ఏదో సీరియస్ కేసు అని వెళ్లినట్లు ఉన్నాడు అని ఆదిత్య చెప్పగా.. హాస్పిటల్కా అని ఆనందరావు. అయితే సరే మనసు చెడి వాడు ఎటో వెళ్లాడు అని భయపడ్డాను అని చెబుతాడు. ఇక సౌందర్యను కూర్చోమని.. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. దానికి నీ సపోర్ట్ కూడా కావాలి. పెద్దోడితో నీకే చనువు ఎక్కువ. నువ్వైతేనే గట్టిగా చెబుతావు అని ఆనందరావు అంటాడు. దేని గురించి అండి అని సౌందర్య అడగ్గా.. కోడలిని, మనవరాళ్లను ఇంటికి తీసుకువచ్చేద్దాం సౌందర్య అని ఆనందరావు అంటాడు. దాంతో సౌందర్య, ఆదిత్యలు షాక్ అవుతారు.
ఇక ఆనందరావు మాట్లాడుతూ.. నీకు గుర్తుందా సౌందర్య. నాన్న కావాలా, అమ్మ కావాలా అని అడిగితే. అమ్మను అయితే పట్టుకున్నారు కానీ వాళ్ల నాన్న వైపు ఎంత ధీనంగా చూశారో గమనించావా.. నేను గమనించాను. వీడిని పెంచినందుకు హిమను మాత్రమే బాగా చూసుకోలేదు. రౌడీని కూడా. రక్తసంబంధం కదా. ఆ ప్రేమ ఎక్కడికి పోతుంది. పాపం పసిబిడ్డలను తల్లి కోసం తండ్రికి దూరంగా వెళ్లిపోయి ఎంత దిగులుపడుతున్నారో. ఏంటి పెద్దరికం. ఎందుకు ఇంక మనం ఉండి. వెళ్లి తీసుకువచ్చేస్తాను. నువ్వు, వాడు ఏ గొడవలు పడతారో పడండి. నాకు ఓపిక లేదు. నేను నా మనవరాళ్లతో ఆడుకుంటాను. అప్పుడైనా ఈ గుండె భారం తగ్గిపోయి తేలికపడుతుందేమో అని అంటుంటాడు.
వెంటనే ఆదిత్య.. నువ్వు ఇవన్నీ ఆలోచించకు డాడీ. అన్నయ్య నీకు ఏం చెప్పాడు అని అనగా.. వాడు డాక్టర్లా చెప్పలేదురా. డాక్టర్ బాబులా చెప్పాడు. వాడి బాబును నేను ఆ మాత్రం తెలుసుకోలేనా అని అంటుండగా.. కార్తీక్ ఎంట్రీ ఇస్తాడు. ఏంటి ఏమైంది అని కార్తీక్ అడగ్గా.. ఏం కాలేదు. ఇటు రారా అని పిలిచి రాత్రంతా హాస్పిటల్లోనే ఉన్నావా అని ప్రశ్నిస్తాడు. ఏదో కేసు ఉందని వెళ్లావంట కదా. అవునా అని ఆనందరావు అడగ్గా.. అవును డాడీ. లేటు అయ్యిందని అక్కడే పడుకున్నాను అని కార్తీక్ చెబుతాడు. ఆ తరువాత పోనీలే నీకోసమే చూస్తున్నాను అని ఆనందరావు అనగా.. ఏంటి డాడీ అని కార్తీక్ అడుగుతాడు. వెంటనే ఆనందరావు అదేదో మీ అమ్మ చెబుతుంది అని అంటాడు. ఇక సౌందర్య.. ఏం లేదులేరా నువ్వు వెళ్లు అనగా.. ఏం లేదు అంటావేంటి. ఉంది. నువ్వు చెప్పలేకపోతే నేను చెప్పలేననుకుంటున్నావా అని ఆనందరావు అంటాడు. ఏంటి డాడీ అని కార్తీక్ అడగ్గా.. రేయ్ కారు తీయ్రా. కోడలిని, పిల్లలను తీసుకొని వద్దాం అని కార్తీక్ దగ్గరకు వెళతాడు. నువ్వు కావాలంటే దీపతో మాట్లాడకు. కానీ ఈ ఇంటి కోడలు ఈ ఇంట్లోనే ఉండటం న్యాయంరా. పాపం తిండికి కూడా కష్టాలు పడుతున్నారురా. వెళ్లి తీసుకొద్దాం అని ఆనందరావు అంటాడు. దానికి కార్తీక్.. కావాలంటే హిమను, రౌడీని తీసుకొద్దాం డాడీ అనగా.. తల్లిని, బిడ్డలను విడగొట్టి మనమేం సంతోషంగా ఉంటాంరా. ఆ పాపం మనకు తగలదా. రారా వెళ్దాం అని అంటాడు. ఇక కార్తీక్.. డాడీ జరగని వాటి గురించి ఎందుకు ఇంత తాపత్రయం. నువ్వు రెస్ట్ తీసుకోవాలి ఇవన్నీ ఆలోచించకూడదు. రా ట్యాబ్లెట్ వేసుకొని పడుకోవాలి అని అనగా.. లేదురా. నాకేం కాదు. ఈ కుటుంబం ఇలా ముక్కలు అయిపోతుంటే, ఈ ఇంటి వారసురాళ్లు ఎక్కడో పేదరికంలో మగ్గిపోతుంటే నేను బతకలేనురా. రా వెళ్లొద్దాం అని ఆనందరావు కార్తీక్ని తీసుకెళుతుంటాడు. వెంటనే సౌందర్య.. ఈ ఒక్కసారి వాడి మాట వినండి. మీరు రెస్ట్ తీసుకోండి అని చెబుతుంది. దానికి కార్తీక్.. అదేంటి. నువ్వు నాన్నకు వత్తాసు పలుకుతావని, ఆయన ఆరోగ్యాన్ని అడ్డం పెట్టుకొని వాళ్లను తీసుకొచ్చి ఇంట్లో పెడతావని అనుకుంటే నువ్వే ఆపుతున్నావు ఏంటి మమ్మీ అని అడుగుతాడు.
దానికి సౌందర్య మనసులో తీసుకురావడానికి వాళ్లు ఎక్కడున్నారురా అని అనుకుంటుంది. ఇక ఆనందరావు, కార్తీక్ని బలవంతపెడుతుండగా.. ఏంటండి, మీరు కదలొద్దు అంటే సౌందర్య అనగా.. వద్దు డాడీ కావాలంటే నేను, అన్నయ్య వెళతాము అని ఆదిత్య అంటాడు. లేదు. వాళ్లంతా ధీనంగా వెళ్లిపోతుంటే నిస్సాహయంగా ఉన్నానురా. వాళ్ల జాలి చూపులే నన్ను వెంటాడుతున్నాయిరా. గుర్తు వచ్చినప్పుడల్లా గుండెల్లో కళుక్కుమంటుంది. పెద్దోడా. నీకు దండం పెడతానురా. కాదనుకురా. రారా రా అని పిలుస్తుంటాడు. ఇక కార్తీక్,. ఆగండి. నా మాట వినండి అని అంటుంటాడు. ఇక సౌందర్య.. ఏంటండి అని అంటుండగా.. మేము వెళతాం డాడీ. నువ్వు వద్దని చెబుతున్నావు కదా అని ఆదిత్య అంటాడు. ఇక ఆనందరావు.. వద్దురా నాకేం చెప్పొద్దు. నేను ఎవరి మాట వినను. నన్ను ఎవరూ ఆపొద్దు. ఇవాళ నేను తీసుకురావాల్సిందే. రారా అని కార్తీక్ని తీసుకెళుతుంటాడు. ఇక సౌందర్య.. ఆగండి. దీప లేదండి అని చెబుతుంది. ఏంటి అని ఆనందరావు అడగ్గా.. దీప లేదండి. ఆ ఇంట్లో లేదు అని సౌందర్య చెబుతుంది. కార్తీక దీపం సీరియల్ కొనసాగుతుంది.