Home /News /movies /

KARTHIKA DEEPAM SERIAL UPDATE SOUNDARYA MOTIVATES DEEPA ELSEWHERE MONITHA IS IN HAPPY MNJ

Karthika Deepam: దీప, కార్తీక్‌ల కోసం సౌంద‌ర్య ప్లాన్.. సంతోషంలో తేలిపోతున్న మోనిత

తెలుగు రాష్ట్రాల్లో కార్తీకదీపం సీరియల్‌కు ఎంత క్రేజ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు. (Karthika Deepam)

తెలుగు రాష్ట్రాల్లో కార్తీకదీపం సీరియల్‌కు ఎంత క్రేజ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు. (Karthika Deepam)

Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతోంది. ఇవాళ్టి ఎపిసోడ్‌లో దీప ఇంట్లో అంతా స‌ర్దుకుంటుండ‌గా.. సౌంద‌ర్య వ‌స్తుంది. అక్క‌డ దీప‌ను చూసి వాడు అస‌లు ప‌ట్టించుకోవ‌ట్లేద‌ని ఇప్పుడు దీప‌తో ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక సౌంద‌ర్య‌ను గ‌మ‌నించిన దీప‌.. ఇప్పుడు కాసేప‌ట్లో డాక్ట‌ర్ బాబు వ‌స్తాడు.

ఇంకా చదవండి ...
  Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతోంది. ఇవాళ్టి ఎపిసోడ్‌లో దీప ఇంట్లో అంతా స‌ర్దుకుంటుండ‌గా.. సౌంద‌ర్య వ‌స్తుంది. అక్క‌డ దీప‌ను చూసి వాడు అస‌లు ప‌ట్టించుకోవ‌ట్లేద‌ని ఇప్పుడు దీప‌తో ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక సౌంద‌ర్య‌ను గ‌మ‌నించిన దీప‌.. ఇప్పుడు కాసేప‌ట్లో డాక్ట‌ర్ బాబు వ‌స్తాడు. ఈసారి నేను వంట‌ల‌క్క‌లా కాదు ఆ ఇంటి కోడ‌లిగా వెళ్లాలి. అంటే మంచి చీర క‌ట్టుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది. అది విన్న సౌంద‌ర్య‌.. వాడు వ‌స్తాడ‌ని, తీసుకువెళ‌తాడ‌ని ఎంత ఆశ‌గానో చూస్తున్న ఈ పిచ్చి త‌ల్లికి రాడు అని నేను ఏ మొహం పెట్టుకొని చెప్ప‌ను. త‌ప్ప‌దు చెప్పాలి అని లోప‌లికి వెళుతుంది. ఇక సౌంద‌ర్య‌ను చూసిన దీప‌, సౌంద‌ర్య‌ను కూర్చోమ‌ని నీళ్లు తీసుకువ‌చ్చేందుకు లోప‌లికి వెళుతుంది. ఇక దీప చీర‌ల‌ను చూస్తూ.. ఉన్న నాలుగైదు చీర‌ల్లో ఏ చీర‌కు చిరుగులు లేవో చూసుకుంటున్నావా బంగారం అని అనుకొని దీప‌ను చూసి వాటిని అక్క‌డే పెడుతుంది.

  ఇక దీప, సౌంద‌ర్య‌తో.. మాట్లాడారా అత్త‌య్యా, ఏమ‌న్నారు.. అస‌లు విన్నారా.. వినే ఉంటారులే.. న‌మ్మే ఉంటారులే.. మ‌రి ఆయ‌న రాలేదేం.. ఏదైనా అర్జెంట్ ఆప‌రేష‌న్ అని వెళ్లారేమో.. అస‌లు ఏమైంది అత్త‌య్యా.. ఏం చెప్పారు మీరు.. స‌రిగానే చెప్పారా.. అస‌లు చెప్పారా లేదా.. అని అడుగుతూ ఉంటుంది. దానికి సౌంద‌ర్య చెప్పాను అన‌గా.. ఏమ‌న్నారు అత్త‌య్యా అని మ‌ళ్లీ దీప అడుగుతుంది. వినిపించుకోలేద‌ని, ప‌ట్టించుకోలేదు, నాకు అస‌లు స‌మాధానమే చెప్ప‌లేదు రాస్కెల్ అని సౌంద‌ర్య అన‌గా.. దీప డీలా ప‌డుతుంది. ఇక దీప‌ను చూస్తూ సౌంద‌ర్య‌.. నేకొక స్టుపిడ్‌ని. అయినా నేను కాదు చెప్పాల్సింది నువ్వు. అన‌వ‌స‌రంగా నేను త‌ల‌దూర్చాను. నేను ఏం చెప్పినా వాడికి నచ్చదు. ఇదుగో ఇప్పుడే చెప్తున్నా. నువ్వే చెప్పాలి. నేను జోక్యం చేసుకోవ‌డం వ‌ల్ల అదొక సిఫార్సులా ఉంటుంది త‌ప్ప నిజంలా ఉండ‌దే. సున్నిత‌మైన విష‌యాన్ని త‌ల్లిగా నేను చెప్ప‌లేక ఫెయిల్ అయ్యానేమో.. భార్య‌గా, ఏ త‌ప్పు చేయ‌ని ఓ ప‌విత్ర స్త్రీ మూర్తిగా నీ ఉనికిని, వ్య‌క్తిత్వాన్ని, ఆత్మ గౌర‌వాన్ని నిల‌బెట్ట‌గ‌లిగే నిజం ఇది. ఇది నువ్వే వాడికి చెప్పాలి దీప‌. నువ్వే వాడి క‌ళ్ల‌లో ప‌శ్చాతాపాన్ని క‌ళ్లాలా చూడాలి అని అంటుంది. దాంతో దీప ఏడుస్తూ న‌వ్వుతూ.. మీకు ఎంత ఆశ‌. ఎంత వెర్రి న‌మ్మ‌కం. మీరు చెప్తేనే న‌మ్మ‌ని మీ సుపుత్రుడు నేను చెప్తే న‌మ్ముతారా అని అంటుంది. దానికి సౌంద‌ర్య నేను స‌రిగా చెప్ప‌లేదేమోనే అన‌గా.. త‌ల్లిగా చెప్ప‌లేక‌పోవ‌చ్చు. కానీ మేం క‌ల‌వాల‌నే త‌ప‌న మీతో స్ప‌ష్టంగా చెప్పిస్తుంది. ఆయ‌న వినే ఉంటారు. న‌మ్మ‌లేదు. ప‌ట్టించుకోలేదు. న‌మ్మ‌న‌ప్పుడు స‌మాధానం ఏం చెప్తారు. హిమ అడిగితే మౌనంగా వెళ్లిపోయిన‌ట్లే మీరు చెప్పిన‌ప్పుడు నిశ్శ‌బ్ధంగా దాటేసి ఉంటారు అని దీప అంటుంది.

  ఇక సౌంద‌ర్య‌.. లేదు లేదు.. వాడు నిజంగానే విన్నాడు. వాడిలోని మ‌నిషిని ఆలోచ‌న మొద‌లుపెట్టే ఉంటాడు. అంత‌ర్మ‌థ‌నం మొద‌ల‌య్యే ఉంటుంది. అంత‌రాత్మ హెచ్చ‌రిస్తూనే ఉంటుంది. నీ మీద అన‌వ‌స‌రంగా అప‌వాదు వేశానేమోన‌న్న న్యూన‌త భావం మ‌రింత పెరిగి వాడు మార‌డానికి సిద్ధ‌ప‌డే ఉంటాడు అని అన‌గా.. నాకు న‌మ్మ‌కం అనే ప‌దం మీద న‌మ్మ‌కం పోయింది. ఒక ఆడ‌దాని ప‌విత్ర‌త‌కు విలువ ఇంతేనా.. మ‌రి అంత దిగ‌జారిపోయి క‌నిపిస్తున్నానా.. ఎలా అనుకుంటారు ఈ మ‌గాళ్లు.. ప్రాణం పోయినా శీలానికి విలువ నిచ్చే స్త్రీ గురించి ఇంత త‌క్కువగా ఆలోచించ‌డం ఏంటి.. అందులోనూ చ‌దువు, సంస్కారం, గౌర‌వ ప్ర‌ద‌మైన వృత్తి ఇవన్నీ ఉండి కూడా ఎందుకు ఇంత సంకుచితంగా ఆలోచిస్తున్నారు. నా త‌ర‌ఫున నిల‌బ‌డింది ఒక స్త్రీ మూర్తి. నా త‌ర‌ఫున  తన భ‌ర్త‌లోని లోపాన్ని బ‌య‌ట‌పెట్టింది ఇంకో స్త్రీ మూర్తి. చివ‌రికి నా స‌వ‌తి త‌ల్లి కూడా ప‌విత్ర‌త విష‌యంలో న‌న్ను అంతెత్తున నిల‌బెట్టింది. నాణ్య‌త నిరూపించుకోవ‌డానికి అంగ‌ట్లో దొరికే వ‌స్తువులు కాదు నైతిక విలువ‌లు. మ‌నిషి క‌దా మారుతారు అనుకున్నాను. మ‌న‌సే క‌దా క‌రుగుతుంద‌నుకున్నాను. నీ సుపుత్రుడే క‌దా మీ మాట అయినా న‌మ్ముతాడ‌నుకున్నాను. కానీ అబ‌ద్దాన్ని ప్రేమించినంత‌గా నిజాన్ని ప్రేమించ‌డం లేదు. ఇంత‌క‌న్నా అవ‌మానం నాకు ఇంకొక‌టి లేదు. ఇక ఈ మార్గం కూడా మూసేసిన‌ట్లే అత్త‌య్యా. మీరు ఇక ప్ర‌యాస ప‌డ‌కండి. నా త‌ర‌ఫున పోరాడి పోరాడి అల‌సిపోయారు. వ‌దిలేయండి అని క‌ళ్లు తుడుచుకొని స‌ర్దుపెట్టిన ఫొటోల‌ను తీస్తూ ఉంటుంది. అవి చూసిన సౌంద‌ర్య ఏంటే ఇవి అన‌గా.. ఆ ఇంటి గోడ‌కు త‌గిలించాల‌ని వెర్రి ఆశ‌తో తీశాను. ఈ ఇంటి గోడ‌మీదే శాశ్వ‌తంగా ఉంటాయని అర్థ‌మై మ‌ళ్లీ ఈ గోడ మీదే త‌గిల‌స్తాను అని దీప అంటుంది.

  ఇక ఆ ఫొటోను తీసుకునే సౌంద‌ర్య‌.. దీప‌. ఒక్క మాట అడ‌గుతాడు చెప్పు. నీకు వాడు మార‌తాడ‌న్న న‌మ్మ‌కంతోనే క‌దా ఇవ‌న్నీ స‌ర్దుకుంది. అయితే విను. ఆ న‌మ్మ‌క‌మే నీ జీవితాన్ని నిల‌బెడుతుంది. ఆ న‌మ్మ‌క‌మే నీ భవిష్య‌త్‌ని నంద‌న‌వ‌నంలా మారుస్తుంది. నువ్వు బ‌ల‌హీన‌ప‌డ‌కు. నీలోని శ‌క్తిని నువ్వే త‌క్కువ అంచ‌నా వేయ‌కు. ఇన్నేళ్లు స‌హ‌నంతో ఉన్నావు. ఇంకాస్త ఓర్పు తెచ్చుకో అని అంటుంది. దానికి దీప‌.. ఇంకెక్క‌డి స‌హ‌నం అత్త‌య్యా. నాలో స‌హ‌నం చ‌చ్చిపోయింది. ఆత్మాభిమానం చ‌చ్చిపోయింది. ఇంకేం న‌మ్మ‌కం ఉంటుంది. ఇంకెక్క‌డ ఆశ మిగిలి ఉంటుంది. లేదు. నా వ‌ల్ల కాదు అని అంటుంది. వెంట‌నే సౌంద‌ర్య‌.. అవుతుంది. నీ వ‌ల్లే అవుతుంది. నీ జీవితాన్ని నిల‌బెట్టుకోగ‌లిగే సాక్ష్యం నీ ద‌గ్గ‌రే ఉంది. నువ్వు నువ్వుగా వెళ్లు. వాడి భార్య‌గా వెళ్లు. కాళ్లా వేళ్లా ప‌డాల్సిన ప‌ని లేదు. అంతా చెప్పు. తుల‌సి చెప్పిందంతా చెప్పు. న‌మ్మ‌క‌పోతే తుల‌సిని వెతుక్కుంటూ వెళ్లి తీసుకు వెళ్లు. నిజాన్ని చెప్పించు. బంగారం.. నువ్వు ఈ ఒక్క‌సారి నా మాట విను. నేను చెప్పేది విను. నువ్వు వ‌చ్చే టైమ్‌కి వాడు ఇంట్లోనే ఉండేలా నేను చూస్తాను. మేమంద‌రం గుడికి వెళ‌తాము. ఎవ్వ‌రూ ఉండ‌రు. మీరిద్ద‌రే ఉంటారు. నిజాన్ని నిర్భ‌యంగా నిజాయితీగా చెప్పు. అర్థ‌మైందా అని అడ‌గ్గా.. దీప ఏడుస్తూ హు అంటుంది. ఇక వెళ్లి క‌లుస్తావా అని సౌంద‌ర్య అడ‌గ్గా.. దానికి స‌రేన‌ని దీప అంటుంది. దీంతో సౌంద‌ర్య‌, దీప‌ను ముద్దాడుతుంది.

  ఇక కార్తీక్ ఉద‌యాన్నే లేచి రౌడీ అని పిలుస్తాడు. ప‌క్క‌న ఎవ‌రూ లేక‌పోయే స‌రికి.. దీనికి అన్నీ మంచి అల‌వాట్లే. ఎవ్వ‌రూ లేప‌క‌పోయినా త్వ‌ర‌గా లేస్తుంది. ఎవ‌రి సాయం లేకుండా రెడీ అయిపోతుంది అని అంటాడు. ఇక అదే స‌మ‌యానికి సౌంద‌ర్య కాల్ చేస్తుంది. చెప్పు మ‌మ్మీ అన‌గా.. వాట్సాప్‌లో మెసేజ్ చేశాను అని సౌంద‌ర్య‌ అంటుంది. మెసేజ్ పెట్టి నువ్వెక్క‌డికి వెళ్లావు అని కార్తీక్ అడ‌గ్గా.. ఆ విష‌య‌మే మెసేజ్ చేశాను అని ఫోన్ పెట్టేస్తుంది. ఇక ఆ మెసేజ్‌లో అంద‌రం గుడికి వ‌చ్చాము. టేబుల్ మీద అన్నీ రెడీగా ఉన్నాయి. రెడీ అయ్యి బ్రేక్ ఫాస్ట్ చెయ్యి.మేం లేమ‌ని నిర్ల‌క్ష్యం చేయ‌కు. పూజ అవ్వ‌గానే వ‌చ్చేస్తాము. బాయ్ అని వాయిస్ మెసేజ్ ఉంటుంది.

  ఇక కార్తీక్.. ఈ విష‌యం రాత్రే చెప్పొచ్చు క‌దా. రౌడీ కూడా ఏం చెప్ప‌లేదు. ఇలా స్పెష‌ల్‌గా చెప్ప‌డ‌మేంటి.. న‌న్ను గుడికి ర‌మ్మ‌ని ఎందుకు పిల‌వ‌లేదు. దీని వెనుక ఏమైనా కుట్ర ఉందా.. ఛ‌.. ఛ.. అన్నింటిని నెగిటివ్‌గా ఆలోచించ‌డం అల‌వాటు అయిపోయింది అనుకొని రెడీ అవ్వ‌డానికి వెళ‌తాడు. ఇక దీప‌, దేవుడి ద‌గ్గ‌ర‌కు వెళ్లి.. అంద‌రూ ఆశీర్వ‌దించాల్సిన స‌మ‌యం వ‌చ్చింది. అవ‌స‌రం కాదు. స‌మ‌యం. ప‌దేళ్లు మోసిన అప‌నింద ఈ రోజు చెరిపేసుకోవ‌డానికి వెళుతున్నాను. ఈ అగ్ని ప్ర‌వేశం నుంచి నేను అగ్ని పునీత‌గా బ‌య‌ట‌ప‌డాలి. అక్ష‌రాలా నేను ప‌విత్ర స్త్రీ మూర్తిన‌ని నా భ‌ర్త గుర్తించాలి. నీతికి, విలువ‌ల‌కు నేను ఎంత గౌర‌వం ఇచ్చానో ఆయ‌న తెలుసుకోవాలి. ప‌దేళ్ల ఎడ‌బాటు, ప‌దేళ్ల ఒంట‌రి బ‌తుకు, ప‌దేళ్ల నిస్సార‌మైన, నిర్జీవ‌మైన కాపురం, ఇన్నేళ్లుగా నలిగిపోయిన హృద‌యం వీట‌న్నింటికి ముగింపు ప‌ల‌కాలి. ఇది మ‌రో ఆరంభం. దీప క‌థ‌లో మ‌రో కార్తీక దీపం. న‌మ్మాలి. మారాలి. న‌న్ను, నా బిడ్డ‌ల‌ను ఆద‌రించాలి. ముక్కోటి దేవ‌త‌లు ఆశీర్వ‌దించాలి అని మొక్కుకుంటుంది.

  మ‌రోవైపు మోనిత అటూ ఇటూ తిరుగుతూ కార్తీక్, తుల‌సి వాళ్ల ఇంటికి వెళ‌తాన‌ని చెప్పాడు. అక్క‌డ ఏం జ‌రిగిందో, తుల‌సి ఏం చెప్పిందో తెలీడం లేదు అనుకుంటూ ఉంటుంది. అదే స‌మ‌యానికి కార్తీక్‌కి ఫోన్ చేస్తుంది. చెప్పు మోనిత అని కార్తీక్ అన‌గా.. నువ్వే చెప్పాలి. తుల‌సి ద‌గ్గ‌రికి వెళ‌తాన‌ని చెప్పావు క‌దా. తుల‌సిని క‌లిశావా.. ఏం చెప్పింది అని మోనిత అడ‌గ్గా.. ఏం చెప్ప‌డానికి తుల‌సి లేద‌ని కార్తీక్ అంటాడు. ఇంటికి తాళం వేసిందా అని మోనిత అడ‌గ్గా.. ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోయిందంటా అని కార్తీక్ అంటాడు. ఇక మోనిత సంతోషంలో అమెరికా వెళ్లిపోయిందా అని అడ‌గ్గా.. అనుకుంటా. డిపాజిట్ కూడా తీసుకెళ్లింద‌ట అని కార్తీక్ అంటాడు. బ్రేక్‌ఫాస్ట్‌కి వ‌స్తావా.. నీకు ఇష్ట‌మైన‌వి చేసి పెడ‌తాను అని మోనిత అన‌గా.. వ‌ద్దు మ‌మ్మీ రెడీ చేసి వెళ్లిపోయింది అని కార్తీక్ చెబుతాడు.

  ఎక్క‌డికి అని మోనిత అడ‌గ్గా.. అంతా క‌లిసి గుడికి వెళ్లార‌ని కార్తీక్ చెబుతాడు. నిన్ను ఒక్క‌డినే వ‌దిలేసి అంతా గుడికి వెళ్లారా ఎందుకు.. ఇవాళ విశేష‌మైన రోజు ఏం కాదే. అంద‌రూ క‌ట్ట‌క‌ట్టుకొని వెళ్లి నిన్ను ఒంట‌రిగా వ‌దిలేశారంటే ఏదైనా ప్లాన్ ఉందేమో కార్తీక్ అని అంటుంది. ప్లాన్ ఏంటి అని కార్తీక్ అన‌గా.. ఇప్పుడు దీప గానీ ఇంటికి వ‌స్తుందేమో, మీ ఇద్ద‌రికి ప్రైవ‌సీ క‌లిపించ‌డానికే ఈ ఏకాంతం క‌లిపించారేమో.. మీ ఇద్ద‌రు మాట్లాడుకొని ఒక అండ‌ర్ స్టాండింగ్‌కి రావ‌డానికి ఇంత‌కన్నా మంచి టైమ్ ఉండ‌దు. ఆ టైమ్ దీప‌కు క‌లిసి వ‌స్తుంది. ఈ టైమ్‌ని దీప బాగా యుటిలైజ్ చేసుకుంటుంది. ఎవ్వ‌రూ లేని వేళ అంత పెద్ద ఇంట్లో మీ ఇద్ద‌రే ఎంజాయ్ కార్తీక్ అని మోనిత అన‌గా.. నువ్వు నోరును అదుపులో పెట్టుకే. పొద్దున్నే ఇరిటేట్ చేసే జోకులు వేయ‌కు. న‌న్ను ప్ర‌శాంతంగా ఉండ‌నివ్వు అని కార్తీక్ అంటాడు. ఇక ఫోన్ పెట్టేయ‌గానే దీప‌కు టైమ్ క‌లిసొచ్చింది. నాకు విసుగు వ‌చ్చేలా ఉంది. నా భ‌యం నాది. అత్త అంద‌రితో భ‌య‌ట‌కు వెళ్లి కోడ‌లిని ఇంటికి పంపిస్తుందేమో.. కార్తీక్ నా మాట కొట్టిప‌డేశాడు కానీ అదే జ‌ర‌గొచ్చు. ఆ సౌంద‌ర్య‌ను న‌మ్మ‌డానికి వీలు లేదు. ఏమైనా చేయ‌గ‌ల స‌మ‌ర్ధురాలు అని మోనిత అనుకుంటుంది. ఇక కార్తీక్ డైనింగ్ టేబుల్ మీద కూర్చోగా దీప ఇంట్లోకి వ‌స్తుంది. కార్తీక దీపం కొన‌సాగుతుంది.
  Published by:Manjula S
  First published:

  Tags: Karthika deepam, Karthika Deepam serial, Television News

  తదుపరి వార్తలు