హోమ్ /వార్తలు /సినిమా /

Karthika Deepam: ఎవ‌ర్తిరా ఆ మౌనిత‌.. దాని మీద‌, నీ మీద నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సింది.. కార్తీక్‌పై మండిప‌డ్డ సౌంద‌ర్య

Karthika Deepam: ఎవ‌ర్తిరా ఆ మౌనిత‌.. దాని మీద‌, నీ మీద నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సింది.. కార్తీక్‌పై మండిప‌డ్డ సౌంద‌ర్య

తెలుగు రాష్ట్రాలలో కార్తీక దీపం సీరియల్‌కు ఉన్న క్రేజ్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. గ్రంథాలు రాయాల్సి వస్తుంది. అంత గుర్తింపు తెచ్చుకుంది ఈ సీరియల్. 2017 అక్టోబర్‌లో మొదలైన కార్తీక దీపం సీరియల్ టిఆర్పీ రేటింగ్స్‌లో అగ్రస్థానంలో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు దీన్ని బీట్ చేసే సీరియల్ మరోటి రాలేదంటే వంటలక్క రేంజ్ ఏంటో అర్థం అయిపోతుంది. మరి ఇంతటి పాపులర్ సీరియల్‌లో ఉన్న నటుల స్క్రీన్ నేమ్స్ అందరికీ తెలుసు. మరి వంటలక్క నుంచి మోనిత వరకు వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ ఏంటో ఓ సారి చూద్దాం.

తెలుగు రాష్ట్రాలలో కార్తీక దీపం సీరియల్‌కు ఉన్న క్రేజ్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. గ్రంథాలు రాయాల్సి వస్తుంది. అంత గుర్తింపు తెచ్చుకుంది ఈ సీరియల్. 2017 అక్టోబర్‌లో మొదలైన కార్తీక దీపం సీరియల్ టిఆర్పీ రేటింగ్స్‌లో అగ్రస్థానంలో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు దీన్ని బీట్ చేసే సీరియల్ మరోటి రాలేదంటే వంటలక్క రేంజ్ ఏంటో అర్థం అయిపోతుంది. మరి ఇంతటి పాపులర్ సీరియల్‌లో ఉన్న నటుల స్క్రీన్ నేమ్స్ అందరికీ తెలుసు. మరి వంటలక్క నుంచి మోనిత వరకు వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ ఏంటో ఓ సారి చూద్దాం.

తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం(Karthika Deepam) సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. త‌న మీద ప‌డ్డ నింద‌ను చెరిపేసుకునేందుకు కంక‌ణం క‌ట్టుకున్న దీప‌.. త‌న‌లోని మ‌రో అవతారాన్ని చూపించింది. ఈ క్ర‌మంలో క‌ట్టుకున్న భార్య‌ను అవ‌మానించే అవ‌మాన‌పు మొగుడివి నువ్వు అంటూ కార్తీక్‌ని అనేసింది.

ఇంకా చదవండి ...

  Karthika Deepam: తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. త‌న మీద ప‌డ్డ నింద‌ను చెరిపేసుకునేందుకు కంక‌ణం క‌ట్టుకున్న దీప‌.. త‌న‌లోని మ‌రో అవతారాన్ని చూపించింది. ఈ క్ర‌మంలో క‌ట్టుకున్న భార్య‌ను అవ‌మానించే అవ‌మాన‌పు మొగుడివి నువ్వు అంటూ కార్తీక్‌ని అనేసింది. ఇక ఇవాళ్టి ఎపిసోడ్‌లో మౌనిత ఫోన్‌కి కార్తీక్ ఫోన్ చేయ‌గా.. ఆ ఫోన్ దీప ద‌గ్గర ఉండ‌టంతో దాన్ని లిఫ్ట్ చేసిన ఆమె.. రాంగ్ నంబ‌ర్ అని పెట్టేస్తుంది. దాంతో వాయిస్ ఏంటి దీప‌లా ఉందంటూ అనుమాన‌ప‌డ‌తాడు కార్తీక్. అదే స‌మ‌యానికి దీప మౌనిత ఫోన్‌ని స్విచ్ఛాప్ చేసి కార్తీక్‌వైపుగా వెళుతుంది దీప‌. ఇది ఇక్క‌డే ఉంది తిరుగుతుంది క‌దా అనుకుంటూ ఆ త‌రువాత కూడా మౌనిత ఫోన్‌కి కాల్ చేస్తుంటాడు. ఇక కార్తీక్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన దీప‌.. చీక‌ట్లో దేనికి ఫోన్ చేస్తున్నారు..? దానికేనా..? అని అడుగుతుంది. వెంట‌నే కార్తీక్.. ఏమైందే నీకు అన‌గా.. నాకేమైంది..? నాకేం రోగం..? నేను బాగానే ఉన్నాను. మిమ్మ‌ల్నే రెండు పిశాచాలు ప‌ట్టుకున్నాయి. ఒక‌టి అనుమానం, రెండు మౌనిత‌. ఆ రెండింటిని వ‌ద‌ల‌గొట్టే భూత‌వైద్యం మొద‌లుపెట్టానులెండి. తొంద‌ర‌గానే వ‌దిలిస్తాను అని అంటుంది. వెంట‌నే కార్తీక్.. పిచ్చి పిచ్చిగా ఉందా..? పిల్ల‌లిద్ద‌రిని వ‌దిలేసి పిచ్చిప‌ట్టిన దానిలా తిరుగుతున్నావేంటి..? ఇంటికెళ్లు అంటాడు.

  దానికి దీప‌.. అబ్బో ఏం ప్రేమ ఒల‌గ‌బోస్తున్నారండి..? అదంతా నేను దాన్ని తీసుకువెళ్తున్న‌ప్పుడు ఏమైంది..? ప‌సిబిడ్డ ఉసురు పోసుకుంటున్నారు. అదేమో పిచ్చిదానిలా మా నాన్న నా కోసం వ‌స్తాడు వ‌స్తాడు అని ఎదురుచూస్తు కూర్చుంది. మీరేమో చీక‌ట్లో కూర్చొని పిశాచాల‌కు డ‌య‌ల్ చేస్తూ ఉన్నారు అని అంటుంది. నేను మౌనిత‌కు కాల్ చేశాన‌ని నీకు ఎలా తెలుసు అని ప్ర‌శ్నిస్తాడు. పిశాచం అన‌గానే మీకు మౌనిత గుర్తు వ‌చ్చిందంటేనే అర్థ‌మ‌వుతోంది. అది మిమ్మ‌ల్ని ఎంత‌లా ప‌ట్టి పీడిస్తుందో..! ఆ చేసేదేదో పిల్ల‌ల‌కే చేయొచ్చు క‌దా.. అబ్బే పంతం. మీ గ‌దిలో మాత్రం ఫొటో ఉండాలి. ల‌వ్యూ డాడీ అని రాత‌లు ఉండాలి. దాని త‌ల‌రాత మార్చి.. మ‌ళ్లీ దాని త‌రఫున వ‌కాల్తా ఒక‌టి. పిల్ల‌ల్ని వదిలేసి తిరుగుతావేంటి..? అని తిట్లు.. మీలాగా అంద‌రినీ వ‌దిలేసుకొనే ర‌కాన్ని కాదు నేను అని అంటుంది. దానికి కార్తీక్.. లెక్చ‌ర్ ఇచ్చింది చాలు వెళ్లు అంటాడు. వెంట‌నే దీప‌.. లెక్చ‌ర్‌లా ఉందా..? క‌్లియ‌ర్ పిక్చ‌ర్ ముందుంది. ఎవ‌రు ఏంటి అనేది మీకు నేను తెలిసేలా చేస్తా. మీరు ఈ శ‌తాబ్దంలో తెలుసుకోలేర‌ని అర్థ‌మైంది. ద‌శాబ్దం నుంచి న‌న్ను అనుమానిస్తూనే ఉన్నారు. అందుకే ముందుడుగు వేశా. ఇంకెంతోకాలం ప‌ట్ట‌దులెండి అని అంటుంది.

  వెంట‌నే కార్తీక్.. న‌న్ను ఇరిటేట్ చేయ‌కు అన‌గా.. న‌న్ను ఇరిటేట్ చేసేదే మీరు అని దీప అంటుంది. మీకిప్పుడు వాక్‌స్వాతంత్ర్యం లేదు, భావ‌స్వాతంత్ర్యం అంత‌క‌న్నా లేదు. స్త్రీ శ‌క్తి ముందు మీ పురుషాధిక్య‌త ఏ మాత్ర‌పుదో మీకే తెలుస్తుంది, తెలిసేలా చేస్తాను అని చెబుతుంది. దానికి కార్తీక్.. నీ క‌విత్వం విని మా అమ్మ రస‌ఙ్ఞురాలులా మారి శ‌భాష్ అంటుందేమో నేను అలా కాదు అని అంటాడు. వెంట‌నే దీప‌.. అవును మ‌రి మౌనిత అనే పిశాచం వదిలే దాకా మీకు మీరే మోనార్క్ అనుకుంటారు. దాని మీద, దాని చెప్పుడు మాట‌ల మీద ఉండే శ్ర‌ద్ధ.. మీకు మ‌న పిల్ల‌ల మీద లేదు. అంటే అన్నారంటారు గానీ.. ఒక్క‌సారి వ‌చ్చి పిల్ల‌ల‌ను చూస్తే మీకు ఏమౌతుంది. అబ్బే ఆ పిశాచి ఉండే మ‌ర్రిచెట్టు చుట్టూ రోజుకు ఒక‌సారైనా తిరుగుతూ ఉంటారు త‌ప్ప, పిల్ల‌ల ద‌గ్గ‌ర‌కు ఎందుకు వ‌స్తారు..? హిమే క‌దా.. క‌న్న‌కూతురును పెంచుకున్న క‌న్న‌తండ్రి మీరు, చ‌రిత్ర‌లో ఇలాంటి తండ్రి ఎక్క‌డా ఉండ‌డు, ఇప్పుడు మిమ్మ‌ల్ని అని ఏం లాభం.. గ్ర‌హ‌ణం ప‌ట్టిన చంద్రుడు మీరు.. త్వ‌ర‌లోనే శ్రీరామ‌చంద్రుడ‌ని నిరూపిస్తా.. వ‌స్తా.. న‌మ‌స్తే.. బ‌య‌ట మంచు, చ‌లి.. లోప‌లికి వెళ్లి భోజ‌నం చేయండి.. పిశాచాల‌తో త‌రువాత ముచ్చ‌టించుకోండి అని చెప్పి వెళుతుంది.

  ఇక మౌనిత ఇంట్లో ఉండ‌గా.. ప్రియ‌మ‌ణి కాఫీ తెచ్చి ఇస్తుంది. దాన్ని తాగి మౌనిత ఇబ్బంది ప‌డుతుండ‌గా.. నీళ్లు ఎక్కువ‌, పాలు త‌క్కువ చండాల‌మైన కాఫీ క‌ద‌మ్మా అని ప్రియ‌మ‌ణి అన‌గా.. మౌనిత కోపంగా చూస్తుంది. దానికి ప్రియ‌మ‌ణి.. నేను కాదు ఆ దీప పంపింది అని అంటుంది. మౌనిత న‌వ్వుతూ ఉండ‌గా.. ప్రియ‌మ‌ణి ఎందుకు న‌వ్వుతున్నార‌మ్మా అని అడుగుతుంది. దానికి మౌనిత‌.. నా జీవితం నా చేతులో నుంచి జారిపోతుందేమో అనిపిస్తుంది ప్రియ‌మ‌ణి అని అంటుంది. వెంట‌నే ప్రియ‌మ‌ణి.. ఇప్పుడేంట‌మ్మా, ఎప్పుడో జారిపోయింది. అవున‌మ్మా.. ఏరోజైతే నీకు ఆ సౌంద‌ర్య‌మ్మ‌, దీప చేతుల్లో నీకు త‌న్నులు అల‌వాటు అయ్యుందో అప్పుడే మీ జీవితం.. ఎందుకులెండ‌మ్మా మీరు చెబితే బాధ‌ప‌డుతారు అంటుంది. ఇక మౌనిత‌.. ఇది ఎంత‌కాలం ఇలా న‌న్ను హౌజ్ అరెస్ట్ చేస్తుంది..? ఏదొక టార్గెట్ లేక‌పోతే ఇలా చేయ‌దు. అబ్బా త‌ల తిరుగుతుంది అని అనుకుంటుంది. వెంట‌నే ప్రియ‌మ‌ణి.. భోజనం చేస్తారా..? ప‌చ్చి మిర్చి, ప‌చ్చి పులుసు పంపింది. అదేం కాంబినేష‌నో అర్థం కావ‌ట్లేదు. వంట‌ల‌క్క క‌దా బాగా చేసి పంపించి ఉంటుంది. లేయ్ అమ్మా అని అంటుంది. దానికి మౌనిత‌.. నువ్వు తిన‌వే, నాకు ఆక‌లిగా లేదు అని కోప్ప‌డుతుంది. ప్రియ‌మ‌ణి వెళ్లిన త‌రువాత నాకు ఎవ‌రెవ‌రు ఫోన్లు చేశారో ఏమో.. నా కార్తీక్ ఎన్నిసార్లు చేసి ఉంటాడో ఏమో..? దీప ఏదొక‌రోజు నువ్వు నాకు దొర‌క్క‌పోవు అని అనుకుంటుంది.

  ఇక వెంక‌టేష్ వ‌చ్చి దీప‌ను ఇంటి ద‌గ్గ‌ర వ‌దిలేస్తాడు. అప్పుడు దీప‌.. నిన్ను శ్ర‌మ‌పెడుతున్నానా..? అని అడ‌గ్గా.. నీకు వార‌ణాసి ఎంత‌నో న‌న్ను అలానే అనుకో అక్కా.. రేపు పొద్దునే ఎన్ని గంట‌ల‌కు రావాలి అని అడుగుతాడు. దానికి దీప నేను ఫోన్ చేసి చెబుతాలే అంటుంది. ఇక ఇంటికి వెళ్లిన దీప‌ను చూసి.. సౌర్య, హిమ ఇద్ద‌రు సంతోష‌ప‌డుతారు. ఇంత‌సేపు ఎక్క‌డికి వెళ్లావు అమ్మా అని అడ‌గ్గా... ఒక ముఖ్య‌మైన ప‌ని మీద తిరుగుతున్నాన‌మ్మా అని దీప చెబుతూ.. భోజ‌నం చేశారా..? అని అడుగుతుంది. దానికి లేద‌మ్మా.. నువ్వు వ‌స్తావ‌ని ఎదురుచూస్తూ ఉన్నాము అని అంటారు. ఆక‌లిగా లేదా అంటే.. నాకు ఏం తినాల‌నిపించ‌డం లేద‌మ్మా అని హిమ అంటుంది. ఎందుకు అని అడ‌గ్గా.. మ‌నం ఇలా వేరుగా ఉండ‌టం నాకు న‌చ్చ‌డం లేద‌మ్మా. అంద‌రం క‌లిసి ఎప్పుడు ఉంటామో తెలీక బాధ‌గా ఉంది అని చెబుతుంది. వెంట‌నే సౌర్య‌.. నేను ఎంత చెప్పినా హిమ దిగులుగానే ఉంటుందమ్మా.. నాన్న మీద బెంగ ఎక్కువైన‌ట్లు ఉంది అంటుంది. ఇంకొద్ది రోజులమ్మా అంతే.. కాస్త ఓపిక ప‌ట్టండ‌మ్మా.. క‌లిసి ఉండాల‌నే ప్ర‌య‌త్నంలోనే ఉన్నాను. అందుకే బ‌య‌ట‌కు వెళుతున్నాను స‌రేనా అని చెప్పి.. లోప‌లికి తీసుకెళుతుంది.

  ఇక కార్తీక్ ఇంట్లో తిరుగుతూ ఉండ‌గా.. సౌంద‌ర్య అటుగా వ‌స్తుంది. అంద‌రం తిన్నాము అన‌గా.. కార్తీక్ మంచిదంటాడు. నువ్వు అని సౌంద‌ర్య అడ‌గ్గా.. అది ఎందుకు వ‌చ్చింది అని కార్తీక్ అడుగుతాడు. ఏది అని సౌంద‌ర్య అన‌గా.. తెలీదు అన‌కు నీకు తెలుసు అని కార్తీక్ అంటాడు. వెంట‌నే సౌంద‌ర్య‌.. నా కోడ‌లా అని అడుగుతుంది. ఎందుకొచ్చింది అని అడిగాను, నీకు ఏం వ‌రుస అవుతుంది అని అడ‌గ‌లేదు అని కార్తీక్ అంటాడు. దానికి సౌంద‌ర్య‌.. బ‌హుశా నిన్ను నాలుగు దులిపి, మూడు కొస‌రేసి పోవాల‌ని వ‌చ్చిన‌ట్లుంది. మ‌రి అదేగా జ‌రిగింది అని అంటుంది. వెంట‌నే కార్తీక్.. తెలివైన స‌మాధానాలు వ‌ద్దు మ‌మ్మీ అని అంటాడు. తెలివి త‌క్కువ‌గా స‌మాధానాలు చెప్ప‌డం నాకు రాదు, ఎలాగో నువ్వు నేర్పిస్తావా..? అని సౌంద‌ర్య అడుగుతుంది. వెంట‌నే కార్తీక్.. ఎక్క‌డికి వెళ్లి వ‌చ్చింది అని అడ‌గ్గా.. నువ్వు భోజ‌నం చేయ్ అంటుంది. ఆక‌లిగా లేదు, ఎక్క‌డికి వెళ్లి వ‌చ్చిందో చెప్పు అని మ‌ళ్లీ అడ‌గ్గా.. నా ద‌గ్గ‌ర సమాధానం లేదంటూ అక్క‌డి నుంచి వెళ్లేందుకు సౌంద‌ర్య ప్ర‌య‌త్నిస్తుంది. వెంట‌నే కార్తీక్.. మ‌మ్మీ ఆగు, ఏం జ‌రుగుతుంది అని అడుగుతాడు. దానికి సౌంద‌ర్య‌.. పుణ్య‌క్షేత్రంలో ర‌ణ‌క్షేత్రం అంటుంది. అంటే అని కార్తీక్ అడ‌గ్గా.. దాని ఆత్మ‌గౌర‌వానికి, మాతృత్వానికి మ‌ధ్య అంత‌ర్యుద్దం జ‌రుగుతోంది అని సౌంద‌ర్య చెబుతుంది.

  అందుక‌ని ఏం చేయాల‌నుకుంటుంది అని కార్తీక్ అడ‌గ్గా.. తెలీద‌ని సౌంద‌ర్య స‌మాధానం చెబుతుంది. వెంట‌నే ఎక్క‌డికి వెళుతుంది అని అడ‌గ్గా.. తెలీదు అని అంటుంది. దానికి కార్తీక్ ఏదీ తెలీదా..? అని అడుగుతాడు. వెంట‌నే సౌంద‌ర్య‌.. చాలా తెలుసు, చాలా మాట్లాడాల‌ని ఉంది. అడ‌గాల‌ని, క‌డ‌గాల‌ని, తిట్టాల‌ని, చాచిపెట్టి చెంప ప‌గ‌ల‌గొట్టాల‌ని ఉంది. చెట్టంత ఎదిగావు, చిగురాకంత జాలి లేదు. ఇద్ద‌రు బిడ్డ‌ల‌ను క‌న్నావు, ఇసుమంత న‌మ్మ‌కం లేదు. కోట్లు సంపాదించావు, నీ భార్య బిడ్డ‌ల‌కు స‌రైన తిండి లేదు. స‌మాజంలో కీర్తి ప్ర‌తిష్ట‌లు సాధించావు, సంసారంలో సార‌త్య లేదు. మిడిసిప‌డ‌కురా సుపుత్రా.. ఈ అఙ్ఞానం న‌శించి, ఈ అంధ‌కారం మాయ‌మై, ఈ అప‌న‌మ్మ‌కం, ఈ అనుమానం ప‌టాపంచ‌లైన రోజు.. నిన్ను అక్కున చేర్చుకొని ఓదార్చ‌డానికి ఒక అమ్మ త‌ప్ప‌కుండా ఉండాలి క‌దా. అప్పుడు నా అవ‌స‌రం ఉంటుందని.. ఇప్పుడు నిన్ను తిట్ట‌లేక‌, కొట్ట‌లేక, దూరం పెట్ట‌లేక‌, నాలో నేనే ర‌గిలిపోతున్నా. నిశ్శ‌బ్దంగానే స‌మాధానం చెబుతున్నాను అని అంటుంది. వెంట‌నే కార్తీక్.. నా మీద లేని న‌మ్మ‌కం దాని మీద ఉంది నీకు అడుగుతాడు. దానికి సౌంద‌ర్య‌.. ఈ న‌మ్మ‌కం వ్య‌క్తి మీద కాదు వ్య‌క్తిత్వం మీద అని సౌంద‌ర్య చెబుతుంది.

  నా కోడ‌లి వ్య‌క్తిత్వం దాని మ‌ట్టి గాజుల చ‌ప్పుడులో తెలుస్తుంది నాకు. నా కోడ‌లి సంస్కారం దాని కంఠ‌స్వ‌రంలో తెలుస్తుంది నాకు. నా కోడ‌లి ప‌విత్ర‌త దాని పాపిట సింధూరంలో మెరుస్తూ క‌నిపిస్తోంది నాకు. నా కోడలి న‌డ‌వ‌డ‌క దాని మెట్ట‌ల స‌వ్వ‌డిలో ధ్వ‌నిస్తూ వినిపిస్తోంది నాకు. అలాంటి నా కోడ‌లిని ప‌ట్టుకొని అంత‌మందిలో అంత దారుణంగా అవ‌మానిస్తావారా..? యూ స్కౌండ్ర‌ల్ అని కోప్ప‌డుతుంది. వ‌ద్దు కార్తీక్.. న‌న్ను క‌దిలించ‌కు, దాని గ‌ర్భ‌కోశంలో నుంచి పొంగే గ‌ర్భ‌శోకాన్ని నేను విన్నాను. నేను ముగ్గురు పిల్ల‌ల‌ను క‌న్న‌త‌ల్లినిరా అందుకే దాని ఆక్రోశం అర్థ‌మైంది నాకు. దాని క‌డుపున పుట్టిన ఆ ప‌సిమొగ్గ‌ల పుట్టుక‌నే ప్ర‌శ్నించి ఎంత పాపం మూట‌గ‌ట్టుకున్నావో తెలుసా అని ఆవేశ‌ప‌డుతుంది. వెంట‌నే కార్తీక్.. మమ్మీ అంత జ‌రిగినా నా అంత‌ట నేను పెద‌వి విప్ప‌లేదు మమ్మీ.. కానీ మౌనిత అంటూ ఉండ‌గా.. ఎవ‌ర్తిరా ఆ మౌనిత‌.. ఇది నీ భార్య భ‌ర్త‌ల స‌మ‌స్య‌. ఆ స‌మ‌స్యను మ‌రింత చిక్కుముడిలా చేసే అధికారం దానికి ఎవ‌రు ఇచ్చారు. నువ్వు కాదా..? అందుకే దీప‌కు కోపం వ‌చ్చి బ‌య‌లుదేరింది. ముందు మౌనిత మీదనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వ‌చ్చింది అని సౌంద‌ర్య చెబుతుంది.

  వెంట‌నే కార్తీక్.. ఏంటి మౌనిత మీద కంప్లైంట్ ఇచ్చిందా..? అదెవ‌రు అని అడగ్గా.. క‌రెక్టే పెళ్లాం ఉండ‌గా, ఇంకోదాన్ని పెళ్లి చేసుకుంటా అన్నందుకు నేను ఇవ్వాలి పోలీస్ కంప్లైంట్ నీ మీద‌, ఆ మౌనిత మీద‌. మ‌రి దీప ఎందుకు వెళ్లిందో ఏమ‌ని కంప్లైంట్ ఇచ్చిందో నాకు తెలీదు. ఈ మాట విని దాని అంతుచూస్తాను అంటావేమో..? అది ఈ మాటే చెప్పి వెళ్లింది.. మౌనిత అంతుచూస్తాన‌ని అని వెళుతూ.. డైనింగ్ టేబుల్ ద‌గ్గ‌ర ఎదురుచూస్తుంటానురా అని చెబుతుంది. ఈ మాట‌ల‌న్నీ అంజి వింటాడు. పొద్దున్నే లేచి సౌంద‌ర్య మాట‌ల‌ను గుర్తుచేసుకుంటూ ఉంటాడు. చీచీ ఆ మౌనిత‌ను డాక్ట‌ర్ బాబు పెళ్లి చేసుకోవ‌డం ఏంటి..? దేవ‌తలాంటి దీప‌మ్మ‌కు అన్యాయం జ‌ర‌గ‌డ‌మే కాదు. ఒక మ‌నిషిని చంపిన రాక్ష‌సికి డాక్ట‌ర్ బాబును పెళ్లి చేసుకునే అర్హత లేదు. అంత‌దాకా వ‌స్తే దాని గురించి మొత్తం చెప్పేస్తా.. ఏమ‌నుకున్నా స‌రే. ఉద్యోగంలో నుంచి తీసేసినా, జైలుకు పంపినా స‌రే ఏదో ఒక‌టి చేస్తా. ఆ మౌనిత‌కు నేనే బుద్ది చెబుతా అని మ‌న‌సులో అనుకుంటూ ఉంటాడు.

  ఇక శ్రావ్య అక్క‌డ‌కు వచ్చి.. అంజి కారు రెడీనా అని అడ‌గ్గా.. ఏంట‌మ్మా అంటాడు. అంటే నేను అన్న‌ది వినిపించ‌లేదా..?అంటే ఏదో ఆలోచిస్తున్నావు అని శ్రావ్య అంటుంది. అయ్యో అదేం లేద‌మ్మా అన‌గా.. దీపు గాడికి కొన్ని వ‌స్తువులు తీసుకురావాలి వెళ్తామా అని అంటుంది. ఆ త‌రువాత మౌనిత నంబ‌ర్ ఇవ్వ‌మ‌ని శ్రావ్య‌ను అడుగుతాడు అంజి. ఎందుకు అని శ్రావ్య అడ‌గ్గా.. ఎదురింట్లో పనిచేసే డ్రైవ‌ర్ భార్య గ‌ర్భ‌వతి అంటా.. నంబ‌ర్ క‌నుక్కోమ‌న్నాడు అని అడ‌గ్గా.. శ్రావ్య నంబ‌ర్ పంపుతుంది.

  ఇక దీప చ‌పాతీ పిండి క‌లుపుతూ ఉండ‌గా.. అమ్మా రాత్రి నువ్వు ఎక్క‌డికి వెళ్లావు అని హిమ అడుగుతుంది. వెంట‌నే దీప‌.. ఏమ్మా బ‌య‌ప‌డ్డారా..? అని అడ‌గ్గా.. సౌర్య ఉందిగా నాకేం భ‌యం అనిపించ‌లేదు అంటుంది. దానికి దీప అస్స‌లు భ‌య‌ప‌డ‌కూడ‌దు, ధైర్యంగా ఉండాలి అని చెబుతుంది. ఆ త‌రువాత‌ నువ్వు రాత్రి శ్రావ్య పిన్ని చీర క‌ట్టుకొని వ‌చ్చావేంటమ్మా..అంటే ఆ ఇంటికి వెళ్లావా అని అడుగుతుంది. రాత్రి నువ్వు ఇంటికి రాగానే సౌర్య అన్ని మ‌ర్చిపోయింది. నేను అప్పుడే గ‌మ‌నించాను, అది శ్రావ్య పిన్ని చీర, అక్క‌డికి వెళ్లావా..? అని అడుగుతుంది. వెళ్లాన‌మ్మా అని దీప చెప్ప‌గా.. మ‌రి నాకెందుకు చెప్ప‌లేదు అంటూ సౌర్య కోపంగా అడుగుతుంది. ఏం చెప్పాల‌ని దీప అడ‌గ్గా.. అక్క‌డికి వెళ్లిన‌ట్లు చెప్ప‌నేలేదు. ఎందుకు వెళ్లావు అని సౌర్య ప్ర‌శ్నిస్తుంది. అన్నీ నీకు చెప్పాలా..? అంత కోపంగా చూస్తావేంటి..? అని దీప అన‌గా.. మ‌రి ఏంటి..? డాక్టర్ బాబుకు ఫోన్ చేసి అమ్మ వ‌చ్చిందా..? అని అడిగితే వ‌చ్చిందో రాలేదో ఏదో ఒక‌టి చెప్పొచ్చు క‌దా.? ఏం చెప్ప‌కుండా ఫోన్ క‌ట్ చేశాడు. అప్ప‌టికీ అమ్మ కోసం హిమ ఏడుస్తుంది అని కూడా చెప్పాను. నువ్వు అక్క‌డే ఉంటే నీకు ఫోన్ ఇవ్వొచ్చు క‌దా. పోని నువ్వైనా అక్క‌డ ఉన్నాన‌ని మాకు చెప్పొచ్చు క‌దా. అడిగితేనేమో అన్నీ నీతో చెప్పాలా..? అని నువ్వు అంటావు. డాక్ట‌ర్ బాబుకు చేస్తే దీనికేంటి చెప్పేది అని క‌ట్ చేస్తాడు. ఇద్ద‌రికి ఇద్ద‌రు మ‌మ్మ‌ల్ని ఏం చేద్దామ‌నుకుంటున్నారు..? అని కోప్ప‌డుతుంది. ఎందుకంత కోపం సౌర్య, అమ్మే క‌దా అని హిమ అంటుంది. సౌర్య.. నేను ఫోన్ చేసిన‌ప్పుడు నువ్వు అక్క‌డే ఉన్నావా అని దీప‌ను ప్ర‌శ్నిస్తుంది. తెలీదు. నువ్వు ఎప్పుడు చేశావో...? నేను ఎప్పుడు వెళ్లానో..? అని దీప అంటుంది. ఏదొక జవాబు అయితే నాన్న చెప్పాలి క‌దా.. చెప్ప‌లేదు. క‌నీసం హిమ ఏడుస్తుంది అన్నా కూడా చెప్ప‌లేదు అని కోప్ప‌డుతూనే ఉంటుంది. ఇక డాడీ ఎందుకు చెప్ప‌లేద‌మ్మా అని హిమ ప్ర‌శ్నించగా.. నేను చెబుతాను డాడీకి అమ్మ అంటే కోపం. కానీ ఆ కోపం ఎందుకో అమ్మ చెప్ప‌దు, నాన్న చెప్ప‌డు, నానమ్మ చెప్ప‌దు, ఎవ్వ‌రూ చెప్ప‌రు అని కోప్ప‌డుతూ ఉంటుంది. వెంట‌నే దీప‌.. చెప్ప‌రు అంటూ వారిపై కోప్ప‌డుతుంది. ఇక రేప‌టి ఎపిసోడ్‌లో అంజి, మౌనిత ఫోన్‌కి ఫోన్ చేస్తుంది. ఆ మాట‌ల‌ను దీప వింటుంది. దీంతో కార్తీక దీపం మ‌రింత ఆసక్తికరంగా మార‌బోతోంది.

  Published by:Manjula S
  First published:

  Tags: Karthika deepam, Karthika deepam telugu serial

  ఉత్తమ కథలు