హోమ్ /వార్తలు /సినిమా /

Karthika deepam: మోనిత గురించి సౌంద‌ర్య‌లో మొద‌లైన అనుమానం.. అప్పుడే కార్తీక దీపం క‌థ‌ కంచికి చేరుతుంద‌న్న దీప

Karthika deepam: మోనిత గురించి సౌంద‌ర్య‌లో మొద‌లైన అనుమానం.. అప్పుడే కార్తీక దీపం క‌థ‌ కంచికి చేరుతుంద‌న్న దీప

అప్పటికే తన పిల్లలు హిమ,శౌర్యలను తన భర్త దగ్గరికి చేరుస్తుంది వంటలక్క. సీరియల్‌కు మెయిన్ విలన్ అయిన మోనిత డాక్టర్ బాబు దక్కలేదనే బాధతో ఆత్మహత్య చేసుకుంటుందని ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పట్లో ఈ సీరియల్ ముగింపు ఊహించడం కష్టమే.

అప్పటికే తన పిల్లలు హిమ,శౌర్యలను తన భర్త దగ్గరికి చేరుస్తుంది వంటలక్క. సీరియల్‌కు మెయిన్ విలన్ అయిన మోనిత డాక్టర్ బాబు దక్కలేదనే బాధతో ఆత్మహత్య చేసుకుంటుందని ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పట్లో ఈ సీరియల్ ముగింపు ఊహించడం కష్టమే.

Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా కొసాగుతోంది. నిన్న‌టి ఎపిసోడ్‌లో సౌంద‌ర్య‌తో మోనిత అహంకారంగా మాట్లాడుతుంది. ఇక దీప ఇంటి ద‌గ్గ‌ర సంతాన‌ల‌క్ష్మి అనే కొత్త పాత్ర‌ను చూపించారు. ఆమె దీప వ‌ద్ద‌కు వ‌చ్చి పిల్ల‌ల‌ను ముద్దు చేస్తుంది. అయితే టిఫిన్ సెంట‌ర్‌కి నాన్న టిఫిన్ సెంట‌ర్ అని ఉండ‌టంతో మీ నాన్న ఎక్క‌డ అని అడుగుతుంది. దాంతో దీప కాస్త ఇబ్బంది ప‌డుతుంటుంది. ఇక ఇవాళ్టి ఎపిసోడ్‌లో సంతాన ల‌క్ష్మి అక్క‌డి నుంచి వెళుతుంది

ఇంకా చదవండి ...

  Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా కొసాగుతోంది. నిన్న‌టి ఎపిసోడ్‌లో సౌంద‌ర్య‌తో మోనిత అహంకారంగా మాట్లాడుతుంది. ఇక దీప ఇంటి ద‌గ్గ‌ర సంతాన‌ల‌క్ష్మి అనే కొత్త పాత్ర‌ను చూపించారు. ఆమె దీప వ‌ద్ద‌కు వ‌చ్చి పిల్ల‌ల‌ను ముద్దు చేస్తుంది. అయితే టిఫిన్ సెంట‌ర్‌కి నాన్న టిఫిన్ సెంట‌ర్ అని ఉండ‌టంతో మీ నాన్న ఎక్క‌డ అని అడుగుతుంది. దాంతో దీప కాస్త ఇబ్బంది ప‌డుతుంటుంది. ఇక ఇవాళ్టి ఎపిసోడ్‌లో సంతాన ల‌క్ష్మి అక్క‌డి నుంచి వెళుతుంది. ఆ త‌రువాత దీప కోపంగా..నాన్న ఒక్క‌టే ఉంటాడు. అనాథలాగా అన్నావు. నాన్న అక్క‌డే ఉంటాడు. మ‌న‌ల్నే అనాథ‌లాగా వ‌దిలేసి అని అంటుంది. ఇక సౌర్య దీప ద‌గ్గ‌ర‌కు వెళ్లి.. బోర్డు చెరిపేద్దామా అమ్మా అని అడ‌గ్గా.. వ‌ద్దులే ఉండ‌నీయ్. అడిగిన వాళ్ల‌కు ఏం స‌మాధానం చెప్పాలో నాకు తెలుసు అని దీప అంటుంది. ఇక వార‌ణాసి.. అక్కా ఊరు, పేరు చెప్పుకోవ‌డానికి కూడా ఎందుకు భ‌య‌ప‌డాలి అని ప్ర‌శ్నించ‌గా.. మ‌న గురించి వెతుక్కుంటూ ఎవ‌రో ఒక‌రు బ‌య‌లుదేరే ఉంటారు. ఎక్క‌డ ఎంక్వైరీ చేసినా మ‌నం దొర‌క‌కూడ‌దు క‌దా అని దీప అంటుంది.

  ఇక ముర‌ళీకృష్ణ దీప‌ను క‌నిపెట్టేందుకు బ‌య‌లుదేరుతుంటాడు. భాగ్యాన్ని పిలిచి నేను బ‌య‌లుదేరుతున్నాను అని చెబుతాడు. అయితే అక్క‌డ భాగ్యం, ముర‌ళీకృష్ణ ఫొటోను పెట్ట‌డం చూసి.. ఏంటే ఇది. నా ఫొటో అక్క‌డ ఉండ‌టం ఏంటి, పుస్తెలు అక్క‌డ పెట్ట‌డం ఏంటి.. నీ మెడలో ప‌సుపుకొమ్ము పెట్టుకోవ‌డం ఏంటి.. ఏంటే ఇదంతా అని అడుగుతాడు. నేను వ్ర‌తం మొద‌లు పెట్టాన‌య్యా అని భాగ్యం అన‌గా.. ఏంటా వ్ర‌తం అని ముర‌ళీకృష్ణ ప్ర‌శ్నిస్తాడు. చిత్ర‌ప‌ట మాంగ‌ల్య వ్ర‌తం అని భాగ్యం చెప్ప‌గా.. ఇదేం చిత్ర విచిత్ర‌మే అని ముర‌ళీకృష్ణ అడుగుతాడు. దానికి భాగ్యం.. పూర్వ‌కాలం రాజులు యుద్ధానికి వెళితే రాణులు ఇలానే చిత్ర‌ప‌టాన్ని పెట్టుకొని మాంగల్య వ్ర‌తం చేసుకునే వార‌ని తీర్ధ‌యాత్ర‌ల్లో తిమింగ‌లానంద స్వామి చెప్పారండి అని అంటుంది. ఇక ముర‌ళీకృష్ణ నిట్టూర్పు విడుస్తూ.. ఆ తిమింగ‌ళం ఏం చెప్పాడో, ఈ తింగ‌రి మొహం దానికి ఏం అర్థ‌మైందో ఏంటో అని అంటాడు. ఇక భాగ్యం.. నువ్వు నీ కూతురు సౌభాగ్యం కోసం నువ్వు ఈ ప్ర‌మాదం.. ఛీ ఛీ ప్ర‌యాణం మొద‌లుపెట్టావు. నా సౌభాగ్యం కాపాడుకోవ‌డం కోసం నా మాంగ‌ల్యాన్ని పూజ‌లో పెట్టాను అని అంటుంది. మ‌రి నా ఫొటో ఎందుకు అక్క‌డ పెట్టావే అని ముర‌ళీకృష్ణ అడ‌గ్గా.. భ‌ర్త‌ను మించిన దేవుడే లేడ‌ని నీ ఫొటోనే పెట్టాన‌య్యా అని భాగ్యం అంటుంది. వెంట‌నే ముర‌ళీకృష్ణ‌.. నీకు తీర్థ‌యాత్ర‌ల్లో ఙ్ఞానం న‌శించి, అఙ్ఞానం ఉద‌యించిన‌ట్లు ఉందే. నీ చాద‌స్తం ఏంటే. నా ఫొటో పెడితే పెట్టావు కానీ దండ వేసి, బొట్టు పెట్ట‌కే. నీకో దండం పెడ‌తాను అని అంటాడు. వెంట‌నే భాగ్యం.. అయ్యో. ఊరుకోవ‌య్యా. దేవుడు భ‌క్తురాలికి దండం పెట్టడం ఏంటి.. నేను రోజూ ఉద‌యం, మ‌ధ్యాహ్నం, సాయంత్రం నీకు, నా మాంగ‌ల్యానికి పూజ‌లు చేస్తూ అర్ధ‌పావుతో ర‌క‌ర‌కాల నైవేద్యాలు చేస్తాన‌య్యా అని అంటుంది.

  ఇక ముర‌ళీకృష్ణ‌.. అర్ధ‌పావు వండొచ్చనే నీ తూకానికి, నీ ఙ్ఞానానికి నా శ్ర‌ద్ధాంజ‌లి ఘటిస్తూ వెళుతున్నాను అని అంటాడు. వెంట‌నే భాగ్యం.. జాగ్ర‌త్త అయ్యా. రోడ్డు దాటుతూ అమ్మ దీప‌, అమ్మ దీప అంటూ ట్రాఫిక్‌ని ప‌ట్టించుకోకుండా దాట‌క‌య్యా. నువ్వు క్షేమంగా తిరిగిరావాలి. నేను మ‌ళ్లీ ఆ మాంగ‌ల్యాన్ని ధ‌రించాలి. వ్ర‌తాన్ని పూర్తి చేసి ధ‌రించాలి అని అన‌గా.. మంచిది. కానీ వాయినాలు అంటూ ఇరుగుపొరుగు వారిని పిల‌వ‌కే. నీకు పిచ్చి ప‌ట్టింద‌నుకొని పిచ్చి ఆసుప‌త్రిలో చేరిస్తే నేను మాత్రం నిన్ను వెన‌క్కి తీసుకురాను అని ముర‌ళీకృష్ణ అంటాడు. ఇక భాగ్యం.. ముందు దీప‌ను, పిల్ల‌ల‌ను తీసుకురావ‌య్య‌. పాపం ఆ సౌంద‌ర్య‌మ్మ నీ మీద ఎంతో న‌మ్మ‌కం పెట్టుకొని పంపిస్తోంది అన‌గా.. అలాగే దీప‌ను క‌చ్చితంగా వెన‌క్కి తీసుకొస్తాను అని ముర‌ళీకృష్ణ అంటాడు. ఇక భాగ్యం.. ఏమ‌య్యా,. క్షేమంగా వెళ్లి లాభంగా రా. ఉండు నేను ఎదురువ‌స్తాను అని చెప్ప‌గా.. వ‌ద్దు భాగ్యం. నీ మాంగ‌ల్యానికి నువ్వే ప‌రీక్ష పెట్టుకోకు. నేను వెళ్లి వ‌స్తాను. వ‌స్తా అని వెళ‌తాడు.

  మ‌రోవైపు సౌంద‌ర్య ఏదో ఆలోచిస్తుండ‌గా.. ఎందుకు అంత అస్థిమితంగా ఉన్నావు సౌంద‌ర్య అని ఆనంద‌రావు అడుగుతాడు. ఆ మోనిత న‌న్ను స్థిమితంగా ఉండ‌నివ్వ‌డం లేదండి అని సౌంద‌ర్య అన‌గా.. నువ్వు మోనిత‌కు భ‌య‌ప‌డుతున్నావా అని ఆనంద‌రావు ప్రశ్నిస్తాడు. లేదు. మోనిత‌కు వాడు మాట ఇచ్చినందుకు భ‌య‌ప‌డుతున్నాను అని సౌంద‌ర్య చెబుతుంది. ఈ లోపు హిమ క‌నిపిస్తే ఆ మ‌హాత‌ల్లి గురించి ప‌ట్టించుకోవాల్సిన ప‌ని లేదు క‌దా అని ఆనంద‌రావు అన‌గా.. హిమ దొర‌క్క‌పోతే అని సౌంద‌ర్య ప్ర‌శ్నిస్తుంది. దానికి ఆనంద‌రావు.. మోనిత మ‌న‌కంటే వేగంగా ప‌ట్టుకోగ‌ల‌దా అని అడుగుతాడు. దానికి కావ‌ల్సింది కార్తీక్‌తో పెళ్లి. అందుకోసం ఏమైనా చేస్తుంది. రాత్రింబ‌వ‌ళ్లు తిరుగుతుంది. అది ఒక ఆడ‌ది అయితే క‌దా. చీక‌టికి బ‌య‌ప‌డానికి, ఒంట‌రిగా తిర‌గ‌డానికి అని సౌంద‌ర్య అంటుంది. నువ్వు వెళ్లి ఏం మాట్లాడావు అని ఆనంద‌రావు అడ‌గ్గా.. ఏం మాట్లాడాల‌న్నా వాడు నా చేతులు క‌ట్టేశాడండి. ఇంత‌కుముందులా మోనిత నాకు కాస్త కూడా భ‌య‌ప‌డ‌టం లేదు. ఎదురుతిరిగి మాట్లాడుతోంది. ధీమాగా స‌మాధానం చెబుతోంది. వాడు పెళ్లి చేసుకుంటాన‌ని మాట ఇచ్చేస‌రికి ఎక్క‌డ లేని తెగింపు వ‌చ్చేసింది అని సౌంద‌ర్య అంటుంది.

  అంత‌లా మారిపోయిందా అని ఆనంద‌రావు అడ‌గ్గా.. మీరు కంగారు ప‌డ‌నంటే ఇంకో విష‌యం చెబుతాను. హిమ దొరికితే వాడు మోనిత ఇంట్లోనే ఉంటాను అన్న‌ట్లుగా చెప్పాడు అని సౌంద‌ర్య అంటుంది. వెంట‌నే ఆనందరావు.. చాచిపెట్టి చెంపకు కొట్ట‌క‌పోయావా అని అన‌గా.. వీడిని కొట్టి, దాన్ని కొట్టి ఏం దారికి తెస్తామండి. దాన్ని కొట్టి కొట్టి నాకే విసుగు వ‌చ్చింది. వీడిని కొడితే మా మ‌ధ్య దూరం మ‌రింత పెర‌గ‌డం మాట అటు ఉంచితే వాడు పంతానికైనా మోనిత‌కు ద‌గ్గ‌ర‌గా అవుతాడు అని సౌంద‌ర్య అంటుంది. ఇక ఆనంద‌రావు.. చిన్నోడి గురించి నాకేం దిగులు లేదు. శ్రావ్య‌తో వాడికి ఎలాంటి పొర‌ప‌చ్చాలు లేవు. బంగారం లాంటి కొడుకు పుట్టాడు. కానీ పెద్దోడి జీవిత‌మే అస్త‌వ్య‌స్తం అయిపోయేలా ఉంది. మ‌నం ఎంత‌గా ఇద్ద‌రి మ‌ధ్య రాజీ కుదుర్చాల‌ని ప్ర‌య‌త్నించినా వాడే చేజేతులా సంసారాన్ని ముక్క‌లు ముక్క‌లు చేసుకున్నాడు. ఇప్పుడు బిడ్డ దూరం అవుతుంద‌న్న ఫ్ర‌స్టేష‌న్‌లో ఏం మాట్లాడుతున్నాడో, ఏం నిర్ణ‌యం తీసుకున్నాడో వాడికే తెలియ‌డం లేదు అని అంటాడు. వెంట‌నే సౌంద‌ర్య‌.. కార్తీక్ స్వ‌త‌హాగా ఎవ్వ‌రికీ హాని చేయ‌డండి. ఆ మోనిత వ‌ల్లే మొత్తం మారిపోతున్నాడు. మంచి, చెడు ఆలోచించే విచ‌క్ష‌ణ‌ను పోగొట్టుకుంటున్నాడు. వాడి వివేకం మొత్తం ఏమైపోతుందో అని అన‌గా.. ఏం చేద్దాం సౌంద‌ర్య అని ఆనంద‌రావు అడుగుతాడు.

  దానికి సౌంద‌ర్య‌.. దీప ఆచూకీ తెలిస్తే త‌ప్ప ఏం చేయాలి అన్నది నాకు పాలుపోవ‌డం లేదండి. మోనిత నోరు మూయించాల‌న్నా, కార్తీక్‌ని క‌ట్ట‌డి చేయాల‌న్నా ఇద్ద‌రు మ‌న చేతులు దాటిపోయారు. వాడి బ‌ల‌హీన‌త హిమ‌. హిమ‌ను అడ్డం పెట్టుకొని పెళ్లి చేసుకుంటాను అనేదాకా వ‌చ్చింది. నేను పాత సౌంద‌ర్య‌ను అయితే, ఒక్క‌సారి అన్నీ మ‌ర్చిపోయి పాత సౌంద‌ర్య‌గా మారితే మోనిత‌ను ఊరి పొలిమేర‌ల వ‌ర‌కు త‌రిమి త‌రిమి కొట్టేదాన్ని. ఇవాళ మాట్లాడిన‌ట్లు మాట్లాడితే స్పాట్‌లో షూట్ చేసేదాన్ని. అంత‌గా ర‌గిలిపోతుంది నాకు. నాకు ఒక్క విష‌య‌మే మింగుడుప‌డ‌టం లేదండి. ఏ ఆడ‌ది అయినా పెళ్లి అయ్యాక పిల్ల‌ల కోసం త‌పిస్తుంది. అప్పుడే జ‌న్మ సార్ధ‌కం అయ్యింద‌ని, ప‌రిపూర్ణ స్త్రీ అయ్యింద‌ని అనుకుంటుంది. మ‌రి కార్తీక్‌కి పిల్ల‌లు పుట్ట‌ర‌ని తెలిసి మోనిత ఏరికోరి వాడినే పెళ్లి చేసుకోవాల‌ని ఎందుకు అనుకుంటుంది. ఇందులో ఏదైనా మ‌త‌ల‌బు ఉందా అని అంటుంది.

  మ‌రోవైపు దీప ఒంట‌రిగా కూర్చొని సంతాన‌ల‌క్ష్మి మాట‌ల‌ను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అది గ‌మ‌నించి సౌర్య, దీప ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌బోతుండ‌గా హిమ అడ్డుకుంటుంది. అమ్మ‌ను మ‌ళ్లీ బాధ‌పెట్టాము అని హిమ అన‌గా.. మ‌న‌మేం చేశాము అని సౌర్య అడుగుతుంది. దానికి హిమ.. మ‌నం కాదు. అస‌లు ఇదంతా మొత్తం నీ వ‌ల్లే అని అన‌గా.. నేనా.. నేనేం చేశాను అని సౌర్య ప్ర‌శ్నిస్తుంది. నువ్వేగా టిఫిన్ సెంట‌ర్‌కి నాన్న టిఫిన్స్ అని పేరు పెట్టింది. అందుకేగా ఆవిడ ఎవ‌రో్ వ‌చ్చి ఏదోదే మాట్లాడిపోయింది. నాన్న టిఫిన్స్ అని పెడితే మీ నాన్న ఏడి అని అడిగితే ఏం చెప్తాము. అమ్మ ఏమ‌ని చెబుతుంది అని హిమ అంటుంది. ఇక సౌర్య‌.. నేను అలా అడుగుతార‌నుకోలేదు. ఆవిడ అలా అంటుద‌ని కూడా అనుకోలేదు అని అన‌గా.. చూడు ఆవిడ అలా అడిగినందుకే అమ్మ అంతలా బాధ‌ప‌డుతోంది అని హిమ అంటుంది. ఇక సౌర్య‌.. నాన్న ఎంత‌లా గుర్తు చేసుకుంటాడు. మ‌నం నాన్న‌ని ఆ బోర్డు చూసిన‌ప్పుడ‌ల్లా గుర్తు చేసుకోవ‌చ్చున‌ని ఆ పేరు పెట్టాను అని అన‌గా.. అమ్మ‌నే ఇడ్లీ చేస్తుంది. అమ్మ‌నే చ‌ట్నీ చేస్తుంది. అమ్మ‌నే అన్నీ రుబ్బుతుంది. అమ్మే బాగా క‌ష్ట‌ప‌డుతుంది. నాన్న ఏం చేస్తున్నాడు. అయినా నువ్వు నాన్న పేరే పెట్టావు. అమ్మ‌నే క‌దా అన్నీ చేసేది అని హిమ అంటుంది.

  నిజ‌మే మ‌నం నాన్న‌ను గుర్తు చేసుకున్న‌ప్పుడ‌ల్లా అమ్మ బాధ‌ప‌డుతుంది అని సౌర్య అన‌గా.. ఇంకా ఎక్కువ గుర్తు చేసుకుంటే వార‌ణాసికి చెప్పి మ‌న‌ల్ని నాన్న ద‌గ్గ‌రకు పంపిమ‌ని చెబుతుంది అని హిమ అంటుంది. ఇక సౌర్య‌.. ఆ బోర్డు ఉంటే అంద‌రూ మీ నాన్న ఎక్క‌డ అని అడుగుతారేమో అని అన‌గా.. అవును తీసేద్దాం బావుండ‌దు అని హిమ అంటుంది. వార‌ణాసికి న‌ల్ల రంగు తెమ్మ‌ని చెబుదాం. నాన్న అన్న‌ది క‌న‌ప‌డ‌కుండా చెరిపేద్దాం అని సౌర్య అన‌గా.. స‌రే అని హిమ అంటుంది. అయినా పాపం నాన్న మంచివాడు క‌దా అని సౌర్య అన‌గా.. హిమ అవును అంటుంది. నాన్న‌ను ఒక్క‌రు ప‌ట్టించుకోరు. అంద‌రూ నాన్న‌నే అంటారు. క‌నీసం పేరు కూడా పెట్ట‌నివ్వ‌రా అని సౌర్య అని లోప‌లికి వెళుతుంది. ఆ మాట‌ల‌న్నీ వింటున్న దీప ఏడుస్తూ.. మా ఇద్ద‌రి మ‌ధ్య మీ ఇద్ద‌రు ఎంత న‌లిగిపోతున్నారో తెలుసు. అందుకే క‌దా. మీ నాన్న కాళ్లావేళ్లా ప‌డ్డాను. వెనుకాల ఉన్న ఆస్తి కోస‌మా. మీ ఇద్ద‌రికీ నాన్న ఉండాల‌నే క‌దా. ఎన్ని మాట‌లు అన్నారు న‌న్ను. అవ‌న్నీ మ‌ర్చిపోవాల‌నుకున్నా గుండెల్లో ఈటెల్లా గుచ్చుకుంటున్నాయి అని ఏడుస్తుంది.

  ఇక కార్తీక్ ఇంట్లోకి వ‌స్తాడు. ఇంట్లో ఎవ‌రూ క‌నిపించ‌క‌పోవ‌డంతో ఆదిత్య అని పిలుస్తాడు. లోప‌లి నుంచి శ్రావ్య వ‌చ్చి వ‌చ్చారా బావ. ఆదిత్య టెర్ర‌స్‌పైన ఉన్నాడు. మీరు వ‌చ్చాక ప్రెష్ అయ్యి టెర్ర‌స్ పైకి ర‌మ్మ‌న్నాడు అని అంటుంది. మ‌రి మ‌మ్మీ, డాడీ ఎక్క‌డా అని అడ‌గ్గా.. వారు గార్డెన్‌లో ఉంటామ‌ని చెప్పారు అని శ్రావ్య అంటుంది.

  ఇక దీప.. దేవుడిని మొక్కుతూ.. నాకు పెళ్లై ప‌దేళ్లు అయ్యింది. స‌రిగ్గా ఇదే రోజు అయ్యింది. ఏం ఒరిగింది. ఏం మిగిలింది. ఇక్క‌డే నేను, ఎక్క‌డో ఆయ‌న‌. ఏది బంధం, ఏది సంబంధం, ఏది అనుబంధం, దీన్ని పెళ్లి అంటారా.. ఈ పెళ్లికి ఓ పెళ్లి రోజు ఉందంటారా.. ఇది రోజులా వ‌చ్చే ఒక రోజు అంతే. ఆ రాశికి నేను గుర్తున్నాన్నా.. ఆ మారాశికి ఈ రోజు గుర్తు ఉంటుంది. ఉంటే విడిపోయినందుకు బాధ‌ప‌డుతాడా.. పెళ్లైనందుకు బాధ‌ప‌డుతాడా.. పెళ్లై వెళ్లిపోయింద‌ని సంతోష‌ప‌డ‌తాడా.. ఏంటి మ‌నుషులు. ధ‌ర్మం అధ‌ర్మంలా ఎందుకు మారింది. ఆశ‌యాలు న‌డిమ‌ధ్య‌లోనే ఎలా మ‌ర్చిపోతారు. ఆర్దుల‌ను, అనాధ‌ల‌ను, నిరుపేద‌ల‌ను ఆద‌రించే ఆ హృద‌యంలో ఎప్ప‌టికీ కార్తీక దీపం వెల‌గ‌దా.. నేను చేయ‌ని పాపం న‌న్ను వ‌ద‌లదా అని అంటుంది. ఇక వార‌ణాసి అక్కా అని వ‌స్తాడు. ఏంట‌ది వార‌ణాసి అని అడ‌గ్గా.. నాన్న పేరును చెరిపేయ‌డానికి న‌ల్ల‌రంగు తెచ్చామ‌మ్మా అని సౌర్య అంటుంది. ఇక హిమ.. నాన్న పేరు కాద‌మ్మా. నాన్న టిఫిన్స్ అని పెట్టిన దాన్ని చెరిపేస్తాం అన‌గా.. ఎందుకు అని దీప అడుగుతుంది. నాన్న ఎవ‌రు అని అడుగుతార‌ని అని సౌర్య చెప్ప‌గా.. ఆవిడ ఎవ‌రో వ‌చ్చి అడిగితే ఏం చెప్తారు అని అడిగింది క‌ద‌మ్మా అని హిమ అంటుంది.

  అందుకు నువ్వు చాలా బాధ‌ప‌డ్డావు క‌దా అని హిమ అన‌గా.. అందుకే వెళ్లి చెరిపేస్తామ‌మ్మా అని సౌర్య అంటుంది. దానికి దీప‌.. నాన్న పేరును చెరిపేస్తారు. నాన్న‌నే మ‌న‌సులో నుంచి చెరిపేయ‌గ‌ల‌రా అని ప్ర‌శ్నిస్తుంది. మ‌రి అంద‌రూ అడిగితే బావుండ‌దు క‌ద‌మ్మా అని సౌర్య అన‌గా.. ఇప్ప‌టికీ ఎంద‌రో అడిగారు న‌న్ను. నిజ‌మే. బావుండ‌దు. కానీ నాన్నే లేడు అన్నా బావుండ‌దు క‌దా. ఉన్నారు క‌దా. ఖ‌రీదైన బంగ్లాలో, ప‌డ‌వ అంత కారులో, గుండె బాగుచేసే ఆసుప‌త్రిలో, మీ మ‌న‌సులో, నా మంగ‌ల‌సూత్రంలో, మ‌న‌తో లేకున్నా మ‌న‌లోనే ఉన్నారు. స్వామి స‌ర్యాంత‌ర్యామిలాగా విస్త‌రించిపోయారు అని దీప అంటుంది. మ‌రి ఆ బోర్డును చూసిన‌ప్పుడ‌ల్లా నువ్వు బాధ‌ప‌డ‌తావు క‌ద‌మ్మా అని హిమ అనగా.. బోర్డు చూసిన‌ప్పుడేనా బాధ‌ప‌డేది, బొట్టు పెట్టుకున్న‌ప్పుడు గుర్తు వ‌స్తాడు. సింధూరంలోనూ క‌నిపిస్తారు. మంగ‌ల‌సూత్రంలోనూ ద‌ర్శ‌న‌మిస్తారు. మెట్టెల స‌వ్వ‌డిలోనూ వినిపిస్తారు. ఆఖ‌రికి శూన్యంలోకి చూసినా ఆ రూపంతోనే క‌నిపిస్తారు. స్వామి స‌ర్వ‌మంగ‌ళ‌విగ్ర‌హం క‌దా. ఆ నిజ రూప సంద‌ర్శ‌నం స‌దా జ‌రుగుతూనే ఉంటుంది అని దీప అంటుంది.

  ఇక వార‌ణాసి.. అక్కా డాక్ట‌ర్ బాబుపై ఇంత ప్రేమ పెట్టుకొని నీకు ఎంత క‌ష్టం అక్కా. నీ మ‌న‌సులో డాక్ట‌ర్ బాబు ఇంకా దేవుడిలాగానే ఉన్నాడు అని అంటాడు. దానికి దీప గుడికి వెళితే దేవుడు అంద‌రి కోరిక‌లు తీర్చ‌డు వార‌ణాసి. అన్నీ కోరిక‌లు తీర్చ‌డు. అంత మాత్రానా. దేవుడు, దేవుడు కాకుండా పోతాడా.. త‌ల‌రాత అంటే నీటి మీద రాత కాదు వార‌ణాసి. వెంట‌నే అదృశ్య‌మైపోవ‌డానికి. మ‌నం ఉన్నంత కాలం మ‌న‌ల్ని న‌డిపిస్తూనే ఉంటుంది అని దీప అంటుంది. మ‌నం మ‌న ఊరికి వెళ్లిపోదామ‌క్కా అని వార‌ణాసి అన‌గా.. ఎందుకు, ఏముంది అక్క‌డ‌. బిరుదులా, స‌న్మానాలా, స‌త్కారాలా. ఛీత్కారాలా, ఏమున్నాయి అక్క‌డ అని దీప అంటుంది. సౌంద‌ర్యమ్మ గారు ఉన్నారు క‌దా అక్క అని వార‌ణాసి అన‌గా.. ఉన్నారు. ఆవిడ ఉన్నారు కాబ‌ట్టే అన్ని రోజులు ఉన్నాను. దేవుడే వరం ఇవ్వ‌న‌ప్పుడు ఎన్ని స‌హ‌స్త్ర‌నామాలు, ఎన్ని కుంభాల‌తో అభిషేకాలు మ‌న‌కోసం చేసినా ఫ‌లితం ఉంటుందా..అమ్మ‌కు, అత్త‌కు మ‌ధ్య ఆవిడ న‌లిగిపోవ‌డం త‌ప్ప‌.. కోడ‌లికి, సాటి స్త్రీకి మ‌ధ్య ఆవిడ ఉనికి కోల్పోవ‌డం త‌ప్ప మార్పు ఉంటుందా.. ఆ మార్పు ఎక్కడ రావాలి, ఎవ‌రిలో రావాలి. వారే, ఆ స్వామి. క‌రుణాంత‌రంగుడై క‌రుణిస్తేగానీ ఈ క‌థ కంచికి చేర‌దు, ఈ క‌థ మంచికి చేర‌దు అని దీప అంటుంది. దాంతో పిల్ల‌లిద్ద‌రు ఏడుస్తుంటారు. ఇక వారిద్ద‌రినీ దీప ద‌గ్గ‌ర‌కు తీసుకుంటుంది.

  Published by:Manjula S
  First published:

  Tags: Karthika deepam, Karthika Deepam serial, Television News

  ఉత్తమ కథలు