హోమ్ /వార్తలు /సినిమా /

Karthika Deepam: డాక్ట‌ర్ బాబుకు స‌రోజ‌క్క సూటి ప్ర‌శ్న‌లు.. పెళ్లి చేసుకుంటాన‌ని మోనిత‌కు మాటిచ్చిన కార్తీక్

Karthika Deepam: డాక్ట‌ర్ బాబుకు స‌రోజ‌క్క సూటి ప్ర‌శ్న‌లు.. పెళ్లి చేసుకుంటాన‌ని మోనిత‌కు మాటిచ్చిన కార్తీక్

అప్పటికే తన పిల్లలు హిమ,శౌర్యలను తన భర్త దగ్గరికి చేరుస్తుంది వంటలక్క. సీరియల్‌కు మెయిన్ విలన్ అయిన మోనిత డాక్టర్ బాబు దక్కలేదనే బాధతో ఆత్మహత్య చేసుకుంటుందని ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పట్లో ఈ సీరియల్ ముగింపు ఊహించడం కష్టమే.

అప్పటికే తన పిల్లలు హిమ,శౌర్యలను తన భర్త దగ్గరికి చేరుస్తుంది వంటలక్క. సీరియల్‌కు మెయిన్ విలన్ అయిన మోనిత డాక్టర్ బాబు దక్కలేదనే బాధతో ఆత్మహత్య చేసుకుంటుందని ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పట్లో ఈ సీరియల్ ముగింపు ఊహించడం కష్టమే.

Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతోంది. నిన్న‌టి ఎపిసోడ్‌లో దీప‌, పిల్ల‌ల‌ను ఇంటికి తీసుకురావాల‌ని ఆనంద‌రావు, కార్తీక్‌ను బ‌ల‌వంత‌పెడుతుంటాడు. ఇవాళ్టి ఎపిసోడ్‌లో వారి సంభాష‌ణ కొన‌సాగుతుంటుంది. ఆనంద‌రావు మాట్లాడుతూ.. నేను ఎవ్వ‌రి మాట విన‌ను. ఇవాళ నేను వెళ్లి తీసుకురావాల్సిందే. నువ్వు రా.. రా అని కార్తీక్‌ని లాక్కెళుతుంటాడు. వెంట‌నే సౌంద‌ర్య‌.. ఆగండి. దీప లేదండి అని అంటుంది.

ఇంకా చదవండి ...

  Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతోంది. నిన్న‌టి ఎపిసోడ్‌లో దీప‌, పిల్ల‌ల‌ను ఇంటికి తీసుకురావాల‌ని ఆనంద‌రావు, కార్తీక్‌ను బ‌ల‌వంత‌పెడుతుంటాడు. ఇవాళ్టి ఎపిసోడ్‌లో వారి సంభాష‌ణ కొన‌సాగుతుంటుంది. ఆనంద‌రావు మాట్లాడుతూ.. నేను ఎవ్వ‌రి మాట విన‌ను. ఇవాళ నేను వెళ్లి తీసుకురావాల్సిందే. నువ్వు రా.. రా అని కార్తీక్‌ని లాక్కెళుతుంటాడు. వెంట‌నే సౌంద‌ర్య‌.. ఆగండి. దీప లేదండి అని అంటుంది. దాంతో ఆనంద‌రావు, కార్తీక్‌ షాక్‌కి గురవుతారు. వెంట‌నే ఆనంద‌రావు ఏంటి అని అడ‌గ్గా.. దీప లేదండి. ఆ ఇంట్లో లేరు అని సౌంద‌ర్య చెబుతుంది. దానికి ఆనంద‌రావు.. వాళ్ల నాన్న ద‌గ్గ‌రికి వెళ్లిపోయిందా. పోని అక్క‌డికే వెళ‌దాం అని అన‌గా..ఇల్లు ఖాళీ చేసి పిల్ల‌ల‌ను తీసుకొని ఎవ‌రికీ చెప్ప‌కుండా ఎక్కడికో వెళ్లిపోయిందండి. వెళ్లిపోయింది. మీ ఆరోగ్యం బాగాలేద‌ని, మీకు తెలిస్తే త‌ట్టుకోలేర‌ని చెప్పుకుండా దాచిపెట్టాం అని సౌంద‌ర్య చెబుతుంది.

  ఇక ఆనంద‌రావు.. అంటే.. అంటే.. ఆ ఇల్లు కాక‌పోతే ఇంకో ఇంట్లో అని త‌డ‌బ‌డుతూ అడ‌గ్గా.. అస‌లు ఊర్లోనే లేదు అది. గుండె ప‌గిలి ఎక్క‌డికో వెళ్లిపోయింద‌ని స‌రోజ చెప్పింది అని సౌంద‌ర్య ఏడుస్తూ చెబుతుంది. ఇక ఆనంద‌రావు నువ్వు స‌రిగ్గా విన్నావా అని అడ‌గ్గా.. అది ఇలా చేస్తుంద‌నుకోలేదండి. వీడు ఎప్ప‌టికీ మార‌ను, మార‌ను, మార‌ను అనే స‌రికి ఇంక ఏ ఆశ‌తో ఉంటుంది. ఏ న‌మ్మ‌కంతో ఎదురుచూస్తుంది అని సౌంద‌ర్య చెబుతుంది. వెంట‌నే ఆనంద‌రావు బాధ‌ప‌డుతూ.. పెద్దోడా. లేదంట‌రా. నువ్వు కారు తీయొద్దు, మ‌నం వెళ్లొద్దు. పిల్లలు కూడా ఉండ‌రు. నీకు సంతోష‌మే క‌దా. నీకు సంతోష‌మేక‌దారా అని ఏడుస్తూ సోఫాలో కూర్చుంటాడు. అయిపోయింది. అంతా అయిపోయింది. దీప క‌థ ముగిసిపోయింది. రేయ్ మీ అమ్మ అన్న‌ట్లు మీ ఆవిడ‌కు బాగా సెల్ఫ్ రెస్పెక్ట్. ఏం నాకు హ‌క్కు లేదా మామ‌య్య‌. మేం ఇక్క‌డే ఉంటాం. మీతోనే ఉంటాం అంటే నేను, మీ అమ్మ కాదంటామా. ఇంత ఆస్తి సంపాదించాము. అంతా పోయేనాడు మ‌న వెంట తీసుకుపోతామా అని ఆనంద‌రావు ఏడుస్తుంటాడు.

  ఇక సౌంద‌ర్య ట్యాబ్లెట్లు తీసుకొచ్చి వేసుకోమ‌ని ఆనంద‌రావుకు చెబుతుంది. దాంతో ఆనంద‌రావు ట్యాబ్లెట్ వేసుకొని బాధ‌ప‌డుతూ ఉంటాడు. మ‌రోవైపు కార్తీక్ పైకి వెళుతూ హిమ‌, సౌర్య ఙ్ఞాప‌కాల‌ను గుర్తు చేసుకుంటూ బాధ‌ప‌డుతూ మెట్ల‌పై కూర్చుంటాడు. అది చూసి సౌంద‌ర్య, కార్తీక్ ద‌గ్గ‌ర‌కు వెళుతుండ‌గా.. ఆదిత్య అడ్డుకొని అమ్మ అన్న‌య్య‌ను ఇప్పుడు క‌దిలించ‌కు. వ‌దిన గురించి కూడా ఏం మాట్లాడ‌కు. అన్న‌య్య ఇప్పుడు పిల్లలు వెళ్లిపోయార‌న్న షాక్‌లో ఉన్నాడు. బాధ‌ప‌డుతున్నాడు. ఆ బాధ త‌గ్గేదాకా మ‌నం కూడా దూరంగా ఉందాం అని అంటాడు. ఇక సౌంద‌ర్య ఏడుస్తూ.. ఆ బాధ ఎప్ప‌టికి త‌గ్గుతుందిరా. ఎప్ప‌టికి త‌గ్గుతుంది అని అంటుంది. ఇక ఆదిత్య‌.. మ‌మ్మీ అని సౌంద‌ర్య‌ను సోఫాలో కూర్చోబెడ‌తాడు. ఇక కార్తీక్ ఏడుస్తూ కుమిలిపోతూ ఉంటాడు.

  మ‌రోవైపు వార‌ణాసి ఒక టిఫెన్ బండిని తీసుకొస్తాడు. దీప దాన్ని చూస్తుండ‌గా.. దీనికి రంగులు వేయాల్సిన ప‌ని లేద‌క్కా. క‌డిగేస్తే స‌రిపోతుంది. పైగా నీట్‌గా కూడా ఉంటుంది అని వార‌ణాసి చెబుతాడు. అటుగా సౌర్య‌, హిమ‌లు వ‌స్తారు.ఇది ఎవ‌రిద‌మ్మా అని సౌర్య అడ‌గ్గా.. ఇక నుంచి మ‌న‌దే అని దీప చెబుతుంది. ఎందుకు అని సౌర్య అడ‌గ్గా.. నేను వంట‌ల‌క్క‌ను క‌దా. మ‌ళ్లీ అదే బ‌తుకు మొద‌లుపెట్టాలి క‌దా. నా పేరు నేను సార్ధ‌కం చేసుకుంటాను. అందుకే క‌దా పుట్టాను అని దీప చెబుతుంది. ఇక వార‌ణాసి.. అమ్మ టిఫెన్లు చేసి దీని మీదే అమ్మాల‌నుకుంటుంద‌మ్మా అని అంటాడు. ఇక సౌర్య‌, సౌంద‌ర్య మాటల‌ను గుర్తుచేసుకుంటూ ఉంటుంది. మ‌రోవైపు హిమ‌.. నువ్వు రోడ్డు ప‌క్క‌న అంద‌రికీ ఇడ్లీలు చేసి అమ్ముతావా అమ్మా అని అడ‌గ్గా.. ఆత్మాభిమానాన్ని అమ్ముకోవ‌డం క‌న్నా అదే గౌర‌వం అని దీప చెబుతుంది. దానికి హిమ ఏంట‌మ్మా అని అన‌గా.. ఏం లేద‌మ్మా అని దీప చెబుతుంది. ఇక హిమ‌.. ఇదేంట‌మ్మా ఈ బండి అని అడ‌గ్గా.. ఇది తోపుడు బండేన‌మ్మా. కానీ క‌ద‌ల‌దు. ఒకేచోట ఉంటుంది. నా బ‌తుకులాగా. ముందుకు న‌డిపించే వాళ్లు ఉండ‌రు అని దీప చెబుతుంది.

  వెంట‌నే సౌర్య‌.. నాన‌మ్మ‌కు ఇలాంటి బండి అంటే ఇష్టం ఉండ‌దు క‌ద‌మ్మా అని అన‌గా.. మిమ్మ‌ల్ని పోషించ‌లేక ప‌స్తులు ఉంచ‌డం మాత్రం మీ నాన‌మ్మ‌కు ఇష్టం ఉంటుందా అని దీప అడుగుతుంది. ఉండ‌దు అని సౌర్య చెప్ప‌గా.. ఉండ‌దు అని దీప అంటుంది. ఇక టిఫిన్ సెంట‌ర్‌కు ఏదైనా పేరు పెడ‌దామా అక్క అని వార‌ణాసి అడ‌గ్గా.. ఊరు, పేరు, ఇంటి పేరు వాడుకోలేని వాళ్ల‌ము. మ‌న‌కెందుకురా పేరు. పెట్టిన ఇడ్లీ తృప్తిగా తిని ఇక్క‌డ బావుంటుంది అన్న పేరు వ‌స్తే చాలు. జ‌నాలు వాళ్లే వ‌స్తారు అని దీప అంటుంది. వెంట‌నే వార‌ణాసి.. ఫ‌లానా టిఫిన్ సెంట‌ర్‌లో టిఫిన్ బావుంటుంది అని చెప్పుకోవ‌డానికైనా పేరు ఉండాలి క‌దా అని అన‌గా.. అవున‌మ్మా. మంచి పేరు పెడ‌దాం అని సౌర్య అంటుంది. స‌రే అదేదో మీరే పెట్టండి అని దీప అంటుంది. ఇక సౌర్య‌.. మ‌నం స్కూల్‌కి వెళ్లే దారిలో అమ్మ టిఫిన్స్ అని ఉంటుంది. అలాంటి పేరు పెట్టాలి అని అన‌గా.. అదే పేరు పెడ‌దామా అని హిమ అంటుంది. ఇక సౌర్య‌.. అమ్మంటే అంద‌రూ ఇష్ట‌ప‌డుతారు మ‌న‌లాగే. మ‌నం నాన్న‌ను వ‌దిలిపెట్టి అమ్మ‌తో రాలేదా. కానీ నాన్నే అనాథ‌లా ఒక్క‌డే ఉంటాడు. మ‌నం నాన్న టిఫిన్స్ అని పెడ‌దాం అని అంటుంది. అయితే దానికి దీప ఏమంటుందో అని.. సౌర్య వెన‌క్కి వెళుతూ ఉంటుంది. కానీ దీప‌, సౌర్య‌ను ద‌గ్గ‌ర‌కు ర‌మ్మంటుంది. ఆ త‌రువాత సౌర్య‌.. నాన్న టిఫిన్ సెంట‌ర్ అని పెడ‌దామా అమ్మ అని అన‌గా.. కానీ నాన్న‌కు మ‌న‌మంటే ఇష్టం లేదు క‌దా అని హిమ అంటుంది. ఇక సౌర్య‌.. నాన్న‌కు మ‌న‌మంటే ఇష్ట‌మే అని అన‌గా.. అవును ఇష్ట‌మే. మీవి ప‌సిమ‌నుసులు. మీ వ‌య‌సుకు నాన్న‌ను మ‌ర్చిపోవ‌డం అన్న‌ది అస‌త్యం. నేను ఆవేద‌న‌లోనో, ఆవేశంలోనో.. విరక్తిలోనో, వైరాగ్యంలోనో మీ నాన్న‌ను మ‌ర్చిపోమ‌ని మీతో చెప్పాను. అది మీ వ‌ల్ల కాద‌ని మ‌ళ్లీ నాకే అర్థం అవుతుంది. అడుగ‌డుగునా నాన్న‌ను త‌లుచుకుంటున్నారు. త‌లుచుకోవ‌ద్ద‌ని మీకు చెప్పే హ‌క్కు నాకు లేదు. నా మ‌న‌సుకైన గాయం చాలు. మీ మ‌న‌సుకు కూడా గాయ‌మైతే అది నా గాయం క‌న్నా పెద్ద‌దిగా క‌నిపిస్తుంది నాకు. అది నేను భ‌రించ‌లేను. నాన్న వ‌స్తాడ‌ని అతిగా ఆశ‌లు పెంచుకోకండి. రాక‌పోతే ఆ నిరాశ‌ను త‌ట్టుకోవ‌డానికి అంద‌రూ దీప‌లు కాలేరు. అందులోనూ ప‌సివాళ్లు మీరు. అస‌లు కాలేరు అని దీప చెప్పి.. పిల్ల‌లిద్ద‌రిని ద‌గ్గ‌ర‌గా తీసుకొని మీకు ఏ పేరు న‌చ్చితే అదే పెట్టుకోండి. కాద‌నే శ‌క్తి నాకు లేదు అని లోప‌లికి వెళుతుంది. ఆ త‌రువాత హిమ‌.. నువ్వు నాన్న‌ను గుర్తు చేస్తావెందుకు సౌర్య అని అడుగుతుంది. ఇక వార‌ణాసి.. నాన్న‌ను అమ్మ మ‌ర్చిపోతే క‌ద‌మ్మా. ఎవ‌రో గుర్తు చేయ‌డానికి అని అంటాడు. లోప‌ల దీప ఏడుస్తూ ఉంటుంది.

  ఇక సౌంద‌ర్య ఇంట్లో.. ఆనంద‌రావుకు సౌంద‌ర్య‌, ఆదిత్య‌లు జ్యూస్, ట్యాబ్లెట్లు ఇస్తుంటారు. మ‌న‌వరాళ్లు ఆడ‌పిల్ల‌లు లోకం తెలియ‌ని ప‌సివాళ్లు. దీప ఇన్నాళ్లు క‌ళ్లెదురుగా క‌న‌బ‌డి ఇప్పుడు ఎక్క‌డ ఉన్నారో ఆశ్ర‌యం లేదు. ఆద‌రించే వాళ్లు లేరు, ఆస్తి లేదు, సంపాద‌న లేదు. మన కోడ‌లు, మ‌న వార‌సులు ఇంత అశ్వైర్యం ఉండి కూడా ఉత్త చేతుల‌తో వెళ్లిపోయారు. ఎలా బ‌తుకుతారు సౌంద‌ర్య‌. ఎక్క‌డికి వెళ్లి ఉంటుందో వెతికించు. ఎంత ఖ‌ర్చు అయినా ప‌ర్వాలేదు. మ‌నుషుల‌ను పంపించు అని ఆనంద‌రావు అంటాడు. దానికి సౌంద‌ర్య‌.. ముందు మీరు కంగారు ప‌డ‌కండి. ఎవ‌రూ ఎక్క‌డికి వెళ్ల‌రు అని అంటుంది. మ‌ళ్లీ ఆనంద‌రావు.. జ‌రిగేవ‌న్నీ చూస్తూ, మ‌న కోడ‌లు వెళుతుంటే ప్రేక్ష‌కుల్లా చూస్తూ ఉండిపోయాం అనగా.. అది ఇలాంటి నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని క‌ల‌లో కూడా అనుకోలేదండి. క‌ళ్లెదురుగానే ఉంటుంది క‌దా అని ఆశ‌ప‌డ్డాను. మ‌న‌సు చెదిరి నిరాశ‌తో వెళ్లిపోతుంద‌ని ఊహించ‌లేదు. మీరు బెంగ‌పెట్టుకోకండి. దీప‌, పిల్ల‌లు ఎక్క‌డున్నా వెతికి తీసుకొచ్చే బాధ్య‌త నాది అని సౌంద‌ర్య అంటుంది.

  దానికి ఆదిత్య‌.. మ‌నం వెత‌క‌డం కాదు మ‌మ్మీ. అన్న‌య్యే వెతికేలా చేయాలి. మ‌నం వెతికితే శ్రీరాం న‌గ‌ర్ బ‌స్తీ, కాక‌పోతే సీతాన‌గరం బ‌స్తీలో పెట్టాలి. మ‌ళ్లీ అదే జీవితం, అదే పేద‌రికం. అవే క‌న్నీళ్లు, అదే వంటరిత‌నం. ఏం మ‌మ్మీ. నేను నీ కళ్ల‌కు స్టుపిడ్‌లా క‌నిపిస్తున్నానా అని అంటాడు. దానికి సౌంద‌ర్య‌.. అన్న‌య్య వెతికేవాడే అయితే వెళ్లినిచ్చేవాడు కాదురా. వెళ్ల‌నిచ్చాడు అంటే ఉండ‌నిచ్చే ఉద్దేశ‌మే లేదు. నాలుగు రోజులు హిమ కోసం బాధ‌ప‌డుతాడు త‌ప్ప భార్యా బిడ్డ‌లు దూర‌మైపోయార‌ని పిచ్చోడు అయిపోడు క‌దా అని అంటుంది. ఇక ఆనంద‌రావు.. వాడు మారడ‌ని మ‌న‌కే కాదురా. ప‌దేళ్లుగా మారుతాడ‌ని ఎదురుచూసిన మీ వ‌దిన‌కు కూడా అర్థ‌మైపోయింది. అందుకే ఎదురుచూడ‌టం మానేసి, ఎవ‌రూ చూడాల్సిన అవ‌స‌రం లేదంటూ దూరంగా వెళ్లిపోయింది. క‌నీసం ఆచూకీ కూడా తెలీకుండా జాగ్ర‌త్త‌ప‌డింది. వెంట‌నే సౌంద‌ర్య‌.. దీప దొరికితే వాడు తిరిగి ఆదరిస్తాడా.. లేదా అన్న ప్ర‌శ్న‌కు మ‌న అంద‌రికీ జ‌వాబు తెలుసు. ఆ ప్ర‌శ్న దీప‌కు తెలీదా.. ఆ జవాబు దీప ఊహ‌కు అంద‌దా.. పిల్ల‌ల కోస‌మైనా ప‌రీక్ష చేయించుకుంటాడ‌ని ఆశ‌ప‌డ్డాం. అక్క‌డా కోర్టుకు వెళ్ల‌కుండా ఆగి నిరాశ‌ను మిగిల్చాడు. పిల్ల‌ల‌కోస‌మైనా కాపురాన్ని నిల‌బెట్టుకోవాల‌న్న ఆలోచ‌న వాడికి రాలేదు, రాదు, ఇంతే అని అంటుంది. ఇక ఆదిత్య‌.. అన్న‌య్య‌కు అర్థం కావ‌డం లేదు మ‌మ్మీ.ఎప్పుడూ త‌ను మాట్లాడిందే క‌రెక్ట్ అన్న అభిప్రాయంలో ఉంటాడు. చేతనైతే మ‌నం అన్న‌య్య మ‌న‌సు మార్చుదాం. లేదంటే అన్న‌య్య కుటుంబాన్ని మ‌ర్చిపోదాం. నువ్వు దిగులు ప‌డినంత మాత్రాన అన్న‌య్య మార‌డు డాడీ. అది గుర్తు పెట్టుకో. ట్యాబ్లెట్ వేసుకో అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ త‌రువాత ఆనంద‌రావు.. వాడి మాట‌ల్లో బాధ కాకుండా ఇంకా ఏదో ఉంది సౌంద‌ర్య అన‌గా.. అర్థం ఉంది. వాడికి ఏదో క్లారిటీ వ‌చ్చింద‌ని అర్థ‌మైంది అని సౌంద‌ర్య అంటుంది.

  ఇక కార్తీక్.. శ్రీరామ్ న‌గ‌ర్‌లో దీప అంత‌కుముందు ఉండే ఇంటికి వెళ‌తాడు. అక్క‌డ సౌర్య‌, హిమ ఙ్ఞాప‌కాల‌ను గుర్తు చేసుకుంటుంటాడు. బ‌య‌ట‌కు రాగానే అక్క‌డ స‌రోజ ఉంటుంది. దీప ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయింద‌నుకుంటున్నారా డాక్ట‌ర్ బాబు. మీ కాపురం నుంచే ఖాళీ చేసి వెళ్లిపోయింది. మీ బ‌తుకులోనుంచి ఖాళీ చేసి వెళ్లిపోయింది. ఏముంటుంద‌ని ఊడ్చి ప‌డేసిన ఈ చెత్త‌ను చూడ‌టానికి వ‌చ్చారు డాక్ట‌ర్ బాబు. వ‌స్తూ, వెళుతూ చూసేదాన్ని గ‌డ‌ప క‌డిగి బొట్లు పెట్టేది. నీళ్లు చ‌ల్లి ముగ్గుపెట్టేది. చిరున‌వ్వుతో ప‌ల‌క‌రించేది. ఇప్పుడు ఈ ఇల్లు పాడిపోయిన కోవెల‌లా క‌నిపిస్తుంది డాక్ట‌ర్ బాబు. ప‌ల‌కరింపు లేవు. పిల్ల‌ల అల్ల‌రి న‌వ్వులు లేవు, ఇంత‌కుముందు మీరు ఏదైనా అంటే ఇక్క‌డికి వ‌చ్చి గ‌డ‌ప‌లోనే ఏడుస్తూ కూర్చోనేది. నాతో చెప్పుకొని బాధ‌ప‌డేది. ఇప్పుడు నాతో చెప్ప‌లేదు, ఏడుస్తూ కూర్చోలేదు. ఏంటా అని ఇక్క‌డ‌కు వ‌స్తే సామాన్లు స‌ర్దుకొని వెళుతూ క‌నిపించింది అని చెబుతుంది. ఇక కార్తీక్ త‌డ‌బ‌డుతూ.. ఎక్క‌డికో చెప్ప‌లేదా అని ప్ర‌శ్నించ‌గా.. చెప్ప‌లేదు. ఎందుకు డాక్ట‌ర్ బాబు. ఇంకా అనాల్సిన‌వి ఏవైనా భాకీ ఉన్నాయా అని స‌రోజ‌క్క అంటుంది. నిజంగా నీతో ఏం చెప్ప‌లేదా అని కార్తీక్ అడ‌గ్గా.. మీ అమ్మ గారికే చెప్ప‌లేదంటా. ఆవిడ వ‌చ్చి ఏడుస్తూ వెళ్లారు. ఇంక నాకు ఏం చెబుతుంది డాక్ట‌ర్ బాబు అని స‌రోజ అంటుంది. కార్తీక్.. రౌడీకి ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వ‌స్తుంది అన‌గా.. వాళ్ల గొంతులు మూగ‌బోయిన‌ట్లు వారి ఫోన్లు మూగ‌బోయిన‌ట్లున్నాయి డాక్ట‌ర్ బాబు. అయినా వారి కోసం మీ అమ్మ గారు త‌ప్ప ఎవ‌రు ఫోన్ చేస్తారు అని స‌రోజ‌క్క అంటుంది. మాకు ఎవ‌రికీ చెప్పొద్ద‌ని చెప్పిందా. నిజం చెప్పు అని కార్తీక్ అడ‌గ్గా.. అస‌లు మీరు వ‌స్తార‌ని, అడుగుతార‌ని ఆశ‌నే ఉంటే ఇక్క‌డే ఉండేదే క‌దా. అన్ని ఆశ‌లు కొట్టుకొని, గుండె రాయి చేసుకొని వెళ్లిపోయింది అని స‌రోజ‌క్క అంటుంది. ఇక కార్తీక్.. పిల్ల‌లు నాన్న కావాల‌ని మారం చేయ‌లేదా అని అడ‌గ్గా.. ఇప్పుడేంటి డాక్ట‌ర్ బాబు. నాకు తెలిసిన‌ప్ప‌టి నుంచి సౌర్య నాన్న కావాలి. నాన్న ద‌గ్గ‌ర‌కు వెళ‌దాం అంటూ మారం చేస్తూనే ఉంది. ఆ త‌రువాత హిమ కూడా వ‌చ్చింది. అమ్మ కావాలంటూ ఇక్క‌డే ఉండిపోయింది. వెళ్లేట‌ప్పుడు ఏదో అడ్డుప‌డిన‌ట్లు ఉంది. అందుకే నాన్న పేరు బ‌య‌ట‌కు అన‌లేక‌పోయారు. వాళ్ల పిచ్చిగానీ నాన్న కావాల‌ని మారం చేస్తే మాత్రం మీరు క‌రిగిపోతారా అని స‌రోజ‌క్క అంటుంది. కార్తీక దీపం కొన‌సాగుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ ప్రోమోలో హిమను తీసుకొస్తే నిన్ను పెళ్లి చేసుకుంటాను అని కార్తీక్,మోనితకు మాట ఇస్తాడు.

  Published by:Manjula S
  First published:

  Tags: Karthika deepam, Karthika Deepam serial, Television News

  ఉత్తమ కథలు