• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • KARTHIKA DEEPAM SERIAL UPDATE MOUNITHA TUNES KARTHIK ELSEWHERE MURALI KRISHNA GOOD WORDS FOR DEEPA MNJ

Karthika Deepam: కార్తీక్‌ని త‌న‌వైపు తిప్పుకునేందుకు.. బాగా ట్యూన్ చేస్తోన్న మౌనిత‌

Karthika Deepam: కార్తీక్‌ని త‌న‌వైపు తిప్పుకునేందుకు.. బాగా ట్యూన్ చేస్తోన్న మౌనిత‌

Karthika Deepam: తెలుగు బుల్లితెర‌ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకునే కార్తీక దీపం సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. ఇవాళ్టి ఎపిసోడ్‌లో కార్తీక్, సౌంద‌ర్య మ‌ధ్య సంభాష‌ణ కొన‌సాగుతోంది. వారిద్ద‌రు మాట్లాడుకుంటుండ‌గా.. మాకు అర్థం కాన‌వ‌స‌రం లేదా అని ఆదిత్య అడుగుతాడు

Karthika Deepam: తెలుగు బుల్లితెర‌ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకునే కార్తీక దీపం సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. ఇవాళ్టి ఎపిసోడ్‌లో కార్తీక్, సౌంద‌ర్య మ‌ధ్య సంభాష‌ణ కొన‌సాగుతోంది. వారిద్ద‌రు మాట్లాడుకుంటుండ‌గా.. మాకు అర్థం కాన‌వ‌స‌రం లేదా అని ఆదిత్య అడుగుతాడు

  • Share this:
    Karthika Deepam: తెలుగు బుల్లితెర‌ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకునే కార్తీక దీపం సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. ఇవాళ్టి ఎపిసోడ్‌లో కార్తీక్, సౌంద‌ర్య మ‌ధ్య సంభాష‌ణ కొన‌సాగుతోంది. వారిద్ద‌రు మాట్లాడుకుంటుండ‌గా.. మాకు అర్థం కాన‌వ‌స‌రం లేదా అని ఆదిత్య అడుగుతాడు. దానికి సౌంద‌ర్య.. ఎవ‌రికి అర్థం అయితే వాళ్ల‌కు చాలు క‌దా అంటుంది. ఇక ఆనంద‌రావు మేము ప‌రాయి భాష వార్త‌లు చూస్తున్న‌ట్లు అర్థం కాకుండా చూడాలా..? అని అడ‌గ్గా.. ఇవి వార్త‌లు కావు, వాత‌లు. వాడికి ప‌డ‌బోతున్నాయి లెండి మన‌కెందుకు అని సౌంద‌ర్య అంటుంది. దానికి కార్తీక్.. వెళ్లి వ‌చ్చాక కాన్ఫిడెంట్ లెవ‌ల్స్ పెరిగిన‌ట్లు ఉన్నాయి. ప‌ద్ధ‌తిగా మ‌ద్ధ‌తు ఇచ్చి వ‌చ్చినట్లు ఉన్నావు అని అంటాడు. ఇక సౌంద‌ర్య‌.. ఇప్పుడేంటి. ప‌దేళ్ల నుంచి నా ఫుల్ స‌పోర్ట్ ప్ర‌క‌టిస్తూ వ‌స్తూనే ఉన్నాను అన‌గా.. త్వ‌ర‌లోనే విక‌టిస్తుంది చూస్తూ ఉండు అని కార్తీక్ అంటాడు. దానికి సౌంద‌ర్య.. సేమ్ డైలాగ్ అవ‌త‌ల పార్టీ కూడా ప్ర‌క‌టించిందే అని అంటుంది.

    ఇక కార్తీక్.. ధ‌ర్మం, న్యాయం, నిజాయితీ ఇలాంటివ‌న్నీ నావైపే ఉన్నాయి అని అన‌గా.. అటు వైపు నేను ఉన్నాను అని సౌంద‌ర్య అంటుంది. కురుక్షేత్రంలో పాండ‌వుల ప‌క్షాన కృష్ణుడు ఒక్క‌టే ఉన్నాడు అని సౌంద‌ర్య చెబుతుండ‌గా.. ఆపుతారా అని ఆనంద‌రావు అంటాడు. మీరు క‌లియుగంలో నుంచి కురుక్షేత్రంలోకి వెళుతున్నారు అని అంటాడు. ఇక సౌంద‌ర్య‌.. అక్క‌డ ఉక్రోషం ట‌న్నుల కొద్ది త‌న్నుకొస్తుంది అని అన‌గా.. అక్క‌డ ఆక్రోశం డ్ర‌మ్ముల కొద్ది మోసుకొని తిర‌గ‌ట్లేదా అని కార్తీక్ అంటాడు. దానికి సౌంద‌ర్య‌.. చూద్దాం. ఉక్రోశం గెలుస్తుందో ఆక్రోశం గెలుస్తుందో అన‌గా.. చూద్దాం అని కార్తీక్ కూడా అంటాడు. ఇక వారిద్ద‌రు ఎవ‌రిదారిన వాళ్లు వెళ్లగా.. వాళ్లు ఏం మాట్లాడుకున్నారు తాత‌య్య అని సౌర్య అడుగుతుంది. దానికి ఆనంద‌రావు.. నీకే అర్థం కాలేదు అంటే నాకేం అర్థం అవుతుందే అని అంటాడు. ఇక శ్రావ్య నీకేం అర్థం కాలేదా ఆదిత్య అని అడ‌గ్గా.. నాకు అర్థ‌మైతే ఇలా బిత్త‌ర మొహం ఎందుకు వేస్తాను అని అంటాడు. ఇక ఆనంద‌రావు ఇంత‌మందికి అర్థం కాకుండా వీళ్లు తెలుగులోనే ఇంత తెలివిగా మాట్లాడుకున్నారంటే ఒక‌రిని మించి ఒక‌రు త‌యార‌య్యారు. త‌రువాత శ్రావ్య‌కు టీ తీసుకొని ర‌మ్మ‌ని చెబుతాడు.

    మ‌రోవైపు ముర‌ళీకృష్ణ‌, దీప‌తో మాట్లాడుతుంటాడు. ఏంటి నాన్న నువ్వు అనేది అని దీప అన‌గా.. అవునమ్మా నువ్వు మౌనిత ఇంట్లో మాట్లాడే మాట‌లు హిమ వినింది. ఆ వ‌య‌సుకు అర్థం కాక‌పోయినా.. నీ మాట‌ల్లో డాక్ట‌ర్ బాబుకు న‌చ్చ‌ని మాట‌లు, బాధ‌పెట్టే మాట‌లు ఉండే ఉంటాయి. ఆ మాట‌లు ప‌ట్టుకొని ఆ ప‌సిమ‌న‌సుకు లోప‌ల మ‌ర్మం ఏంటో తెలియ‌క‌పోయినా నీ మీద కాస్త కోపం వ‌చ్చి ఉంటుంది అని అంటాడు. ఇక దీప‌.. అక్క‌డ నేను డాక్ట‌ర్ బాబును అంత‌గా విమ‌ర్శించింది ఏమీ లేదు నాన్న‌. కానీ హిమ మీద ఎలాంటి హ‌క్కులు లేవు అని ఆగి.. ఆ రోజు సంభాష‌ణ‌ను గుర్తు చేసుకుంటుంది.

    అవునేమో ఆ మాట‌ల్లో కోపం లేక‌పోయినా విన‌డానికి క‌చ్చిత‌మైన మాట‌ల్లానే ఉన్నాయేమో అని అంటుంది. ఇక ముర‌ళీకృష్ణ‌.. అల్లుడు గారితో మాట్లాడేట‌ప్పుడు మ‌రీ కయ్యానికి కాలు దువ్విన‌ట్లు కాకుండా కాస్త సామ‌ర‌స్యంతోనే మాట్లాడాలి అని అంటాడు. ఇక దీప‌.. ఏం నాన్న‌.. ఆ రోజు ఆ ప్రెస్ వాళ్ల‌తో ఆయ‌న‌, ఆ మౌనిత నా గురించి ఏం మాట్లాడారో నువ్వు పేప‌ర్లో చ‌దివారో క‌దా. అప్పుడు కూడా కోపం తెచ్చుకోకుండా ఉండ‌టానికి నేను రాయినో, ర‌ప్ప‌నో కాదు క‌దా నాన్న‌. మ‌నిషిని, అయినా ఆ కోపం నుంచి నేను ద్వేషం పెంచుకోలేదు. పంతం పెంచుకున్నాను. న‌న్ను నేను నిరూపించుకొని ఆ మ‌నిషి ముందు ధైర్యంగా నిల‌బడాల‌ని పట్టుద‌ల‌ పెంచుకున్నాను. అంతే త‌ప్ప ప‌గ‌, ప్ర‌తీకారం, తిరుగుబాటు అంటూ బ‌య‌లుదేర‌లేదు అని అంటుంది. దాంతో ముర‌ళీకృష్ణ‌.. నీ వైపు నువ్వు నిజాయితీగానే ఉన్నావు. డాక్ర‌ర్ బాబులో అపార్ధ‌మే ఉంది. ఆ అపార్ధం తొలిగిపోతే త‌ప్ప నీ నిజాయితీ బ‌య‌ట ప‌డ‌దు. నువ్వు త‌ప్పు చేయ‌నప్పుడు నీ త‌ప్పు లేదు అని వాయించ‌డానికో, అత‌డి త‌ప్పులు ఎత్తి చూప‌డానికో కేక‌లు వేయాల్సిన అవ‌స‌రం లేదమ్మా అని అంటాడు.

    దానికి దీప‌.. నిజానికి శ‌బ్దం ఎక్కువ నాన్న‌. అబ‌ద్ధానికి ఉండే చ‌ప్పుడు తాటాకు చ‌ప్పుడులాంటిదే. అందుకే నా కంఠంలో ప‌దును క‌నిపిస్తుంది. నా గుండె మంటే వినిపిస్తుంది అని అంటుంది. ఇక ముర‌ళీకృష్ణ‌.. నేను నీ ప్ర‌వ‌ర్త‌న‌ను త‌ప్పు ప‌ట్ట‌ట్లేదు. నువ్వు ప్ర‌ద‌ర్శించే ప‌ద్ద‌తి పిల్ల‌ల‌కు న‌చ్చ‌ట్లేదు అని అంటున్నాడు. అత‌డిని నువ్వు అపార్ధం చేసుకొని దూరం చేసుకొని ఉండొచ్చు. మ‌నిషిగా మంచివాడు, మ‌న‌సున్న వాడు, ప‌ది మందికి మంచి చేసే వాడు. డాక్ట‌ర్‌గానే కాదు వ్యక్తిగా కూడా స‌మాజంలో పేరు ఉన్నవాడు. ప‌ది మంది ముందో, ఇంకొక‌ళ్ల ముందో నువ్వు నిల‌బెట్టి మాట్లాడుతున్న‌ప్పుడు ఆయ‌న‌కు ఎలా ఉంటుంది. పిల్ల‌ల‌కు ఎలా ఉంటుంది. అది.. అది ఆలోచించ‌మ్మా. నీ వైపు నిజం ఉంది కానీ ఆ నిజం ఏంటి అన్న‌ది పిల్ల‌ల‌కు తెలీదు. నీకు, అల్లుడు గారికి మ‌ధ్య వ‌చ్చిన మ‌న‌స్ప‌ర్థల గురించి వారికి తెలీదు. క‌న‌ప‌డేది, విన‌ప‌డేదే వాళ్ల దృష్టిలో నిజం. మీ భార్య‌భ‌ర్త‌ల స‌మ‌స్య తీరేలోపు పిల్ల‌ల‌కు నీ మీద ఎలాంటి అయిష్టం కల‌గ‌కుండా చూసుకోవాల్సిన బాధ్య‌త నీదే. అదొక్క‌టి గుర్తు పెట్టుకో అమ్మా అని చెప్పి అక్క‌డి నుంచి వెళ‌తాడు.

    ఇక మౌనిత ఇంట్లో కార్తీక్ మాట్లాడుతూ.. కానీయ్. అదే జ‌ర‌గ‌నీయ్‌. మ‌న‌కు కావాల్సింది అదే క‌దా. రోగి కోరేది, వైద్యుడు ఇచ్చేది ఒకే మందు అన్న‌ట్లు మ‌నం కోరుకున్న‌ట్లే హిమ‌ను దీప కోర్టు ద్వారా అప్ప‌గిస్తుందంటే అంత‌కంటే కావాల్సింది ఏముంది అని అంటాడు. ఆ త‌రువాత అస‌లు అప్ప‌గించ‌డానికి ఒప్పుకున్న‌ప్పుడు కోర్టు ఎందుకో నాకు అర్థం కావ‌డం లేదు. అయినా స‌రే మ‌న‌కు కావాల్సింది హిమ‌. ఎలాగైతే ఏంటి. నా ద‌గ్గ‌ర‌కు వ‌స్తే చాలు అని అంటాడు. దానికి మౌనిత‌.. నువ్వు హిమ వ‌స్తే చాలు అనుకుంటున్నావు. దీప‌.. కోర్టుకు వెళితే చాలు అనుకుంటుంది. నువ్వు హిమ‌ను పెంచుకున్నావు. దీప క‌డుపున మోసింది. ఒక క‌న్న‌త‌ల్లి, ఒక కాదు.. ఏ క‌న్న త‌ల్లి అయినా క‌డుపులో పుట్టిన బిడ్డ‌ను అలా ఎలా అప్ప‌జెబుతుంది. అంత ధైర్యంగా ఎలా ఒప్పుకుంది అని అంటుంది.

    దానికి కార్తీక్.. హిమ ఇన్నేళ్లు నా ద‌గ్గ‌రే పెరిగింది క‌దా. మొద‌టి నుంచి తెలీక‌పోయినా మ‌ధ్య‌లో హిమ‌నే త‌న కూతురు అని తెలిసిపోయింది. అయినా తీసుకెళ్లిపోతా అన‌లేదు. అంటే సౌర్య మీద ఉన్న ప్రేమ ముందు హిమ మీద ఉన్న ప్రేమ త‌క్కువ‌నే క‌దా అని అంటుంది. దానికి మౌనిత‌.. త‌ల్లికి, బిడ్డ‌ల మీద ఎక్కువ త‌క్కువ‌లు ఏం ఉండ‌వు. నీకు నిజం చెబితే చించి ఠాకాలు వేస్తావ‌ని బ‌య‌ట‌ప‌డలేదు. జ‌రిగింది ప‌క్క‌న‌పెడ‌దాం కార్తీక్. ఇప్పుడు జ‌ర‌గ‌బోయేదే నాకు అర్థం కావ‌డం లేదు. ఇంత తేలిగ్గా ఎందుకు తీసుకుంటుంది. మొహంలో టెన్ష‌న్ కానీ భ‌యం కానీ లేకుండా ఎప్పుడూ లేని కాన్ఫిడెన్స్ ఎందుకు చూపిస్తుంది. అది ఆలోచించాలి అని అంటుంది.

    దానికి కార్తీక్.. అవును. మామూలుగా అయితే ఆ రోజు నీ ఇంట్లోనే నాకు ఎలాంటి హ‌క్కులు లేవ‌ని చెప్పింది క‌దా. హిమ మీద నాకు హ‌క్కులు లేవ‌న్న మ‌నిషి.. హిమ‌ను నాకు ఎందుకు అప్ప‌జెబుతానంటుంది అని అంటాడు. వెంట‌నే మౌనిత‌.. హిమ‌ను నీ ద‌గ్గ‌రకు వెళ్లొద్ద‌ని ట్యూన్ చేస్తుందా.. నువ్వంటే కోపం వ‌చ్చేలాగా అవీ, ఇవీ చెప్పి బాగా ట్యూన్ చేస్తుందా.. ఏం జ‌రుగుతుంది అని అంటుంది. దాంతో కార్తీక్ ఆలోచ‌న‌లో ప‌డ‌తాడు. మొన్న కూడా మీ ఇంటికి వ‌చ్చిన‌ప్పుడు హిమ నాతో ర‌మ్మంటే రాలేదు. సౌర్య నాతో వ‌చ్చింది కానీ హిమ మాత్రం రాలేదు. అంటే హిమ‌.. పూర్తిగా దీప ప్రేమ‌కు లొంగిపోయిందా అని అంటాడు. దాంతో మౌనిత న‌వ్వుతుంది.

    ఎందుకు న‌వ్వుతున్నావ‌ని కార్తీక్ అడ‌గ్గా.. ఇది న‌వ్వు కాదు. నిన్ను చూస్తే బాధ వేస్తోంది. ఒక‌ప్పుడు కాలేజీలో హిమ‌ను ప్రేమించాను. ఆ ప్రేమ యాక్సిడెంట్‌తో ముగిసింది. త‌రువాత దీప‌ను చూసి జాలి ప‌డి పెళ్లి చేసుకున్నావు. ఆ పెళ్లి యాక్సిడెంట‌ల్‌గా బ్రేక‌ప్ అయ్యింది. త‌రువాతే అమ్మే దైవం, మాతృదేవ‌త అంటూ మీ అమ్మ‌ను నెత్తిన పెట్టుకున్నావు. ఇప్పుడు దీప‌, మీ అమ్మ‌ను స్కూటీ మీద ఎక్కించుకొని తిప్పుతోంది. ఇక నీ కూతురు ఎంత చేశావు కార్తీక్ దానికి. దాని కోసం ఎంత క‌ష్ట‌ప‌డ్డావు. ఆ దీప నుంచి దూరం చేయ‌డానికి ఎన్ని క‌ష్టాలు ప‌డ్డావు. అయినా నీ కూతురు నీ మాట‌ను తొక్క‌లే అని తీసిపారేస్తే.. చివ‌ర‌కు దాన్ని తెచ్చుకోవ‌డానికి కోర్టును ఆశ్ర‌యించాల్సి వ‌చ్చింది. ఇప్పుడు అర్థం చేసుకో. అంతా క‌లిసి నిన్ను ఎంత ఒంట‌రిని చేశారో అర్థం అవుతుందా..? నువ్వు ఏంటో.. నీ ప‌రిస్థితి ఏంటో.. చివ‌ర‌కు నీ గ‌తి ఏంటో బాగా ఆలోచించుకో అని నూరిపోస్తుంది. ఆ త‌రువాత ఒక మాట చెబుతాను విను. ఇది పాత మాటే కావొచ్చు. కానీ సృష్టి ఉన్నంత కాలం ఇది స‌త్యం, ఇదే నిత్యం. అదేంటంటే నువ్వు ప్రేమించిన వాళ్ల క‌న్నా. నిన్ను ప్రేమించిన వాళ్లు మిన్న. నిన్ను ప్రేమించే వాళ్ల‌తోనే నీ జీవితం బావుంటుంది. అది గుర్తు పెట్టుకో. హిమ‌ను ఎలా తెచ్చుకోవాల‌న్న‌ది నేను ఆలోచిస్తా. నేను చెప్పిన యాంగిల్‌లో నువ్వు ఆలోచించు అని అంటుంది.

    ఇక సౌంద‌ర్య ఇంట్లో సౌర్య‌.. అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. ఆ లోపు కార్తీక్ వ‌స్తాడు. ఏంటే ఎవ‌రి కోసం చూస్తున్నావు అని కార్తీక్ ప్ర‌శ్నించ‌గా.. మీ కోస‌మే. ఎంత సేప‌టి నుంచి ఎదురుచూస్తున్నానో తెలుసా. ఎక్క‌డికి వెళ్లావు నాన్న‌. మ‌ధ్యాహ్నం కూడా అన్నం తిన‌లేదు. నీ క‌స‌లు ఆక‌లి వేయ‌లేదా.. ఇలా అయితే నీర‌సం అనిపించ‌దా.. నాన‌మ్మ ఎవ్వ‌రికీ అర్థం కాని భాష‌లో అనింద‌ని ఫీల్ అయ్యావా.. నేను త‌రువాత బాగా కోప్ప‌డ్డానులే. మీరు ఇంటికి వ‌స్తే చాలు ఏదొక‌టి అంటారేంటి. ఇంకోసారి అంటే బావుండ‌దు అని గ‌ట్టిగా అన్నాను. నాకేం భ‌య‌మా.. ఇవాళ మాల‌తితో చెప్పి మీకు ఇష్ట‌మైన కూర‌లు చేయించాను. బాగా ఆక‌లిగా ఉంటుంది. త్వ‌ర‌గా స్నానం చేసిరా. ఇవాళ నేనే వ‌డ్డిస్తానులే అని అంటుంది. ఇక ఏంటి నాన్న అలా చూస్తున్నారు. ఓ నాన్న అని పిలుస్తున్నా అనా.. ఎవ‌రూ లేరులే. అంద‌రూ దీపుగాడి ద‌గ్గ‌రే ఉన్నారు. నాన్న అన‌డం ఎవ్వ‌రూ విన‌లేదులే. వెళ్లండి వెళ్లండి అని చెబుతుంది. దాంతో సౌర్య మీద చెయ్యి వేసే కార్తీక్.. ఎందుకే ఇదంతా అని అడుగుతాడు. దానికి సౌర్య‌... మా నాన్న‌వే క‌దా నాన్న అని అంటుంది. వెంట‌నే కార్తీక్.. నేన‌స‌లు నిన్ను నాన్న అనే పిల‌వొద్దు అంటాను. అయినా నీకు నేనంటే అన‌గా.. ఇష్టం, వెళ్లి ఫ్రెష్ అయ్యి రండి అని సౌర్య చెబుతుంది.

    ఇక దీప‌, ముర‌ళీకృష్ణ మాట‌ల‌ను గుర్తు చేసుకుంటుంది. హిమ ద‌గ్గ‌ర‌కు వెళ్లి ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. దానికి హిమ‌.. ఆన్‌లైన్ క్లాస్‌లు రాసుకుంటున్నాన‌ని చెబుతుంది. ఇక దీప‌.. ఆక‌లి వేయ‌ట్లేదా అని అడ‌గ్గా.. తాత‌య్య ఎప్పుడూ ఏదో ఒక‌టి తిన‌డానికి పెడుతూనే ఉంటాడు క‌దా. ఆక‌లి వేయ‌ట్లేదు అని అంటుంది. ఇక త‌రువాత రాసుకుందువే అని చెప్పి.. నిన్ను ఒక మాట అడుగుతాను చెప్తావా అని దీప, హిమ‌ను ప్ర‌శ్నిస్తుంది. ఏంట‌ది అని హిమ అడ‌గ్గా.. మీ డాడీతో ప్ర‌తిసారి నేను గొడ‌వ ప‌డ్డ‌ట్లుగా అనిపిస్తుందా..? అని అడుగుతుంది. దానికి హిమ‌, ప్రేమ‌గా మాట్లాడుతున్న‌ట్లు మాత్రం అనిపించ‌దు అని చెబుతుంది.

    వెంట‌నే దీప‌.. అదంతా సినిమాల్లోనే జ‌రుగుతుంద‌మ్మా. బ‌య‌ట అంద‌రూ బ‌య‌ట‌కు ప్రేమ‌గా మాట్లాడాల‌నేం లేదు. మ‌న‌సులో ఉంటే చాలు. మాట‌ల్లో చూపించక్క‌ర్లేదు. అయినా మీ నాన్న మీద నిజంగా నాకు కోప‌మే ఉంటే నాన్న‌తో క‌లిసి ఉండాల‌ని నేను ఎందుకు కోరుకుంటాను. నా పెళ్లి చేసే స్తోమ‌త మా నాన్న‌కు ఉండేది కాద‌మ్మా. ఎవ‌రు వ‌చ్చినా ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌లు క‌ట్నం అడిగేవారు. నాకు ఇంక పెళ్లి కాద‌ని అనుకునేదాన్ని. నేను కాదు అంద‌రూ అనేవాళ్లు, అనుకునే వాళ్లు. మీ నాన్న‌కు నాన‌మ్మ గొప్ప సంబంధం తెచ్చి పెళ్లి చేయాల‌నుకుంది. కానీ మీ నాన్న న‌న్ను చూసి ఇష్ట‌ప‌డ్డారు. పెళ్లి చేసుకున్నారు. మా నాన్న‌కు ఒక్క రూపాయి కూడా ఖ‌ర్చు లేకుండా నా పెళ్లి అయిపోయింది. అంత మంచి డాక్ట‌ర్ బాబు మీద నాకు ఉన్న‌ది గౌర‌వం మాత్ర‌మే, కోపం కాద‌మ్మా అని అంటుంది.

    దానికి హిమ‌.. అయినా నాతో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నావ‌మ్మా అని అడ‌గ్గా.. ఎప్పుడైనా నేను గ‌ట్టిగా మాట్లాడితే అది కోపంతో కాద‌ని.. నువ్వు, సౌర్య అర్థం చేసుకోవాలి. మ‌నం మన వాళ్ల‌తోనే క‌దా గ‌ట్టిగా మాట్లాడేది. మ‌న‌మంద‌రం క‌లిసి రోజు నేను మీ నాన్న‌తో ఎలా ఉంటానో మీరే చూస్తారు. గుడిలో దేవుడిని చూసిన‌ట్లు చూస్తాను. అది నాకు తెలుసు. అప్ప‌టిదాకా ఈ గొడ‌వ‌ల‌న్నీ క‌లిసి ఉండ‌టం కోస‌మే త‌ప్ప కోపంతో కాద‌ని నువ్వు తెలుసుకోవాలి అని చెబుతుంది. ఇక రేపు మ‌న ఇంటికి వెళ‌దామా అని అడ‌గ్గా.. ఇంకొన్ని రోజులు ఉందాం. సౌర్య కూడా లేదు. నేను ఒక్క‌దాన్ని ఉంటే బోరు కొడుతుంది అని చెబుతుంది. ఇక సౌంద‌ర్య ఇంట్లో .. కార్తీక్‌కి, సౌర్య అన్నం వ‌డ్డిస్తూ ఉంటుంది. కార్తీక దీపం కొన‌సాగుతోంది.
    Published by:Manjula S
    First published: