Home /News /movies /

KARTHIKA DEEPAM SERIAL UPDATE MOUNITHA TALKS BAD ABOUT DEEPA ELSEWHERE DEEPA IS IN FULL HAPPY MNJ

Karthika Deepam: షాక్‌లో సౌంద‌ర్య‌.. సంతోషంలో దీప‌.. మ‌రింత తెగించేందుకు సిద్ధ‌మైన మౌనిత‌

తెలుగు రాష్ట్రాల్లో కార్తీకదీపం సీరియల్‌కు ఎంత క్రేజ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు. (Karthika Deepam)

తెలుగు రాష్ట్రాల్లో కార్తీకదీపం సీరియల్‌కు ఎంత క్రేజ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు. (Karthika Deepam)

karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతోంది. గ‌త ఎపిసోడ్‌లో విహారికి పిల్ల‌లు పుట్టే అవ‌కాశం లేద‌న్న విష‌యాన్ని తుల‌సి, దీప‌కు చెబుతుంది. ఇవాళ వారిద్ద‌రి మ‌ధ్య సంభాష‌ణ కొన‌సాగుతుంది. దీప మాట్లాడుతూ.. నా స‌మ‌స్య‌కు ఇంకోలా ప‌రిష్కారం చూపించి ఉండి ఉంటే ఎంత బావుండేది.

ఇంకా చదవండి ...
  karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతోంది. గ‌త ఎపిసోడ్‌లో విహారికి పిల్ల‌లు పుట్టే అవ‌కాశం లేద‌న్న విష‌యాన్ని తుల‌సి, దీప‌కు చెబుతుంది. ఇవాళ వారిద్ద‌రి మ‌ధ్య సంభాష‌ణ కొన‌సాగుతుంది. దీప మాట్లాడుతూ.. నా స‌మ‌స్య‌కు ఇంకోలా ప‌రిష్కారం చూపించి ఉండి ఉంటే ఎంత బావుండేది. ఇప్పుడు నేను విహారి విష‌యం బ‌య‌ట పెడితే త‌ప్ప డాక్ట‌ర్ బాబు న‌మ్మ‌డ‌ని స్వార్థంగా ఆలోచించాలా అని అన‌గా.. అవును దీప‌. నువ్వు ఇప్పుడు కూడా నీ జీవితాన్ని, నీ కాపురాన్ని చ‌క్క‌దిద్దుకోలేక‌పోతే ఆ దేవుడు నీకు ఇచ్చిన ఈ అద్భుత‌మైన అవ‌కాశం వృధా అవుతుంది. ఈ నిజం నీ కాపురానికి ఉప‌యోగ‌ప‌డితే నాకు అంత క‌న్నా కావాల్సింది ఏమీ లేదు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వెన‌కంజ వేయ‌కు అని తుల‌సి అంటుంది. ఇక దీప త‌న‌కు జ‌రిగినందా గుర్తు చేసుకుంటుంది.

  మ‌రోవైపు ఇంట్లో కార్తీక్.. ఫోన్ చూసుకుంటూ ఉండ‌గా సౌంద‌ర్య వ‌స్తుంది. కూర్చో మ‌మ్మీ అన్న కార్తీక్.. ఏంటి మ‌మ్మీ ఏమైనా మాట్లాడాలా అని అడుగుతాడు. రేపే క‌దా కోర్టు హియ‌రింగ్ అని సౌంద‌ర్య అన‌గా.. లేదు అని కార్తీక్ చెబుతాడు. రేపు లేదా అని సౌంద‌ర్య అడ‌గ్గా.. రేపే కాదు ఎల్లుండి లేదు అని స‌మాధానం ఇస్తాడు. కోర్టు సెల‌వలా అని సౌంద‌ర్య అడ‌గ్గా.. కాదు. నేను కేసును విత్‌డ్రా చేసుకున్నాను అని కార్తీక్ చెబుతాడు. అదేంటిరా అని సౌంద‌ర్య అడ‌గ్గా.. నువ్వెంటి మ‌మ్మీ అంత ఉలిక్కిప‌డ్డావు అని కార్తీక్ అడుగుతాడు. నేనెందుకు ఉలిక్కిప‌డతాను. నువ్వే క‌దా కోర్టుకు వెళ‌తాన‌ని ఉత్సాహప‌డ్డావు. మ‌రి ఎందుకు విర‌మించుకున్న‌ట్లు అని సౌంద‌ర్య అడుగుతుంది.

  దానికి కార్తీక్.. మ‌న ఇంటి వ్య‌వ‌హారాలు కోర్టు దాకా ఎందుకులే అని అంటాడు. ఆ త‌రువాత నువ్వేంటి మ‌మ్మీ.. నేను కోర్టుకు వెళ్ల‌నంటే ఆనందించాల్సింది పోయి అప్‌సెట్ అయిన‌ట్లు మొహం పెట్టావు అని కార్తీక్ అడుగుతాడు. దానికి సౌంద‌ర్య‌.. నేను ఎందుకు అప్‌సెట్ అవుతానురా. పిల్ల‌ల విష‌యం కోర్టు దాకా వెళ్ల‌క‌పోవ‌డం మంచిదే క‌దా. కానీ నీకు హిమ అక్క‌ర్లేదా అని అడుగుతుంది. ఎందుకు అక్క‌ర్లేదు అని కార్తీక్ అన‌గా.. మ‌రి ఎలా అని సౌంద‌ర్య అడుగుతుంది. దానికి కార్తీక్.. నా హిమ నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేస్తుంది. పెంచిన ప్రేమ తీసుకొచ్చి ఇస్తుంది అని అంటాడు. ఏంటో అంత న‌మ్మ‌కం అని సౌంద‌ర్య అడ‌గ్గా.. మౌనిత ఎంట్రీ ఇచ్చి నేను ఉన్నాను క‌దా ఆంటీ అని అంటుంది.

  మౌనిత నువ్వేంటి ఇక్క‌డ అని కార్తీక్ ప్ర‌శ్నించ‌గా.. నువ్వాగు కార్తీక్ అని ఆపి సౌంద‌ర్య‌తో మాట్లాడుతుంది. ఏంటండీ మీ కోడలు. కొంచెం కూడా మ‌ర్యాద లేకుండా మాట్లాడుతుంది. త‌ను ఏమ‌న్నా మ‌హారాణి అంటుంది. ఆవిడ అనే మాట‌లు ప‌డ‌టానికి మేమేమౌనా బానిస‌లు అనుకుంటుందా.. మేము ఆవిడ మోచేతి నీళ్లు తాగుతున్నామా అని ఫైర్ అవుతూ అరుస్తూ ఉంటుంది. వెంట‌నే కార్తీక్ ఏమైంది మౌనిత అని అడ‌గ్గా.. ఏమైంది కాదు కార్తీక్. ఏమంది అని అడుగు. అరే నోటికి ఏది వ‌స్తే అది అనేయ‌డమేనా.. నీ మొహం చూసి వ‌దిలేస్తున్నాను ప్ర‌తిసారి. ఆఫ్ట్రాల్ నా ద‌గ్గ‌ర ప‌నిచేసే న‌ర్సు ముందు అని అంటూ ఒక్క నిమిషం ఆగు అని వీడియో చూపిస్తుంది. ఆ వీడియో చూసి సౌంద‌ర్య న‌వ్వుతూ ఉంటుంది. ఆ త‌రువాత మౌనిత‌.. ఏంటండీ ఈ భాష‌. అల‌గా మ‌నిషి, అల‌గా భాష‌.. అస‌లు నా ఎదురుగా నిల‌బ‌డే స్థాయినే త‌న‌ది. ఎందులో నాతో స‌రితూగుతుంది. చ‌దువులోనా..అందంలోనా.. ఐశ్వ‌ర్యంలోనా.. స్టేట‌స్‌లోనా.. సంస్కారంలోనా అని అరుస్తూ ఉంటుంది.

  వెంట‌నే సౌంద‌ర్య మౌనిత అన‌గా.. ఆపండి ఆంటీ. ఆత్మ సౌంద‌ర్యంలో గొప్ప‌ది, ఆత్మాభిమానంలో గొప్ప‌ది, ఆత్మ విశ్వాసంలో గొప్ప‌ది లాంటి ట్రాష్ మాట్లాడ‌కండి. తొక్క‌లో ఆత్మ సౌంద‌ర్యం. అది దేనికి ప‌నికి వ‌స్తుందండి. నేను మూడు నిమిషాలు ఆప‌రేష‌న్ చేస్తే 30వేలు చార్జ్ చేస్తాను. అది 30 రోజులు క‌ష్ట‌ప‌డితే ముష్టి 3వేలు సంపాయిస్తుంది. నాతో వాద‌న‌కు దిగే లెవ‌లేనా దానిది. ఇదుగో ఈ మ‌హానుభావుడే.. ఆద‌ర్శాల‌కు పోయి మెడ‌లో తాళి క‌ట్టి దాని స్థాయిని పెంచాడు.పెంచితే పెరిగిపోతుందా.. క‌న‌క‌పు సింహాసంబున శున‌కంను కూర్చుండ‌బెట్టిన వెనుక‌టి గుణ‌మేల మాను అని అలా దాని బుద్దులు ఎక్క‌డికి పోతాయి అని మండిపడిపోతుంటుంది.

  ఇక సౌంద‌ర్య మాట్లాడుతూ.. నీకు తెలుగు ప‌ద్యాలు కూడా వ‌చ్చా మౌనిత‌. అయితే ఇది కూడా వినే ఉంటావు. అల్పుడెప్పుడు ప‌ల్కు ఆడంబ‌రంగానూ స‌జ్జ‌నుండు ప‌ల్కు చ‌ల్ల‌గానూ అని. అలా దీప నీకు చ‌ల్ల‌గానే వాత‌లు పెట్టిన‌ట్లు ఉంది. నువ్వు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వ‌ళ్లించిన‌ట్లు ఉంది. ఇంత‌కు నువ్వు ఇక్క‌డ‌కు ఎందుకు వ‌చ్చావు. పొద్దునే దాని మీద చాడీలు చెప్ప‌డానికా.. దాని వెంట‌, నా కొడుకు వెంట ప‌డ‌టం త‌ప్ప నీకు వేరే ప‌నేం లేదా అని అంటుంది. ఇక కార్తీక్.. అస‌లు నీకు తుల‌సి ఇంటికి వెళ్లాల్సిన అవ‌స‌రం ఏం వ‌చ్చింది అని ప్ర‌శ్నిస్తాడు. దాంతో మౌనిత షాక్‌కి గురి అవుతుంది. చెప్పు మౌనిత అన‌గా.. నేనెందుకు తుల‌సి ద‌గ్గ‌ర‌కు వెళ్లానో.. మీ ఆవిడ అన‌బ‌డే ఆవిడ అక్క‌డికి ఎందుకు వ‌చ్చిందో ఆవిడ‌నే అడిగి తెలుసుకో కార్తీక్. నాట‌కాలు ఆడుతున్నారు అంద‌రూ అని అక్క‌డి నుంచి వెళుతుంది.

  ఆ త‌రువాత సౌంద‌ర్య‌.. ఏంటి కార్తీక్ ఇది. ఇదేదో దీప‌కు స‌వ‌తి అయిన‌ట్లు ప్ర‌తి దాంట్లో దాంతో గొడ‌వ‌ప‌డి న్యాయం చెప్ప‌మ‌ని నీ ద‌గ్గ‌ర‌కు వ‌స్తుందేంటిరా అని అన‌గా.. ఆపు మమ్మీ. మీ భాష, మీరూనూ బొత్తిగా డీసెన్సీ మ‌ర్చిపోయారు. ఏంటా మాట‌లు. మ‌న ప‌రువు, మ‌ర్యాద ఏమైనా నిల‌బ‌డుతుందా.. మౌనిత మీకు న‌చ్చదు. దీప మీకు న‌చ్చుతుంది. దీప నాకు న‌చ్చ‌దు, మీకు న‌చ్చుతుంది. మౌనిత పేరు ఎత్తితే మీకు కంప‌రం, దీప పేరు ఎత్తితే నాకు ఒళ్లంతా గొంగ‌ళిపురుగులు తిరిగినంత స‌ల‌ప‌రం. మీకు న‌చ్చింది నాకు న‌చ్చాల‌ని రూల్ లేన‌ట్లే. నాకు న‌చ్చింది మీకు న‌చ్చాల‌ని రూల్ ఏం లేదుగా. మౌనితను నెత్తిన పెట్టుకోండ‌ని నేను చెప్ప‌లేదు. దీప‌ను నా భుజాల‌కు ఎక్కించి భారం మోయ‌మ‌ని చెప్ప‌డం మాత్రం భావ్యం కాదు అని చెబుతున్నాను అని కార్తీక్ అక్క‌డి నుంచి వెళ‌తాడు. ఆ త‌రువాత సౌంద‌ర్య‌.. వీడు కోర్టుకు వెళ‌తాడు, జ‌డ్జి గారు డీఎన్ఏ టెస్ట్‌కి వెళ్ల‌మంటారు అని దీప ధీమాగా ఉంది. ఇప్పుడు ఆ ఆలోచ‌న విర‌మించుకున్నాడంటే అది ఎంత అప్‌సెట్ అవుతుందో అనుకుంటుంది.

  ఇక ఇంట్లో హిమ‌ను పిలుస్తూ.. పైన ఏం చేస్తున్నావ‌మ్మా అని అడుగుతుంది. దానికి హిమ‌.. లాక్‌డౌన్ టైమ్‌లో పైన ర‌క‌ర‌కాల ప‌క్షులు క‌నిపించాయ‌మ్మా. మ‌ళ్లీ మాయ‌మైపోయాయి. ఏమైనా క‌నిపిస్తాయోమోన‌ని డాబా మీదికెళ్లి చూస్తున్నాను అని చెబుతుంది. ఇక దీప‌.. స‌రేలే అని స్వీట్‌ని హిమ‌కు పెడుతుంది. ఏంట‌మ్మా సంతోషంగా ఉన్నావ‌ని హిమ ప్ర‌శ్నించ‌గా.. మ‌న జీవితంలో లాక్‌డౌన్ శాశ్వ‌తంగా వెళ్లిపోయింద‌మ్మా. ఇక మ‌న క‌ళ్ల‌కు రంగు రంగుల పువ్వులు, ర‌క‌ర‌కాల ప‌క్షులు, ఆకాశంలో న‌క్ష‌త్రాలు అన్నీ క‌నిపిస్తాయి అని దీప అంటుంది. ఎలాగ‌మ్మా అని హిమ అడ‌గ్గా.. మ‌న‌కు మంచి రోజులు వ‌చ్చేసిన‌ట్లే. మీ నాన్న‌కు ఒక విష‌యంలో నా మీద కోపం ఉంద‌ని చెప్పాను క‌దా. ఆ కోపం పోవ‌డానికి నాకు ఒక మంచి అవ‌కాశం దొరికింది. నా మ‌న‌సు ఆనందంతో ఉర‌క‌లు వేస్తోంది. నాకు కొత్తగా రెక్క‌లు వ‌చ్చిన‌ట్లు, స్వేచ్ఛ‌గా ఆకాశంలో ఎగురుతున్న‌ట్లు, భార‌మైన గుండె దూదిపింజ‌లా మారిపోయిన‌ట్లు, ఎవ‌రెస్ట్ విఖ‌రం ఎక్కిన‌ట్లు, స‌ముద్రాలు సునాయ‌సంగా ఈదిన‌ట్లు, అవ‌త‌లి ఒడ్డుకు చేరిన‌ట్లు ఏదోలా ఉంది అని సంతోష‌ప‌డిపోతూ ఉంటుంది.

  ఆ తరువాత హిమ‌.. స‌డ‌న్‌గా ఏం జ‌రిగింద‌మ్మా అనగా.. ఒక దేవత వ‌రం ఇచ్చింది. ఆ వ‌రంతో నా దేవుడు క‌రుణించే అవ‌కాశం వ‌చ్చింది అని దీప అంటుంది. అది ఏంటో చెప్ప‌మ్మా అని హిమ అన‌గా.. ఆ విష‌యం నీకు వివ‌రంగా చెప్పేది కాదులే గానీ ఒక విష‌యం మాత్రం క‌చ్చితంగా చెప్ప‌గ‌లను. మీ డాడీ ప‌రిగెట్టు వ‌చ్చి రా దీప మ‌నింటికి వెళ్లిపోదాం. హిమ‌, సౌర్య‌, నువ్వూ, నేను, మా అమ్మా నాన్న‌, ఆదిత్య‌, శ్రావ్య‌, దీపు అంతా హ్యాపీగా క‌లిసిపోయి పండుగ చేసుకుందాం అనే రోజు వ‌చ్చింది అని దీప అంటుంది. నిజంగానా అని హిమ అన‌గా.. అవున‌మ్మా ప్రామిస్ అని చెబుతుంది. ఆ త‌రువాత ఇద్ద‌రు సంతోషప‌డ‌తారు. ఇక హిమ‌.. సౌర్య‌కు ఫోన్ చేసి చెబుతాన‌మ్మా. త‌ను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది క‌దా అని అన‌గా.. వ‌ద్దు. మ‌న నోటితో వ‌ద్దు. ఒకేసారి మీ నాన్న నోటి వెంట వింటే అత్త‌మ్మ ఇంకా థ్రిల్ అవుతుంది. దాని ప‌దేళ్ల క‌ల నెర‌వేరుతుంది. న‌న్ను ప‌దేళ్ల పాటు ప‌ట్టి పీడిస్తోన్న దుర‌దృష్టం పారిపోతుంది. మ‌న‌కు మంచి రోజులు వ‌చ్చేశాయి హిమ అని దీప అంటుంది.

  ఇక మౌనిత కారులో వెళుతూ.. య‌స్ మౌనిత చెడ్డ‌దే. అనుకున్న‌ది సాధించ‌డానికి ఎంత‌కైనా దిగ‌జారుతుంద‌ని ఎవ్వ‌రైనా అనుకోని నాకు సంబంధం లేదు. మౌనిత అనుకున్న‌ది సాధించ‌డానికి ఎంత‌కైనా తెగిస్తుంది అని నేను అనుకుంటున్నాను. అయితే మాత్రం అంద‌రూ మౌనిత‌ను మాట‌లు అంటే ప‌డాలా..మౌనిత మాయ‌మాట‌లు విని న‌మ్మేంత ప‌రిస్థితికి కార్తీక్‌ని తెచ్చింది అంటే అది మౌనిత టాలెంట్‌. ఆ టాలెంట్‌ని అభినందించ‌కుండా అంద‌రూ న‌న్ను ఆడిపోసుకుంటారేంటి. ఉప్పెన మార‌దు. భూకంపం మార‌దు. మౌనిత కూడా మార‌దు. వైప‌రిత్యాల్లో మౌనిత కూడా ఒక‌టి. వాళ్ల అమ్మ ఎదురుగా ఉంటే నోట మాట రాదు. ఇప్పుడు కూడా వాళ్ల అమ్మ మీద రియాక్ట్ అయ్యాడో.. లేక‌పోతే చిరాగ్గా బ‌య‌ట‌కు వెళ్లిపోయాడో.. ఏం చేస్తున్నాడో అని అనుకుంటుంది.

  ఇక భాగ్యం ఏదో క‌లగంటూ ఉంటుంది. అదే స‌మ‌యానికి కార్తీక్ ఆ ఇంటికి వెళ‌తాడు. ఇళ్లంతా నిశ్శ‌బ్దంగా ఉంది. హిమ‌, దీప లేరా అని భాగ్యంను చూస్తాడు. ఇక ఇంత‌దూరం వ‌చ్చి హిమ‌ను చూడ‌కుండా వెళ్లాలా అని.. హిమ‌ను పిలుస్తాడు. దాంతో భాగ్యం హిమ రైళ్లో ఎందుకు ఉంటుందండి అని అంటుంది. ఇక కార్తీక్.. ఏంటండి భాగ్యం గారు అన‌గా.. ఎవ‌ర‌బ్బా చైన్ లాగింది అని లేస్తుంది. ఆ త‌రువాత బాబూ మీరా బ‌ద్రినాథ్ ఎప్పుడు వ‌చ్చారు.. ఈ రైలు ఎప్పుడు ఎక్కారు అని అడ‌గ్గా.. ఇది మీ ఇల్లు అని కార్తీక్ అంటాడు. ఇక భాగ్యం.. ఇన్ని రోజులు తీర్ధ‌యాత్ర‌లు తిరిగే స‌రికి ఇంకా రైళ్లో ఉన్న‌ట్లే ఉంది అని చెబుతుంది. హిమ లేదా అని కార్తీక్ అడ‌గ్గా.. వాళ్లు వెళ్లిపోయార‌ని చెబుతుంది. ఇక వారిద్ద‌రి మ‌ధ్య కాసేపు స‌ర‌దా సంభాష‌ణ సాగుతుంది.

  ఇక ఇంట్లో వార‌ణాసి క్యారీలు వేసేందుకు లిస్ట్ చేయ‌బోతుండ‌గా.. అదేం అవ‌స‌రం లేదు. మేము మా నాన్న ద‌గ్గ‌ర‌కు వెళతాము అని హిమ చెబుతుంది. దాంతో దీప‌.. కోర్టుకు వెళ్లాక విహారి విష‌యం బ‌య‌ట ప‌డ‌కముందే మేము క‌లిసిపోతాం అని మ‌న‌సులో అనుకుంటుంది. అదే స‌మ‌యానికి దీప ఇంటికి వ‌చ్చిన సౌంద‌ర్య‌.. కార్తీక్ కేసు విత్‌డ్రా చేసుకున్న విష‌యాన్ని ఎలా చెప్పాలో అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ త‌రువాత హిమ‌ను బ‌య‌ట‌కు పంపి.. కార్తీక్ కేసును విత్‌డ్రా చేసుకున్న విష‌యాన్ని చెబుతుంది.
  Published by:Manjula S
  First published:

  Tags: Karthika deepam, Karthika Deepam serial, Television News

  తదుపరి వార్తలు