హోమ్ /వార్తలు /సినిమా /

Karthika Deepam: డాక్ట‌ర్ బాబు అస‌లు ఏం చేయ‌బోతున్నాడు.. మ‌రింత ఆసక్తిక‌రంగా 'కార్తీక దీపం'

Karthika Deepam: డాక్ట‌ర్ బాబు అస‌లు ఏం చేయ‌బోతున్నాడు.. మ‌రింత ఆసక్తిక‌రంగా 'కార్తీక దీపం'

తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం(Karthika Deepam) సీరియ‌ల్ ఆస‌క్తిక‌రంగా సాగుతోంది. ఇవాళ్టి ఎపిసోడ్‌లో కార్తీక్, మౌనిత ఇంటికి వెళ్ల‌గా.. అత‌డికి కాఫీ తీసుకొస్తుంది మౌనిత‌. మ‌రి నువ్వు అని కార్తీక్ అడ‌గ్గా.. నేను ఇప్పటికే మూడు సార్లు కాఫీ తాగాను అంటుంది. ఎందుకు అని కార్తీక్ ప్ర‌శ్నించ‌గా.. మూడు చెరువుల నీళ్లు నా క‌డుపులో ప‌డ్డాయి గ‌నుక అంటుంది.

తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం(Karthika Deepam) సీరియ‌ల్ ఆస‌క్తిక‌రంగా సాగుతోంది. ఇవాళ్టి ఎపిసోడ్‌లో కార్తీక్, మౌనిత ఇంటికి వెళ్ల‌గా.. అత‌డికి కాఫీ తీసుకొస్తుంది మౌనిత‌. మ‌రి నువ్వు అని కార్తీక్ అడ‌గ్గా.. నేను ఇప్పటికే మూడు సార్లు కాఫీ తాగాను అంటుంది. ఎందుకు అని కార్తీక్ ప్ర‌శ్నించ‌గా.. మూడు చెరువుల నీళ్లు నా క‌డుపులో ప‌డ్డాయి గ‌నుక అంటుంది.

తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం(Karthika Deepam) సీరియ‌ల్ ఆస‌క్తిక‌రంగా సాగుతోంది. ఇవాళ్టి ఎపిసోడ్‌లో కార్తీక్, మౌనిత ఇంటికి వెళ్ల‌గా.. అత‌డికి కాఫీ తీసుకొస్తుంది మౌనిత‌. మ‌రి నువ్వు అని కార్తీక్ అడ‌గ్గా.. నేను ఇప్పటికే మూడు సార్లు కాఫీ తాగాను అంటుంది. ఎందుకు అని కార్తీక్ ప్ర‌శ్నించ‌గా.. మూడు చెరువుల నీళ్లు నా క‌డుపులో ప‌డ్డాయి గ‌నుక అంటుంది.

ఇంకా చదవండి ...

  Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ ఆస‌క్తిక‌రంగా సాగుతోంది. ఇవాళ్టి ఎపిసోడ్‌లో కార్తీక్, మౌనిత ఇంటికి వెళ్ల‌గా.. అత‌డికి కాఫీ తీసుకొస్తుంది మౌనిత‌. మ‌రి నువ్వు అని కార్తీక్ అడ‌గ్గా.. నేను ఇప్పటికే మూడు సార్లు కాఫీ తాగాను అంటుంది. ఎందుకు అని కార్తీక్ ప్ర‌శ్నించ‌గా.. మూడు చెరువుల నీళ్లు నా క‌డుపులో ప‌డ్డాయి గ‌నుక అంటుంది. దానికి కార్తీక్.. అస‌లు ఏం జ‌రిగింది..? అని అడుగుతాడు. వెంట‌నే మౌనిత డ్రామాను స్టార్ట్ చేస్తుంది. నా వెన‌కాల భ‌యంక‌ర‌మైన కుట్ర జ‌రుగుతోంది అంటుంది. ఇక ప్రాబ్ల‌మ్ మాది అయితే వాళ్లు నీ మీద ప‌డ్డారేంటి..? అని కార్తీక్ అడ‌గ్గా.. కాస్త నీళ్లు న‌ములుతూ అదే క‌దా నా బాధ‌. న‌డిరోడ్డు మీద వాళ్లు మంత‌నాలు మొద‌లుపెట్టి నీ ప‌రువంతా గంగపాలు చే్స్తున్నారు అని మౌనిత అంటుంది. అసలు నువ్వు వాళ్ల ఫోన్లు ప‌గ‌ల‌గొట్ట‌డ‌మేంటి..? అంత ఒళ్లు తెలియ‌ని కోపం ఎందుకు వ‌చ్చింది..? నేను చూడ‌ని అంత ర‌హ‌స్యం వాళ్ల ఫోన్లో ఏం ఉంది..? నీ దారిన నువ్వు పోకుండా.. దారిన పోయే కంప‌ను తగిలించుకోవ‌డ‌మంటే ఇదే..? నీ కారు ఆపి మ‌రీ వెళ్లి నిల‌దిస్తే దీప మాత్రం ఎందుకు ఊరుకుంటుంది. అస‌లే దానికి ఈ మ‌ధ్య పిచ్చి కోపం వ‌స్తోంది. ఎవ్వ‌రినీ లెక్క చేయ‌ట్లేదు. దానిలో ఇంత తెగింపు నా పెళ్లైన ఇన్ని ఏళ్ల‌లో నేను చూడ‌లేదు. ఒకే ఒక్క‌సారి మా ఇంటి గ‌డ‌ప దాటుతున్న‌ప్పుడు చూశాను. దానికి బాగా మండితే త‌ప్ప ఇలా రియాక్ట్ కాదు. ఆ క‌నుబొమ్మ‌లు పైకి లేపితే నీలాంటి వాళ్లు త‌గ్గ‌ట‌మే మంచిది అని కార్తీక్ అంటాడు. వెంట‌నే మౌనిత‌.. స్టాపిట్ కార్తీక్ అంటుంది.

  నువ్వు నీ భార్య‌ను పొగుడుతున్నావా..? న‌న్ను విమ‌ర్శిస్తున్నావా..? నాకేం అర్థం కావ‌డం లేదు. వాళ్లు నా వెనుకాల ఏదో కుట్ర చేస్తున్నారు. నువ్వేం ప‌ట్టించుకోవ‌ట్లేదేంటి..? ఇదుగో ఇప్పుడే చెబుతున్నా. వాళ్లు ఏవో దొంగ సాక్ష్యాలు సృష్టించి నీ నుంచి న‌న్ను దూరం చేయాల‌ని చూస్తున్నారు. నువ్వు మాత్రం న‌మ్మ‌ద్దు అని అంటుంది. వెంట‌నే కార్తీక్.. దొంగ సాక్ష్యాలు సృష్టించేంత టాలెంట్ దానికి ఉంటే ముందు దాని కాపురం నిల‌బెట్టుకోవ‌డం కోసం దొంగ సాక్ష్యాలు పుట్టించేది క‌దా. మ‌రి అలాంటివేమీ ఇప్ప‌టిదాకా తీసుకురాలేదే అని అంటాడు. దానికి మౌనిత అస‌లు ఏం మాట్లాడుతున్నావు కార్తీక్.. సాక్ష్యాలు చూపించ‌నంత మాత్రానా దీప త‌ప్పు చేయ‌లేదంటావా..? అని ప్ర‌శ్నిస్తుంది. ఇప్పుడు ఆ టాపిక్ అవ‌స‌ర‌మా..? అని కార్తీక్ అడ‌గ్గా.. మ‌రి లేక‌పోతే ఏంటి..? వా క‌చ్చితంగా న‌న్ను నీ ముందు దోషిలా నిల‌బెడ‌తారు. నువ్వు న‌మ్మితే నేను దూర‌మ‌వుతా.. న‌మ్మ‌క‌పోతే వాళ్లు దూరం అవుతారు. బాల్ నీ కోర్టులో ఉంది అని అంటుంది. ఆ త‌రువాత మ‌న‌సులో.. ఇప్పుడు దొరికావు కార్తీక్. నిన్ను మొత్తం నావైపు డైవ‌ర్ట్ చేసుకోవ‌డానికి ఇంత‌క‌న్నా గొప్ప ఆయుధం లేదు అని అనుకొని.. బ‌య‌ట‌కు.. కోర్టు అంటే గుర్తు వ‌చ్చింది. హిమ గురించి నువ్వు ప‌డే బాధ‌ను చూశాను. ఆ దీప కావాల‌నే హిమ‌ను నీ నుంచి దూరం చేసి ఆ ప‌సిదాన్ని అడ్డం పెట్టుకొని నీ ఇంటికి వ‌ఛ్చి తిష్ట వేయాల‌ని చూస్తోంది. అందుకే దానికి ప‌ర్మినెంట్ సొల్యూష‌న్ నేను క‌నుకున్నా అంటుంది.

  దానికి కార్తీక్.. ఏంటి..? ఏం చేశావు అని ప్ర‌శ్నిస్తాడు. ఇక మౌనిత‌.. లాయ‌ర్ సుజాత‌ను నేను ఇవాళ క‌లిశాను అంటే ఏమంది అని కార్తీక్ అడుగుతాడు. పిల్ల‌లు త‌ల్లి ద‌గ్గ‌ర ఉండాలో..? త‌ండ్రి ద‌గ్గ‌ర ఉండాలో తేల్చుకోవ‌డానికి కోర్టును ఆశ్ర‌యించొచ్చంట‌. హిమ నీ ద‌గ్గ‌ర ఉంటాను అనేలా మ‌నం ట్యూన్ చేయ‌గ‌లిగితే.. న్యాయ‌బ‌ద్ధంగానే హిమ‌ను మ‌నం తెచ్చుకోవ‌చ్చున‌ట అని అంటుంది. దానికి కార్తీక్ సంతోషంగా అవునా.. నిజమా..? హిమ నా ద‌గ్గ‌ర ఉంటానంటే ఆ దీప ఇంక ఏం చేయ‌లేదు క‌దా అని అంటాడు. వెంట‌నే మౌనిత ఏం చేయ‌లేదు అని అంటుంది. థ్యాంక్యు, థ్యాంక్యు వెరీ మ‌చ్ చాలా మంచి న్యూస్ చెప్పావు అని అంటాడు. అది చెప్పాల‌నే నీకు ప‌ది సార్లు కాల్ చేసినా నాట్ రీచ్‌బుల్ వ‌చ్చింది. నీ ఫోన్ ఏమైంది..? అని మౌనిత అడుగుతుంది. దానికి దీప త‌న ద‌గ్గ‌ర ఫోన్ తీసుకెళ్లిన విష‌యాన్ని గుర్తు చేసుకొని.. నా ఫోన్ ఇంట్లో ఉంది అని చెబుతాడు.

  ఇక ఇంట్లో దీప‌.. ఏదో ఆలోచ‌న‌లో ఉంటుంది. ఆమె ద‌గ్గ‌ర హిమ ఉండ‌గా.. సౌర్య కూడా అక్క‌డ‌కు వ‌చ్చి ఏమైంది అని అడుగుతుంది. అమ్మ నాతో స‌రిగా మాట్లాడ‌టం లేదు అని హిమ చెబుతుంది. నేనా అని దీప అన‌గా.. వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి నాతో ఏం మాట్లాడ‌లేదు క‌ద‌మ్మా అని అడుగుతుంది. అయ్యో నేనేదో ఆలోచిస్తున్నాన‌మ్మా అని దీప అన‌గా.. వెంట‌నే సౌర్య‌.. నువ్వు కాబ‌ట్టి ఏం అన‌లేదు. అదే నేను అయితేనా చెడామ‌డా తిట్టేది. ఇలా చెప్పా పెట్ట‌కుండా వెళితే ఎవ‌రికైనా కోపం రాదా.?? నాన్న‌నో, నాన్న‌మ్మ‌నో చూడటానికి వెళ్లావా నువ్వు..? ఆ మౌనిత‌ను చూడ‌టానికి వెళ్లావు.. అయినా ఆ ఇంటికి ఎందుకు వెళ్లావు..? అమ్మ అడ‌గ‌లేదు. నేను అడుగుతున్నాను. నువ్వ ఎందుకు మాతో చెప్ప‌కుండా పొద్దున్నే అక్క‌డికి వెళ్లావు..? నిన్నేఅడిగేది. చెప్పు ఎందుకు వెళ్లావు అని అడుగుతుంది.

  దానికి హిమ నాకు నాన్నంటే ఇష్టం కాబ‌ట్టి అని చెబుతుంది. నాన్నంటే ఇష్ట‌మైతే నాన్న ద‌గ్గ‌ర‌కే వెళ్లాలి..? మౌనిత ఇంటికి వెళ్లావు క‌దా నువ్వు అని సౌర్య అడ‌గ్గా.. అవును.. మౌనిత ద‌గ్గ‌ర‌కే వెళ్లాను. ఎందుకంటే నాన్నంటే నాకు ఇష్టం. చాలా ఇష్టం. నాన్న‌కు కూడా నేనంటే చాలా ఇష్టం. నాన్న‌ను వ‌దిలి ఉండ‌లేక పోతున్నాను. మ‌ర్చిపోలేక‌పోతున్నాను. కానీ నాన్న ఇక్క‌డ‌కు రాడు. నేను అక్క‌డికి రాన‌న్నాను. నాన్న కావాలంటే మనంద‌రం క‌లిసి ఉండాలి. ఆ పెద్దింట్లోనే ఉండాలి. అదెప్పుడో నాకు తెలీదు. ఎవ‌రు చెప్పినా నాన్న విన‌డు. ఒక్క మౌనిత చెబితేనే వింటాడు. అందుకే మౌనిత ద‌గ్గ‌ర‌కు వెళ్లి తొంద‌రగా అమ్మ‌ను, నాన్న‌ను క‌ల‌ప‌మ‌న్నాను. ఆ మాట చెప్ప‌డానికే వెళ్లాను. నేను అక్క‌డికి వెళ్తాను అంటే మీరు వ‌ద్దంటారని భ‌యం వేసింది.. అందుకే చెప్ప‌కుండా వెళ్లాను అని చెబుతుంది. ఆ త‌రువాత హిమ‌ను దీప ద‌గ్గ‌ర‌కు తీసుకొని.. నువ్వు ఎవ‌రింటికి వెళ్లాల్సిన అవ‌స‌రం లేద‌మ్మా.. నువ్వ‌న్నావే అంద‌రం క‌లిసి ఆ పెద్దింట్లోనే క‌లిసి ఉండాల‌నుందని, ఉంటాము, అందరం క‌లిసే ఉంటాము. తొంద‌ర‌లోనే అది జ‌ర‌గుతుంది. ఆ విష‌యం నాకు వ‌దిలేయండి నేను చూసుకుంటాను. ఈ లోపు మీరిద్ద‌రు నాకు తెలీకుండా ఎలాంటి సాహ‌సాలు చేయొద్దు అని చెబుతుంది.

  ఇక కార్తీక్ ఇంటికి రాగా.. కిచెన్‌లో నుంచి శ్రావ్య‌.. పైనుంచి సౌంద‌ర్య‌, ఆనంద‌రావులు వ‌స్తారు. వెంట‌నే కార్తీక్.. సారీ మా ఇళ్ల‌ని లోపలికి వ‌చ్చాను అని కార్తీక్ అనగా.. అదేంటి బావ‌గారు ఇది మ‌న ఇళ్లే అని శ్రావ్య అంటుంది. దానికి కార్తీక్.. అరే మ‌న ఇళ్లేనా..? ఇంత సైలెంట్‌గా ఉందేంటి..? అంద‌రూ అప‌రిచితుల్లా చూస్తున్నారేంటి..? అని ప్ర‌శ్నిస్తాడు. అయ్యో అలాంటిదేమీ లేదు బావ‌గారు అని శ్రావ్య అన‌గా.. అయ్యో అలాంటిదే ఉంద‌మ్మా. అంద‌రూ గొడ‌వ లోప‌లికి వ‌చ్చి, ప్ర‌శాంత‌త‌ను బ‌య‌ట‌కు పంపిన‌ట్లు చూస్తున్నారు అని కార్తీక్ అంటాడు.

  వెంట‌నే ఆనంద‌రావు క‌రెక్టే. ఫ్ర‌స్టేష‌న్ రిజిస్ట్రేష‌న్ చేయించుకొని మ‌రీ ఇంట్లోకి ద‌ర్జాగా అడుగుపెడుతున్న‌ట్లు ఉంది అని అంటాడు. దానికి కార్తీక్.. అలాగా డాడీ. మ‌రి దీప వ‌స్తే అని అడుగుతాడు. వెంట‌నే సౌంద‌ర్య‌.. కార్తీక దీపం వ‌స్తున్న‌ట్లు ఉంటుంది అని అంటుంది. దానికి కార్తీక్.. అనుకున్నాను. క్వ‌శ్చ‌న్ అక్క‌డ వేస్తే, ఆన్స‌ర్ ఇక్క‌డి నుంచి వ‌స్తుంద‌ని అడిగే ముందే అనుకున్నాను. దీప‌, దీపంలా ఎందుకు వ‌స్తుంది మ‌మ్మీ.. ఇంత‌కుముందు ధీనంగా వ‌చ్చేది. ఇప్పుడు న‌డుస్తున్న అగ్ని ప‌ర్వ‌తంలా వ‌స్తుంది అని అంటాడు. ఇక సౌంద‌ర్య‌.. తెలుసు క‌దా మంచిది. అది గుర్తిస్తే బావుంటుంది అని అంటుంది. దానికి కార్తీక్.. అది అగ్ని ప‌ర్వ‌తంలా వ‌స్తే నేను ఫైరింజ‌న్ ప‌ట్టుకొని తిర‌గాలా..? ఆవిడ గుణ‌గ‌ణాలు, ఆవిడ స‌హ‌జ స్వ‌భావాలు, ఆవిడ ఆత్మ స్వ‌రూపాలు నాకెందుకు గానీ.. నేను నిన్ను కొడుకుగా ఒక‌టి అడుగుతాను.

  అడ‌గ‌టం అంటే క్వ‌శ్చ‌న్ కాదు రిక్వెస్ట్ అని అంటాడు. చెప్పు అని సౌంద‌ర్య అన‌గా.. నా స‌మ‌స్య‌కు ప‌రిష్కారం కోసం ఒక ప‌ని చేయ‌బోతున్నాను. అది సాల్వ్ చేసుకున్నాక ఏంట‌న్న‌ది చెబుతాను. నువ్వు ఒక హెల్ప్ చేయాలి అని అంటాడు. ఏం చేయాలి అని సౌంద‌ర్య అడ‌గ్గా.. ఒక్క రెండు రోజులు, రెండంటే రెండు రోజులు నువ్వు దీప‌ను స‌పోర్ట్ చేయ‌కుండా ఉండ‌గ‌ల‌వా..? ప‌్లీజ్ మ‌మ్మీ.. రెండు రోజులు నేను నీ సుపుత్రిడినే అనుకో. అదెవ‌రో అప‌రిచితురాలు అనుకో.. ఆ రెండు రోజుల త‌రువాత కావాలంటే దాన్ని కార్తీక దీపం అనుకో, న‌న్నొక ఫ్ర‌స్టేటెడ్ డాక్ట‌ర్ బాబు అనుకో. ఈ రెండు రోజులు న‌న్ను ప‌ట్టించుకోకుండా ఉంటావా..? అని అంటాడు.

  ఇక సౌంద‌ర్య‌... ఈ రెండు రోజులు నువ్వు స‌మాజంలో విలువ‌లు మారేలా చేస్తావా..? ప‌్రపంచంలో ప‌విత్ర‌త‌కు ఉన్న గౌర‌వాన్ని త‌గ్గించేస్తావా..? లోకంలో స‌హ‌జ సిద్ధ‌మైన స్త్రీ ఉనికినే తారుమారు చేస్తావా..? ఏం చేయ‌గ‌ల‌వు..? రెండు రోజుల్లో దాన్ని నువ్వు ఏం చేయ‌గ‌ల‌వు..? అని ప్ర‌శ్నిస్తుంది. నేను దాన్ని ఏం చేయ‌ను మ‌మ్మీ.. కానీ నేను చేయాల్సింది చేస్తాను అని అంటాడు. వెంట‌నే శ్రావ్య‌.. అత్త‌య్యా అని అడ‌గ్గా.. ఏంట‌మ్మా శ్రావ్య అంత భ‌య‌ప‌డుతున్నావు.. నేను మ‌రీ అంత రాక్ష‌సుడిలా క‌నిపిస్తున్నానా..? అని అడుగుతాడు. కాదు బావ‌గారు నా ఉద్దేశ్యం అన‌గా.. నీ ఉద్ధేశ్యం నాకు అర్థ‌మైంది. కానీ నా ఉద్దేశ్య‌మే ఎవ్వ‌రికీ అర్థం కావ‌డం లేదు. చెప్పు మమ్మీ. రెండు రోజులు దీప మీద నువ్వు చూపించే వాత్స‌ల్యానికి సెల‌వు ప్ర‌క‌టించ‌గ‌లవా..? రెండు రోజులు న‌న్ను నా నిర్ణ‌యాల‌కు వ‌దిలేయ‌గ‌ల‌వా..? అని అడ‌గుతాడు.

  అది కాదు కార్తీక్ అని సౌంద‌ర్య ఏదో చెప్ప‌బోతుండ‌గా.. ఇంకేమీ అడ‌గ‌ద్దు సౌంద‌ర్య అని ఆనంద‌రావు అంటాడు. ఈ రెండు రోజులు అని సౌంద‌ర్య ఏదో చెప్ప‌బోతుండ‌గా.. ఇప్పుడేంటి.. రెండు రోజులు దీప‌కు మీ అమ్మ స‌పోర్ట్ ఇవ్వ‌కూడ‌దు అంటావు.. అంతేనా అని అడుగుతాడు. అవును అని కార్తీక్ చెప్ప‌గా.. అస్స‌లు కుద‌ర‌దు అని ఆనంద‌రావు అంటాడు. మీ అమ్మ నీ అంత వెర్రిద‌నుకున్నావా..? నీకు ఈ ఐడియా ఇచ్చిన వాళ్లంతా పిచ్చిద‌నుకున్నావా..? ఇది నీలో పుట్టిన ఆలోచ‌న అయ్యి ఉండ‌దు. అస‌లు రెండు రోజులు కాదు క‌దా.. మాకున్న వాత్స‌ల్యానికి రెండు గంట‌లు కూడా సెల‌వు ప్ర‌క‌టించే ప్ర‌స‌క్తే లేదు అని అంటాడు. ఆ మాట‌లతో సౌంద‌ర్య ఆనంద‌ప‌డుతుంటుంది.

  ఈ రెండు రోజుల్లో నువ్వు దీప‌కు ఏదైనా అన్యాయం త‌ల‌పెడితే నీకు మాట ఇచ్చాము క‌దా అని మేము నోర్మూసుకొని చూస్తూ కూర్చోవాలా..? అది జ‌ర‌గ‌దు. దీప‌కు మా స‌పోర్ట్ ఎప్పుడూ ఉంటుంది అని అంటాడు. వెంట‌నే సౌందర్య‌.. శ‌భాష్ అండి ఇంత కాలానికి మీరు ఒక మంచి మాట చెప్పారు అని నేను అన‌నండి. ఎందుకంటే అలా అంటే కొంత‌మందికి కాలుతుంది అని చెబుతుంది. ఇక ఆ మాట‌తో కార్తీక్ అక్క‌డి నుంచి వెళ్లిపోతాడు.

  ఇక త‌న ఇంట్లో మౌనిత ఆలోచిస్తూ ఉంటుంది. దీప‌తో అన్న మాట‌ల‌ను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. నేను ఇచ్చిన వార్నింగ్‌కి వాళ్ల రియాక్ష‌న్ ఏంటి..? అంత ఈజీగా భ‌య‌ప‌డే ర‌కం అయితే కాదు. మ‌రి వాళ్లు కూడా నాలాగే రెచ్చిపోతే నా జీవితం కూడా అంధ‌కార‌మ‌వుతుందా అని అనుకుంటూ.. ఏహే ఏంటి అంధ‌కారం, చీక‌టి అంటూ ఈ వెధ‌వ క‌రెంట్ పోవ‌డం వ‌ల‌నే ఇలాంటి ఆలోచ‌న‌లు వ‌స్తున్నాయి. స‌మ‌యానికి ప్రియ‌మ‌ణి లేదు క‌రెంట్ లేదు ఫోన్ టార్చ్ వెలిగిద్దామంటే చార్జింగ్ లేదు. ఏంటి అన్ని నెగిటివ్‌గా వ‌స్తున్నాయి. ఏదైనా జ‌ర‌గ‌బోతుందా..? ఏహే తొక్క‌లే ఏం జ‌ర‌గ‌బోతోంది.. లేదు నాకేదో నేనే తీగ‌లాగి, నా ఢొంక‌ను నేను క‌దిలించికున్న‌ట్లు అనిపిస్తుంది. ఛ క‌రెంట్ ఎప్పుడు వ‌స్తుంది అని ఏదోదో ఆలోచిస్తూ ఉంటుంది.

  ఇక రాత్రి దీప ఫోన్‌కి అంజి మెసేజ్ పెట్టగా.. దీప బ‌య‌ట‌కు వెళుతుంది. ఏంటి అంజి ఈ టైమ్‌లో వ‌చ్చావు అన‌గా.. నాకేదో జ‌రుగుతుంద‌ని భ‌యం వేస్తోంది అమ్మా. అందుకే మిమ్మ‌ల్ని జాగ్ర‌త్త‌గా ఉండ‌మ‌ని చెప్తామ‌ని వ‌చ్చాను అని అంటాడు. ఏమైంది అని దీప అడ‌గ్గా.. ఇవాళ డాక్ట‌ర్ బాబు.. పెద్ద మేడ‌మ్, పెద్ద సార్‌తో ఒక మాట అన్నారు అమ్మా అన‌గా.. ఏమ‌ని అని దీప అడుగుతుంది. ఒక్క రెండు రోజులు మిమ్మ‌ల్ని ప‌ట్టించుకోవ‌ద్ద‌ని, స‌పోర్ట్ చేయొద్ద‌ని అంటున్నాడు. నేను అనుకోకుండా వెళ్లాను. ఇది విని వెన‌క్కి వ‌చ్చేశాను అని అంటాడు. రెండు రోజులు న‌న్ను ప‌ట్టించుకోవ‌ద్ద‌ని మా అత్త‌య్య గారితోనూ, మామ‌య్య గారితోనూ చెప్పారా..? ఎందుకో చెప్ప‌లేదా..? అని దీప అడుగుతుంది. కార‌ణం చెప్ప‌లేద‌మ్మా.. కానీ ఏదో పెద్ద ఆలోచ‌న‌లోనే ఉన్న‌ట్లు అనిపిస్తోంది అని అంజి అంటాడు. ఏమై ఉంటుంది అని దీప ఆలోచిస్తూ.. దానికి వాళ్లేం చెప్పారు అని దీప అడుగుతుంది. పెద్ద సార్ అస్స‌లు ఒప్పుకోలేద‌మ్మా.. నువ్వు అడిగిన రెండు రోజుల్లో దీప‌కు అన్యాయం చేస్తే మేము చూస్తూ కూర్చోవాలా..? అదేం కుద‌ర‌దు అని తెగేసి చెప్పారు.

  డాక్ట‌ర్ బాబు ఈ రెండు రోజుల్లో అన్ని స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం చూస్తా అన్నారు. కానీ వాళ్లిద్ద‌రు మీకే స‌పోర్ట్ చేస్తాము అన్నారు. ఇక దీప ప‌రిష్కారామా.. మా అత్తా మామ నాకు స‌పోర్ట్ చేయ‌క‌పోతే ఆయ‌న చూసే ప‌రిష్కారం ఏమై ఉంటుంది అని అంటుంది. అదే తెలియ‌ట్లేద‌మ్మా అని అంజి అన‌గా.. ఇది ఆ మ‌నిషికి వ‌చ్చిన ఆలోచ‌న అయ్యి ఉండ‌దు. ఒక్క‌దానికొక్క‌టి ముడి పెట్టుకుంటూ పోతే అన్నింటికి కార‌ణం ఆ మౌనిత‌నే అనిపిస్తుంది. అదే ఇలాంటి కొత్త కొత్త ఆలోచ‌న‌లు ఆయ‌న‌కు వ‌చ్చేలా చేస్తుంది అని దీప అంటుంది. మంచి, చెడు తెలిసిన డాక్ట‌ర్ బాబు అలాంటి దానికి ఎలా లొంగిపోతున్నారో అర్థం కావ‌డం లేద‌మ్మా, పెద్ద మేడ‌మ్ వాళ్ల స‌పోర్ట్ లేకుండా చేస్తే మిమ్మ‌ల్ని దూరం చేసుకోవాల‌నుకుంటున్నారా.. లేదంటే మౌనిత‌ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా.. ఏది తేల‌డం లేదు నాకు అని అంజి అంటాడు. అది లాయ‌ర్‌ని క‌లిసింది అన్నావు క‌దా అట్నుంటి ఏమైనా న‌రుక్కుంటూ వ‌స్తుందా.. అని దీప అడుగుతుంది. ఇక అంజి.. ఈ రోజు నుంచి ఆ మౌనిత విష‌యం మీరు మ‌ర్చిపోండ‌మ్మా.. నేను ఎలాగోలా మేనేజ్ చేస్తాను. మీరే కొంచెం జాగ్ర‌త్త‌గా ఉండండి. పెద్ద మేడ‌మ్‌ని క‌లిసి డాక్ట‌ర్ బాబును కొంచెం క‌నిపెట్ట‌మ‌ని చెప్పండి. ఏదైనా తెలిస్తే ముందు పెద్ద మేడ‌మ్‌కే తెలుస్తుంది క‌ద‌మ్మా. వ‌స్తాన‌మ్మా అని అంజి అన‌గా.. థ్యాంక్స్ అంజి అని దీప చెబుతుంది. అయ్యో అంత మాట ఎందుక‌మ్మా. వ‌స్తాను అని అక్క‌డి నుంచి వెళ‌తాడు.

  First published:

  Tags: Karthika deepam, Karthika deepam telugu serial

  ఉత్తమ కథలు