• HOME
 • »
 • NEWS
 • »
 • MOVIES
 • »
 • KARTHIKA DEEPAM SERIAL UPDATE MOUNITHA FIRES ON KARTHIK ELSEWHERE SOURYA QUESTIONS KARTHIK MNJ

Karthika Deepam: నీదే చేత‌గానిత‌నం అందుకే.. కార్తీక్‌పై మౌనిత ఫైర్

Karthika Deepam: నీదే చేత‌గానిత‌నం అందుకే.. కార్తీక్‌పై మౌనిత ఫైర్

కార్తీక దీపం

Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆకట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. ఇవాళ్టి ఎపిసోడ్‌లో కార్తీక్‌తో మాట్లాడి వ‌చ్చిన దీప త్వ‌ర‌లోనే అంద‌రం క‌లిసి ఉంటామంటూ ముర‌ళీకృష్ణ‌, హిమ‌కు చెబుతుంది. ముర‌ళీకృష్ణ ఏంట‌మ్మా నువ్వ‌నేది అన‌గా.. దానికి దీప‌.. నేను హిమ‌ను ఏదో మ‌రిపించ‌డానికో నిన్నేదో మురిపించ‌డానికో న‌టిస్తున్నాను అనుకుంటున్నావా నాన్న‌. కాదు.

 • Share this:
  teKarthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆకట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. ఇవాళ్టి ఎపిసోడ్‌లో కార్తీక్‌తో మాట్లాడి వ‌చ్చిన దీప త్వ‌ర‌లోనే అంద‌రం క‌లిసి ఉంటామంటూ ముర‌ళీకృష్ణ‌, హిమ‌కు చెబుతుంది. ముర‌ళీకృష్ణ ఏంట‌మ్మా నువ్వ‌నేది అన‌గా.. దానికి దీప‌.. నేను హిమ‌ను ఏదో మ‌రిపించ‌డానికో నిన్నేదో మురిపించ‌డానికో న‌టిస్తున్నాను అనుకుంటున్నావా నాన్న‌. కాదు.. కానే కాదు. ఆయ‌న ఆయ‌నే. అలాగే ఉన్నారు. ఏ మార్పు లేదు. అదే వ్య‌క్తిత్వం, అదే సంస్కారం, అదే కరుణ‌, అదే మ‌న‌స్త‌త్వం. నా మీద అస‌లు కోప‌మే లేదు. ఇవాళ నాకు ఆయ‌న మీద అస‌లు కోప‌మే రాలేదు. అంత ఎత్తున క‌నిపించారు. ఎంతో ఉన్న‌తంగా అనిపించారు. మా అత్త‌య్య క‌డుపు చ‌ల్ల‌గా ఎంత‌బాగా పెంచారో మా ఆయ‌న‌ను అంటుంది. ఇక ముర‌ళీకృష్ణ.. దీప ఏంట‌మ్మా. ఇన్నేళ్లుగా లేంది. ఇవాళ నీలో ఇంత ఆనందాన్ని చూస్తున్నాను. డాక్ట‌ర్ బాబు నీ క‌ళ్ల‌కు అంత గొప్ప‌గా క‌నిపించాడు అంటే.. నీ కాపురం నిల‌బ‌డ్డ‌ట్లే క‌దా అంటాడు. ఇక దీప అదంతా నేను చూసుకుంటాను నాన్న‌. నా పిల్ల‌ల కోసం, నా కాపురం కోసమే కాదు. అంత మంచి మ‌నిషితో జీవితాంతం క‌లిసి బ్ర‌త‌క‌డం కోసం నేను ఎంతైనా క‌ష్ట‌ప‌డ‌తాను. క‌లిసి పోతాం నాన్న‌. అందరం క‌లిసిపోతాము అని అంటుంది. ఇక హిమ.. అమ్మ నిజంగానా.. మ‌నం డాడీ ద‌గ్గ‌రకు వెళ్తామా అన‌గా.. మ‌నం వెళ్లటం ఏంట‌మ్మా.. మీ నాన్నే ప‌డ‌వ‌లాంటి కారు ఏసుకొచ్చి ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి మ‌న‌ల్ని చేర్చి మ‌న బ‌తుకులు గ‌ట్టెక్కిస్తాడు. ఇంత‌కాలం అంత న‌మ్మ‌కం లేదు. ఇవాళే వ‌చ్చింది. మా ఆయ‌న బంగారం అని దీప అంటుంది. దాంతో ముర‌ళీకృష్ణ‌, హిమ ఇద్ద‌రు సంతోష‌ప‌డ‌తారు.

  మ‌రోవైపు కార్తీక్, మౌనిత ఇంటికి వెళ్ల‌గా.. అక్క‌డ అంతా చెల్లాచెదురుగా ప‌డి ఉంటాయి. మౌనిత ద‌గ్గ‌ర‌కు వెళ్లి ఆమెను పిలుస్తాడు. వెంట‌నే మౌనిత ఆవేశంగా.. నాకు తెలుసు కార్తీక్. ఇలాంటి రోజు ఒక‌టి వ‌స్తుంద‌ని. నేను ముందే ఊహించాను. అరే నీ కోసం.. నిన్ను, హిమ‌ను క‌లప‌డం కోసం నేను ఎంత తాపత్ర‌య‌ప‌డుతున్నానో నీకు తెలిసి నువ్వు ఇంకా ఆ దీప‌నే క‌లుస్తున్నావు చూడు. అది నాకు బాధ‌గా ఉంది. అస‌లే ఆ దీప‌.. నిన్ను, హిమను ఎక్క‌డ క‌లుపుతానో అని నాపై వీలైనంతవ‌ర‌కు కుట్ర‌లు, నింద‌లు వేయ‌డానికి ట్రై చేస్తుంది. అంత ఎందుకు. ప‌ది సంవ‌త్సరాల క్రితం నీకు, హిమ‌కు జ‌రిగిన యాక్సిడెంట్ కూడా నేనే చేయించాన‌ని అబ‌ద్ధం చెప్పి.. న‌న్ను దోషిలా నీ ముందు నిల‌బెట్టి దాని నువ్వు నిజ‌మ‌ని న‌మ్మేలా చేస్తుంది. ఇది ప‌క్కా. అంత ప‌క్కా ప్రణాళిక‌ల‌తో ఉంది ఆ దీప‌. అది నీకు తెలుసా.. తెలీదు. కానీ నువ్వు దాని మాట‌లే న‌మ్మి న‌న్ను ప‌క్క‌న‌పెడుతున్నావు. దాని గురించి కాదు అస‌లు నువ్వు ఏమ‌నుకుంటున్నావో చెప్పు ముందు. ఆ విహారి గాడి సంగ‌తి మ‌ర్చిపోయి అంద‌రూ క‌లిసి ఉంటారా చెప్పు. నీ మీద పిచ్చి ప్రేమ‌తో నువ్వు చేసే ప‌నులు చూడ‌లేక టెన్ష‌న్‌తో నేను పిచ్చిదాన్ని అయ్యేలా ఉన్నాను. ఇవ‌న్నీ ఎందుకు. న‌న్ను అమెరికా వెళ్లిపోమంటావా.. చెప్పు. వెళ్లిపోతా.. మాట్లాడు కార్తీక్ అంటుంది.

  వెంట‌నే కార్తీక్.. ఇక ఆపుతావా.. ఇందాక‌టి నుంచి చూస్తున్నాను. మాట్లాడే ఛాన్స్ నాకు ఇవ్వ‌వా.. నేను నిన్ను దోషిలా కాదు. నువ్వే న‌న్ను దోషిలా నిల‌బెట్టి మాట్లాడుతున్నావు. అరె నేను అర్థ‌మ‌య్యేలా క్లారిటీగా చెప్పినా ఎందుకు అలా అపార్థం చేసుకుంటావు. నేను హిమ‌ను ఇష్ట‌ప‌డి పెళ్లి చేసుకోవాల‌నుకున్న విష‌యం నీకు తెలుసు. ఏదో వాళ్ల అమ్మ ఫోన్ చేస్తే వెళ్లాను. అక్క‌డ‌కు వెళ్లాక తెలిసింది. దీప, హిమ బ‌ర్త్‌డేను సెల‌బ్రేట్ చేస్తుంద‌ని. హిమ గురించి త‌ను అలా చేసింద‌ని తెలిసి కాస్త ఎమోష‌న‌ల్ అయ్యాను అంతే. దానికే నేను త‌న‌తో క‌లిసిపోయిన‌ట్లు మాట్లాడుతావేంటి..? అయినా చెయ్యాల్సిన ప‌నులు వ‌దిలేసి.. ఇలా లేని పోని టాపిక్స్ గురించి మాట్లాడుతున్నావు చూడు. అది నాకు న‌చ్చ‌ట్లేదు. నీ చేతగానిత‌నాన్ని, అస‌మ‌ర్ధ‌త‌ను ఇలా చూపించ‌కు. కావాలంటే నేను చెప్పిన ప‌ని చేసి ప్రూవ్ చేసుకో అంటాడు.

  ఇక మౌనిత‌.. ఏంటి నాది చేత‌గాని త‌న‌మా..? నాది కాదు నీదే చేత‌గాని త‌నం. అవును. ముమ్మాటికి నీదే చేత‌గానిత‌నం. బ‌య‌ట పెట్ట‌డం ఇష్టం లేక‌నే ఆ విహారి సంగ‌తిని నేను వ‌దిలేశాను. అది నీ క‌ళ్ల‌తో నువ్వే చూశావు. ప్ర‌పంచంలో ఆ విహారి ఒక్క‌డేనా క‌విత‌లు రాసేది. క‌విత‌లు అంటే ఎంత ఇష్టం ఉన్నా.. వాడితో దీప అలా రాసుకుపూసుకొని తిర‌గాలా..?మాట్లాడు కార్తీక్. నాకు డ్యాన్స్ అంటే ఇష్టం. అలాగ‌ని నేను చెన్నై వెళ్లి ప్ర‌భుదేవాతో స్టెప్పులు వేస్తానా..? లేదుగా. ప్రూవ్ చేసుకోవాలంటా ప్రూవ్. సిగ్గు లేక‌పోతే స‌రి అని అంటుంది. అదే స‌మ‌యానికి ప్రియ‌మ‌ణి రావ‌డంతో కాఫీ తెమ్మ‌ని చెబుతుంది. ఆ త‌రువాత నిదానంగా కార్తీక్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి.. అది కాదు కార్తీక్ నువ్వు బాగుండాల‌ని అనుకునే న‌న్ను కాద‌ని, నువ్వు బాధ‌ప‌డాల‌ని చూసే వారికి ప్రిఫ‌రెన్స్ ఇవ్వ‌ద్ద‌ని చెబుతున్నా. నీ కోసం నా ప‌ర్స‌న‌ల్ లైఫ్‌ని కూడా నేను వ‌దులుకో్వ‌డానికి సిద్ధ‌ప‌డ్డాను. న‌న్ను చాలా మంది ప్రేమించారు. పెళ్లి కూడా చేసుకుంటామ‌ని చెప్పారు. దేవ‌త‌లా చూసుకుంటాము అన్నారు. కానీ వాళ్లంద‌రిని కాద‌ని నిన్నే దేవుడిలా చూసుకుంటూ.. కాదు కాదు కొలుస్తున్నాను. అయినా నువ్వు న‌న్ను అర్థం చేసుకోవ‌డం లేదు. అది నా బాధ అని అంటుంది.

  ఇక ఇంట్లో దీప‌.. హిమ‌కు అన్నం తినిపిస్తూ ఉంటుంది. ఇక్క‌డ కూర్చుంటే చాలా బావుంద‌మ్మ. గాలి చూడు ఎంత బాగా వ‌స్తుందో అని హిమ అన‌గా.. అవును చాలా బావుంటుంది. ఇలా కూర్చొని తింటే అన్నం కూడా ఎక్కువ తినాల‌ని అనిపిస్తుంది. అంద‌రం ఎండాకాలం ఇలానే పైన కూర్చొని చాప‌లు ప‌రుచుకొని క‌లిసి భోజ‌నం చేస్తూ ఉంటారు అని అంటుంది. ఇక హిమ‌.. మ‌నం కూడా.. నాన్న‌, నువ్వు. మ‌న‌మంద‌రం నానమ్మ వాళ్ల ఇంటికి వెళ్లాక ఇలానే బెంచ్ వేసుకొని కూర్చొని తిందాం అని అంటుంది. ఇక దీప‌.. మ‌నం అక్క‌డ‌కు వెళ్లాక ప్ర‌తి రాత్రి కార్తీక వ‌న భోజ‌నాలే అని అంటుంది. వెంట‌నే హిమ‌.. ఇప్పుడు సౌర్య కూడా ఉంటే ఎంత బావుండేద‌మ్మా అని అన‌గా.. అవును. కానీ ఇప్పుడు సౌర్య కూడా అక్క‌డ బాగానే ఉంటుంది అని దీప అంటుంది. దానికి హిమ‌.. నాన్న‌తో ఉంది క‌దా అని అంటుంది. ఎలా ఒప్పించిందో, ఎలా మీ నాన్న మ‌న‌సు మార్చిందో. అంత సంతోషంగా వెళ్లిందంటే మీ నాన్న మ‌న‌స్ఫూర్తిగా పిలిచి ఉంటారు అని అన్న దీప‌.. నీతో మాట్లాడిందా అని అడుగుతుంది. దానికి హిమ‌.. నాన్న ప‌క్క‌న ఉంటే ప‌క్క‌కు వ‌చ్చి కొంచెం మాట్లాడి గ‌బ‌గ‌బా పెట్టేసింది అని అంటుంది. ఇక దీప‌.. ఎంతైనా సౌర్య‌.. మ‌న ద‌గ్గ‌ర‌, వార‌ణాసి ద‌గ్గ‌ర రౌడీ గానీ వాళ్ల నాన్న ద‌గ్గ‌ర మాత్రం బ‌య‌ప‌డుతూనే ఉంటుంది. ఇప్పుడు మా అత్త‌మ్మ‌కు మ‌నం అస‌లు గుర్తు వ‌స్తామా..? ఉండ‌నీ. ప‌దేళ్ల నుంచి నాన్న కోసం త‌పించిపోయింది అని అంటుంది. ఇక హిమ‌.. పాపం సౌర్య ఇప్పుడు ఏం చేస్తుందో అని అంటుంది.

  మ‌రోవైపు సౌంద‌ర్య ఇంట్లో సౌర్య చ‌లికి వ‌ణికిపోతూ ఉంటుంది. అప్పుడే వ‌చ్చిన కార్తీక్.. ఏయ్ రౌడీ ఏంటి అలా వ‌ణికిపోతున్నావు. చ‌లి జ్వ‌రం వ‌చ్చిందా అని చూసి.. చ‌ల్ల‌గా ఉందే అని అంటాడు. దానికి సౌర్య‌.. ఏసీ జ్వ‌రం నాన్న అని అంటుంది. ఆ త‌రువాత ఏసీ రిమోట్‌ని ఇచ్చి.. చూడండి నాన్న ఏసీ ఎంత త‌గ్గించినా త‌గ్గ‌ట్లేదు.16 మీద పెట్టినా చ‌లి పెరుగుతూనే ఉంది కానీ త‌గ్గ‌ట్లేదు అని అంటుంది. దానికి కార్తీక్ న‌వ్వ‌గా.. ఎందుకు న‌వ్వుతున్నారు. రిమోట్ ప‌నిచేయ‌ట్లేదా అని సౌర్య అడుగుతుంది. దానికి కార్తీక్ నీ బ్రెయిన్ పని చేయ‌డం లేదు. మీ ఇంట్లో మా అమ్మ ఏసీ పెట్టించింది క‌దే. అప్పుడు నువ్వు రిమోట్ వాడ‌లేదా..? అని అడుగుతాడు. దానికి సౌర్య‌.. అమ్మో అప్పుడు నాకు ఇలానే చ‌లి వేసి దుప్ప‌టి మీద అమ్మ చీర‌లు నాలుగు, ఐదు క‌ప్పుకునే దాన్ని. ఇక్క‌డ‌లా అక్క‌డ అన్ని దుప్ప‌ట్లు ఉండ‌వు క‌దా. ఎక్కువ చ‌లి వేస్తే ఇద్ద‌రం చీర‌లే క‌ప్పుకుంటాము. అందుకే నేను ఏపీ అస్స‌లు వేసుకోలేదు. హిమ ఉన్న‌న్ని రోజులే ఏసీ వేసుకుంది. త‌రువాత ఏసీ వేసుకోలేదు. క‌రెంట్ ఎక్కువ కాలుతుందట క‌దా. అందుక‌ని అమ్మ ఎప్పుడూ వేసుకోలేదు అని అంటుంది.

  దానికి కార్తీక్ మ‌న‌సులో రాక్ష‌సి. దాని సెల్ఫ్ రెస్పెక్ట్ రౌడీని ఎంత ఇబ్బంది పెడుతుంది అని అనుకుంటాడు. ఆ త‌రువాత సౌర్య‌.. నాన్న చ‌లి నాన్న అని అంటుంది. ఇక కార్తీక్.. ఇదుగో చ‌లి త‌క్కువ కావాలంటే రూమ్ టెంప‌రేట‌ర్ పెంచాలి. అంటే ఈ నంబ‌ర్లు త‌క్కువ చేయ‌కూడ‌దు. ఎక్కువ చేయాలి. ఇలాగా అని చూపిస్తాడు. దానికి సౌర్య‌.. అవునా. ఎంత చ‌లి కావాలంటే అంత త‌గ్గించాలా.. ఎంత త‌గ్గించాలంటే నంబ‌ర్ అంత పెంచాలా.. అయినా నాకు వ‌ణుకు త‌గ్గ‌లేదు అని అంటుంది. ఇక కార్తీక్.. కాసేపు ఆపేస్తాలే అంటాడు. ఇక సౌర్య‌.. ఎంతైనా బ‌య‌ట గాలే బావుంటుంది అని అంటుంది. వెంట‌నే కార్తీక్.. అలా అని గార్డెన్‌లో ప‌డుకుంటావా ఏంటి..? అని అడుగుతాడు. కాదు ఒక ప‌ని చేద్దామా.. డాబాపైకి వెళ్లి ప‌క్క వేసుకొని ప‌డుకుందామా అని సౌర్య అడ‌గ్గా.. పైనా.. పైన ఎప్పుడు ప‌డుకోలేదు అని అంటాడు. ఇక సౌర్య‌.. ఒక్క‌సారి మీరు పైన ప‌డుకొని చూడండి. ఆకాశంలో న‌క్ష‌త్రాలు క‌నిపిస్తూ ఉంటాయి. న‌క్ష‌త్రాల్లో బొమ్మ‌లు కూడా ఉంటాయి. అవ‌న్నీ చూడ‌చ్చు అని అంటుంది. ఇక కార్తీక్.. నీకు అలా న‌క్ష‌త్రాలు చూస్తూ ప‌డుకోవ‌డం ఇష్ట‌మా అని అడ‌గ్గా.. బాగా ఇష్టం నాన్న అని సౌర్య చెబుతుంది. ఇక కార్తీక్.. స‌రే ప‌దా అని అంటాడు. అలా ఇద్ద‌రు పైకి వెళ‌తారు.

  మ‌రోవైపు మౌనిత కార్తీక్‌తో చెప్పిన మాట‌ల‌ను గుర్తుచేసుకుంటూ ఉంటుంది. ఆ త‌రువాత అస‌లు కార్తీక్ నా వైపు వ‌స్తాడా..? లేక ఆ దీప వైపుకే వెళ్లిపోతాడా..? ఎంత ఆలోచించినా ఏ క్ష‌ణాన ఏం జ‌రుగుతుందో అర్థం కావ‌డం లేదే.. లేదు కార్తీక్‌కి ఆ దీప అంటే ఇష్ట‌మే లేదు. త‌ను అటు వైపుకి అస్స‌లు వెళ్ల‌డు. నాతోనే ఉంటాడు. అవును. నాతోనే ఉంటాడు అని న‌వ్వుకుంటుంది.

  ఇక మేడ‌మీద ప‌డుకున్న సౌర్య‌.. ఆకాశాన్ని చూస్తూ ఉంటుంది. ఇక కార్తీక్.. న‌క్ష‌త్రాలు లేవే అని అన‌గా.. అవును మేం బ‌ల‌భ‌ద్ర‌పురంలో ఉన్న‌ప్పుడు బాగా క‌నిపించేవి అని అంటుంది. దానికి కార్తీక్.. ప‌ల్లెటూరిలో పొల్యూష‌న్ ఉండ‌దు క‌దా. అందుక‌ని న‌క్ష‌త్రాలు క్లియ‌ర్‌గా క‌నిపిస్తాయి. సిటీలో అర్ధ‌రాత్రి దాకా ట్రాఫిక్ ఉంటుంది. ఫ్యాక్ట‌రీల పొగ అన్నీ క‌లిసిపోయి పొల్యూష‌న్ పెరిగి న‌క్ష‌త్రాలు స‌రిగా క‌నిపించ‌వు అని అంటాడు. దానికి సౌర్య‌.. ఓహో అదా కార‌ణం. పొల్యూష‌న్ అంటే ఏంటి నాన్న అని అడుగుతుంది. వెంట‌నే కార్తీక్.. కాలుష్యం. ఆకాశానికి, భూమికి మ‌ధ్య ఉండేది అని అంటాడు. అది పోతే అని సౌర్య అడ‌గ్గా.. ఆకాశం నిర్మ‌లంగా స్వ‌చ్ఛంగా క‌నిపిస్తుంది అని కార్తీక్ అంటాడు.

  ఇక సౌర్య.. ఆకాశానికి, భూమికి మ‌ధ్య కాలుష్యం ఉన్న‌ట్లు.. నీకు, అమ్మ‌కు మ‌ధ్య అలాంటింది ఏదో ఉంది క‌దా నాన్న. అదేదో కాలుష్యంలాగా పోతే.. అమ్మ కూడా ఆకాశం లాగే మీరు అన్న‌ట్లు నిర్మ‌లంగా, స్వ‌చ్ఛంగా క‌నిపిస్తుందేమో అని అంటుంది. దానికి కార్తీక్.. నీ వ‌య‌సు ఎంతే. నువ్వు ఇంత పెద్ద పెద్ద మాట‌లు మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. దానికి సౌర్య‌.. పెద్ద పెద్ద మాట‌లు కాదు నాన్న‌. పెద్ద‌వాళ్ల మాట‌లు. ఇప్పుడు మీరే కదా.. కాలుష్యం గురించి చెప్పింది. అదే క‌దా నేను చెప్పింది అని చెప్పి.. ఒక‌టి అడ‌గ‌నా అని అంటుంది. కార్తీక్ స‌రే అన‌గా.. మీకు ఇప్పుడు అమ్మంటే కోపం క‌దా నాన్నా.. కానీ అమ్మ అంటే ఇష్టం ఎప్పుడో ఒక‌ప్పుడు ప్రేమ ఉండేది క‌దా. అప్పుడు ఎలా ఉండేది అని అడుగుతుంది. దానికి దీప‌తో ఙ్ఞాప‌కాల‌ను గుర్తు చేసుకుంటాడు. ఇక సౌర్య‌.. చెప్పండి నాన్న. మా అమ్మ ప్రేమ‌గా ఉండేదా..? అని అడ‌గ్గా.. కార్తీక్ హా అంటాడు. మీతో స‌ర‌దాగా మాట్లాడేదా అని మ‌ళ్లీ సౌర్య అడ‌గ్గా.. హు అని కార్తీక్ అంటాడు. ఆ త‌రువాత మిమ్మ‌ల్ని బాగా చూసుకునేదా అని అడ‌గ్గా.. ఓ అని కార్తీక్ అంటాడు. త‌నే భోజ‌నం వ‌డ్డించేదా అని సౌర్య‌ అడ‌గ్గా.. ఒక‌సారి ఉప్మా కూడా వ‌డ్డించింది రాక్ష‌సి. మా అమ్మ ముందు క‌క్క‌లేక‌, మింగ‌లేక తినాల్సి వ‌చ్చింది అని కార్తీక్ అంటాడు. దానికి సౌర్య న‌వ్వుతుంది. ఇక కార్తీక్.. మీ అమ్మ మంచిదే. కానీ అని ఏం లేదులే అంటాడు. ఇక సౌర్య‌.. అంత మంచి అమ్మ మీద కోపం ఎందుకు వ‌చ్చింది నాన్న అని అడుగుతుంది. దానికి కార్తీక్.. కాలుష్యం అని చెప్పి, ప‌డుకో అని అంటాడు. ఆ త‌రువాత కార్తీక్.. విహారితో దీప క్లోజ్‌గా ఉన్న సీన్ల‌ను గుర్తు చేసుకుంటాడు.

  మ‌రోవైపు దీప ఇంట్లో.. హిమ చుక్క‌లు లెక్క‌బెడుతూ ఉంటుంది. ఎన్న‌న్ని లెక్క‌పెడ‌తావు అని దీప అడ‌గ్గా.. అవున‌మ్మా చాలా ఉన్నాయి అని హిమ అంటుంది. దానికి దీప‌.. చుక్క‌లు ఎన్ని ఉన్నా. చంద‌మామ ఒక‌టే. మ‌న‌కు మీ నాన్న‌లా అంటుంది. దానికి ఇద్ద‌రు న‌వ్వుతారు. ఇక హిమ‌.. సౌర్య కూడా ఉంటే బావుండేది. పోటి పెట్టుకొనే వాళ్లం. 5 నిమిషాల్లో ఎవ‌రు ఎన్ని చుక్క‌లు లెక్క‌పెడితే వాళ్లే విన్న‌ర్ అని అంటుంది. ఇక దీప.. మ‌నం లెక్క‌పెడ‌తామా..? అని అడ‌గ్గా.. ఓ రెడీ అని ఇద్ద‌రు పోటీ ప‌డ‌తారు. హిమ‌.. థౌజండ్ నేనే విన్.. నేనే విన్ అని ఎగిరి.. అమ్మా అలిసి పోయాన‌మ్మా అని దీప ద‌గ్గ‌ర‌గా వెళుతుంది. అప్పుడు దీప‌.. కార్తీక్ మాట‌ల‌ను గుర్తు చేసుకుంటుంది. నేను బాగా అలిసిపోయాను దీప అన్న మాట‌ల‌ను గుర్తు చేసుకుంటుంది. ఇక సౌర్య‌.. కార్తీక్ మీద చెయ్యి వేయ‌గా.. హిమ అని క‌ళ్లు తెరుస్తాడు. ఆ త‌రువాత సౌర్య చేతిని మెల్ల‌గా తీస్తుండ‌గా.. సౌర్య ఏం నాన్న నేను చెయ్యి వేసుకోకూడ‌దా..? అని అడుగుతుంది. కార్తీక దీపం కొన‌సాగుతుంది.
  Published by:Manjula S
  First published: