హోమ్ /వార్తలు /సినిమా /

Karthika Deepam: నా పాపం పండే రోజు ద‌గ్గ‌ర‌ప‌డిందా..? నా బ‌తుకు బ‌య‌ట‌ప‌డే టైమ్ వ‌చ్చిందా..? మౌనితలో మొద‌లైన టెన్ష‌న్

Karthika Deepam: నా పాపం పండే రోజు ద‌గ్గ‌ర‌ప‌డిందా..? నా బ‌తుకు బ‌య‌ట‌ప‌డే టైమ్ వ‌చ్చిందా..? మౌనితలో మొద‌లైన టెన్ష‌న్

తెలుగు రాష్ట్రాలలో కార్తీక దీపం సీరియల్‌కు ఉన్న క్రేజ్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. గ్రంథాలు రాయాల్సి వస్తుంది. అంత గుర్తింపు తెచ్చుకుంది ఈ సీరియల్. 2017 అక్టోబర్‌లో మొదలైన కార్తీక దీపం సీరియల్ టిఆర్పీ రేటింగ్స్‌లో అగ్రస్థానంలో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు దీన్ని బీట్ చేసే సీరియల్ మరోటి రాలేదంటే వంటలక్క రేంజ్ ఏంటో అర్థం అయిపోతుంది. మరి ఇంతటి పాపులర్ సీరియల్‌లో ఉన్న నటుల స్క్రీన్ నేమ్స్ అందరికీ తెలుసు. మరి వంటలక్క నుంచి మోనిత వరకు వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ ఏంటో ఓ సారి చూద్దాం.

తెలుగు రాష్ట్రాలలో కార్తీక దీపం సీరియల్‌కు ఉన్న క్రేజ్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. గ్రంథాలు రాయాల్సి వస్తుంది. అంత గుర్తింపు తెచ్చుకుంది ఈ సీరియల్. 2017 అక్టోబర్‌లో మొదలైన కార్తీక దీపం సీరియల్ టిఆర్పీ రేటింగ్స్‌లో అగ్రస్థానంలో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు దీన్ని బీట్ చేసే సీరియల్ మరోటి రాలేదంటే వంటలక్క రేంజ్ ఏంటో అర్థం అయిపోతుంది. మరి ఇంతటి పాపులర్ సీరియల్‌లో ఉన్న నటుల స్క్రీన్ నేమ్స్ అందరికీ తెలుసు. మరి వంటలక్క నుంచి మోనిత వరకు వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ ఏంటో ఓ సారి చూద్దాం.

తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం(Karthika Deepam) ర‌స‌వ‌త్త‌రంగా మారింది. నిన్నటి ఎపిసోడ్‌లో మౌనిత‌ను అంజి గుర్తుప‌ట్ట‌డం.. ఆమెపై ప‌గ ‌తీర్చుకుంటాన‌ని శ‌ప‌థం చేయ‌డంతో క‌థ మ‌రింత ఆస‌క్తిక‌రంగా మారింది

  Karthika Deepam: తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం ర‌స‌వ‌త్త‌రంగా మారింది. నిన్నటి ఎపిసోడ్‌లో మౌనిత‌ను అంజి గుర్తుప‌ట్ట‌డం.. ఆమెపై ప‌గ ‌తీర్చుకుంటాన‌ని శ‌ప‌థం చేయ‌డంతో క‌థ మ‌రింత ఆస‌క్తిక‌రంగా మారింది. ఇక ఇవాళ్టి ఎపిసోడ్‌లో మౌనిత‌ను ఇంటికి పిలిపించిన సౌంద‌ర్య ఆమెతో మాట్లాడుతుంది. ఏదో మాట్లాడాల‌న్నారు అని మౌనిత అన‌గా.. ఏదో కాదు అదే. మా కార్తీక్ నీకు ఏదో అసైన్‌మెంట్ అప్ప‌చెప్పాడంట క‌దా. దాని గురించి అని అంటుంది. దాని గురించి మీ దాకా తీసుకొచ్చాడా అని మౌనిత అడ‌గ్గా.. నువ్వేదో నీతికి, నిజాయితీకి పెట్టింది పేరు అని. ఆ పేరు మౌనిత అని వాడు అనుకుంటున్నాడు. నువ్వేంటే ఏంటి అనేది నాకు తెలుసు క‌దా అని సౌంద‌ర్య అంటుంది. నేనంటే ఎంట‌నేది మీకు కాదు కార్తీక్‌కి బాగా తెలుసు. అందుకే న‌న్ను న‌మ్ముతున్నాడు అని మౌనిత చెబుతుంది. దానికి వెంట‌నే సౌంద‌ర్య‌.. అదే క‌దా విచిత్రం గొర్రె క‌సాయివాడినే న‌మ్ముతుంది. డాక్ట‌ర్ బాబు మౌనిత‌నే న‌మ్ముతున్నాడు. ఎవ‌రిని న‌మ్మాలో వారిని న‌మ్మ‌డం లేదు. ఎవ‌రినైతే న‌మ్మ‌కూడ‌దో వారినే న‌మ్ముతున్నాడు అని చెబుతుంది. అయితే ఏమంటారు ఇప్పుడు. లాగిపెట్టి కొట్టే ప్రోగ్రామ్ ఏమైనా పెట్టుకొని ర‌మ్మ‌న్నారా..? మ‌ళ్లీ ఎప్ప‌టిలాగే మెడ ప‌ట్టుకొని గెంటేయాల‌ని నిశ్చ‌యించుకున్నారా అని మౌనిత ప్ర‌శ్నించ‌గా.. లాగి పెట్టి కొట్టినా.. మెడ‌పట్టి గెంటేసినా, సిగ్గు లేకుండా నువ్వు మ‌ళ్లీ మా ఇంటికి వ‌స్తూనే ఉంటావ‌ని నాకు బాగా తెలుసు. మ‌నిషికో మాట‌. ఇంకొక‌దానికి ఇంకొక‌టి అంటారు. ఆ ఇంకోదానికి ఏది ఇచ్చినా మార‌లేదు మ‌రి. అందుకే కొట్టి గెంటేసి ప్రోగ్రామ్‌ని ప్ర‌స్తుతం వాయిదా వేసుకున్నాను అని సౌంద‌ర్య అంటుంది.

  దానికి మౌనిత‌.. థ్యాంక్స్ నా గురించి మీకు బాగా అర్థం అయ్యింది. మీరు ఏం చేసినా నేను కార్తీక్‌ని మ‌ర్చిపోయే ప్ర‌సక్తి లేద‌ని, ఆ ప‌రిస్థితి రాద‌ని మీకు బాగా అర్థం అయిపోయింది. కాబ‌ట్టి నా ప‌ని ఇంకా సులువ‌వుతుంది అని అంటుంది. దానికి సౌంద‌ర్య‌.. అక్క‌డికే వ‌స్తున్నాను. వాడికి నీ గురించి తెలీక‌, పోయి పోయి ఆ అసైన్‌మెంట్‌ని నీకు అప్ప‌జెప్పాడు. అది అడ్వాంటెజ్‌గా తీసుకోని.. నువ్వు నిజాల‌ను అబ‌ద్దాల‌ను, అబ‌ద్దాల‌ను నిజాలుగా మార్చేసి నీ స్వార్థానికి త‌గ్గ‌ట్లుగా మార్చుకుందాము అనుకుంటున్నావేమో.. వాడికి త‌ప్పుడు స‌మాచారం ఇచ్చి త‌ప్పుదోవ ప‌ట్టించాల‌ని చూశావో ఈ సారికి నేను ఏం చేస్తానో, ఏం జ‌రుగుతుందో నువ్వు అస‌లు ఊహించ‌లేవు. నీ పాపం పండేరోజు ద‌గ్గ‌ర‌కి వచ్చింది. ఒక్క క్లూ, ఒక్క ఆధారం, ఒక్క అవ‌కాశం, ఒకే ఒక్క సాక్ష్యం దొరికినా నేను శిథిలాల‌న్నీ తొల‌గించుకుంటూ త‌వ్వ‌కాలు మొద‌లుపెడ‌తాను. నీ నిజ స్వ‌రూపాన్ని, నువ్వు భూగ‌ర్భంలో దాచి ఉంచినా వెలికితీస్తా, నీ అస‌లు రంగు బ‌య‌ట‌పెట్టి, కార్తీక్ చేత‌నే నిన్ను ఛీ అనిపించ‌క‌పోతే నా పేరు సౌంద‌ర్యే కాదు. బాగా గుర్తు పెట్టుకో అని అంటుంది. ఇక అటువైపుగా అంజి రాగా.. అత‌డిని చూసి.. అటు వాడు, ఇటు సౌంద‌ర్య ఒకే రోజు ఒకే విధంగా వార్నింగ్ ఇస్తున్నారంటే నాకేదో మూడిందా అని మౌనిత మ‌న‌సులో అనుకుంటుంది. ఆ త‌రువాత సౌంద‌ర్య‌, మౌనిత భుజాన్ని త‌డుతూ అర్థ‌మైందా అంటుంది.

  ఇక బ‌య‌ట ఉన్న అంజి.. ఈ మౌనిత మామూలు ఆడ‌ది కాదు. సౌంద‌ర్య గారి లాంటి ఆవిడ‌నే న‌మ్మించ‌గ‌లిగింది అంటే ఆవిడ‌కు ఇంత బాగా ద‌గ్గ‌ర అయ్యిందంటే ఇప్పుడు నేను అస్స‌లు తొంద‌ర‌ప‌డ‌కూడ‌దు. మౌనిత ఎలాంటిది అనేది బ‌య‌ట‌పెట్టి అప్పుడు మాట్లాడాలి అని అనుకుంటాడు. ఇక అక్క‌డి నుంచి సౌందర్య‌, అంజి ఇద్ద‌రు వెళ్ల‌డంతో.. రాను రాను నేను ఇలా ఇరుక్కుపోతున్నాను. ఇటు కార్తీక్ నేను చెప్పిన అబ‌ద్దాన్ని నిజం చేయ‌మంటున్నాడు. అటు అంజిగాడు నా బ‌తుకుకు ప‌ర్మినెంట్‌గా స‌మాధి క‌డ‌తా అంటున్నాడు. ఇప్పుడు ఈవిడ ఇలాంటి వార్నింగ్ ఇస్తోంది. నిజంగా నా పాపం పండే రోజు ద‌గ్గ‌ర‌ప‌డిందా..? నా బ‌తుకు బ‌య‌ట‌ప‌డే టైమ్ వ‌చ్చిందా..? అని మౌనిత బ‌య‌ప‌డుతుంది.

  ఇక డాక్ట‌ర్లు హిమ‌ను పిలుచుకొని ర‌మ్మ‌ని చెప్ప‌డంపై ఆలోచిస్తున్న కార్తీక్.. హిమ‌ను పంప‌మ‌ని మ‌మ్మీతో చెప్పిస్తే, ఫ్యామిలీ ఫ్యామిలీని ఇన్వైట్ చేస్తుంది. అందుకే నేనే వెళ్లి ఫంక్ష‌న్‌కి తీసుకెళ్లి, అయ్యాక మ‌ళ్లీ దీప ఇంట్లోనే డ్రాప్ చేస్తాను అని అనుకుంటాడు. ఆ స‌మ‌యంలో దీప, హిమ‌ చెప్పిన మాట‌ల‌ను కార్తీక్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఆ దీప మాట‌లు ప‌ట్టుకొని హిమ‌ను దూరంగా ఉంచ‌నా..? పెంచిన ప్రేమ‌ను చంపుకోలేక తెచ్చేసుకోనా..? హిమంత‌ట హిమే వ‌స్తే పెంచిన తాలుకు పవ‌ర్ ఏంటో ఆ దీపకు అర్థ‌మ‌వుతుంది. అప్ప‌టిదాకా నేను తొంద‌ర‌ప‌డి ఓడిపోకూడ‌దు. య‌స్ నేను వెళితే దీప అనుకున్న‌దే జ‌రుగుతుంది. మమ్మీ చేత కాల్ చేయించి హిమ‌ను ఒక్క‌దాన్నే తీసుకుర‌మ్మ‌ని చెప్పాలి. వెంట‌బెట్టుకొని మ‌రీ ర‌మ్మ‌ని చెప్పాలి అని అనుకుంటాడు.

  ఇక ఇంట్లో మౌనిత గోళ్ల‌కు రంగు వేసుకుంటూ ఉండగా.. అది చూసి ప్రియ‌మ‌ణి న‌వ్వుతుంది. ఏంటి న‌వ్వుతున్నావు అని మౌనిత అడ‌గ్గా.. ఏం లేదమ్మా మా ఊరు గుర్తు వ‌చ్చింది అని అంటుంది. ఏ ఊరేంటి నీది అని మౌనిత అడ‌గ్గా.. ఆంధ్ర‌న‌మ్మా మంగ‌ళ‌గిరి. చిన్న‌ప్పుడు ర‌థ‌నాల రోడ్డులో తిరునాల అప్పుడు మేం చేసిన అల్ల‌రి గుర్తు వ‌చ్చిందమ్మా అని ప్రియ‌మ‌ణి అంటుంది. నీకే న‌యం ప్రియ‌మ‌ణి మంచి మెమోరీస్ ఉన్నాయి. నా బ్ర‌తుక్కి అప్పుడు లేవు, ఇప్పుడు లేవు అన్నీ టెన్ష‌న్‌లే అని మౌనిత అంటుంది. ఇక చిన్న‌ప్పుడు మీకేం టెన్ష‌న్‌లు అమ్మా అని ప్రియ‌మ‌ణి అడ‌గ్గా.. మా అమ్మ ఫ్లైట్ యాక్సిడెంట్‌లో చ‌నిపోయారుగా న‌న్ను మా బాబాయి పెంచాడు. తండ్రిదండ్రులు లేని బిడ్డ క‌దా అని గారాబంగా పెంచారు. చ‌చ్చేంత క్ష‌మ‌శిక్ష‌ణ‌గానూ పెంచాడు. అలా పెంచ‌బ‌ట్టే ఇలా త‌యార‌య్యా అని అంటుంది. ఆ త‌రువాత అంజి మాట‌ల‌ను గుర్తు చేసుకుంటూ మౌనిత భ‌య‌ప‌డుతుంది. ఆ అంజిగాడు నా చ‌రిత్ర సౌంద‌ర్య‌కు చెప్పేస్తే.. ఈ ఫంక్ష‌న్‌కి వెళ్లిన త‌రువాత అంద‌రూ న‌న్ను నిల‌దీస్తే.. చెప్పేస్తాడా..? లేదు చెప్ప‌డు అని త‌న‌లో తాను కొన్ని ఊహించుకుంటూ ఉంటుంది. ఒక‌వేళ అంజి చెప్తే.. అదంతా అబ‌ద్ధ‌మ‌ని అడ్డం తిరుగుతా అంతే అని మౌనిత అనుకుంటుంది. ఈ ఫంక్ష‌న్‌కి నాకు అనుకూలంగా మార్చుకోవాలి అని మౌనిత అనుకుంటుంది.

  మ‌రోవైపు భాగ్యం ర‌మ్మ‌ని చెప్ప‌డంతో టెన్ష‌న్‌తో ముర‌ళీ కృష్ణ ఇంటికి వ‌స్తాడు. ఏమైంది భాగ్యం ఫోన్ చేసి ర‌మ్మాన్నావు అని అడ‌గ్గా.. అయ్యో నీకు ఇంకా తెలీలేదా.. నీకంటే నేనే మేలు క‌దా అయ్యా.. ఎక్క‌డేం జ‌రుగుతుందో క్ష‌ణాల్లో పోగేసుకుంటాను అని భాగ్యం అంటుంది. ఏం జ‌రిగిందో చెప్పాల‌ని ముర‌ళీ కృష్ణ అన‌గా.. ఇవాళ మ‌న పెద్ద‌ల్లుడు డాక్ట‌ర్ బాబుకు స‌న్మానం అని చెబుతుంది. ఈ ఫంక్ష‌న్‌ని మ‌న‌ల్ని ఎవ‌రు పిలుస్తారు అని ముర‌ళీకృష్ణ అన‌గా... శ్రావ్య‌కు ఫోన్ చేసి బ‌ల‌వంతంగా పిలిపించేలా చేశాను అని చెబుతుంది. త్వ‌ర‌గా మ‌నం వెళ్దాం ప‌ద ప‌ద అంటూ తొంద‌ర‌పెడుతుంది. వెంట‌నే ముర‌ళీ కృష్ణ‌.. ఎక్క‌డికి నిన్ను తీసుకురావ‌ద్ద‌ని శ్రావ్య చెప్పింది అని చెప్తాడు ముర‌ళీ కృష్ణ‌. నేను వెళ్లొస్తాన‌ని చెప్తాడు.

  ఇక దీప ఫోన్‌కి సౌంద‌ర్య ఫోన్ చేయ‌గా.. హిమ లిఫ్ట్ చేస్తుంది. హిమ ఎలా ఉన్నావో అని సౌంద‌ర్య అడ‌గ్గా.. నాన‌మ్మ డాడీ ఎలా ఉన్నారు..? ఇప్పుడు ఇంట్లో ఉన్నాడా..? నీ ప‌క్క‌న ఉన్నాడా..? నా ద‌గ్గ‌ర‌కు వ‌స్తాడ‌నుకుంటే ఇంకా రాలేదేంటి..? వ‌స్తాడ‌ని రోజు చూస్తున్నా, ఎందుకు రావ‌డం లేదు. నువ్వేం చెప్ప‌ట్లేదా..? తీసుకుర‌మ్మ‌ని కోప్ప‌డ‌ట్లేదా..? అని ప్ర‌శ్న‌ల మీద ప్ర‌శ్న‌లు కురిపిస్తుంది. అది చెప్తామ‌నే ఫోన్ చేశా అని సౌందర్య చెప్ప‌గా.. ఇది నీకు గుడ్‌న్యూస్ అంటుంది. మీ డాడీకి డాక్ట‌ర్లు స‌న్మానం చేస్తున్నారు అని చెప్ప‌గా.. అది డాడీకి గుడ్‌న్యూస్. నాకు ఎలా అవుతుంది అని హిమ అడుగుతుంది. ఇవాళ సాయంత్రం మీ డాడీకి స‌న్మానం చేస్తున్నారే. ఆ ఫంక్ష‌న్‌కి నిన్ను తీసుకుర‌మ్మన్నారే అని చెబుతుంది. ఏంటి న‌న్ను తీసుకుర‌మ్మ‌న్నారా..? అని సంతోష‌ప‌డుతుంది. సాయంత్రం రెడీ అయి ఉండు నిన్ను తీసుకెళ్తాను అని సౌంద‌ర్య చెబుతుంది. రెడీ అవుతాను అని సంతోష‌ప‌డుతుంది. వెంట‌నే డాడీ న‌న్ను ఒక్క‌టినే ర‌మ్మ‌న్నాడా..? అమ్మా, సౌర్య‌ను తీసుకుర‌మ్మ‌ని చెప్ప‌లేదా..? అని అడుగుతుంది. లేదు అని చెప్ప‌గా.. హిమ బాధ‌ప‌డుతుంది. వెంట‌నే దీప ఫోన్ తీసుకోగా... ఫంక్ష‌న్‌కి హిమ‌ను మాత్ర‌మే తీసుకుర‌మ్మ‌న్నాడ‌ని సౌంద‌ర్య చెబుతుంది. తీసుకెళ్లండి అత్త‌య్యా.. నాన్న నాన్న క‌ల‌వ‌రిస్తుంది. ఆ తండ్రికి చూడాల‌ని ఉంటుంది క‌దా అని చెబుతుంది. కానీ హిమ నేను వెళ్ల‌ను. వ‌స్తే అందరం క‌లిసి వ‌స్తాము అని చెబుతుంది. అలా అన‌కూడ‌ద‌మ్మా.. మీ డాడీని చూడాల‌ని నీకు ఉంది క‌దా.. వెళ్లిన‌ట్లు ఉంటుంది. చూసిన‌ట్లు ఉంటుంది అని హిమ చెబుతుంది. మీరు వ‌స్తానంటేనే నేను వెళ్తా అని హిమ చెప్ప‌గా.. న‌న్ను, సౌర్య‌ను తీసుకొస్తే నాన్న కోప్ప‌డ‌తాను, తిడ‌తాడు అని దీప చెబుతుంది. ఏం కాదు నేను ఉన్నా క‌దా. మిమ్మ‌ల్ని బ‌ల‌వంతంగా తీసుకొచ్చాన‌ని చెబుతా. నాన్న‌కు సన్మానం చేస్తుంటే నీకు. సౌర్య‌కు చూడాల‌ని ఉండ‌దా అమ్మా అని అంటుంది. నాకేం ఇష్టం లేదు. అక్క‌డికి అమ్మ వంట‌ల‌క్కలాగే రావాలి. నేను వంట‌ల‌క్క కూతురి గానే రావాలి. మన అమ్మ డాక్ట‌ర్ బాబు భార్య‌గా వ‌చ్చే ఫంక్ష‌న్ అయితే వ‌స్తాను అని సౌర్య అంటుంది. స‌రే ఫంక్ష‌న్ సాయంత్రం క‌దా.. ఈలోపు హిమ‌కు స‌ర్దిచెప్పు అని సౌంద‌ర్య అంటుంది. వినేలా లేద‌ని దీప చెప్ప‌గా.. మ‌రి నువ్వు వ‌స్తావా అని అడుగుతుంది. పిల‌వ‌ని పేరంటానికి వ‌స్తే ఏమ‌వుతుందో నాకు తెలుసు అత్త‌య్యా అని దీప చెబుతుంది. వెంట‌నే హిమ ఫోన్ తీసుకొని.. రాన‌ని చెప్పు అని మొండిగా చెబుతుంది. స‌రే నువ్వు, సౌర్య కూడా రెడీ అయి ఉండండి అని సౌంద‌ర్య చెబుతుంది.

  ఆ త‌రువాత దీప‌ను ప‌క్క‌కు ర‌మ్మ‌ని చెప్పిన సౌంద‌ర్య‌.. కార్తీక్, మౌనిత‌కు ఇచ్చిన టాస్క్ గురించి చెబుతుంది. దాని గురించి దీప సౌంద‌ర్య‌ను ప్ర‌శ్న‌లు వేస్తుండ‌గానే.. సౌర్య అటుగా రావ‌డంతో మ‌ళ్లీ ఫోన్ చేస్తాను అత్త‌య్య అని చెబుతుంది. ఇక ఫంక్ష‌న్ జ‌రిగే ప్ర‌దేశానికి కార్తీక్ వెళ‌తాడు. అక్క‌డ‌కు హిమ వ‌చ్చిందేమోన‌ని వెతుకుతుంటాడు. మ‌మ్మీతో హిమ‌ను మాత్రం తీసుకుర‌మ్మ‌ని చెప్పాను క‌దా..? నేను ర‌మ్మ‌ని చెబితే వ‌స్తుంది క‌దా..? ఎలా వ‌స్తుంది..? అస‌లు వ‌స్తుందా..? రాదా...? ఆ దీప పంప‌నందా..? అని మ‌న‌సులో అనుకుంటూ ఉంటాడు. ఈలోపే హిమ డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వ‌స్తుంది. ఇక రేప‌టి ఎపిసోడ్‌లో దీప‌, సౌర్య‌ను స్టేజ్ మీద‌కు పిలిచిన హిమ‌.. అక్క‌డ త‌న అమ్మ‌, అక్క అంటూ ప‌రిచ‌యం చేస్తుంది. దీంతో కార్తీక్ కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతాడు.

  Published by:Manjula S
  First published:

  Tags: Karthika deepam, Karthika deepam telugu serial, Television News

  ఉత్తమ కథలు