హోమ్ /వార్తలు /సినిమా /

Karthika Deepam: టెస్ట్‌కి రెడీ అయిన‌ కార్తీక్.. మ‌రో కుట్ర‌కు సిద్ధ‌మైన మోనిత‌.. ఈ ఒక్క రోజు టైమ్‌లో

Karthika Deepam: టెస్ట్‌కి రెడీ అయిన‌ కార్తీక్.. మ‌రో కుట్ర‌కు సిద్ధ‌మైన మోనిత‌.. ఈ ఒక్క రోజు టైమ్‌లో

అప్పటికే తన పిల్లలు హిమ,శౌర్యలను తన భర్త దగ్గరికి చేరుస్తుంది వంటలక్క. సీరియల్‌కు మెయిన్ విలన్ అయిన మోనిత డాక్టర్ బాబు దక్కలేదనే బాధతో ఆత్మహత్య చేసుకుంటుందని ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పట్లో ఈ సీరియల్ ముగింపు ఊహించడం కష్టమే.

అప్పటికే తన పిల్లలు హిమ,శౌర్యలను తన భర్త దగ్గరికి చేరుస్తుంది వంటలక్క. సీరియల్‌కు మెయిన్ విలన్ అయిన మోనిత డాక్టర్ బాబు దక్కలేదనే బాధతో ఆత్మహత్య చేసుకుంటుందని ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పట్లో ఈ సీరియల్ ముగింపు ఊహించడం కష్టమే.

Karthika Deepam: తెలుగు బుల్లితెర‌పై గ‌త కొన్నేళ్లుగా రేటింగ్‌లో టాప్‌లో దూసుకుపోతోంది కార్తీక దీపం. చిన్న అనుమానంతో క‌ట్టుకున్న భార్య దీప‌ను దూరం పెడ‌తాడు కార్తీక్. వీరిద్ద‌రు ఎలా కలుస్తారు అన్న క‌థాంశంతో ఈ సీరియ‌ల్ తెర‌కెక్కింది. ఇప్పుడు ఈ సీరియ‌ల్ ఆ ఆస‌క్తికరంగా సాగుతోంది.

ఇంకా చదవండి ...

    Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతోంది. నిన్న‌టి ఎపిసోడ్‌లో కార్తీక్‌కి క‌నువిప్పు క‌లిగిస్తాడు ఆదిత్య‌. మ‌రోవైపు దీప‌కు ద‌గ్గు ఎక్కువ‌గా రావ‌డంతో పిల్ల‌లు మందుల‌ను తీసుకొస్తారు. వారి కోసం మెడిక‌ల్ షాప్‌లో ప‌నిచేసే వారు వెతుకుంటారు. ఇక ఇవాళ్టి ఎపిసోడ్‌లో దీప, కార్తీక్ ఙ్ఞాప‌కాల‌ను త‌ల‌చుకుంటూ ఉంటుంది. ఙ్ఞాప‌కాలు వ‌ర‌మా, శాప‌మా.. ఎందుకిలా న‌న్నుఙ్ఞాప‌కాలు వెంటాడుతున్నాయి. ఎంత రాయిలా మారాల‌నుకున్నా ప‌దే ప‌దే గుర్తొచ్చి నేను ఏం పోగొట్టుకున్నానో వెక్కిరించి పోతున్నాయి. కాపురం కోస‌మే పుట్టిన నేను క‌విత్వం మీద అభిరుచి ఎందుకు పెంచుకోవాలి. అయితే మాత్రం త‌ప్పు చేశానా.. నేనేంటో నాకు తెలీదా.. ఎందుకు ఆ మ‌నిషి అంత సులువుగా అనుమానానికి లొంగిపోవాలి. నాకు వ్య‌క్తిత్వం లేదా.. నా బొంద వ్య‌క్తిత్వం. పిల్ల‌ల బ‌తుకు ఎటూ కాకుండా పోయిందే. పిచ్చి తండ్రి హిమ‌ను ఎంత పిచ్చిగా, ఎంత ప్రేమ‌గా పెంచుకున్నాడో.. ఎలా ఉండ‌గ‌లుగుతున్నాడో, న‌న్ను ఎంత‌లా తిట్టుకుంటున్నాడో,. అయినా స‌రే ఇక్క‌డ ఉన్న‌ట్లు ఎవ్వ‌రికీ తెలీకూడ‌దు అనుకుంటుంది.

    మ‌రోవైపు సౌంద‌ర్య‌, ఆదిత్య‌తో మాట్లాడుతూ ఉంటుంది. బ‌ర్త్‌డే రోజు శ్రావ్య‌ను బ‌య‌టికి తీసుకెళ్ల‌లేక‌పోయావా అని సౌంద‌ర్య అడ‌గ్గా.. లేదు మ‌మ్మీ. ఇంట్లో హ్యాపీగానే గ‌డిచింది అని ఆదిత్య అంటాడు. ఇక అటుగా వ‌చ్చిన కార్తీక్.. ఏంటి చ‌లికాలం అనుకుంటున్నారా.. లేదా రాత్రి పూట వెన్నెల్లో కూర్చున్నాం అనుకుంటున్నారా.. ఇక్క‌డ కూర్చొని కాఫీ తాగుతున్నారు. బ‌య‌ట వేడిగా ఉంది క‌దా అని అన‌గా.. నువ్వు కాఫీ తాగావా అని సౌంద‌ర్య అడుగుతుంది. లేదు మ‌మ్మీ అన‌గా.. ఉండు తెస్తాను అని లోప‌లికి వెళుతుంది. ఆ త‌రువాత కార్తీక్ కూర్చోగా.. హ్యాంగోవ‌ర్ ఉందా అని ఆదిత్య అడుగుతాడు. దానికి కార్తీక్.. రాత్రి మందు ఏం ఎక్కువ అవ్వ‌లేదు కానీ నీ మాట‌లు నా మీద బాగా ప‌నిచేశాయి అని అంటాడు. త‌ప్పుగా మాట్లాడానా అని ఆదిత్య అన‌గా.. లేదు నీ మాటలు నాకు న‌చ్చాయి. నువ్వు నా మీద చూపించిన అక్క‌ర‌కు పొంగిపోయాను. ఇంత‌కాలం నీ మీద అభిమానం మాత్ర‌మే ఉండేది. ఇప్పుడు గౌర‌వం పెరిగింది. నిన్ను చూస్తే నాకు గ‌ర్వంగా ఉంది. ప్రేమ‌తో నీ భార్య మ‌న‌సు తెలుసుకున్నావు. దానికి నిన్ను అభినందించాలి. కానీ అది మ‌న‌సుకు సంబంధించిన స‌మ‌స్య‌. మ‌న‌సును మార్చుకోగ‌లం కానీ.. నాది అలా కాదు. మ‌న‌సుకు స‌ర్దిచెప్పుకోలేని త‌ప్పు నా భార్య‌ది అని అంటాడు.

    నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు అన్న‌య్య. నీకు పిల్ల‌లు పుట్ట‌రు అనేది నీ అపోహ కావొచ్చు క‌దా అని ఆదిత్య అన‌గా.. అపోహ అని ఎలా అనుకుంటావు. టెస్ట్ రిపోర్ట్‌లు చూశాకే క‌దా నేను తెలుసుకున్నది. నాకు పిల్ల‌లు పుట్టే యోగం లేద‌ని తెలిసి నేను ఎంత బాధ‌ప‌డ్డానో తెలుసా. జీవితంలో పెళ్లి వ‌ద్దు అనే ఆలోచన‌ను వ‌దులుకున్నాను. మీ వ‌దిన‌ను చూశాకే నిజంగా ఆమె వ్య‌క్తిత్వాన్ని ప్రేమించాను. చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. కానీ నాలో లోపం ఉంది కదా. నా స్వార్థం కోసం ఒక ఆడ‌పిల్ల జీవితాన్ని బ‌లి చేయాలా అని ఆలోచించాను. దీప ప‌రిస్థితి తెలిసి మంచి భ‌విష్య‌త్ ఇస్తే బావుంటుంది క‌దా అనుకున్నాను. నా విష‌యం దీప తండ్రితో వివ‌రంగా చెప్పి నీకు, మీ అమ్మాయికి ఎలాంటి అభ్యంత‌రం లేక‌పోతనే పెళ్లి చేసుకుంటాను అని చెప్పాను. వాళ్ల నాన్న పెళ్లికి ముందు దీప‌తో ఈ విష‌యం చెప్ప‌లేదు. కానీ పెళ్లి అయ్యాక త‌ను గ‌ర్భ‌వ‌తి అయ్యింద‌ని తెలిశాక నేను షాక్ అయ్యాను. వెంట‌నే త‌న‌ను అనుమానించ‌లేదు. అంత‌కుముందు నేను చేయించుకున్న రిపోర్ట్‌ల‌లో పొర‌పాటు ఏమైనా జ‌రిగిందేమోన‌ని మ‌ళ్లీ చెక్ చేయించాను. ఆ లోపం అలానే ఉంద‌ని తేలింది. ఇక మీ వ‌దిన ఏ పాపం చేయ‌లేద‌ని ఎలా అనుకోవాలి. ముందే ఈ విష‌యం చెప్పి ఉంటే మీ వ‌దిన జాగ్ర‌త్త ప‌డేదేమో అని అంటాడు.

    వెంట‌నే ఆదిత్య‌.. అన్న‌య్య నువ్వు మ‌ళ్లీ చాలా పొర‌పాటుగా మాట్లాడుతున్నావు అని అంటాడు. ఎందుక‌లా అనుకుంటున్నావు అని కార్తీక్ అడ‌గ్గా.. వ‌దిన వ్య‌క్తిత్వం అంత మంచిది కాబ‌ట్టి. ఏమో మ‌ళ్లీ రిపోర్ట్‌ల‌లో పొర‌పాటు జ‌రిగిందేమో. అన్న‌య్య మీ దగ్గ‌రికి వ‌చ్చే పేషెంట్లు కూడా సెకండ్ ఒపీనియ‌న్, థ‌ర్డ్ ఒపీనియ‌న్ అని చాలా మంది డాక్ట‌ర్ల‌ను క‌లుస్తారే. అలాంటిది ఇంత పెద్ద విష‌యం ఒక కాపురాన్ని కూల్చే విష‌యం. ఒక స్త్రీ మూర్తిని అవ‌మానించే విష‌యం. ఒక ఆడ‌దాన్ని పాతాలానికి నెట్టేసే విష‌యం, సంఘంలో నెట్టేసే విష‌యం. వ‌దిన గురించి తెలిసి వంద సార్లు టెస్ట్ చేయించుకోవాల్సిన విష‌యం. కానీ నువ్వు ఏం చేశావు. నేనే డాక్ట‌ర్‌ని. నేను రిపోర్ట్‌ల‌ను న‌మ్మ‌కపోవ‌డం ఏంటి అన్న అఙ్ఞానం. నీకు ల్యాబ్ టెస్ట్‌ల మీద ఉన్న న‌మ్మ‌కం నీ భార్య మీద లేదు. ఆడ‌దే క‌దా నింద వేయొచ్చు అన్న అహంభావం. వ‌దిన‌ను మేమంతా న‌మ్ముతున్నాము. లోకం న‌మ్ముతుంది. నువ్వు న‌మ్మ‌క‌పోవ‌డం అన్న‌ది నీ అహంకార‌మో, మూర్ఖ‌త్వ‌మో త‌ప్పితే వేరే ఏం లేదు అని అంటాడు. దానికి కార్తీక్.. ఆదిత్య చాలా పెద్ద పెద్ద మాట‌లు మాట్లాడుతున్నావు. నీ ఆవేశం నాకు అర్థ‌మైంది. అందుకే నీ మీద నాకు కోపం రావ‌డం లేదు. నాది అపోహ కాదు అని మిమ్మ‌ల్ని కూడా క‌న్విన్స్ చేయాల్సిన బాధ్య‌త నాకు ఉంది. నేను క‌రెక్టో, మీరు క‌రెక్టో నిరూపిస్తాను వ‌స్తాను అని కారులో వెళ‌తాడు. త‌రువాత ఆదిత్య‌.. సారీ అన్న‌య్య. నిన్ను ఎలాగైనా టెస్ట్‌ల‌కు పంపాల‌న్న ఆలోచ‌న‌తోనే నిన్ను రెచ్చ‌గొట్టేలా మాట్లాడాను. సారీ అని అంటాడు.

    మ‌రోవైపు పిల్ల‌లు కనిపించిన‌ట్లు మోనిత‌కు ఫోన్ వ‌స్తుంది. దీంతో సంతోషంగా.. నిజంగానే క‌నిపించారా అని అడుగుతుంది. క‌నిపించార‌ని మెడిక‌ల్ షాప్ అత‌ను చెప్ప‌గా.. వాళ్ల ఆచూకీ చెప్పిన వెంట‌నే మీకు మ‌నీ ట్రాన్స్‌ఫ‌ర్ చేస్తాను. మీ అకౌంట్ డిటైల్స్ పంపండి అని చెబుతుంది. ఆ త‌రువాత సంతోషంలో పొంగిపోతుంది. ఇక భాగ్యం ఇంట్లో పూజ‌లు చేస్తూ ఉంటుంది. అది కాస్త ఫ‌న్నీగా ఉంటుంది.

    మ‌రోవైపు ముర‌ళీకృష్ణ దీప వాళ్ల‌ను వెతుకుతుండ‌గా.. భాగ్యం ఫోన్ చేస్తుంది. కాల్ లిఫ్ట్ చేసి చెప్పు అన‌గా.. చెప్పుకు ఏమైంద‌య్యా తెగిందా అని భాగ్యం అంటుంది. దానికి ముర‌ళీకృష్ణ‌.. కాలు కింద చెప్పు కాదే. కాల్ చేశావు క‌దా చెప్పు అన్నాను అని అంటాడు. ఇక భాగ్యం.. ఎలా ఉన్నావా, ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతూ.. నేను ఇక్క‌డ పూజ‌లు చేస్తున్నాను. కుంకుమార్చ‌నే కాదు ప‌సుపార్చ‌న కూడా చేస్తున్నాను. నా పూజ‌లు వృధాగా పోవు. నీ ఆరోగ్యం బావుంటుంది అని చెబుతుంది. ఇక వీరిద్ద‌రి మ‌ధ్య కాసేపు సంభాష‌ణ కొన‌సాగుతుంది.

    ఇక‌ మోనిత ద‌గ్గ‌ర‌కు వెళ్లిన కార్తీక్.. నేనొక నిర్ణ‌యం తీసుకున్నాను అని అంటాడు. దానికి మోనిత మ‌న‌సులో ఏ నిర్ణ‌యం తీసుకొని ఉంటాడు. దీప‌ను, హిమ‌ను, సౌర్య‌ను మ‌ర్చిపోయి నన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడా.. అదే నిర్ణ‌యం అయితే ఈ రోజుతో నా త‌ప‌స్సు పూర్తి అయిపోయిన‌ట్లే అని అనుకుంటుంది. ఆ త‌రువాత బ‌య‌ట‌కు ఏంటా నిర్ణ‌యం అని అడ‌గ్గా.. నాకు పిల్ల‌లు పుట్టే అవ‌కాశం ఉందో లేదో మ‌రోసారి టెస్ట్ చేయించుకోవాల‌నుకుంటున్నాను అంటాడు. దాంతో మోనిత షాక్‌కి గురి అవుతుంది. ఇక కార్తీక్ మాట్లాడుతూ.. ప్ర‌పంచం అంతా దీప ప‌విత్ర‌త‌కే మ‌ద్ద‌తు ప‌లుకుతుంది. మా అమ్మ మ‌న‌షుల‌ను అంత తేలిగ్గా అభిమానించ‌దు. ఒక‌ప్పుడు ఎంతో ద్వేషించే మా అమ్మ కూడా దీప‌ను ఎప్పుడూ స‌మ‌ర్ధిస్తూనే ఉంటుంది. మా నాన్న‌, మా త‌మ్ముడు, శ్రావ్య‌, ముర‌ళీకృష్ణ గారు ఎవ‌రైనా స‌రే దీప గురించి చాలా పాజిటివ్‌గా మాట్లాడుతారు. ఈ మ‌ధ్య తుల‌సి, విహారి గురించి కూడా చెప్పింది. అంద‌రూ చెప్పే నిజాన్ని నేను ఒక్క‌డినే అబ‌ద్దంగా కొట్టి పారేస్తున్నాను. ఏమో నేను పరీక్ష చేయించుకున్న‌ప్పుడు రిపోర్టులు మారిపోయి ఉండ‌చ్చేమో. లేదంటే అనుభవం లేని టెక్నీషియ‌న్ టెస్ట్ చేశాడేమో. ఎక్క‌డో ఏదో పొర‌పాటు జరిగి ఉంటే అదే ప‌ట్టుకొని ఇన్నేళ్లు నేను ఉంటే నా అంత మూర్ఖుడు ఈ ప్ర‌పంచంలోనే ఉండ‌డు. దీప‌వైపు నుంచి చేయాల్సిన ప్ర‌య‌త్నాలు, మా అమ్మ వైపు నుంచి చేయాల్సిన ప్ర‌య‌త్నాలు అన్నీ పూర్తి అయిపోయి దీప మ‌న‌సు విరిగిపోయి వెళ్లిపోయింది. అయితే ఒక‌వేళ ఆ బిడ్డ‌లు ఇద్ద‌రు నా బిడ్డ‌లే అయితే. నాన్న అని పిల‌వాల‌నుకున్న సౌర్య‌ను నేను మీ నాన్న‌ను కాద‌మ్మా అని చెప్పి, ఈ బిడ్డ‌లు నా బిడ్డ‌లు కాదు అని చెప్పి దీప‌ను అంద‌రినీ.. నా వాళ్ల‌ను నేను అనుమానించి, అవ‌మానించి దూరం చేసుకున్నందుకు నా పాపానికి అస‌లు ప్రాయ‌శ్చితం ఉంటుందా అని అంటాడు. దాంతో మోనిత టెన్ష‌న్ ప‌డుతుంటుంది.

    మ‌న‌సులో మోనిత‌.. నువ్వు మంచి వాడివి కార్తీక్. అందుకే స‌రిగ్గా ఆలోచిస్తున్నావు. త‌ప్పు నీ వైపు ఉండొచ్చ‌ని రియ‌లైజ్ అయ్యావు. కానీ ఈ నిజం తెలిస్తే మోనిత ప‌రిస్థితి ఏంటి.. నేను రిపోర్టులు మార్చిన విష‌యం నీకు తెలుస్తుందో లేదో ప‌క్క‌న‌పెడితే నువ్వు నాకు దూరం అయిపోతావు క‌దా కార్తీక్. దీప‌కు ద‌గ్గ‌ర అయిపోతావు క‌దా. నీకంటూ మ‌ళ్లీ కుటుంబం, భార్య‌, పిల్ల‌లు, అమ్మ‌, నాన్న అద్భుత ప్ర‌పంచంలో అడుగుపెడ‌తావు. మ‌రి నేను. నిన్ను ప్రేమించిన నేను. నేను ఏమైపోతాను అని టెన్ష‌న్ ప‌డుతూ అనుకుంటుంది. ఆ త‌రువాత కార్తీక్.. నువ్వేం మాట్లాడ‌ట్లేదు ఏంటి అడ‌గ్గా.. ఏం మాట్లాడాలో తెలీడం లేదు కార్తీక్. నిజంగా ఈ నిర్ణ‌యం నీకు మంచే చేస్తే అంత‌కంటే నాకు కావ‌ల్సింది ఏంటుంది అని మోనిత అంటుంది. వెంట‌నే కార్తీక్.. ఇది నా వ్య‌క్తిత్వాన్ని ప్ర‌శ్నించే స‌మ‌స్య‌. నా సంస్కారాన్ని శోధించే స‌మ‌స్య‌. నా చ‌దువు, నా తెలివి, నా విలువ‌లు, నా ఆద‌ర్శాలు అన్నింటిని ఒక్క నిజం లేదా ఒక అబద్దం శాసిస్తుంది. ఆ నిజం అబ‌ద్ధ‌మ‌ని తేలాలి లేదంటే అబ‌ద్ధ‌మే నిజ‌మ‌ని తేలాలి అప్ప‌టిదాకా నాకు మ‌న‌శ్శాంతి లేదు అని అంటాడు.

    దాంతో మోనిత మ‌న‌సులో.. నిజం నిజ‌మ‌నే తేలుతుంది. నేను చెప్పిందే అబ‌ద్ధం అని తేలుస్తుంది. ఆ త‌రువాత ప‌దిహేనేళ్ల సుదీర్ఘ పోరాటాన్ని విషాదాంతం చేసే ఈ నిజం నీకు ఇప్పుడు చాలా అవ‌స‌రం. మ‌రి నాకు. దోషిగా నిల‌బెడుతుందా.. ఏకాకిగా మారుస్తుందా అని అనుకుంటుంది. ఇక కార్తీక్ నీకు న‌చ్చ‌లేదా ఈ నిర్ణ‌యం అని అడ‌గ్గా.. నా భ‌విష్య‌త్‌నే శూన్యం చేసే నీ నిర్ణ‌యం నాకు ఎలా న‌చ్చుతుంది కార్తీక్ అని అనుకుంటుంది. రేపే టెస్ట్ చేయించుకుంటాను అని కార్తీక్ అనగా.. నేను తోడు రానా అని మోనిత అడుగుతుంది. దానికి కార్తీక్..రేపు క‌దా చూద్దాం అని అన‌గా.. నీ ఇష్టం అని మోనిత అంటుంది. ఇంకోసారి ఆఖ‌రి ప్ర‌య‌త్నం చేస్తాను అని కార్తీక్ అంటాడు. దాంతో మోనిత మ‌న‌సులో.. ఇవాళ ఒక్క‌రోజే టైమ్ ఉంది నా వంతు ప్ర‌య‌త్నం నేను చేస్తాను అనుకుంటుంది.

    మ‌రోవైపు దీప టిఫిన్ సెంట‌ర్‌కి చాలా మంది వ‌స్తుంటారు. దీప డ‌బ్బులు చూసుకుంటుడ‌గా.. సౌర్య‌, హిమ‌లు వ‌స్తారు. మీరెందుకు వ‌చ్చారు అని దీప అడ‌గ్గా.. ఇంట్లో బోర్ కొడుతుంద‌మ్మా అని సౌర్య అంటుంది. దానికి దీప చ‌దువుకుంటే బోర్ కొట్ట‌దు అన‌గా.. ఇక్క‌డ నీకు హెల్ప్ చేస్తాం . కాసేప‌మ్మా అని హిమ అంటుంది. ఇక దీప‌.. నేను ముందే చెప్పాను. మీరు అస‌లు ఇటు వైపే రావొద్ద‌ని అన‌గా.. వ‌స్తే ఏమ‌వుతుంది అని సౌర్య అడుగుతుంది. ఇక మెడిక‌ల్ షాపు వ్య‌క్తి వీరిని వెతుక్కుంటూ వ‌స్తుంటాడు. ఇక సౌర్య‌, హిమ‌లు మారం చేస్తుండ‌గా.. మీరు ఇలానే మారం చేస్తే నేను బండి కూడా తీసేసి కూలీ ప‌నికి వెళ‌తాను, ఇటుక‌లు మోస్తాను. అప్పుడు మీకు సంతోషంగా ఉంటుందా.. మీకు నా బ‌తుకు ఛాయ‌లు కూడా ప‌డ‌కూడ‌ద‌ని నేను క‌ష్ట‌ప‌డుతుంటే మీరేమో ఇందులోకి వ‌స్తాం అంటున్నారు. మీ నాన్న‌తో ఉన్నా లేక‌పోయినా మీరు ఆ కోటీశ్వ‌రుల వార‌సులు. ఇక్క‌డ ప‌నిచేస్తే నా మ‌న‌సు ఒప్పుకోదు అని అంటుంది. మ‌రి నువ్వు చేస్తున్నావెందుకు అని హిమ అడ‌గ్గా.. కోటీశ్వ‌రుల కూతుళ్లు మీరు. నేను మామూలు గుమ‌స్తా ముర‌ళీకృష్ణ కూతురిని. మీతో పోల్చుకునేంత గొప్ప‌దాన్ని కాదు. వెళ్లండి అని లోప‌లికి పంపుతుంది.

    దీప వారిని వెతుక్కుంటూ వ‌చ్చిన మెడిక‌ల్ షాపు అత‌ను టిఫిన్ సెంట‌ర్ ద‌గ్గ‌ర‌కు వ‌స్తాడు. అత‌డిని చూసి వార‌ణాసి చెప్పండి అన్న‌. ఇడ్లీ ఇవ్వ‌మంటారా అని అడ‌గ్గా.. టీ ఇవ్వు చాలు అంటాడు. వార‌ణాసి టీ తీసుకొచ్చిన త‌రువాత.. ఇక్క‌డ‌కు ఎవ‌ర‌న్నా కొత్త‌గా వ‌చ్చారా అని అడుగుతాడు. ఇక్క‌డ ఎవ్వ‌రూ రాలేదే అని వార‌ణాసి అన‌గా.. మీరు కూడా కొత్త‌గా ఉన్నారే, ఏ ఊరు నుంచి వ‌చ్చారు అని మెడిక‌ల్ షాప్ వ్య‌క్తి అడుగుతాడు. దానికి వార‌ణాసి ఇదే ఊరు భ‌య్యా. ఇంత‌కుముందు రైల్వే స్టేష‌న్‌లో ముందు ఉండేది బండి. అక్క‌డ కాంట్రాక్ట్ అయిపోయింది. సైకిల్ షాప్ వీర్రాజు లేడు ఆయ‌న అన్న కొడుకును, మా బాబాయ్ ఆయ‌న అని అంటాడు. నువ్వు ఇక్క‌డి వాడివేనా అని వార‌ణాసికి ఫొటోలు చూపించ‌బోతాడు. ఆ త‌రువాత మ‌న‌సులో వ‌ద్దులే వీడికి చెబితే వీడే వాళ్ల‌కి చెబుతాడు క‌దా. నాకు చెబుతాడ‌న్న న‌మ్మ‌కం ఏంటి అని ఆగిపోతాడు. ఆ త‌రువాత అక్క‌డి నుంచి వెళ‌తాడు. రేప‌టి ఎపిసోడ్ ప్రోమోలో టెస్ట్‌కి వెళుతుంటాడు కార్తీక్. మ‌రోవైపు సౌర్య‌ను సంతాన ల‌క్ష్మి ద‌త్త‌త తీసుకుంటాను అని అడుగుతుంది. కార్తీక దీపం కొన‌సాగుతోంది.

    Published by:Manjula S
    First published:

    Tags: Karthika deepam, Karthika Deepam serial, Television News

    ఉత్తమ కథలు