హోమ్ /వార్తలు /సినిమా /

Karthika Deepam: మోనిత మాట‌ల‌ను వినేసిన కార్తీక్.. కార్తీక్ విష‌యంలో మ‌రింత క‌ఠినంగా మారిన‌ హిమ

Karthika Deepam: మోనిత మాట‌ల‌ను వినేసిన కార్తీక్.. కార్తీక్ విష‌యంలో మ‌రింత క‌ఠినంగా మారిన‌ హిమ

అప్పటికే తన పిల్లలు హిమ,శౌర్యలను తన భర్త దగ్గరికి చేరుస్తుంది వంటలక్క. సీరియల్‌కు మెయిన్ విలన్ అయిన మోనిత డాక్టర్ బాబు దక్కలేదనే బాధతో ఆత్మహత్య చేసుకుంటుందని ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పట్లో ఈ సీరియల్ ముగింపు ఊహించడం కష్టమే.

అప్పటికే తన పిల్లలు హిమ,శౌర్యలను తన భర్త దగ్గరికి చేరుస్తుంది వంటలక్క. సీరియల్‌కు మెయిన్ విలన్ అయిన మోనిత డాక్టర్ బాబు దక్కలేదనే బాధతో ఆత్మహత్య చేసుకుంటుందని ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పట్లో ఈ సీరియల్ ముగింపు ఊహించడం కష్టమే.

Karthika Deepam: మాకు ఎవ‌రికీ చెప్పొద్ద‌ని చెప్పిందా.. నిజం చెప్పు అని కార్తీక్ అడ‌గ్గా.. అస‌లు మీరు వ‌స్తార‌ని ఆశ‌నే ఉంటే ఇక్క‌డే ఉండేది క‌దా. గుండె రాయి చేసుకొని వెళ్లిపోయింది అని స‌రోజ అంటుంది. పిల్ల‌లు నాన్న కావాల‌ని మారం చేయ‌లేదా అని కార్తీక్ అడ‌గ్గా.. ఇప్పుడేంటి బాబు. నాకు తెలిసిన‌ప్ప‌టి నుంచి సౌర్య నాన్న కావాలి, నాన్న ద‌గ్గ‌రికి వెళ‌దాం అంటూ మారం చేస్తూనే ఉంది.

ఇంకా చదవండి ...

  Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ ఆస‌క్తిక‌రంగా సాగుతోంది. నిన్న‌టి ఎపిసోడ్‌లో దీప పిల్ల‌ల‌ను తీసుకొని ఊరు వ‌దిలి వెళ్లింద‌ని తెలుసుకున్న కార్తీక్.. శ్రీరామ్ న‌గ‌ర్ బ‌స్తీలో వారు ఉన్న ఇంటికి వెళ‌తాడు. అక్క‌డ స‌రోజ‌క్క, కార్తీక్‌కి సూటి ప్ర‌శ్న‌లు వేస్తుంది. వాటికి స‌మాధానం ఏమీ చెప్పని కార్తీక్.. వారు ఎక్క‌డికి వెళ్లారో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తాడు. ఇక ఇవాళ్టి ఎపిసోడ్‌లో వారి సంభాష‌ణ కొన‌సాగుతుంటుంది. మాకు ఎవ‌రికీ చెప్పొద్ద‌ని చెప్పిందా.. నిజం చెప్పు అని కార్తీక్ అడ‌గ్గా.. అస‌లు మీరు వ‌స్తార‌ని ఆశ‌నే ఉంటే ఇక్క‌డే ఉండేది క‌దా. గుండె రాయి చేసుకొని వెళ్లిపోయింది అని స‌రోజ అంటుంది. పిల్ల‌లు నాన్న కావాల‌ని మారం చేయ‌లేదా అని కార్తీక్ అడ‌గ్గా.. ఇప్పుడేంటి బాబు. నాకు తెలిసిన‌ప్ప‌టి నుంచి సౌర్య నాన్న కావాలి, నాన్న ద‌గ్గ‌రికి వెళ‌దాం అంటూ మారం చేస్తూనే ఉంది. ఆ త‌రువాత హిమ కూడా వ‌చ్చింది. అమ్మ కావాలంటూ ఇక్క‌డే ఉంది. వెళ్లేట‌ప్పుడు పిల్ల‌ల గొంతుకు ఏదో అడ్డుప‌డ్డ‌ట్లు ఉంది. అందుకే నాన్న పేరు బ‌య‌ట‌కు అన‌లేక‌పోయారు. వాళ్ల పిచ్చిగానీ నాన్న కావాల‌ని మారం చేస్తే మాత్రం మీరు క‌రిగిపోతారా ఏంటి అని స‌రోజ అంటుంది. దానికి కార్తీక్.. నువ్వు నన్ను రాక్ష‌సుడిని చేసి మాట్లాడుతున్నావు స‌రోజ‌క్క అంటాడు. వెంట‌నే స‌రోజ‌.. లేదు బాబు. పిల్ల‌ల‌ను తీసుకొని వెళ్లిపోతుంటే క‌డుపు త‌రుక్కుపోయి, గుండె ర‌గిలిపోయి మీతో ఏదో మాట్లాడాను బాబు. క్ష‌మించండి బాబు. మీరు ఏదో పెద్ద పేరున్న డాక్ట‌ర్. మిమ్మ‌ల్ని నేను రాక్ష‌సుడిలా ఎలా చూస్తాను. మీ అమ్మ గారు ఒక‌సారి చెప్పారు. మీరు దేశోద్దార‌కుడంట క‌దా. వెళ్లిరండి బాబు. వెళ్లి దేశాన్ని ఉద్ధ‌రించండి. ఉద్ద‌రించండి అని అక్క‌డి నుంచి వెళుతుంది. ఇక కార్తీక్ కూడా భార‌మైన హృద‌యంతో అక్క‌డి నుంచి వెళుతూ పిల్ల‌ల ఙ్ఞాప‌కాల‌ను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు.

  ఇక కారు మ‌ధ్య‌లో ఆపి హిమ ఙ్ఞాప‌కాల‌ను గుర్తు తెచ్చుకొని హిమ అని గ‌ట్టిగా అరుస్తాడు. ఆ త‌రువాత కారులోకి వెళ్లి ఫోన్‌లో హిమ ఫొటోను చూస్తూ.. ఎక్క‌డున్నావు నాన్న అని అనుకుంటాడు. అక్క‌డి నుంచి బ‌ల‌భ‌ద్ర‌పురం(దీప గ‌తంలో సౌర్య‌తో ఉండే ఊరు) వైపు వెళ‌తాడు. అక్క‌డ కొంత‌మందికి ఫొటోల‌ను చూపిస్తూ అక్క‌డ‌కు వ‌చ్చారని అడుగుతారు.

  మ‌రోవైపు వార‌ణాసి టిఫిన్ బండిని క్లీన్ చేస్తూ ఉండ‌గా.. హిమ‌, సౌర్య వ‌స్తారు. వారు పని చేస్తుండ‌గా.. వ‌ద్ద‌ని చెప్పి ప‌క్క‌కు పంపుతాడు వార‌ణాసి. ఆ ప‌రిస్థితిని చూసి హిమ‌.. సౌంద‌ర్య మాటల‌ను గుర్తు చేసుకుంటుంది. మ‌రోవైపు సౌర్య‌.. కార్తీక్ మాటల‌ను గుర్తు చేసుకుంటుంది. ఇక పిల్ల‌లిద్ద‌రి ద‌గ్గ‌రికి వెళ్లి కూర్చుంటుంది దీప‌. ఇద్ద‌రు ఏం ఆలోచిస్తున్నారు అని దీప అడ‌గ్గా.. నువ్వు బాక్సులు వేసినా ఏం అనిపించ‌లేదు కానీ ఇలా బండిపెట్టి అమ్మ‌డం ఎందుకో నాకు న‌చ్చ‌డం లేద‌మ్మా అని హిమ అంటుంది. ఎందుక‌ని అని దీప అడ‌గ్గా.. నువ్వు డాక్ట‌ర్ గారి భార్య‌వు క‌ద‌మ్మా. సౌంద‌ర్య లాంటి నాన‌మ్మ‌కు కోడ‌లివి క‌దా. నువ్వు ఇడ్లీలు అమ్ముతుంటే నాకు బాధ‌గా ఉంది. త‌ప్ప‌దా అమ్మా అని హిమ అన‌గా.. త‌ప్ప‌లేద‌మ్మా. మ‌నం ఆక‌లితో ఉండ‌టం కంటే. ప‌ది మంది క‌డుపు నింపి ఆక‌లి తీర్చ‌డంలో త‌ప్పేం లేదు. అది కూడా ఒక ప‌విత్ర‌మైన ప‌నే అని దీప అంటుంది. ఇక సౌర్య‌.. మ‌నం ఇంత దూరం ఎందుకు వ‌చ్చామ‌మ్మా. ఇది వ‌ర‌కులాగా అదే ఊర్లో వేరే ఇంట్లో ఉండొచ్చు క‌దా అని అడ‌గ్గా.. వేరే ఇల్లు అయినా ఊరు ఒక‌టే క‌దా. అక్క‌డే ఉంటే వాళ్లే గుర్తు వ‌స్తారు. గుర్తు వ‌స్తే ఏం లాభం. మ‌న బ‌తుకులు ఏమైనా మారుతాయా. మీ నాన్న అనాథ ఆశ్ర‌మాల‌కు వెళ్లి పండ్లు, దుప్ప‌ట్లు పంచిన‌ట్లు ఎప్పుడైనా మీకు నాన్న గానీ నాన్న‌గా ప్రేమ పంచుతాడేమో. ఆ ఆలోచ‌న ఆ పూట‌కే, ఆ క్ష‌ణానికే ఆ త‌రువాత మీరు, నేను, మ‌న ఒంట‌రిత‌నం, మ‌న బ‌తుకు, అందుకే అక్క‌డే ఎందుకు ఉండాలి. బిడ్డ‌ల‌కు ఇంత అన్నం పెట్టుకోవ‌డానికి ప‌రాయి ఊరు అయితే ఏంటి. సొంత ఊర్లో ప‌రాయి వాళ్ల‌గా బ‌తికేకంటే ఇక్క‌డే తృప్తిగా బ‌త‌కచ్చు అని దీప అంటుంది. ఆ త‌రువాత సౌర్య‌.. ఇంక నాన్న రాడా అమ్మా అని అడ‌గ్గా.. వ‌స్తాడ‌ని ప‌దేళ్లు ఎదురుచూశాన‌మ్మా. రాలేదు. రాన‌న్నాడు. వ‌స్తే బావుండును అని ఇక్క‌డ‌కు వ‌చ్చే ఆఖ‌రి క్ష‌ణం దాకా ఎదురుచూశాను. రారు, రాలేదు. మీరు ఎన్ని ఏళ్లు ఎదురుచూస్తారు. రాక‌పోతే ఏమైపోతారు అని దీప అంటుంది. ఒక‌వేళ వ‌స్తే అని సౌర్య అడ‌గ్గా.. రాడు. నేను నంబ‌ర్ మార్చేశాను. నీ ఫోన్ నంబ‌ర్ కూడా మార్చేశాను అని చెప్పి మ‌ళ్లీ టిఫిన్ బండి ద‌గ్గ‌ర‌కు వెళుతుంది. సౌర్య అటుగా వచ్చి సాయం చేయాల‌నుకోగా.. మీకెందమ్మా ఈ ప‌నుల‌న్నీ. మీరెళ్లి అటు కూర్చోండి అని చెబుతుంది.

  ఇక మోనిత, ప్రియ‌మ‌ణితో క‌లిసి న‌వ్వుతూ.. పండుగ వ‌చ్చిందే ప్రియ‌మ‌ణి. నా బ‌తుకులో పండుగ వ‌చ్చింది. ఎన్ని సార్లు దీప‌ను త‌రిమేయాల‌ని నేను ట్రై చేసినా వీలు కానిది కార్తీక్ వ‌ల్లే అయ్యింది. దీప మ‌న‌సు విరిగి పిల్ల‌ల‌ను తీసుకొని దూరంగా వెళ్లిపోయిందంట అని మోనిత అంటుంది. ఇక ప్రియ‌మ‌ణి.. అవున‌మ్మా. మ‌రి హిమ లేక‌పోతే కార్తీక్ అయ్య త‌ట్టుకోగ‌ల‌డు అంటావా అని అడ‌గ్గా.. నిజ‌మేనే. హిమ లేక‌పోతే కార్తీక్ చాలా అప్‌సెట్ అవుతాడు. ఇప్పుడు గానీ నేను హిమ‌ను వెతికి తీసుకొస్తే కార్తీక్ వెంట‌నే నా మెడ‌లో తాళి క‌ట్టేస్తాడు అని అంటుంది. వెంట‌నే కార్తీక్ నిజ‌మే అని ఎంట్రీ ఇస్తాడు. నువ్వు ఊహించిన దాన్ని నిజం చేస్తాను. నేను కోరుకున్న‌ట్లు హిమ‌ను తీసుకురాగ‌ల‌వా అంటాడు. మోనిత సంతోషంలో కార్తీక్ అని అంటుంది. ఇక లోప‌లికి వ‌చ్చిన కార్తీక్.. సోఫాలో కూర్చుంటాడు. కార్తీక్ ఏమైంది. ఒంట్లో బాలేదా అని మోనిత అడ‌గ్గా.. హిమ లేదు అంతే అని కార్తీక్ చెబుతాడు.

  వెంట‌నే మోనిత‌.. హిమ ఎక్క‌డికీ పోదు కార్తీక్. నువ్వంటే హిమ‌కు చాలా ఇష్టం అని చెప్పి ప్రియ‌మ‌ణి మంచి నీళ్లు తీసుకురా అని లోప‌లికి పంపుతుంది. ఆ త‌రువాత కార్తీక్, నువ్వే ఇలా డీలా ప‌డిపోతే ఎలా. వాళ్లేం దేశాలు దాటి పోలేదు క‌దా. ఎందుకు అంత బాధ‌ప‌డుతున్నావు అన‌గా.. న‌న్ను దాటి వెళ్లిపోయారు క‌దా. అంటే నేను అక్క‌ర్లేద‌నే క‌దా. హిమ కూడా ఒప్పుకుంటుంద‌ని నేను ఏ మాత్రం ఊహించ‌లేదు. దీప‌ను హిమ ఎందుకు ఆప‌లేదు. ఎందుకు నాన్నే కావాల‌ని అడ‌గ‌లేదు. ఎందుకు ఉండిపోలేదు. నాకు క‌నీసం ఫోన్ అయినా ఎందుకు చేయ‌లేదు. అంత మార్చేసిందా దీప‌. అంత‌గా మారిపోయిందా హిమ‌. నేను పెంచిందంతా గాలికి కొట్టుకుపోయిందా. నా బిడ్డ లేకుండా నేను ఎలా ఉండాలి అని అంటాడు. ఇక మోనిత.. నిజ‌మే కార్తీక్. నువ్వు హిమ‌ను ఎలా పెంచావో నాకు తెలుసు. హిమ కోసం నువ్వు ఎన్ని విష‌యాల్లో కాంప్ర‌మైజ్ అయ్యావో అది కూడా తెలుసు. నాకే కాదు హిమ‌కు తెలుసు. అయినా త‌ల్లి వెళ్లిపోదాం అన‌గానే వెళ్లిపోతుందా.. నీ గురించి కాస్త ఆలోచించి ఉంటే బావుండు అని అంటుంది. వెంట‌నే కార్తీక్.. హిమ‌నే కాదు చిత్రంగా నాకు రౌడీ కూడా గుర్తు వ‌స్తుంది. అది కూడా క‌నిపించ‌దు అంటే బాధ వేస్తుంది. నా బ‌ల‌హీన‌త తెలుసుకున్న దీప‌.. కావాల‌నే ఇద్ద‌రినీ నా నుంచి దూరం చేసి తీసుకెళ్లింది. ఎంత శాడిస్ట్‌గా మారిపోయింది. నేరుగా న‌మ్మించ‌లేక నా మ‌న‌సు మార్చ‌లేక చివ‌ర‌కు బిడ్డ‌ల‌పై ప్రేమ‌తో దిగి వ‌చ్చి వెతికి తెచ్చుకుంటాన‌నేగా. ఇంత ప్లాన్ చేసింది. లేదంటే.. నిజంగానే నా మీద మ‌న‌సు విరిగిపోయి ఈ మ‌నిషి ఇక మార‌డు అని విర‌క్తితో వెళ్లిపోయి ఉంటుందా. అలా వెళ్లిపోతే మ‌ళ్లీ తిరిగి వ‌స్తుందా. నాకు హిమ కావాలంటే ఇస్తుందా అని అంటాడు.

  ఇక ప్రియ‌మ‌ణి తెచ్చిన నీళ్ల‌ను కార్తీక్‌కి ఇస్తుంది మోనిత‌. ఆ త‌రువాత నిన్ను చూస్తుంటే చాలా బాధ‌గా ఉంది కార్తీక్. ఇప్పుడు నీ ప‌రిస్థితి ఎలా ఉంటుందో నేను ఊహించ‌గ‌ల‌ను. ఇది నీకు స‌డ‌న్‌గా షాక్‌లా త‌గిలి ఉంటుంది. మందు తాగుతావా అని అడుగుతుంది. దానికి కార్తీక్.. మందు మ‌ర్చిపోయే మందుగా మార‌దు. ఇది అంత తేలిగ్గా పోయే బాధ కాదు. నేను ఒక‌టి అడుగుతాను చెబుతావా.. హిమ‌ను వెతికి తీసుకొస్తాను అన్నావు కదా. ఆ ప‌ని చేయ్. నిజంగా హిమ‌ను నా ద‌గ్గ‌ర‌కు తీసుకొస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. హిమ‌ను వెత‌క‌డ‌మే ధ్యేయంగా పెట్టుకొని వెతుకు. వ‌స్తాను అని అక్క‌డి నుంచి వెళ‌తాడు. ఆ మాట‌ల‌తో మోనిత సంతోషంలో తేలిపోతుంది. ప్రియ‌మ‌ణితో క‌లిసి న‌వ్వుతూ ఉంటుంది.

  ఇక సౌర్య‌.. నాన్న‌కు ఫోన్ చేస్తాను. ఇక్క‌డ ఇడ్లీ బండి పెట్టుకొని అమ్మ చాలా కష్ట‌ప‌డాలి. నాన్న‌కు తెలిస్తే నాన‌మ్మ‌కు తెలుస్తుంది. నాన‌మ్మ‌కు తెలిస్తే అమ్మ‌ను కోప్ప‌డి తీసుకెళుతుంది. అమ్మ‌కు క‌ష్టం త‌ప్పుతుంది. నాన్న‌ను చూసిన‌ట్లు ఉంటుంది అని అనుకుంటుంది. ఇక హిమ వెనుక నుంచి వ‌చ్చి నాన్న నంబ‌ర్ అది కాదు. ఆ ఫోన్ కూడా నీది కాదు. నీ ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఉంది. ఇది అమ్మ ఫోన్ కొత్త నంబ‌ర్. నాన్న‌తో మాట్లాడాల‌ని ఉందా. చూడాల‌ని ఉందా.. మ‌నం నాన్న ద‌గ్గ‌ర నుంచి వ‌చ్చేట‌ప్పుడు అమ్మ ఏం చెప్పింది. నాన్న కావాలంటే అమ్మ వ‌ద్ద‌నే క‌దా. పాపం అమ్మ‌. మ‌న కో్సం ఇడ్లీ బండి పెట్టుకొని క‌ష్ట‌ప‌డి సంపాదించాల‌నుకుంటుంది. మ‌నం అమ్మ‌తో ఉన్నాం కాబ‌ట్టి అమ్మ ధైర్యంగా ఉంద‌ని వార‌ణాసి చెప్పాడు. ఇప్పుడు నువ్వు నాన్న‌కు మ‌నం ఎక్క‌డున్నామో చెబితే వ‌చ్చి తీసుకెళ‌తాడు. నేను రాను. అమ్మ రాదు. నీకు మేము వ‌ద్దా సౌర్య అని హిమ అంటుంది. దాంతో ఫోన్‌ని ప‌క్క‌న‌పెట్టేస్తుంది సౌర్య‌. ఆ త‌రువాత నాన్న మ‌న అంద‌రినీ తీసుకెళ‌తా అన్న రోజే మ‌నం వెళ‌దాం సౌర్య‌. నువ్వు నాన్న‌కు ఫోన్ చేశావ‌ని తెలిస్తే అమ్మ ఎంత బాధ‌ప‌డుతుందో తెలుసా అని హిమ అడ‌గ్గా.. అవును. నేను అదంతా అనుకోలేదు. వేరే అనుకున్నాను. నేను చెప్ప‌ను. నువ్వు అమ్మ‌కు చెప్పకు. అమ్మ ఏడుస్తుంది అని సౌర్య అంటుంది. ఇక ఇద్ద‌రు క‌న్నీళ్లు తుడుచుకుంటారు. కార్తీక దీపం కొన‌సాగుతుంది.

  Published by:Manjula S
  First published:

  Tags: Karthika deepam, Karthika deepam telugu serial, Television News

  ఉత్తమ కథలు