Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియల్ రసవత్తరంగా సాగుతోంది. ఇవాళ్టి ఎపిసోడ్లో సౌందర్యను స్కూటీపై ఎక్కించుకుని వెళ్లే దీప ఒక చోట సడన్ బ్రేక్ వేస్తుంది. ఆ తరువాత మౌనిత లాయర్ ఇంట్లోకి వెళుతుండగా.. ఆమెను సౌందర్యకు చూపించి, ఇదే లాయర్ గారి ఇల్లు అంటుంది.
Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియల్ రసవత్తరంగా సాగుతోంది. ఇవాళ్టి ఎపిసోడ్లో సౌందర్యను స్కూటీపై ఎక్కించుకుని వెళ్లే దీప ఒక చోట సడన్ బ్రేక్ వేస్తుంది. ఆ తరువాత మౌనిత లాయర్ ఇంట్లోకి వెళుతుండగా.. ఆమెను సౌందర్యకు చూపించి, ఇదే లాయర్ గారి ఇల్లు అంటుంది.
Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియల్ రసవత్తరంగా సాగుతోంది. ఇవాళ్టి ఎపిసోడ్లో సౌందర్యను స్కూటీపై ఎక్కించుకుని వెళ్లే దీప ఒక చోట సడన్ బ్రేక్ వేస్తుంది. ఆ తరువాత మౌనిత లాయర్ ఇంట్లోకి వెళుతుండగా.. ఆమెను సౌందర్యకు చూపించి, ఇదే లాయర్ గారి ఇల్లు అంటుంది. ఇక మౌనిత లోపలికి వెళుతుండగా..స్కూటీని ఆమె దగ్గరగా తీసుకెళతారు. ఆ తరువాత ఇద్దరు కిందికి దిగుతారు. ఇక సౌందర్య.. చస్తుందే. అత్తా కోడళ్లు కలిసి చంపారని ఈ లాయర్ బోనులో నిలబడి సాక్ష్యం చెబుతుంది అని అంటుంది. ఇక దీప, సౌందర్య ఇద్దరూ మౌనిత యోగక్షేమాలు అడుగుతారు. దానికి మౌనిత ఏం పలకదు. ఇక దీప.. ఏంటి లాయర్ సుజాత గారి ఇల్లు ఇదేనా అని అడగ్గా.. నీ ప్రాక్టిస్ మానేసి, ఈవిడ ప్రాక్టిస్ పెంచడానికి బాగా కృషి చేస్తున్నట్లు ఉన్నావు. బిజినెస్ ప్రమోటర్లాగా అని సౌందర్య అంటుంది. ఇక మౌనిత నేను వేరే పని మీద వచ్చాను అంటుంది. దానికి సౌందర్య నవ్వుతూ.. నీకు వేరే పని ఏముంటుందే పిచ్చిమొహమా.. ఎవరికి చెబుతున్నావు అని అడగుతుంది. దానికి మౌనిత.. మీరు ఏ పని మీద వచ్చారు అని అడగ్గా.. స్కూటీ మీద వచ్చాము అని దీప అంటుంది. దాంతో దీప, సౌందర్య ఇద్దరు నవ్వుతారు.
ఇక దీప.. జోక్ ఎలా ఉంది. నీ పగలాగా పాతగా ఉందా..? లేక నా ధైర్యంలాగా కొత్తగా ఉందా..? చాలా బిజీగా తిరుగుతున్నట్లు ఉన్నావు. ముందు ముందు నువ్వు లాయర్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగడానికి ప్రాక్టిస్లా ఉంటుందనా..? అని అడుగుతుంది. ఇక మౌనిత.. ఆవిడ నా ఫ్రెండ్ అనగా.. ఏ స్కూల్లో అని దీప అడుగుతుంది. నా క్లాస్మేట్ అని మౌనిత చెప్పగా.. ఏ కోర్టులో అని దీప మళ్లీ అడుగుతుంది. ఇక మౌనిత నా పని మీద నన్ను వెళ్లనివ్వండి అని అంటుంది. ఇక సౌందర్య.. నీ కాళ్ల మీద నిన్ను వెళ్లనిచ్చింది సంతోషించు. నేను ఆపకపోయి ఉంటే నీ రెండు కాళ్లు కారు డిక్కీలో వేసుకొని వెళ్లాల్సి వచ్చేది అని అంటుంది. ఇక దీప.. లేదు అత్తయ్యా. ఈవిడ నాకు బాగా సాయం చేస్తుంది అందుకే బ్రేక్‌లు వేసి బతికించాను. లేదంటే దీన్ని లేపేయడం ఎంతసేపు చెప్పు అని అంటుంది.
వెంటనే మౌనిత.. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు..? నేను నీకు సాయం చేయడం ఏంటి..? నువ్వు నన్ను క్షమించడం ఏంటి..? అని అంటుంది. ఇక సౌందర్య కూడా.. అవును ఏంటే నాకు అర్థం కావడం లేదు అని అడుగుతుంది. దానికి దీప.. అయ్యో మీకు పూర్తిగా తెలీదు కదూ. మీ అబ్బాయి హిమను తన దగ్గరకు రప్పించుకోవడానికి ఈ కాకి మెడ కొన్ని సలహాలు ఇచ్చింది. అందులో ఇది ఒకటి. నా మీద కేసు వేసి, కోర్టు ద్వారా హిమను రప్పించుకోవడానికి ట్రై చేస్తున్నారు. అందుకే లాయర్ దగ్గరకు వచ్చారు అని అంటుంది. దానికి సౌందర్య.. దీని కాకి మెడ కాకులు ఎత్తుకపోను అని అంటుంది. వెంటనే దీప.. అది మా భాగ్యం పిన్ని తిట్టులా ఉంది అత్తయ్యా అనగా.. దీనికి మాస్ తిట్లే కరెక్ట్ అని సౌందర్య అంటుంది. ఇక దీప.. రావే మౌనిత. నేను వస్తా. లాయర్ గారితో నేను మాట్టాడతా. హిమను పంపించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెబుతా అని అంటుంది. దానికి షాక్‌కి గురైన సౌందర్య.. నీ స్ట్రాటెజీ ఏంటో దీనికి కాదు నాకు అర్థం కావడం లేదే అనగా.. అవన్నీ దీని ముందు డిస్కస్ చేయడం ఎందుకు రండి అని లోపలికి వెళతారు. ఇక మౌనిత వెనక్కి వెళుతుండగా.. ఆమెను తీసుకొని ముగ్గురు లోపలికి వెళతారు.
మరోవైపు కారు దిగిన కార్తీక్ మౌనిత పెట్టిన మెసేజ్‌ని చూస్తాడు. అందులో లాయర్ దగ్గర ఈ ముగ్గురు ఉన్న ఫొటోను పెట్టిన మౌనిత.. హిమను నీకు అప్పగించే విషయంలో కేసు కంపల్సరీ పెట్టమని లాయర్‌తో దీప చెబుతుంది. మీ అమ్మ సపోర్ట్‌తో వచ్చింది. మళ్లీ కాల్ చేస్తా అని మెసేజ్ పెట్టి ఉంటుంది. ఏంటి దీనికి ఇంత తేలిక అయ్యింది. హిమను నాకు అప్పజెప్పడానికి వెనకాడుతుందనుకుంటే ముందు పడీ మరీ రెచ్చగొడుతుంది. పాపం నా కోసం మౌనిత, లాయర్ చుట్టూ తిరుగుతూ కష్టపడుతుంది. ఈ అత్తా కోడళ్లు తనను బాగా ఆడుకుంటున్నట్లు ఉన్నారు అని మనసులో అనుకుంటాడు.
ఇక దీప, సౌందర్యలను చూసి లాయర్ సుజాత షాక్‌కి గురి అవుతుంది. దాంతో సౌందర్య.. దీప ఈ లాయర్ ఈ సెంచరీలో కోలుకునేలాగా లేదు అని అనగా.. మౌనిత మాత్రం తేరుకుందా అత్తయ్యా అని దీప అంటుంది. ఇక సౌందర్య.. అవును ఇది ఇనుప మాస్క్ వేసుకున్నట్లుగా ఉంది అని అంటుంది. ఇక దీప.. వీళ్లతో ఏంటి అత్తయ్యా.. నేను చెప్పాల్సింది చెప్పి పోదాము అని అంటుంది. ఇక లాయర్‌తో.. సుజాత గారు. మీరు చూసే దృశ్యం కరెక్ట్. ఒక అత్తా, ఒక కోడలు, ఒక అని ఆగి.. దానిని ఏ దరిద్పు పదంతోనే పోల్చలేము. ముగ్గురం కలిసే వచ్చాము. అసలు ఈ కేసు ఆలోచన వచ్చింది మౌనితకు కదా. నాకు ఎలాంటి ప్రాబ్లమ్ రాదు. ఎలాంటి అభ్యంతరం లేదు. నా బిడ్డను మా ఆయనకే అప్పగిస్తాను. కానీ ఏదైనా చట్టప్రకారమే జరగాలి. కోర్టు ద్వారా ఉత్తర్వులు వస్తేనే నా బిడ్డను మా ఆయనకు అప్పగిస్తాను. కోర్టులో జడ్జిగారి ముందు ఎక్కడ ఏ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడతాను అని అంటుంది.
వెంటనే సౌందర్య దీప అనగా.. మీరు ఉండండి అత్తయ్యా. నాకు మంచి చేయడానికి ఈ భూలోకంలో పుట్టిన మౌనితను ఇంతకాలం మనం అపార్థం చేసుకున్నాము. అవతార పురుషుడిలాగా అవతార స్త్రీ. అటు చూడండి. అది దాని బిత్తర మొహం. ఎలా కలవెలబోతోందో అని దీప అంటుంది. దాంతో మౌనిత.. దీప నన్ను ఇరిటేట్ చేయకు. ఏంటి ఇదంతా. ఏం చేయలనుకుంటున్నావు అని అడుగుతుంది. ఇక దీప.. చూడు మౌనిత. డాక్టర్ బాబు నా మొగుడు. హిమ నా కూతురు. నా కూతురుని నా మొగుడికి అప్పగించడానికి నువ్వు ఎందుకే అంత తాపత్రయపడుతున్నావు. రోజు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసినట్లు ఈ గుండ్రాయి లాంటి సుజాత చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నావు. ఇందులో ఏంటి నీకు లాభం అని నేను నిన్ను అడిగానా..? నాకేం నష్టం లేదే పిచ్చి మొహమా అంటున్నాను. నీకు అర్థమవుతోందా..? అని అంటుంది.
వెంటనే సౌందర్య.. ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న నాకే అర్థం కావడం లేదు. ఈ కాకి మెదడుకు ఏం అర్థమవుతుందే అని అనగా.. అందరికీ నిదానంగా అర్థమవుతుందిలే అని చెబుతుంది. ఆ తరువాత లాయర్‌తో మీరు నోటీసు నా చేతికి ఇచ్చినా సరే. బంట్రోతుతో పంపినా సరే. నేను రిసీవ్ చేసుకోవడానికి, సంతకం చేయడానికి పెన్ను పట్టుకొని రెడీగా ఉంటాను అని చెబుతుంది. ఇక లాయర్.. దీప గారు. మీరు ఎందుకు హిమ విషయంలో ఆందోళన పడకుండా ఇంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారో తెలుసుకోవచ్చా అని అడుగుతుంది. దానికి దీప.. ఏం లేదు నా భర్త నా మనసు అలిసిపోయింది దీప అన్నారు. అలిసిపోయిన ఆ మనసుకు ఆలోచించ ఓపిన లేదని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి.. ఫీజు గట్టిగా ఇచ్చుకో. కేసు నీది గెలుపు నాది అని చెప్పి.. రండి అత్తయ్యా అని బయటకు వెళుతుంది.
బయటకు వెళ్లిన తరువాత సౌందర్య.. ఏంటే. సస్పెన్స్‌లో ముంచావు. వాళ్లను ముంచితే ముంచావు. నన్ను ఎందుకు ఇంత డైలమాలో ఉంచావు అని అనగా.. నేను అనుకున్నది జరగాలని ఆశీర్వాదం ఇవ్వండి అత్తయ్యా. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణం మాత్రం అడగకండి. న్యాయం చేయడానికి మాత్రమే కోర్టులు ఉన్నాయి. మనవైపు న్యాయం ఉంది. అదే నా ధైర్యం అని అంటుంది. ఇక సౌందర్య.. నా వల్ల కాదు. అంజిని రమ్మని నేను కారులో వెళతాను అని సౌందర్య చెప్పి, అంజికి ఫోన్ చేస్తుంది.
మరోవైపు మురళీకృష్ణ ఇంట్లో హిమ.. ఇవాళ కూడా అమ్మ రావడం ఆలస్యం అవుతుందా తాతయ్య అని అడుగుతుంది. ఏమ్మా అని మురళీకృష్ణ అడగ్గా.. రోజు మీరే వంట చేస్తున్నారు కదా అని హిమ అంటుంది. దానికి మురళీకృష్ణ.. మీ అమ్మమ్మ కంటే నేను వంట బాగా చేస్తాను. మీ అమ్మమ్మ స్పూన్ నూనె మాత్రమే వేస్తుంది. ఆవిడ అటు వెళ్లగానే నేను కూరకు తగినంత నూనె వేస్తుంది. నూనె పైకి తేలగానే దాన్ని చూసి.. స్పూన్ ఆయిల్ వేస్తేనే ఎలా పైకి తేలుతుందో అని గుండెలు బాదుకుంటుంది అని చెబుతాడు. దానికి ఇద్దరు నవ్వుకుంటారు. ఇక హిమ.. ఇప్పుడు ఎవరింటికి వెళ్లింది. వాళ్ల చుట్టాల ఇంటికా..? అని అడగ్గా.. కాదు. పక్కింట్లో ఒక ముసలమ్మ ఉంటుంది. ఆవిడ కొడుకులు అమెరికాలో ఉంటారు. ఆవిడకేమో తీర్ధయాత్రలు చేయాలని కోరిక. మీ అమ్మమ్మకేమో ఈ వంకతో సంపూర్ణ తీర్ధయాత్రలు చేయాలని ఆశ. అమెరికాలో ఉన్న ముసలమ్మ కొడుకులకు ఫోన్ చేసి మీ అమ్మ కోరిక తీర్చని మీరు ఏం కొడుకులని తిట్టి కావాలంటే నేను దగ్గరుండి తీసుకెళ్లాను అని అనింది. వారు వెంటనే రెండు లక్షలు పంపారు. అవి అయ్యాక ఇద్దరినీ తిరిగి రమ్మన్నారు అని చెబుతాడు. ఆ తరువాత హిమ.. తాతయ్య. అమ్మ ఇంకా ఇంటికి రాలేదేంటి. ఏదైనా పనికి వెళుతుందా అనగా.. లేదమ్మా పని మీద వెళుతుంది. మళ్లీ స్కూళ్లు, ఆఫీసులు తెరిచే దాకా మీ అమ్మను డబ్బులకు ఏం ఇబ్బంది పడొద్దని చెప్పాలే. ఇంక ఏ పని వద్దన్నాను అని మురళీకృష్ణ చెబుతాడు.
అమ్మ ఎవరి దగ్గరా తీసుకోదు. నేను నానమ్మని అడిగి రూ.50లక్షలు ఇస్తే తిరిగి ఇచ్చేసింది తెలుసా అని హిమ అనగా.. ఆ 50లక్షల గురించి తెలీదు. 5కోట్ల గురించి తెలుసు. మీ నాన్న అంత డబ్బు ఇస్తానన్నా తీసుకోలేదు అని మురళీకృష్ణ అంటారు. డబ్బులు తీసుకొని వాళ్లు మంచివాళ్లా..? పిచ్చి వాళ్లా..? అని హిమ అనగా.. దానికి మురళీకృష్ణ.. అభిమానవంతులమ్మా. ఎవ్వరి దగ్గరా డబ్బులు తీసుకోని వారు. లోకంలో ఇలాంటి వాళ్లు తక్కువైనా సరే. వీళ్లే గొప్పవాళ్లు అని అంటాడు. ఆ తరువాత మీ అమ్మమ్మ పరాయివాళ్ల సొమ్ముతో దేశమంతా తిరగడానికి వెళ్లింది. ఇప్పుడు అర్థం అయ్యిందా..? మీ అమ్మకు, నా భార్యకు మధ్య ఉన్న తేడా అని అంటాడు. ఇక హిమ.. మరి ఇంత మంచి అమ్మ డాడీని బాధపెడుతుందేమోనని అనిపిస్తుంటుంది తాతయ్య. మొన్న మౌనిత ఇంటికి వెళ్తే.. అమ్మ, నన్ను బయటకు పంపి డాడీతో చాలా సేపు మాట్లాడింది. నేను చాటు నుంచి విన్నాను కానీ కొన్ని వినపడ్డాయి. కొన్ని వినపడలేదు. డాడీ బాధపడ్డాడు తాతయ్య. నన్ను ప్రేమగా పెంచుకున్నాడు కదా అమ్మ ఇలా ఎందుకు చేస్తుంది..? అని ప్రశ్నిస్తుంది.
ఇక మౌనిత.. లాయర్ దగ్గర దీప చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అసలు ఆ దీప ధైర్యం ఏంటి..? నేను హిమను కార్తీక్ దగ్గరకు పంపాలని చూస్తున్నా సరే అంది తప్ప రచ్చ చేయలేదు. చూస్తుంటే ఆ దీప ఏదో పెద్ద ప్లాన్‌తో ఉందనిపిస్తోంది. ఆ ప్లాన్ ఏమై ఉంటుంది. నన్ను కార్తీక్ నుంచి దూరం చేయాలనా..? లేక హిమతో పాటు కార్తీక్‌ని కూడా తన దగ్గరకు రప్పించుకోవాలనా..? లాయర్ కూడా కన్ఫ్యూజన్గానే ఉందని చెప్పింది. ఏది ఏమైనా నా జాగ్రత్తల్లో నేను ఉంటూ ఆ దీప ప్లాన్లు ఏవీ వర్కౌట్ కాకుండా చూడాలి అని అంటుంది.
ఇక సౌందర్య ఇంట్లో టిఫెన్ చేయకుండా ఎక్కడికి వెళ్లారే అని శ్రావ్య అడగ్గా.. టిఫెన్ కోసమే వెళ్లాము పిన్ని అని సౌర్య అంటుంది. దానికి ఆదిత్య.. ఏంటి నువ్వు, మీ నాన్న కలిసి టిఫెన్ కోసం బయటకు వెళ్లారా అని అడగ్గా.. అవును బాబాయ్ అని సౌర్య చెబుతుంది. ఇక ఆనందరావు.. రేయ్ టిఫెన్ ఎక్కడ తిన్నారు అని కాదు. ఇద్దరు కలిసి తిన్నారు అది ముఖ్యం అని అంటాడు. ఇక శ్రావ్య.. నువ్వు రమ్మన్నావా మీ నాన్నను అని అడగ్గా.. అవును పిన్ని. రోడ్డు పక్కన బండి మీద ఇడ్లీ, దోసె వేస్తారే అక్కడ తిన్నాము అని చెబుతుంది. ఇక ఆదిత్య.. పర్లేదే అన్నయ్య బాగానే డెవలప్ అయ్యాడు అని అనగా.. వాడి జీవితంలో ఇదే తొలిసారేమో బయట టిఫెన్ తినడం అని ఆనందరావు అంటాడు. ఇక శ్రావ్య.. ఇది పెద్ద రౌడీ కదా. ఇలాంటి సాహసాలు చాలానే చేస్తుంది మామయ్య అని అంటుంది. ఇక కార్తీక్ పైనుంచి వచ్చి.. ఏంటి ప్రపంచంలోకెల్లా పెద్ద వింతను విన్నట్లు మొహం అలా పెట్టారు అని అంటాడు. దానికి ఆనందరావు మాకు తెలుసని నీకు తెలిసిందన్న మాట అని అంటాడు. వెంటనే కార్తీక్.. రాగానే మీరంతా రౌడీని ఇంటర్వ్యూ చేసి ఉంటారని ఆ మాత్రం తెలుసుకోలేనా అని అంటాడు. ఇక ఆ బొట్టెక్కడిది అని ఆనందరావును కార్తీక్ అడుగుతాడు. దానికి అతడు గుడికి వెళ్లానని చెప్పగా.. కొత్తగా గుళ్లు, గోపురాలు తిరగడం ఎప్పటి నుంచి మొదలుపెట్టారు అని ప్రశ్నిస్తాడు. దానికి ఆనందరావు.. నా కొడుకులు, కోడళ్లు, మనవరాళ్లు అందరూ బావుండాలని అప్పుడప్పుడు వెళుతుంటాలేరా అని చెబుతాడు. దానికి కార్తీక్.. మీరు కోరుకోకపోయినా అందరూ బావుంటారు అని చెబుతాడు. ఆ తరువాత సౌందర్య లోపలికి రాగా.. అదుగోండి వరాలిచ్చే దేవత వచ్చింది అని కార్తీక్ అంటాడు. దానికి సౌందర్య.. ఈ శాపాలిచ్చే మునీశ్వరుడు ఏదో అంటున్నాడు అని అనగా.. మా శాపాలకి పరిహారాలు వెతుకుతున్నట్లు ఉన్నారు అని కార్తీక్ అంటాడు. దండం, కమండలం, మంత్రం, మూర్ఖత్వం అన్నీ నీలోనే ఉండగా.. ఇంకెందుకు వెతుకుతాను అని సౌందర్య చెబుతుంది. ఇక ఆనందరావు మీరు అసలు ఏం మాట్లాడుకుంటున్నారు అని అనగా.. మీకసలు ఏం తెలీనట్లు మాట్లాడుతున్నారు అని కార్తీక్ అంటాడు.
దానికి ఆనందరావు.. నాకేం తెలుసు. ఇది బావుంది. నేను గుడికి వెళ్లి తీర్థప్రసాదాలు తీసుకొచ్చాను అంతే అంటాడు. ఇక కార్తీక్.. మీ పిచ్చిగానీ దేవుడు ఎక్కడో గుడిలో ఉండటం ఏంటి డాడీ. మన ఇంట్లోనే ఉంది. మూర్తీభవించిన దేవతాస్వరూపం మా అమ్మ. ఈవిడ పనికిమాలిన వాళ్లకి, పనికిరాని వాళ్లకి కూడా వరాలిచ్చే భోళా శంకరి అంటాడు. ఇక సౌందర్య.. బండి మీద తింటున్నప్పుడు అల్లం చట్నీ వేయలేదా రౌడీ అని అడగ్గా.. ఎందుకు వేయలేదు. అల్లం చట్నీ కోసమే నేను, డాక్టర్ బాబు ఎక్కువ తిన్నాము అని సౌర్య అంటుంది. దాంతో సౌందర్య అల్లం తింటే పైత్యం తగ్గుతుందంటారు. వీడికి ఇంకా పెరిగిందేమిటి చెప్మా అని అంటుంది. దానికి కార్తీక్.. సత్యం మాట్లాడితే పైత్యంలా ఉందా.? అని అడుగుతుంది. ఇక సౌందర్య.. మీ అందరికీ ఏమైనా అర్థమవుతుందా..? అని అడగ్గా.. ప్రిపేర్ కాకుండా పరీక్షలు రాసే వారి జవాబుల్లా ఉన్నాయి మీ మాటలు అని ఆనందరావు అంటాడు. దానికి కార్తీక్.. పరీక్షలు రాసే వారికి చిట్టీలు రాసే వాళ్లు తయారయ్యారు డాడీ అని అనగా.. అర్థమైంది. నీకు ఎక్కడి నుంచో ఫోన్ వచ్చింది అని సౌందర్య చెబుతుంది. దానికి కార్తీక్.. అర్థమైంది నువ్వు అక్కడి నుంచే వస్తున్నావని అని అంటాడు. ఇక సౌందర్య.. పోనీలే నేను చెప్పనక్కర్లేదు అనగా.. మరి మాకు అర్థం కావాల్సిన అవసరం లేదా అని ఆదిత్య అడుగుతాడు. ఎవరికి అర్థం కావాలో వారికి అర్థమైతే చాలు కదా అని సౌందర్య అనగా.. మేమందరం పరాయి భాషలో వార్తలు చూస్తున్నట్లు అర్థం కాకుండా ఉండాలా..? అని అంటాడు. ఇక సౌందర్య.. ఇవి వార్తలు కాదు వాతలు అని చెబుతుంది. కార్తీక్ దీపం కొనసాగుతోంది.
Published by:Manjula S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.