Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియల్ రసవత్తరంగా కొనసాగుతోంది. నిన్నటి ఎపిసోడ్లో దీప, సౌర్య, మురళీకృష్ణ మధ్య సంభాషణ జరుగుతుంది. దీప అస్సలు నిద్రపోవడం లేదంటూ సౌర్య చెబుతుంటుంది. ఇవాళ్టి ఎపిసోడ్లో వారి మధ్య సంభాషణ కొనసాగుతుంది. సౌర్య మాట్లాడుతూ.. మమ్మల్ని ఎవరో తీసుకుపోయినట్లు మధ్యలో లేచి పిలుస్తూ ఉంటుంది. పిచ్చి దానిలా ఏడుస్తూ ఉంటుంది అని చెప్పగా.. హిమ అమ్మా అంటూ దగ్గరకు వెళుతుంది. మేము ఎక్కడికి వెళ్లము అమ్మా. నాన్న వచ్చి రమ్మన్నా వెళ్లము. నువ్వు బయపడకు అమ్మా పడుకో అని హిమ అంటుంది. ఇక దీపను పడుకోమని మురళీకృష్ణ బయటకు వెళ్లగా.. సౌర్య, హిమలు దీపను పడుకోబెట్టి దుప్పటి కప్పుతారు.
ఇక మోనిత, భాగ్యం మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఆ తరువాత.. అయితే మురళీకృష్ణ దీపను తీసుకురాలేదు. దీప దొరికిందని కనీసం భార్యకు కూడా చెప్పలేదు. కార్తీక్కు, సౌందర్య వాళ్లకు అడ్రస్ కూడా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు. ఆ దీప వద్దని అని ఉంటుంది, రానని అని ఉంటుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ కదా. దీప తిరిగి వెనక్కి రాకపోతే నాకన్నా సంతోషించే వాళ్లు ఈ భూమి మీద ఎవ్వరూ లేరు. కానీ మురళీకృష్ణ దీప మాట వింటాడా.. ఈ నిజం బయటకు చెప్పకుండా ఆగుతాడా.. ఇవన్నీ పక్కనపెడితే కార్తీక్ ఏమయ్యాడు, కార్తీక్కు ఏమైంది, నా కాల్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు. ఏం చేయాలి నేను ఇప్పుడు అని అనుకుంటూ ఉంటుంది.
ఇక ఉదయం దీపను లేపి సౌర్య కాఫీ తీసుకొస్తుంది. నువ్వు కలిపావా అని దీప అడగ్గా.. బండి దగ్గర వారణాసి కలిపి ఇచ్చాడు అని సౌర్య చెబుతుంది. హిమ ఏదమ్మా అని దీప అడగ్గా.. బండి దగ్గరకు తాతయ్యతో కలిసి వెళ్లింది అని సౌర్య చెప్పగా.. మీ ఇద్దరినీ వద్దన్నాను కదా అని దీప అనగా.. మేమిద్దరం వెళతామని చెప్పాము కదా అని సౌర్య అనగా.. అక్కడ మీరు కాకుండా ముగ్గురు ఉన్నారు అని దీప అనగా.. ఇంకో ముగ్గురు ఉన్నా సరిపోరు అంత గిరాకీ ఉంది అని సౌర్య అనగా.. చెప్తే వినరు ఏంటి అని దీప అనగా.. నేను రాత్రి అరిస్తే ఒప్పుకున్నావు కదా అని సౌర్య అనగా.. అరిస్తే ఊరుకున్నాను ఒప్పుకోలేదు అని దీప చెప్పగా.. నువ్వు కోలుకునే దాకా ఒకరు నీతో ఇక్కడ ఉంటే ఒకరం అక్కడ ఉంటాము. నువ్వు ఏమీ మాట్లాడకు అని సౌర్య చెప్పగా.. మిమ్మల్ని కష్టపెట్టడానికి కాదు అత్తమ్మా ఇంత దూరం తీసుకొచ్చింది అని దీప చెప్పగా.. మేము డబ్బులు లెక్కపెట్టి తీసుకోవడం కూడా కష్టమేనా.. డబ్బులు బరువేం ఉండవు అని సౌర్య అనగా.. నీతో వాదించే ఓపిక నాకు లేదు. ఒకసారి మీతో పడలేక నీళ్లు మోయించినందుకే మీ నాన్న నా చెంప పగలగొట్టారు అని దీప అనగా.. ఇప్పుడు నాన్న లేడుగా అని సౌర్య చెప్పగా.. ఎదురుపడినప్పుడే మీ నాన్న అంటే భయంతో ఉండాలా.. ఎదురుగా ఉన్నా లేకపోయినా ఆయనకు నచ్చని పనులు చేయకూడదు. అది నేనే కాదు మీరు తెలుసుకోవాలి, అర్థమైందా అని దీప అనగా.. అర్థమైంది. నువ్వు కాఫీ తాగు అని సౌర్య చెబుతుంది. ఇక దీపను పడుకోమని సౌర్య చెబుతుంది.
మరోవైపు పిల్లల కోసం బయలుదేరిన కార్తీక్.. ఒక హోటల్లో టిఫిన్ కోసం ఆగుతాడు. అక్కడ తనకు సౌర్య చెప్పిన విధంగా చట్నీ, సాంబారు కలుపుకొని సౌర్యను గుర్తు చేసుకుంటాడు. అప్పుడు సౌందర్య ఫోన్ చేసి..కార్తీక్ ఎక్కడ ఉన్నావు నాన్న అని అడుగుతుంది. నిన్నేరా అడిగేది అని సౌందర్య అనగా.. నీకు నచ్చని చోటు అని కార్తీక్ అంటాడు. అంటే మోనిత ఇంట్లోనా అని సౌందర్య అడగ్గా.. అది నాకు నచ్చే చోటు అని కార్తీక్ అనగా.. ఇప్పుడు దాని సంగతి ఎందుకు కానీ చెప్పరా ఎక్కడున్నావు అని సౌందర్య అడగ్గా.. ఎందుకు మమ్మీ అని కార్తీక్ అడగ్గా.. ఎందుకు ఏంటిరా. రాత్రి అంతా ఇంటికి రాకపోతే, ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నాకు ఎలా ఉంటుందిరా. మనం మనం అభిప్రాయాల్లో బేధాలు ఉండటం వలన ఒకరిని ఒకరం ఏదో అనుకుంటాము. కానీ ఎప్పటికైనా నీకు అమ్మనేరా. నువ్వు నా కొడుకువి. నాకు ఎంత టెన్షన్ ఉంటుందో నీకేం తెలుసు అని సౌందర్య అనగా.. నాకు తెలుసు మమ్మీ అని కార్తీక్ అంటాడు. తెలిస్తే ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయవు. హాస్పిటల్లో కూడా లేవన్నారు. మరి ఎక్కడ ఉన్నావు రా. పోనీ ఏమైనా తిన్నావా అది అయినా చెప్పు అని సౌందర్య అడగ్గా.. తింటున్నాను మమ్మీ. వేళ్లు చప్పరిస్తూ మరీ రౌడీలాగా, రౌడీ చెప్పినట్లు టిఫిన్ ఆస్వాదిస్తూ తింటున్నాను అని కార్తీక్ చెప్పగా.. ఎలాగోలా తింటున్నావు కదా. అసలు నువ్వు ఎక్కడికి వెళ్లావురా అని సౌందర్య అడగ్గా.. కంగారు పడకు మమ్మీ. నీ కోడలు లాగా చెప్పాపెట్టకుండా వెళ్లిపోయి ఇంటి పరువు తీయను అని కార్తీక్ అనగా.. నా కోడలు మాత్రమేనా వెళ్లింది. నువ్వు మాత్రం వెళ్లలేదా.. నాకు రికార్డెడ్ వీడియో పంపించి, చెప్పాపెట్టకుండా వెళ్లలేదా. సరే అవన్నీ ఎందుకు ఎప్పుడు వస్తావో చెప్పు అని సౌందర్య అంటుంది. నేను ఒక ఇంపార్టెంట్ పని మీద వచ్చాను మమ్మీ. అది పూర్తి చేసుకునే సరికి కొంత టైమ్ పడుతుంది. పని అయిపోయాక చేస్తానులే టెన్షన్ పడకు అని కార్తీక్ అనగా.. ఆ ఇంపార్టెంట్ పని ఏంటో తెలుసుకోవచ్చా అని సౌందర్య అనగా.. అది కూడా నాకు నచ్చని పనే కానీ చేయక తప్పట్లేదు(సౌందర్య కోరిక మేరకు దీపను కూడా తెచ్చేందుకు కార్తీక్ సిద్ధమైనట్లు తెలుస్తోంది) ఉంటాను అని కార్తీక్ అంటాడు.
మరోవైపు ఇంట్లో సౌందర్య అటూ ఇటూ తిరుగుతూ ఉండగా.. అటుగా ఆనందరావు వచ్చి ఏంటి సౌందర్య, ఇంట్లో నీకు మళ్లీ ఏ టెన్షన్ మొదలైంది అని సోఫాలో కూర్చుంటాడు. నా గుండె అలిసిపోయిందేమో కానీ ఆగిపోయేంత బలహీనంగా మారలేదు. పర్లేదు తట్టుకుంటాను అని ఆనందరావు అనగా.. అయ్యో అంత మాట అనకండి. ఇది టెన్షన్ పడాల్సిన విషయం ఏమీ కాదు. అర్థం కానీ విషయం అంతే అని సౌందర్య అంటుంది. ఏంటది అని ఆనందరావు అడగ్గా.. వాడికి ఫోన్ చేసి ఇంటికి ఎందుకు రాలేదు అని అడిగితే ఒక ఇంపార్టెంట్ పనిమీద బయటకు వచ్చా అన్నాడు. ఏంటా పని అంటే దాటేసి ఇంకేదో అన్నాడు. చెప్పడం ఇష్టం లేక చెప్పలేదా.. లేదా నాతో కూడా చెప్పని విషమయా అదే అర్థం కావడం లేదు అని సౌందర్య అనగా.. వాడికి మనతో సంబంధం లేని మరో ఇంపార్టెంట్ విషయం ఏముంటుంది. అడిగితే దాటేసేంత రహస్యం కూడా ఏముంటుంది అని ఆనందరావు అనగా.. అది వాడికి సంబంధించినదా.. దీపకు సంబంధించినదా.. లేదంటే మోనితకు సంబంధించినదా అని సౌందర్య అంటుంది. అదే సమయానికి మోనిత ఇంట్లోకి వచ్చి ఇద్దరికీ నమస్తే చెబుతుంది.
మోనితను చూసిన సౌందర్య మనసులో పాపి చిరాయువు అంటే ఇదేనేమో అని అనుకుంటుంది. ఇక మోనిత.. నేను మీతో గొడవ పెట్టుకోవడానికో, మీతో గెంటించబడటానికో రాలేదు ఆంటీ. కార్తీక్ నా కాల్ లిఫ్ట్ చేయలేదు. ఇంటి దగ్గరే ఉన్నాడా.. ఎక్కడికైనా వెళ్లాడా అని కనుక్కోవడానికి మాత్రమే వచ్చాను అని అనగా.. ఇంట్లో మాత్రం లేడు. ఎక్కడికి వెళ్లాడో తెలీదు. మేం కూడా దాని గురించే ఆలోచిస్తున్నాము. అయితే నీకు కూడా తెలీదన్న మాట. మంచిది అని ఆనందరావు అనగా.. అంటే వెళ్లి రమ్మనా అంకుల్ అని మోనిత అనగా.. మోనిత ఏదైనా త్వరగా గ్రహిస్తుంది కదా సౌందర్య అని ఆనందరావు అంటాడు. ఆ తరువాత అక్కడి నుంచి మోనిత వెళుతుంది. ఆ తరువాత సౌందర్య.. ఈ మోనిత హిస్టరీలోనే లేని డీసెన్సీ ఇవాళ కొత్తగా చూపించి వెళ్లింది ఏంటి, ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకు చేస్తుంది. అసలు కార్తీక్ కోసం ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఇంటిదాకా రావడం ఏంటి.. కొంపదీసి దీనికి హిమ గానీ దొరకలేదా అని అంటుంది.
ఇక టిఫిన్ బండి దగ్గర మురళీకృష్ణ దోసెలు వేస్తుండగా.. వారణాసి కస్టమర్లను చూసుకుంటుంటాడు. హిమ అక్కడే ఉండగా.. అమ్మా హిమ. నువ్వు ఇక్కడే ఉన్నావని తెలిస్తే అమ్మ నన్ను చంపేస్తుందమ్మా అని వారణాసి అనగా.. ఏం కాదులే వారణాసి మనం చెప్పనిదే అమ్మకు ఎలా తెలుస్తుంది అని హిమ అనగా.. అమ్మకు తెలుస్తుంది అని కాదమ్మా. నువ్వు ఇలాంటి పనులు చేయకూడదు అని వారణాసి అనగా.. ఒక కస్టమర్ ఏదో కావాలని అడుగుతాడు. ఇక లోపల దీప దగ్గుతూ ఉంటుంది. బయటకు వెళ్లేందుకు లేస్తుండగా.. అక్కడ ఎంత ఇబ్బంది పడుతున్నారో నన్ను వెళ్లనీ అత్తమ్మా అని దీప అనగా.. ఏంటి వెళ్లేది, ఏం చిన్నపిల్లవు అనుకుంటున్నావా.. ఒకటే మారం చేస్తున్నావు. కదలకుండా పడుకో అని సౌర్య చెబుతుంది. ఇక బయట కస్టమర్ హిమను చట్నీ తీసుకురమ్మని చెబుతాడు. ఆ చట్నీని తీసుకొని కస్టమర్ దగ్గరకు వెళుతుండగా.. కార్తీక్ వచ్చి చేయి పట్టుకుంటాడు. దాంతో హిమ షాక్కు గురి అవుతుంది. లోపల దీప తన నుదిటిన కుంకుమ పోయిందని పెట్టుకునేందుకు లేస్తుంది. ఇప్పుడు ఆ కుంకుమ పెట్టుకోకపోతే ఏమైంది అని సౌర్య అడగ్గా.. నీకు పని ఎక్కువై చిరాకు వస్తే పక్కనపెట్టు అదంతా నా మీద చూపించకు అత్తమ్మా. నీకేం తెలుసు ఈ పాపిట సింధూరం గురించి అన బొట్టు పెట్టుకుంటూ ఉంటుంది. ఈ కుంకుమ పెట్టుకున్నప్పుడల్లా మీ నాన్న నా పక్కనే ఉన్నట్లు ఉంటుంది అని దీప చెబుతుంది. ఆ తరువాత మనసులో ఏదోలా ఉంటుంది దీపకు. ఇక బయట కార్తీక్, హిమ దగ్గర నుంచి చట్నీ గిన్నెను తీసుకొని కస్టమర్ దగ్గరకు వెళ్లి వేస్తాడు. హిమ, కార్తీక్కు చూసుకుంటూ వెనక్కి వెళుతూ ఉంటుంది. అదే సమయానికి వారణాసి కూడా కార్తీక్ను చూస్తాడు. అతడి చేతిలో నుంచి చట్నీ గిన్నెను తీసుకుంటాడు. ఇక మురళీకృష్ణకు కార్తీక్ను చూపిస్తుంది హిమ. కార్తీక దీపం కొనసాగుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Karthika deepam, Karthika Deepam serial, Television News