తన తప్పు లేదని ఒప్పుకుంటే కట్టు బట్టలతో మళ్లీ అత్తవారింటికి వస్తానని కుండబద్దలు కొట్టింది. అయితే, పాత కథ మళ్లీ తవ్వడానికి కార్తీక్ రెడీగా లేడు. ఆ విషయాన్ని కట్ చేయడానికి ట్రై్ చేశాడు. కానీ, దీప మాత్రం పట్టుబట్టింది.
కార్తీక దీపం సీరియల్ అభిమానులు అందరికీ గుడ్ న్యూస్. ఈ సీరియల్లో అందరూ ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. కార్తీక్ కాళ్లబేరానికి వచ్చాడు. దీపను ఇంటికి తీసుకుని వెళ్లడానికి సిద్ధమయ్యాడు. ఆమెను ఇంటికి కూడా ఆహ్వానించాడు. ఆమెను ఇంటికి రావాల్సిందిగా కోరాడు. హిమని వంటలక్క ఇంట్లో దించిన తర్వాత తాను ఎన్ని రోజులు కూతుర్ని చూడకుండా ఉండగలనో అని చెక్ చేసుకున్న కార్తీక్, రెండు రోజులు కూడా ఉండలేకపోయాడు. ఇక తప్పలేదు. దీంతో హిమతో పాటు శౌర్య, దీపను కూడా వెంట తీసుకుని వెళ్లడానికి డిసైడ్ అయ్యాడు. ఏకంగా ఓ ట్రక్కు కూడా తీసుకొచ్చాడు. సామాగ్రి మొత్తం ప్యాకప్ చేసుకుని తీసుకుని వెళ్దామనుకున్నాడు. అయితే, ఇక్కడో ఇంట్రస్టింగ్, ఎమోషనల్ సీన్ నడిచింది. అందరూ ఒక్కటయ్యారని, తాను మాత్రమే మరో వైపు ఉండిపోయానని కార్తీక్ ఆవేదన చెందాడు. ఇక లాభం లేదని తనను కూడా మీ గ్రూప్లో కలుపుకోవాలని కోరాడు.
కానీ, దీప ఇక్కడో కండిషన్ పెట్టింది. తన తప్పు లేదని ఒప్పుకుంటే కట్టు బట్టలతో మళ్లీ అత్తవారింటికి వస్తానని కుండబద్దలు కొట్టింది. అయితే, పాత కథ మళ్లీ తవ్వడానికి కార్తీక్ రెడీగా లేడు. ఆ విషయాన్ని కట్ చేయడానికి ట్రై్ చేశాడు. కానీ, దీప మాత్రం పట్టుబట్టింది. ఓ దశలో దీపని ఇంటికి తీసుకెళ్లడానికి కార్తీక్ కాళ్లు పట్టుకోవడానికి కూడా సిద్ధమయ్యాడు. దీంతో ఆమె మనసు కొంచెం కరిగింది. ఇక తర్వాత ఎపిసోడ్లో చూస్తే కార్తీక్, దీప, శౌర్య, హిమ అంతా సౌందర్య ఇంటి ముంగిట ఉన్నారు. హిమ, శౌర్య ఇద్దరూ కార్తీక్, దీపకు పుట్టిన వారేనని అందరి ముందు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ, మళ్లీ ఇక్కడో ట్విస్ట్ పెట్టాడు కార్తీక్. వారిద్దరూ దీపకు పుట్టిన వారుమాత్రమేనని, తనకూ, దీపకు కలసి పుట్టిన వారు కాదని చెప్పి ఇంకా గొడవని కంటిన్యూ చేశాడు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.