హోమ్ /వార్తలు /సినిమా /

Karthika Deepam: టెస్ట్ చేయించుకునేందుకు వెళ్లిన కార్తీక్.. దీప‌ను చూసి వెనుదిగిరిన మోనిత‌

Karthika Deepam: టెస్ట్ చేయించుకునేందుకు వెళ్లిన కార్తీక్.. దీప‌ను చూసి వెనుదిగిరిన మోనిత‌

అప్పటికే తన పిల్లలు హిమ,శౌర్యలను తన భర్త దగ్గరికి చేరుస్తుంది వంటలక్క. సీరియల్‌కు మెయిన్ విలన్ అయిన మోనిత డాక్టర్ బాబు దక్కలేదనే బాధతో ఆత్మహత్య చేసుకుంటుందని ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పట్లో ఈ సీరియల్ ముగింపు ఊహించడం కష్టమే.

అప్పటికే తన పిల్లలు హిమ,శౌర్యలను తన భర్త దగ్గరికి చేరుస్తుంది వంటలక్క. సీరియల్‌కు మెయిన్ విలన్ అయిన మోనిత డాక్టర్ బాబు దక్కలేదనే బాధతో ఆత్మహత్య చేసుకుంటుందని ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పట్లో ఈ సీరియల్ ముగింపు ఊహించడం కష్టమే.

Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆకట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ ఆస‌క్తిక‌రంగా కొన‌సాగుతుంది. ఇవాళ్టి ఎపిసోడ్‌లో దీపకు ద‌గ్గు ఎక్కువ అవుతూ ఉంటుంది. ద‌గ్గుతూ దీప‌ సోఫాలో కూర్చోగా సౌర్య‌, హిమ‌లు అక్క‌డ‌కు వ‌స్తారు. అమ్మా ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా అని సౌర్య‌, హిమ‌లు అంటాడు.

ఇంకా చదవండి ...

  Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆకట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ ఆస‌క్తిక‌రంగా కొన‌సాగుతుంది. ఇవాళ్టి ఎపిసోడ్‌లో దీపకు ద‌గ్గు ఎక్కువ అవుతూ ఉంటుంది. ద‌గ్గుతూ దీప‌ సోఫాలో కూర్చోగా సౌర్య‌, హిమ‌లు అక్క‌డ‌కు వ‌స్తారు. అమ్మా ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా అని సౌర్య‌, హిమ‌లు అంటాడు. ఏం లేద‌మ్మా అని దీప అన‌గా.. డాడీ గుర్తు వ‌చ్చారా అని హిమ ప్ర‌శ్నిస్తుంది. ఏం లేకుండానే ఎందుకు ఏడుస్తార‌మ్మా అని సౌర్య అన‌గా.. ఏదో ఉంది అని హిమ అంటుంది. ఇక ఇద్ద‌రు దీప క‌న్నీళ్ల‌ను తుడుస్తారు. ఇక దీప.. మీరిద్ద‌రు నాకు రెండు క‌ళ్లు. నేను ఏడిస్తే చెరో క‌న్ను తుడుస్తారు. కానీ మీరు ఇద్ద‌రు క‌ష్ట‌ప‌డుతానంటే మాత్రం నా రెండు క‌ళ్ల‌లో క‌న్నీళ్లు వ‌స్తూనే ఉంటాయి. మీరు ఇడ్లీ బండి ద‌గ్గ‌ర‌కు రావొద్దమ్మా. మీ ఇద్ద‌రు అక్క‌డ ప‌నులు చేస్తే చూసి తట్టుకొనే శ‌క్తి నాకు లేదు. మీరిద్ద‌రు డాక్ట‌ర్ గారి పిల్ల‌లు. సౌంద‌ర్య గారి మ‌న‌వ‌రాళ్లు, మీకు ఎంతో భ‌విష్య‌త్ ఉంది. నా త‌ల‌రాత మీ మీద ప‌డ‌కూడ‌దు. నా ఒంట్లో శ‌క్తి ఉన్నంత‌కాలం నేను మిమ్మ‌ల్ని డాక్ట‌ర్ బాబు పిల్ల‌ల‌లాగానే పెంచుతాన‌మ్మా అని అంటుంది. ఇప్పుడు నువ్వు మాకు ఏం త‌క్కువ చేశామ‌మ్మా. మేం బాగానే ఉన్నాం క‌దా అని సౌర్య అన‌గా.. మాకు నువ్వు ఉంటే చాల‌మ్మా. ఎలాంటి భ‌యం ఉండ‌దు అని హిమ అంటుంది. దాందో దీప‌.. నా మొహం. నేను ఎక్క‌డికి వెళ‌తాన‌మ్మా మిమ్మ‌ల్ని వ‌దిలి. ఎక్క‌డికీ వెళ్ల‌ను. మీరు నా ప్రాణం రండి అని ఇద్ద‌రినీ ద‌గ్గ‌ర‌కు తీసుకుంటుంది. ఇక సంతాన‌ల‌క్ష్మి బుజ్జి త‌ల్లులు ఎక్క‌డున్నారు అంటూ లోప‌లికి వ‌స్తుంది.

  ఇవాళ పొద్దుటి నుంచి చుట్టాలే. ఒక‌టే ప‌ని. ఒక ప‌క్క మిమ్మ‌ల్ని చూడ‌లేక‌పోతున్నాన‌నే బాధ‌, ఇంకోప‌క్క చాకిరి చేయ‌లేక‌పోతున్నాన‌నే బాధ‌, అంద‌రినీ సాగ‌నంపేట‌ప్ప‌టికీ సాయంత్రం అయ్యింది. మీ ఇద్ద‌రి ద‌గ్గ‌రికి ఉత్త చేత్తో ఎలా రాను. అందుకే నువ్వులుండ‌లు, వేరు శ‌న‌గ ఉండ‌లు తీసుకొచ్చాను. తీసుకోండి. మీ అమ్మ అంత బాగా చేయ‌లేక‌పోయినా ఇవి కూడా బానే ఉంటాయి అని సంతాన ల‌క్ష్మి అంటుంది. ఇప్పుడు ఎందుకు అక్కా ఇవ‌న్నీ అని దీప అన‌గా.. నీకు పొద్దుటి నుంచి ఆ ఇడ్లీ బండితోనే స‌రిపోతుంది. పిల్ల‌ల‌కు ఏదైనా చేసిపెట్టాలంటే పాపం టైమ్ ఉండ‌దు. నాకు ఏం ప‌ని. పిల్ల‌లా జ‌ల్ల‌లా. మా ఇద్ద‌రి కోసం ఇంత అన్నం వండుకుంటే మిగ‌తా టైమ్ అంతా ఖాళీనే అందుకే తీసుకొచ్చా. తీసుకోండి అని సంతాన‌ల‌క్ష్మి అంటుంది. పిల్ల‌లిద్ద‌రు సంశ‌యిస్తుండ‌గా.. ఏం అనుకోకు దీప‌. నాకు పిల్లలు అంటే పిచ్చి అని సంతాన‌ల‌క్ష్మి అన‌గా. నీ ప్రేమ‌ను ఎవ్వ‌రు కాద‌న‌లేదు అక్కా. నువ్వు ఎప్పుడైనా రావొచ్చు అని దీప అన‌గా.. వ‌స్తాను దీప అని సంతాన‌లక్ష్మి అవి పిల్ల‌ల‌కు ఇచ్చేసి వెళుతుంది.

  మ‌రోవైపు ప్రియ‌మ‌ణి, మోనిత ఇంట్లో ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇష్టం వ‌చ్చిన‌వి తింటూ మేక‌ప్ వేసుకుంటూ ఉండ‌గా.. ఎవ‌రో త‌లుపు కొడ‌తారు. దాంతో మోనిత వ‌చ్చిందేమోన‌న్న భ‌యంతో ఎక్కడివి అక్క‌డ పెట్టేసి త‌లుపు తీస్తుంది. బ‌య‌ట కార్తీక్‌ను చూసి.. కార్తీక్ అయ్య మీరా.. రండి అని లోప‌లికి పిలుస్తుంది. ఇక కార్తీక్, మోనిత‌ను పిల‌వ‌గా.. ఇంట్లో లేదు, మీ ప‌ని మీద‌నే వెళ్లింద‌ని ప్రియ‌మ‌ణి అంటుంది. నా ప‌ని మీదా, ఏ ప‌ని అని కార్తీక్ అడ‌గ్గా.. బ్యాగ్ వేసుకొని వెళ్లింది. ఏ ఊరో చెప్ప‌లేదు, ఎక్క‌డికో చెప్ప‌లేదు. కానీ నేను హిమ‌తోనే తిరిగి వ‌స్తాను అని మీతోనే చెప్ప‌మంది అని ప్రియ‌మ‌ణి అంటుంది. నిజ‌మా హిమ ఆచూకీ తెలిసిందా అని కార్తీక్ అడ‌గ్గా.. ఆ సంగ‌తి నాకు తెలీదు కార్తీక్ అయ్యా. కానీ అమ్మ గారు అంత ధైర్యంగా చెప్పారంటే క‌చ్చితంగా హిమ‌ను తీసుకొనే వ‌స్తారు. మీరేం దిగులు ప‌డ‌కండి అని ప్రియ‌మ‌ణి అంటుంది. ఎక్క‌డుందో తెలిసే ఉంటుందేమో. ఫోన్ చేస్తే నంబ‌ర్ క‌ల‌వ‌ట్లేదు. స‌రేలే నీకు ఫోన్ చేస్తే నాకు వెంట‌నే ఫోన్ చేయ‌మ‌ని చెప్పు. థ్యాంక్స్ ప్రియ‌మ‌ణి గుడ్‌న్యూస్ చెప్పి అని కార్తీక్ అక్క‌డి నుంచి వెళ్లిపోతాడు. ఆ త‌రువాత ప్రియ‌మ‌ణి.. ఈ మాట‌కే ఇంత సంతోష‌ప‌డిపోతున్నారంటే హిమ‌ను తీసుకొస్తే క‌చ్చితంగా మోనిత‌మ్మ‌ను పెళ్లి చేసుకుంటారు అని అంటుంది.

  ఇక సంతాన‌ల‌క్ష్మితో సౌర్య‌, హిమ‌ల‌ను జాత‌ర‌కు పంపుతుంది దీప‌. నువ్వు లేకుండా వెళ్ల‌డం ఏంట‌మ్మా. మాకేం జాత‌ర చూడాల‌ని లేద‌మ్మా అని పిల్ల‌లు అన‌గా.. వెళ్లండి అమ్మా. ఎప్పుడు ఇంట్లోనే ఉంటే బోర్ కొడుతుంది. పెద్ద‌మ్మ(సంతాన‌ల‌క్ష్మి) మిమ్మ‌ల్ని బాగా చూసుకుంటుంది అని దీప అంటుంది. నువ్వు రావొచ్చు క‌దా అని పిల్ల‌లు అడ‌గ్గా.. నేను వ‌స్తాను. ఒక అర‌గంట త‌రువాత వ‌చ్చి కాసేపు మీతో ఉండి మ‌ళ్లీ వ‌చ్చేస్తాను. మీరు సాయంత్రం దాకా అక్క‌డే ఉండండి అని దీప అంటుంది. ఏంటి ఏదో అంటున్నారు అని సంతాన‌ల‌క్ష్మి అన‌గా.. ఏం లేదు అక్కా. న‌న్ను ర‌మ్మంటున్నారు అని దీప అంటుంది. మ‌రి రాకూడదా దీప అని సంతాన‌ల‌క్ష్మి పిల‌వ‌గా.. త‌రువాత వ‌స్తానులే మీరు వెళ్లండి అని దీప చెబుతుంది. ఇక వార‌ణాసి మాతో వ‌స్తే ఇడ్లీ బండి ద‌గ్గ‌ర ఎవ‌రు ఉంటార‌మ్మా అని సౌర్య అడ‌గ్గా.. వార‌ణాసి వాళ్ల బాబాయ్ కొడుకును ఇక్క‌డ‌కు రమ్మ‌న్నాడ‌మ్మా. అత‌డు రాగానే బండి అప్ప‌గించి నేను వ‌చ్చేస్తాను అని దీప చెబుతుంది. ఇక నువ్వేం భ‌య‌ప‌డ‌కు దీప‌, మేమిద్ద‌రం చెరో ఒక‌రి చేయి ప‌ట్టుకుంటాం అని సంతాన‌ల‌క్ష్మి చెప్ప‌గా.. నాకేం భ‌య‌పం లేదు అక్కా. పిల్ల‌ల‌కు నా నంబ‌ర్‌తో పాటు మీ ఇద్ద‌రి ఫోన్ నంబ‌ర్లు నోటికి వ‌చ్చు. ఏం కాదులే తీసుకెళ్లు అని దీప చెబుతుంది. ఇక వారిద్ద‌రిని తీసుకొని సంతాన‌ల‌క్ష్మి, వార‌ణాసిలు జాత‌ర‌కు వెళ‌తారు.

  మ‌రోవైపు మోనిత, దీప పిల్ల‌ల‌ను వెతుకుతూ ఉంటుంది. ఒక ఆటో ఎక్కి గ‌డియారం స్తంభం ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌మంటుంది. నాకు హైద‌రాబాద్ అచ్చి రాలేదు. ఈ ఊరి వాస్తు బాగా క‌లిసొచ్చింది. ఇక్క‌డే నా పెళ్లి కార్తీక్‌తో జ‌ర‌గ‌డానికి ముహూర్తం మొద‌లు అవ్వ‌బోతుంది. బీ రెడీ కార్తీక్.. కాదు కాదు పెళ్లికొడుకా.. చి.ల‌.సౌ మోనిత‌ను చిరంజీవి కార్తీక్‌కు ఇచ్చి పెళ్లి చేయ‌డానికి పంచభూతాలు ముహూర్తం నిశ్చ‌యించ‌డ‌మైన‌ది. టెస్ట్‌కి వెళ్తాన‌ని చెప్పాడు క‌దా. వెళ్ల‌నీ వెళ్ల‌నీ అని న‌వ్వుకుంటూ ఉంటుంది. ఆమె న‌వ్వును చూసి ఆటో న‌డిపే వ్య‌క్తి మోనిత‌ను చూడ‌గా.. ఏయ్. ఇక్క‌డేం చూస్తావు. రోడ్డు చూడు అని పుర‌మాయిస్తుంది.

  ఇక కార్తీక్, టెస్ట్ కోసం డాక్ట‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ‌తారు. పిల్ల‌లు పుట్టే అవ‌కాశం ఉందో లేదో తెలుసుకోవాల‌నుకుంటున్నాను. టెస్ట్ రిజ‌ల్ట్ వ‌చ్చేందుకు ఎన్ని రోజులు స‌మ‌యం ప‌ట్టొచ్చు అని అక్క‌డి డాక్ట‌ర్‌ని అడుగుతాడు కార్తీక్. రెండు రోజులు ప‌ట్టొచ్చు అని డాక్ట‌ర్ చెప్ప‌గా.. రెండు రోజుల్లో దీప ఏంటి అన్న‌ది తెలుస్తుంది. పిల్ల‌లు ఎవ‌ర‌న్న‌ది తేలిపోతుంది అని మ‌న‌సులో అనుకుంటాడు. ఇక డాక్ట‌ర్‌తో క‌లిసి ల్యాబ్‌కి వెళ‌తాడు కార్తీక్‌.

  మ‌రోవైపు దీప‌ను వెతుక్కుంటూ టిఫిన్ కోసం దీప టిఫిన్ సెంట‌ర్‌కి వెళ‌తాడు ముర‌ళీకృష్ణ‌. ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకుర‌మ్మ‌ని చెబుతాడు. ఇక బ‌య‌ట‌కు వెళ్లిన దీప ఆటోలో టిఫిన్ సెంట‌ర్‌కి వ‌స్తుంటుంది. ముర‌ళీకృష్ణ ఆ ఇడ్లీ తిని.. దీప రుచిని గుర్తు చేసుకుంటాడు. ఆ త‌రువాత బాబూ.. ఈ బండి, ఈ టిఫిన్ సెంట‌ర్ ఎవ‌రిది అని అడ‌గ్గా.. అదే స‌మ‌యానికి దీప ఆటోలో నుంచి దిగుతుంది. దీప‌, ముర‌ళీకృష్ణలు ఒక‌రినొక‌రు చూసుకుంటారు. అమ్మా.. దీప అని ముర‌ళీకృష్ణ భావోద్వేగానికి గురి అవుతాడు. దీప ద‌గ్గ‌ర‌కి ముర‌ళీకృష్ణ రాగా.. అదే స‌మయానికి మోనిత ఆటోలో నుంచి దిగుతుంది. వారిద్ద‌రిని చూసి షాక్‌కి గురి అవుతుంది. నీ కోసం ఎన్ని ఊర్లు తిరిగానో తెలుసా అమ్మా. నా బంగారు త‌ల్లి అని ముర‌ళీకృష్ణ క‌న్నీళ్లు పెట్టుకుంటాడు. ఇక మోనిత లోప‌ల ర‌గిలిపోతూ ఉంటుంది. కార్తీక్ మాట‌ల‌ను గుర్తు చేసుకొని.. అయిపోయింది. నా పెళ్లి పెటాకులు అయిపోయింది. నా బ‌తుకును ముర‌ళీకృష్ణ ముస‌లోడు తొక్కిపడేశాడు. నా ఆశ‌లు తుంచేశాడు. మోనిత అయిపోయింది అని మ‌న‌సులో అనుకొని. రేయ్ ఆటో తీయ్‌రా అని వెళుతుంది.

  ఇక భాగ్యం, ముర‌ళీకృష్ణ‌కు ఫోన్ చేస్తుంది. అయితే ముర‌ళీకృష్ణ ఫోన్ లిఫ్ట్ చేయ‌క‌పోవ‌డంతో.. ఏంటి ఈయ‌న ఫోన్ చేయ‌రు. నేను చేస్తే తీయ‌రు. కొంప‌తీసి అమ్మా దీప‌.. అమ్మా దీప అని అడుక్కుంటూ ఎక్క‌డో ప‌డిపోలేదు క‌దా. మార్చి ఎండ‌కు మూర్ఛ‌పోయి అమ్మో నా మాంగ‌ళ్యం అని మ‌ళ్లీ ఫోన్ చేస్తుంది. అదే స‌మ‌యానికి సౌంద‌ర్య, భాగ్యం ఇంటికి వ‌స్తుంది. దాంతో భాగ్యం కాస్త టెన్ష‌న్ ప‌డుతుంది. ఇక సోఫాలో సౌంద‌ర్య కూర్చుటుంది. ఏంటి అలా నిల‌బ‌డ్డావు అని సౌంద‌ర్య అడ‌గ్గా.. ఇంకెలా నిల‌బ‌డాలో నాకు తెలీడం లేదు వ‌దిన అని భాగ్యం అంటుంది. దానికి సౌంద‌ర్య‌.. నువ్వు వెర్రిత‌నంతో అడుగుతావో, వెట‌కారంతో అడుగుతావో నాకు ఇప్ప‌టికీ అర్థం కాదు. కూర్చో అని చెబుతుంది. ఆ త‌రువాత భాగ్యం సోఫాలో కూర్చోగా.. అంత టెన్ష‌న్‌గా ఉన్నావేంటి అని సౌంద‌ర్య‌, భాగ్యంను అడుగుతుంది. ఆయ‌న ఫోన్ లిఫ్ట్ చేయ‌డం లేదు వ‌దిన అని భాగ్యం అన‌గా.. ఏ రోడ్ల మీద బిజీగా తిరుగుతున్నారో, ఎందుకు టెన్ష‌న్ ప‌డ‌తావు అని సౌంద‌ర్య అడుగుతుంది. త‌రువాత సౌంద‌ర్య టీ తీసుకురామ‌ని చెప్ప‌గా.. లోప‌లికి వెళుతూ వ‌దినా నేను ఫోన్ చేస్తే భాగ్యంలే అనుకుంటాడు. మీరో ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి మాట్లాడ‌తాడు. ఒక‌సారి చేయండి అని భాగ్యం అంటుంది. దానికి సౌంద‌ర్య ఓకే అని చెబుతుంది.

  మ‌రోవైపు దీప ద‌గ్గ‌ర ముర‌ళీకృష్ణ‌.. ఏంట‌మ్మా ఇది అని అడుగుతాడు. బ‌త‌క‌డానికి ఒక బండి అని దీప చెప్ప‌గా.. నువ్వు అని ముర‌ళీకృష్ణ అంటాడు. వంట‌ల‌క్క‌ను క‌దా అని దీప అన‌గా.. ఎవ‌రి భార్య‌వి, ఎవ‌రి కోడ‌లివి అని ముర‌ళీకృష్ణ అంటాడు. రేప‌టి ఎపిసోడ్ ప్రోమోలో తాను ఇక్క‌డ ఉన్న‌ట్లు ఎవ్వ‌రికీ చెప్పొద్ద‌ని దీప‌, ముర‌ళీకృష్ణ ద‌గ్గ‌ర మాట తీసుకుంటుంది.

  Published by:Manjula S
  First published:

  Tags: Karthika deepam, Karthika Deepam serial, Television News

  ఉత్తమ కథలు