హోమ్ /వార్తలు /సినిమా /

Karthika Deepam: అదిరిపోయే ట్విస్ట్.. సౌర్య‌ను ఇంటికి తెచ్చుకున్న డాక్ట‌ర్ బాబు

Karthika Deepam: అదిరిపోయే ట్విస్ట్.. సౌర్య‌ను ఇంటికి తెచ్చుకున్న డాక్ట‌ర్ బాబు

Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంతగానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. ఇవాళ్టి ఎపిసోడ్‌లో ఆదిత్య ముర‌ళీకృష్ణ ఇంటికి వెళ్ల‌గా.. అత‌డు కాఫీ తీసుకొచ్చి ఇస్తాడు. ఇల్లు ప్ర‌శాంతంగా ఉంద‌ని ఆదిత్య అన‌గా.. మీ అత్త గారు ఊరెళ్లారు క‌దా బాబు ప్ర‌శాంతంగానే ఉంటుంది అని ముర‌ళీ కృష్ణ అంటాడు

Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంతగానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. ఇవాళ్టి ఎపిసోడ్‌లో ఆదిత్య ముర‌ళీకృష్ణ ఇంటికి వెళ్ల‌గా.. అత‌డు కాఫీ తీసుకొచ్చి ఇస్తాడు. ఇల్లు ప్ర‌శాంతంగా ఉంద‌ని ఆదిత్య అన‌గా.. మీ అత్త గారు ఊరెళ్లారు క‌దా బాబు ప్ర‌శాంతంగానే ఉంటుంది అని ముర‌ళీ కృష్ణ అంటాడు

Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంతగానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. ఇవాళ్టి ఎపిసోడ్‌లో ఆదిత్య ముర‌ళీకృష్ణ ఇంటికి వెళ్ల‌గా.. అత‌డు కాఫీ తీసుకొచ్చి ఇస్తాడు. ఇల్లు ప్ర‌శాంతంగా ఉంద‌ని ఆదిత్య అన‌గా.. మీ అత్త గారు ఊరెళ్లారు క‌దా బాబు ప్ర‌శాంతంగానే ఉంటుంది అని ముర‌ళీ కృష్ణ అంటాడు

ఇంకా చదవండి ...

    Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంతగానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. ఇవాళ్టి ఎపిసోడ్‌లో ఆదిత్య ముర‌ళీకృష్ణ ఇంటికి వెళ్ల‌గా.. అత‌డు కాఫీ తీసుకొచ్చి ఇస్తాడు. ఇల్లు ప్ర‌శాంతంగా ఉంద‌ని ఆదిత్య అన‌గా.. మీ అత్త గారు ఊరెళ్లారు క‌దా బాబు ప్ర‌శాంతంగానే ఉంటుంది అని ముర‌ళీ కృష్ణ అంటాడు. ఇంత‌కుముందు ఇలా ఉండేది కాద‌ని ఆదిత్య అన‌గా.. అవును బాబు ఏ మూల చూసిన అర్ధ‌పావు అనే ఊత ప‌దం గ‌బ్బిలంలా వేలాడుతూ క‌నిపించేది అని ముర‌ళీకృష్ణ అంటాడు. మ‌రి మీ భోజ‌నానికి ఏ ఇబ్బంది లేదా..? అని అడ‌గా.. అది ఉన్న‌ప్పుడే ఇబ్బంది. ఎన్ని తిట్టినా అర్ధ‌పావు ప‌ప్పు అంటూ సగం ప‌చ్చ‌డి, స‌గం పెరుగు పెట్టుకునేవాడిని. ఇప్పుడు బాగానే తింటున్నాను బాబు అని అంటాడు. ఇక ఆదిత్య మీ సంగతి కాసేపు ప‌క్క‌న‌పెడ‌దాం అలా కూర్చోండి అని అంటాడు.

    ఇక ముర‌ళీకృష్ణ కూర్చోగా.. మా వ‌దిన‌కు భాగ్యం గారు అయితే స‌వ‌తి త‌ల్లి, మీరైతే పెంచుకోలేదుగా, క‌న్న‌తండ్రిగే అంటాడు. అదేంటి బాబు అలా అడిగారు అని ముర‌ళీకృష్ణ అన‌గా.. నేను పెళ్లి అయిన‌ప్ప‌టి నుంచి చూస్తున్నాను. మీరు శ్రావ్య‌ను ఒక‌లాగా, మా వ‌దిన‌ను ఒక‌లాగా చూస్తున్నారు. వ‌దిన.. ఎక్క‌డో దుబాయ్‌లోనో, సింగ‌పూర్‌లోనో లేదుగా.. బండి ఎక్కితే అర‌గంట ప్ర‌యాణం. వారినికోసారి మీరు వెళ్ల‌డం, మీ కూతురిని, మ‌న‌వ‌రాలిని మీ ఇంటికి భోజ‌నానికి పిల‌వ‌డం చేయొచ్చుగా.. క‌నీసం పండుగ‌ల‌కు అయినా ర‌మ్మంటున్నారా..? మా వ‌దిన ఉన్న ప‌రిస్థితుల్లో మీరేగా అండ‌గా ఉండాలి. ఒక్క‌తే ఈ క‌ష్టాల‌న్నీ ప‌డుతూ ఉంటే ప‌ట్టించుకోకుండా ఎలా ఉన్నారండి.. మా అన్న‌య్య న‌యం క‌దా.. ఉత్త‌ప్పుడు నాకు నువ్వు భార్య‌వే కాద‌న్నా, ఏదైనా అవ‌స‌రం అయితే డ‌బ్బులు తీసుకోవ‌చ్చు క‌దా అని తిడ‌తాడు కూడా. హిమ ఎవ‌రో అనాధ అనుకొని అపురూపంగా పెంచుకున్నాడు. వ‌దిన కూతురు అని తెలిశాక కూడా త‌న ప్రేమలో అనువంత మార్పు కూడా రాలేదు. సౌర్య ఎవ‌రో తెలిసి కూడా త‌నే చదివిస్తున్నాడు. కూతురు అని యాక్సెప్ట్ చేయ‌క‌పోయినా అదంటే అభిమానంగా ఉంటాడు. మ‌రి మీరేం చేస్తున్నారు..? అని అడుగుతాడు.

    దానికి ముర‌ళీకృష్ణ‌.. నిజ‌మే బాబు. క‌న్న‌తండ్రిగా హిమ‌కు నేను ఏమీ చేయ‌లేక‌పోతున్నాను. ఆ అప‌రాధ‌భావం నాలో ఉంది. కానీ మీ వ‌దిన‌.. క‌న్న‌తండ్రి ద‌గ్గ‌ర కూడా చేయి చాచి సాయం అడ‌గ‌దు. అంత ఆ్తత్మాభిమానం దానికి అంటాడు. నేను కేవ‌లం డ‌బ్బు గురించే మాట్లాడ‌టం లేదు మామ‌య్య గారు. డ‌బ్బిస్తే తీసుకోదు. అది మాకు తెలుసు. కానీ వ‌దిన మీ సొంత కూతురు క‌దా.పుట్టిన‌ప్ప‌టి నుంచి క‌ష్టాలు ప‌డుతూనే ఉంది కదా.. హిమ‌, సౌర్య మీ సొంత మ‌న‌వ‌రాళ్లు క‌దా.. ఒక రెండు రోజులు తీసుకొచ్చి మీ మ‌న‌వ‌రాళ్ల‌తో హ్యాపీగా గ‌డ‌పొచ్చు క‌దా మా వ‌దిన‌తో క‌ష్ట‌సుఖాలు మాట్లాడుకోవ‌చ్చు క‌దా. ఆ రెండు రోజులు వ‌దిన మ‌నసు రొటీన్ లైఫ్ నుంచి డైవ‌ర్ట్ అయ్యి కాస్త ప్ర‌శాంతంగా ఉంటుంది క‌దా.. పెద్ద‌వాళ్లు ఉన్న‌ది అందుకే క‌దా. ఒక్క‌సారి ఆలోచించండి అని ఆదిత్య అంటాడు.

    ఇక ఇంట్లో కార్తీక్.. మ‌మ్మీ మమ్మీ అని పిలుస్తుండ‌గా.. శ్రావ్య వ‌చ్చి లేరు బావ‌గారు. ఏదో ప‌ని మీద బ‌య‌ట‌కు వెళ్లారు అని చెబుతుంది. ఎంత‌సేప‌ట్లో వ‌స్తాన‌ని చెప్పింది శ్రావ్య అని కార్తీక్ అడ‌గ్గా.. అది నేను అడ‌గ‌లేరు బావ‌గారు అంటుంది. అవునా స‌రే అని కార్తీక్ అన‌గా.. భోజ‌నం చేస్తారా బావ‌గారు అన శ్రావ్య అడుగుతుంది. వ‌ద్దు అన్న కార్తీక్.. ఆక‌లి లేదు అని అంటాడు. ఏదైనా చెప్పాలా బావ‌గారు..? ఆదిత్య‌ను పిల‌వ‌నా..? అని అన‌గా.. వాడు ఉన్నాడా ఇంట్లో అని కార్తీక్ అడుగుతాడు. లేడు, దీపు గాడికి కోల్డ్ సిర‌ప్ అయిపోతే తీసుకురావ‌డానికి వెళ్లాడు బావ‌గారు. ప‌ర్వాలేదు నాతో చెప్పండి బావ‌గారు అని శ్రావ్య అంటుంది.

    చిన్న హెల్ప్ చేస్తావా శ్రావ్య అని కార్తీక్ అడ‌గ్గా.. చేస్తాను బావ‌గారు అని శ్రావ్య అంటుంది. పొద్దున నేను హిమ‌ను చూడ‌టానికి వెళ్లాను. ఇంట్లో లేదు, మౌనిత ద‌గ్గరికి వెళ్లింది. అక్క‌డ‌కు వెళ్లాను. క‌న్ను ఎర్ర‌బ‌డి క‌నిపించింది. ఇన్ఫెక్ష‌న్ వ‌చ్చిన‌ట్లు క‌నిపించింది. నా ఫ్రెండ్ ఐ స్పెష‌లిస్ట్ ఉంటే క‌నుక్కొని ఐ డ్రాప్స్ తీసుకున్నాను అని అంటాడు. ఇచ్చి ర‌మ్మంటారా బావ‌గారు అని శ్రావ్య అడ‌గ్గా.. కాద‌మ్మా. నా చేత్తో నేనే వేయాలని, అది అస‌లు త‌ల్లేనా..? అదే మీ అక్క‌. అది అస‌లు త‌ల్లేనా.. క‌నుబొమ్మ‌లు ఎత్తితే కాదు, కళ్ల‌తో చూస్తే క‌నబ‌డేది హిమ క‌ళ్లు ఎలా ఉన్నాయి అని. అస‌లు హిమ ఇంట్లో ఉందో లేదో ఏ మాత్రం ప‌ట్టించుకోదా..? అంత రెస్పాన్సిబులిటీ లేకుండా పెంచుతారా పిల్ల‌ల‌ని..? హిమ ఏమైనా రౌడీలాగా పెరిగే పిల్లా..? కాస్త క‌నిపెట్టుకొని ఉండాల‌ని తెలీదు. నువ్వు కొంచెం సాయంగా వ‌స్తావా అమ్మా.. అదే మీ అక్క‌.. పెంచిన ప్రేమ‌, తుంచిన ప్రేమ అంటూ ఏవేవో లెక్క‌లు మాట్లాడుతుంది. ఇలాంటప్పుడు ఈ ప‌ట్టింపుల‌న్నీ అవ‌స‌ర‌మా..? అవ‌స‌రం లేదు క‌దా.. కాబ‌ట్టి నువ్వు లోప‌లికి వెళ్లి, హిమ‌ను బ‌య‌ట‌కు పంపావ‌నుకో నా బంగారు త‌ల్లిని క‌ళ్లారా చూసుకొని ఆ డ్రాప్స్ వేసి వ‌స్తాను అని అంటాడు.

    త‌ప్ప‌కుండా వ‌స్తాను బావ‌గారు అని శ్రావ్య అన‌గా.. ఆ లోపు ఆదిత్య రావ‌డంతో.. ఇదుగో వీడు వ‌చ్చేశాడు. వీడినే తీసుకెళ్లేవాడిని, కానీ వీడు హిమ‌ను ఆ ఇంట్లో అంత ధీనంగా ఉండ‌టం చూసి ఎగిరిప‌డి తీసుకొని వ‌చ్చేద్దామ‌ని గొడ‌వ చేసినా చేస్తాడు. దాంతో వంట‌ల‌క్క మ‌ళ్లీ ఈగోకు పోయి, నా కూతురు నా ఇష్టం అని అంటుంది అని అంటాడు. ఏంటి శ్రావ్య అని ఆదిత్య అడ‌గ్గా.. హిమ‌కు ఐడ్రాప్స్ వేయాలంటా..? బావ‌గారు న‌న్ను ర‌మ్మంటున్నారు అని శ్రావ్య చెప్ప‌గా.. వెళ్లు.. దీపుగాడిని నేను చూసుకుంటానులే అని ఆదిత్య అంటాడు.

    ఇక దీప, ముర‌ళీకృష్ణ‌, సౌర్య‌, హిమ అన్నం తింటూ ఉంటారు. అప్పుడు సౌర్య‌.. హిమ‌, తాత‌య్య అమ్మ‌ను ఎలా పిలుస్తాడు అని అడ‌గ్గా.. హిమ ఇమిటేట్ చేసి చెబుతుంది. అలా కాద‌ని సౌర్య కూడా ఇమిటేట్ చేస్తుంది. ఇలా ఇద్ద‌రు ఇమిటేట్ చేస్తూ అంద‌రూ న‌వ్వుకుంటారు. ఇలా హాయిగా న‌వ్వుకొని ఎంత కాల‌మైందో అని ముర‌ళీకృష్ణ అన‌గా.. మీరు అప్పుడ‌ప్పుడు అమ్మా దీప అని వ‌స్తే ఇలా న‌వ్వుకోవ‌చ్చు అని అంటుంది. ఇక ముర‌ళీకృష్ణ‌.. దీప ఈ నెల ఇంటి అద్దె క‌ట్టావా..? అని అడుగుతాడు. క‌ట్టాన‌ని దీప చెప్ప‌గా.. క‌ట్ట‌లేద‌ని పొద్దున్నే ఓన‌ర్ ఆంటీ వ‌చ్చి వెళ్లింది క‌దా అమ్మా అని సౌర్య చెబుతుంది. అర్థ‌మైంద‌మ్మా.. నువ్వు అబ‌ద్దం చెప్పినా.. పిల్లలు చెప్ప‌లేరు. ఈ నెల అద్దె నేను క‌డ‌తాను అని ముర‌ళీకృష్ణ అంటాడు.

    ఎందుకు నాన్న మా ఓన‌ర్లు అంద‌రి లాంటి వారు కాదు. ఆల‌స్యం అయినా ఆగుతారు అని దీప చెప్ప‌గా.. ఇప్పుడు నీ ద‌గ్గ‌ర ఎలాంటి ఆదాయం లేదు క‌ద‌మ్మా.. అత్త‌గారి ద‌గ్గ‌ర ఆత్మాభిమానం అడ్డు వ‌చ్చినా క‌న్న తండ్రి ద‌గ్గ‌ర కూడా మొహ‌మాటం ఎందుకమ్మా. ఏదైనా అవ‌స‌రం ఉంటే అడుగు అని ముర‌ళీకృష్ణ అంటాడు. ఇక సౌర్య‌.. మీరు ఉండేది సొంతిల్లా..? అద్దె ఇల్లా తాత‌య్య అని అడుగుతుంది. సొంతం కాదు అలాగ‌ని అద్దిల్లు కాదు అంటాడు. మ‌రి అని సౌర్య అడ‌గ్గా.. మీ నాన్న‌మ్మ మీ శ్రావ్య పిన్ని కోసం కొని గిఫ్ట్‌గా ఇచ్చింది అని ముర‌ళీకృష్ణ అంటాడు.

    అవునా.. ఎవ‌రైనా ఏ రింగో, చైనో గిఫ్ట్‌గా ఇస్తారు. మా నానమ్మ ఇల్లే గిఫ్ట్‌గా ఇచ్చిందా..? అని సౌర్య అన‌గా.. మరి మన నాన్న‌మ్మ రిచ్ క‌దా అని హిమ అంటుంది. దానికి ముర‌ళీకృష్ణ అవున‌మ్మా.. శ్రావ్య పిన్ని న‌చ్చి, క‌ట్నం తీసుకోకుండా ఇల్లు రాసిచ్చి మ‌రీ కోడ‌లిగా చేసుకుంది అని అంటాడు. అదే స‌మ‌యంలో శ్రావ్య, దీప ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చి అదేంటి నా పేరు వినిపిస్తోంది అని అంటుంది. ఇక దీప‌.. శ్రావ్య... రా.. నీకు నిండు నూరేళ్లు. ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాము రా శ్రావ్య అని అంటుంది. ఇక పిల్ల‌లిద్ద‌రు కూర్చోండి పిన్ని అని అంటారు. రా శ్రావ్య భోజ‌నం చేద్దువుగానీ అని దీప అన‌గా.. ఒక్క నిమిషం అక్కా అని శ్రావ్య‌.. హిమ‌ను పిలుస్తుంది. మీ నాన్న నీ కోసం బ‌య‌ట కారులో ఎదురుచూస్తున్నారు. వెళ్లు అని చెబుతుంది.

    ఇక దీప‌.. డాక్ట‌ర్ బాబు వ‌చ్చారా..? అని అడ‌గ్గా.. మ‌రి లోప‌లికి రాలేదేంట‌మ్మా అని ముర‌ళీకృష్ణ అంటాడు. దానికి హిమ‌.. నేను వెళ్లి తీసుకొస్తాన‌ని అన‌గా.. రారులేవే.. నువ్వు వెళ్లు అని అంటుంది. ఇక హిమ‌, సౌర్య ఇద్ద‌రు బ‌య‌ట‌కు వెళ్ల‌గా.. హిమ‌, డాడీ ద‌గ్గ‌ర‌కు వెళుతుంది. ఎందుకొచ్చారు శ్రావ్య అని దీప అడ‌గ్గా.. పొద్దున హిమ క‌న్ను ఎర్ర‌బ‌డ‌టం చూశార‌ట‌. ఐడ్రాప్స్ తీసుకొని వ‌చ్చారు అని శ్రావ్య చెబుతుంది. దానికి దీప న‌వ్వుతుండ‌గా.. ముర‌ళీకృష్ణ ఏంట‌మ్మా అని అడుగుతాడు. ఓ బిడ్డ‌కు తండ్రి అని ఒప్పుకోడు. ఇంకో బిడ్డ కావాలి. కానీ దానికి తండ్రిని అని ఒప్పుకోడు. ఇదేం ప్రేమో నాకేం అర్థం కావ‌డం లేదు అని అంటుంది. ఇక హిమ‌ను కార్తీక్ హ‌త్త్తుకుంటాడు. ఇక‌ ఇంట్లో ఆనంద‌రావు.. హిమ‌ను అలా చూసుకొని, సౌర్య‌ను పట్టించుకోక‌పోతే దాని మ‌న‌సు బాధ‌ప‌డుతుంది క‌దా అని అంటుండ‌గా.. బ‌య‌ట హిమ‌, కార్తీక్‌ల‌ను చూసి సౌర్య బాధ‌ప‌డుతుంటుంది. ఇక ఇంట్లో శ్రావ్య‌.. నిజ‌మే నాన్న చిన్న‌పిల్ల‌లు క‌దా వాళ్లకి ఈ గొడ‌వ‌లేం తెలుస్తాయి అని అంటుంది. ఇక దీప.. స‌రే వ‌చ్చి కూర్చో ప్లేట్ తీసుకొస్తాను అని అన‌గా.. శ్రావ్య వ‌ద్ద‌ని చెబుతుంది. నేను ఏమ‌న్నా ప‌రాయిదాన్నా.. చేరో ముద్దా పెట్టండి అని వారి చేత్తో ముద్ద‌లు పెట్టించుకుంటుంది.

    ఇక బ‌య‌ట హిమ‌కు కార్తీక్ ఐడ్రాప్స్ వేస్తుండ‌గా.. హిమ మారం చేస్తుంటుంది. నాకు బావుంది డాడీ అని హిమ అన‌గా.. నువ్వు క‌ళ్లు నులుముకోవ‌డం నేను చూడ‌లేదా అని కార్తీక్ అంటాడు. అది నేను త్వ‌ర‌గా లేవ‌డం వ‌ల‌నే అని హిమ చెబుతుంది. ఇక సౌర్యను చూసిన కార్త్తీక్.. నేను ఈ వంక పెట్టుకొని వచ్చిన‌ట్లు రౌడీ మా ఇంట్లో చెప్ప‌నైనా చెబుతుంది అని మ‌న‌సులో అనుకుంటాడు. ఇక నువ్వేం కంగారు ప‌డ‌కు అని హిమ కంట్లో ఐడ్రాప్స్ వేస్తాడు. ఇక సౌర్య‌.. డాక్ట‌ర్ బాబు నాకు క‌ళ్లు దుర‌ద‌గా ఉన్నాయి. బాగా మండుతున్నాయి అని చెప్పి.. ఇప్పుడు నాకు డ్రాప్స్ వేస్తాడు మా నాన్న అని మ‌న‌సులో అనుకుంటుంది. ఇక కార్తీక్.. ఆగాగు క‌ళ్లు అలా న‌లుముకోకు అని చెప్పి.. సౌర్య క‌ళ్లు చూస్తాడు. నీ క‌ళ్ల‌కేంటే క్లియ‌ర్‌గా ఉన్నాయి. ఎర్ర‌గా ఉన్న‌ప్పుడే వేసుకోవాలి అని చెప్పి ఐడ్రాప్స్‌ని ఇస్తాడు. ఇక క‌ళ్లు తెరిచిన హిమ‌.. ఇప్పుడే వ‌స్తాను డాడీ అని చెప్పి లోప‌లికి వెళుతుంది.

    ఇక కార్తీక్ చెయ్యి ప‌ట్టుకున్న సౌర్య‌.. నాన్న నాకు క‌ళ్ల‌లో మంట‌గా లేదు. అలా నాకు డ్రాప్స్ వేస్తే బావుండు అని పించింది నాన్న‌. నాన్న నాకు నీతో పాటే రావాల‌ని ఉంది. నీతో పాటే ఉండాల‌ని ఉంది. మీరే నాన్న అని తెలిసిన‌ప్ప‌టి నుంచి చాలాసార్లు అనిపించింది. ఒక్క రెండు రోజులు మీ ద‌గ్గ‌ర కూర్చుంటా నాన్న‌. కానీ నన్ను కూడా అనాధ అన‌కు నాన్న‌. నువ్వే పెంచుకున్నావు అనుకో నాన్న‌. ఎప్ప‌టికీ అక్క‌డే ఉండ‌ను. ఒక్క రెండు రోజులే నాన్న‌. రెండు అంటే రెండు రోజులు. అంద‌రూ ఉన్న‌ప్పుడు మిమ్మ‌ల్ని నాన్న అని పిల‌వ‌ను నాన్న‌. మీరు ఒక్క‌రు ఉన్న‌ప్పుడే పిలుస్తాను. లేదంటే డాక్ట‌ర్ బాబు అనే పిలుస్తాను. న‌న్ను మీతో పాటు తీసుకెళ్లండి నాన్న అని చెబుతుంది. వెళ్ల‌వే రౌడీ.. ఇంట్లోకి వెళ్లి బ‌ట్ట‌లు స‌ర్దుకొనిరా అని చెప్ప‌గా.. కార్తీక్‌ని హ‌త్తుకుంటుంది. ఇక రౌడీ సంతోషంగా.. ఒక్క నిమిషంలో స‌ర్దుకొని వ‌స్తాను నాన్న. థ్యాంక్యు నాన్న అని అంటుంది.

    ఇక ఇంట్లోకి వ‌చ్చిన సౌంద‌ర్య‌.. శ్రావ్య‌ను పిలుస్తుంది. దాంతో అక్క‌డ‌కు వ‌చ్చిన ఆదిత్య‌.. శ్రావ్య లేదు మమ్మీ.. అన్న‌య్య వ‌దిన ద‌గ్గ‌రికి తీసుకెళ్లాడు అని చెబుతాడు. హిమ‌ను తీసుకొని రావ‌డానికి అని సౌంద‌ర్య అడ‌గ్గా.. కాదు మ‌మ్మీ అని ఆదిత్య అంటాడు. క‌న్న‌ప్రేమ క‌న్నా పెంచిన ప్రేమ గొప్ప‌ద‌ని ఒప్పుకోవ‌డానికా..? అని సౌంద‌ర్య అడ‌గ్గా.. ఒప్పుకోవ‌డానికి కాదు.. వ‌దిన ఆ మాట అన‌కుండా త‌ప్పుకోవ‌డానికి అని ఆదిత్య అంటాడు. అంటే అని సౌంద‌ర్య అడ‌గ్గా.. మ‌న పిచ్చి గానీ పంతంలో అంద‌రూ అంద‌రే. అన్న‌య్య మాత్ర‌మే వెళితే.. ఆ మాట ఒప్పుకోవల్సి వ‌స్తుంద‌నే క‌దా.. శ్రావ్య‌ను వెంట‌బెట్టుకొని వెళ్లింది. ఈయ‌న కారులో కూర్చుంటే శ్రావ్య వెళ్లి హిమ‌ను తీసుకొస్తే.. కారులో ఐడ్రాప్స్ వేసి వ‌స్తాడ‌ట అని ఆదిత్య చెబుతుంది. చూశాడుగా నిన్న‌.. మ‌ధ్య‌లోనే మీ వ‌దిన వ‌చ్చి తీసుకెళ్లిపోయింది.

    ఇప్పుడు హిమ‌ను చూడ‌టానికి డాక్ట‌ర్ బాబుకు ఒక వంక దొరికింది. ఐడ్రాప్స్ వంక పెట్టుకొని అయ్య గారు కూతురు ద‌గ్గ‌ర‌కు వెళ్లాల్సి వ‌చ్చింది. పోనిలే ఇలాంటి వంక‌లు ఒక నాలుగు దొరికితే అస్త‌మానం వంక‌లు, డొంక‌లు వెతుక్కోవ‌డం దేనిక‌ని.. ఏకంగా అంద‌రినీ తీసుకొస్తాడు అని సౌంద‌ర్య అంటుంది. ఇక రేప‌టి ఎపిసో్డ్ ప్రోమోలో సౌర్య‌ను ఇంటికి తీసుకొచ్చిన డాక్ట‌ర్ బాబు.. నా కూతురిని అది తీసుకెళ్లిందిగా.. ఇప్పుడు దాని కూతురిని తీసుకొచ్చాను. దానికి నా బాధ ఏంటో తెలిసి వ‌స్తుంది అని కార్తీక్ అంటాడు.

    First published:

    Tags: Karthika deepam, Karthika deepam telugu serial, Television News

    ఉత్తమ కథలు