హోమ్ /వార్తలు /సినిమా /

కనువిప్పు క‌లిగించిన ఆదిత్య‌.. డీఎన్ఏ టెస్ట్‌కి సిద్ధ‌మైన కార్తీక్.. మోనిత‌కు ఓ గుడ్‌న్యూస్, ఓ షాకింగ్ న్యూస్

కనువిప్పు క‌లిగించిన ఆదిత్య‌.. డీఎన్ఏ టెస్ట్‌కి సిద్ధ‌మైన కార్తీక్.. మోనిత‌కు ఓ గుడ్‌న్యూస్, ఓ షాకింగ్ న్యూస్

అప్పటికే తన పిల్లలు హిమ,శౌర్యలను తన భర్త దగ్గరికి చేరుస్తుంది వంటలక్క. సీరియల్‌కు మెయిన్ విలన్ అయిన మోనిత డాక్టర్ బాబు దక్కలేదనే బాధతో ఆత్మహత్య చేసుకుంటుందని ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పట్లో ఈ సీరియల్ ముగింపు ఊహించడం కష్టమే.

అప్పటికే తన పిల్లలు హిమ,శౌర్యలను తన భర్త దగ్గరికి చేరుస్తుంది వంటలక్క. సీరియల్‌కు మెయిన్ విలన్ అయిన మోనిత డాక్టర్ బాబు దక్కలేదనే బాధతో ఆత్మహత్య చేసుకుంటుందని ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పట్లో ఈ సీరియల్ ముగింపు ఊహించడం కష్టమే.

Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతోంది. నిన్న‌టి ఎపిసోడ్‌లో కార్తీక్‌ను త‌ల‌చుకొని దీప భావోద్వేగానికి గురి అవుతుంది. ఇక ఇవాళ్టి ఎపిసోడ్‌లో మేడ‌పై ఉన్న ఆదిత్య ద‌గ్గ‌ర‌కు కార్తీక్ వెళ‌తాడు. అక్క‌డ ఆదిత్య మందు తాగేందుకు ఏర్పాట్లు చేస్తుంటాడు. ఏంట్రా ఇది అని కార్తీక్ అడ‌గ్గా.. దీన్నే మందు అంటారు. మ‌నం తాగ‌క చాలా రోజులు అయ్యింది. అలాగ‌ని మందు ఏంటో మ‌ర్చిపోతామా ఏంటి అని ఆదిత్య అంటాడు. ఇప్పుడు ఎందుకు రా అని కార్తీక్ అడ‌గ్గా.. కార‌ణం ఉంది. ముందు నువ్వు కూర్చో. రా అన్న‌య్య‌ అని ఆదిత్య చెబుతాడు.

ఇంకా చదవండి ...

  Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతోంది. నిన్న‌టి ఎపిసోడ్‌లో కార్తీక్‌ను త‌ల‌చుకొని దీప భావోద్వేగానికి గురి అవుతుంది. ఇక ఇవాళ్టి ఎపిసోడ్‌లో మేడ‌పై ఉన్న ఆదిత్య ద‌గ్గ‌ర‌కు కార్తీక్ వెళ‌తాడు. అక్క‌డ ఆదిత్య మందు తాగేందుకు ఏర్పాట్లు చేస్తుంటాడు. ఏంట్రా ఇది అని కార్తీక్ అడ‌గ్గా.. దీన్నే మందు అంటారు. మ‌నం తాగ‌క చాలా రోజులు అయ్యింది. అలాగ‌ని మందు ఏంటో మ‌ర్చిపోతామా ఏంటి అని ఆదిత్య అంటాడు. ఇప్పుడు ఎందుకు రా అని కార్తీక్ అడ‌గ్గా.. కార‌ణం ఉంది. ముందు నువ్వు కూర్చో. రా అన్న‌య్య‌ అని ఆదిత్య చెబుతాడు. ఏంటా కార‌ణం అని కార్తీక్ కుర్చీలో కూర్చుంటాడు. ఇక‌ ఆదిత్య ఎవ‌రికో ఫోన్ చేస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్‌కి ఎవ‌రినైనా పిలుస్తున్నావా అని కార్తీక్ అడ‌గ్గా.. వీడు తాగే వాడు కాదులే అని ఆదిత్య అంటాడు. నేను ఇంకొక‌రితో కూర్చోనురా అని కార్తీక్ అన‌గా.. వీడు మ‌న‌తో కూర్చునే వాడు కూడా కాదులే అని చెబుతాడు. ఆ త‌రువాత శ్రావ్య వారికి మంచింగ్‌కి తీసుకొస్తుంది. తెస్తున్నాను క‌దా ఫోన్ ఎందుకు అని శ్రావ్య అంటుంది. ఇక ఆదిత్య.. వాడే వీడు అని శ్రావ్య‌ను చూపించి చెబుతాడు. ఎవ‌రు అని కార్తీక్ అన‌గా.. నా క్లోజ్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. అమ్మ‌కు తెలీకుండా ఎప్పుడైనా రెండు పెగ్గులు వేయాలంటే ఇలాంటివ‌న్నీ చేసి పెడుతుంది పాపం పిచ్చి పిల్ల అని ఆదిత్య అంటాడు. ఇక శ్రావ్య పిచ్చి పిల్ల‌ను ఏం కాదు. బ‌య‌ట ఫ్రెండ్స్‌తో వెళితే లిమిట్ ఉండ‌దు క‌దా అందుకు అని చెబుతుంది. ఆ త‌రువాత ఇంక ఏమైనా కావాలా బావ‌గారు అని అడ‌గ్గా.. నువ్వేంట‌మ్మా ఇవ‌న్నీ అని కార్తీక్ అడుగుతాడు. దానికి శ్రావ్య‌.. మ‌న ఫ్యామిలీ ఇలాంటి చిన్న చిన్న స‌రదాలు మీకు దూరం అయ్యాయి క‌దా బావ‌గారు అని అంటుంది. ఇక ఆదిత్య, శ్రావ్య‌ను వెళ్ల‌మ‌న‌గా.. ఏమైనా కావాలంటే మెసేజ్ పెట్టు చాలు అని అక్క‌డి నుంచి వెళుతుంది.

  శ్రావ్య వెళుతూ ఉండ‌గా కార్తీక్.. మీ ఇద్ద‌రు చాలా ఫ్రెండ్లీగా ఉంటారురా అని అంటాడు. చాలా మంది భార్య‌లు ఇలా ఉండ‌రు అని కార్తీక్ అన‌గా.. ఇంకెలా ఉంటారు అని ఆదిత్య అంటాడు. వెంట‌నే కార్తీక్.. అది వ‌దిలేయ్. పార్టీకి ఏదో కార‌ణం ఉంది అన్నావు ఏంట‌ది అని అడుగుతాడు. దానికి ఆదిత్య‌.. ఇవాళ శ్రావ్య బ‌ర్త్‌డే అన్న‌య్య అన‌గా.. మ‌రి చెప్ప‌వేంటి అన్న కార్తీక్ శ్రావ్య‌ను పిలిచి బ‌ర్త్‌డే విషెస్ చెబుతాడు. దానికి శ్రావ్య థ్యాంక్స్ చెప్పి కిందికి వెళుతుంది. ఆ త‌రువాత ముందు చెప్పొచ్చు క‌ద‌రా. ఏదైనా గిఫ్ట్ తీసుకొచ్చే వాడిని అని కార్తీక్ అన‌గా.. గిఫ్ట్ అడిగే టైమ్ వ‌స్తుందిలే అన్న‌య్య అని ఆదిత్య అంటాడు. ఇక ఇద్ద‌రు మందు తాగుతూ ఉంటారు. అప్పుడు కార్తీక్.. నువ్వు చాలా అదృష్ట‌వంతుడివిరా అని అంటాడు. దానికి ఆదిత్య ఎందుకు అన్న‌య్య అని అడ‌గ్గా.. నీకు అనుకూలంగా ఉండే భార్య దొరికింది అని కార్తీక్ అంటాడు.

  దానికి ఆదిత్య‌.. ఇప్పుడు ఇలా ఉంది అని అంటాడు. అంటే అని కార్తీక్ అడ‌గ్గా.. శ్రావ్య పెళ్లికి ముందు గానీ, పెళ్లైన కొంత‌కాలం దాకా గానీ త‌న మ‌న‌సులో నేను లేను అని ఆదిత్య చెబుతాడు. ఏంటి అని మ‌ళ్లీ కార్తీక్ అడ‌గ్గా.. అవును అన్న‌య్య‌. త‌న మ‌న‌సులో ఇంక ఎవ‌రో ఉన్నారు అని ఆదిత్య అంటాడు. దాంతో షాక్‌కి గురైన కార్తీక్.. నీకు తెలుసా ఎవ‌రో అని అడుగుతాడు(అప్ప‌ట్లో శ్రావ్య కూడా కార్తీక్‌ని ప్రేమిస్తుంది). దానికి ఆదిత్య‌.. తెలీదు. నాకు అన‌వ‌స‌రం కూడా. శ్రావ్య మ‌న‌సులో నేను లేనని తెలిశాక చాలా ఫీల్ అయ్యాను. నువ్వు ప‌దేళ్లు అనుభ‌వించే న‌ర‌కం నేను ఆ రోజుల్లో ప్ర‌తి క్ష‌ణం అనుభ‌వించాను. ఎవ‌రితో చెప్పుకోలేను. మ‌న‌సులో కుమిలిపోయాను. అమ్మ‌కు, నాన్న‌కు ఈ విష‌యం చెబితే కొడుకు జీవితం ఇలా అయ్యిందే అని వాళ్లు బాధ‌ప‌డుతార‌ని ఆగిపోయాను. ఎవ‌రూ ఓదార్చ‌లేనిది, తీర్చ‌లేనిది. నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. స‌రే పెళ్లికి ముందు త‌న మ‌న‌సులో ఎవ‌రో ఉన్నారు. తాళి క‌ట్టాను క‌దా ఇక త‌న మ‌న‌సు మొత్తం నేనే నిండిపోవాలి అనుకున్నాను. త‌న ప్రేమ‌ను నా వైపుకు తిప్పుకోవాలంటే ముందు త‌న‌ను నేను మ‌రింత ప్రేమించాలి అనుకున్నాను. ప్రేమించాను. మార్పు తీసుకొచ్చాను. నేనే త‌న స‌ర్వ‌స్వం అనుకునేలా చేశాను. హాయిగా ఉన్నాము. ఉంటాము. కాక‌పోతే నాది నిజం, నీది భ్ర‌మ అని అంటాడు.

  ఆ త‌రువాత కొన‌సాగిస్తూ.. భార్య‌లంద‌రూ మంచి వాళ్లే అన్న‌య్య‌. అలాగ‌ని భ‌ర్త‌లంద‌రూ చెడ్డ వాళ్ల‌ని కాదు. ఇద్ద‌రు అర్థం చేసుకొని స‌ర్దుకుపోవాలి. నేను స‌ర్దుకుపోయాను. నువ్వు స‌ర్దుకుపోలేదు. వ‌దిన వెళ్లిపోయింది అని అంటాడు. ఇక కార్తీక్ లేచి.. నువ్వు ఏం చెప్ప‌ద‌లచుకున్నావో నాకు అర్థం అయ్యింది. ఆ టాపిక్ వ‌దిలేయ్ అని అంటాడు. ఏది ఇంకా అస‌లు విష‌యం మొద‌లుపెట్ట‌లేదు క‌దా అని ఆదిత్య అన‌గా.. ఇంకేం ఉందిరా అస‌లు విష‌యం అని కార్తీక్ అంటాడు. దానికి ఆదిత్య‌.. మ‌న‌ల‌ను ఎప్పుడూ త‌ల‌చుకొనే ఒక మ‌న‌సు మ‌న‌కోసం వెతికే ఓ ప్రాణం, మ‌న‌కోసం వేచి చూసే ఒక జీవితం దొర‌క‌డం నిజంగా మ‌న అదృష్టం. ప్రేమించ‌డం క‌న్నా ఇంకొక‌రి ప్రేమ‌ను పొంద‌డం ఒక వ‌రం. ఇవి నా మాట‌లు కాదు. ఎవ‌రో ఫ్రెండ్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు అని అంటాడు. అప్పుడు దీప మాట‌ల‌ను గుర్తు చేసుకుంటాడు కార్తీక్.

  ఆ త‌రువాత ఆదిత్య‌.. అస‌లు వ‌దిన ఇంకొక‌రి మీద ఇష్టం పెంచుకొని ఉంటే ఆ ఇంకొక‌రు ఈ ప‌దేళ్ల‌లో ఎక్క‌డికి వెళ్లిన‌ట్లు. విహారి తుల‌సిని ఎందుకు ప్రేమించి పెళ్లి చేసుకున్న‌ట్లు. వ‌దిన‌కు క‌విత్వం అంటే ఇష్టం. ఆ క‌వి మీద అభిమానం. అందువ‌ల్ల స్నేహంగా మెలిగింది. ఆ స్నేహాన్ని అపార్ధం చేసుకోవ‌డం సంస్కారం కాదు అన్న‌య్య‌. మ‌నం విశాల‌మైన మ‌న‌సుతో ఆలోచిస్తామ‌ని ఎదుటి వాళ్ల‌తో చెప్పుకోవ‌డ‌మో, ఎదుటి వాళ్లు మ‌న‌తో చెప్పుకోవ‌డ‌మో కాదు కావాల్సింది. మ‌న‌తో మ‌నం చెప్పుకోగ‌ల‌గాలి అని అంటాడు. అప్పుడు కూడా కార్తీక్, దీప మాట‌ల‌ను గుర్తు చేసుకుంటూ ఉండ‌గా.. కూర్చొమ‌ని ఆదిత్య చెబుతాడు.

  ఇక మందును కార్తీక్‌కి ఇచ్చే ఆదిత్య‌.. వ‌దిన‌ను నువ్వు ఎన్నో సార్లు అవ‌మానించావు క‌దా. మ‌రి నువ్వు చేస్తున్న‌ది ఏంటి అన్న‌య్య‌. మోనిత‌తో క్లోజ్‌గా.. క్లోజ్‌గా కాదు లివింగ్ టు గెద‌ర్‌లా బిహేవ్ చేయ‌ట్లేదా. వ‌దిన ఎప్పుడైనా ఇంకొక‌రితో అలా బిహేవ్ చేసిందా.. నువ్వు మోనిత‌ను వెంట వేసుకొని ఎంత తిరిగినా వ‌దిన నిన్ను అనుమానించ‌లేదు. మోనిత కారెక్ట‌ర్‌ని త‌ప్పు ప‌ట్టింది. వ‌దిన‌కో న్యాయం, నీకో న్యాయ‌మా.. నువ్వు మోనిత‌ను పెళ్లి చేసుకుంటానని మ‌మ్మ‌ల్ని ఈజీగా బెదిరిస్తున్నావు. అంటే మ‌గ‌వాడివ‌న్న అహంకారం త‌ప్ప ఇంకొక కార‌ణం ఏమీ లేదు. వ‌దిన గ‌డప దాటే రోజు నువ్వు మా అంద‌రి ముందు దీని క‌డుపులో పుట్టే బిడ్డ‌కు తండ్రిని నేను కాదు అన్న ఒక్క మాట‌కు వ‌దిన ఇల్లు వ‌దిలిపెట్టి వెళ్లిపోయింది. భ‌ర్త అయితే ఏంటి, దేవుడు అయితే ఏంటి ఐ డోంట్ కేర్ అనేసి వెళ్లిపోయింది. నువ్వు అన్న ఒక్క మాట వ‌ల్ల వ‌దిన ప‌దేళ్ల నుంచి ఇప్ప‌టివ‌ర‌కు శిక్ష అనుభ‌విస్తూనే ఉంది. న‌ర‌కం చూస్తూనే ఉంది.నిజం నువ్వు అనుకున్న‌ట్లు వ‌దిన మ‌న‌సులో ఎవ‌రైనా ఉండి ఉంటే నీకోసం ప‌దేళ్లు కాదు ప‌ది రోజులు కూడా ఎదురుచూసేది కాదు. అప్పుడే నీకు దూరంగా వెళ్లిపోయేది. మ‌ళ్లీ క‌నిపించేది కాదు. పిల్ల‌ల‌ను క‌ని పెంచేదే కాదు. నువ్వు ఎంత అవ‌మానించావు అన్న‌య్య వ‌దిన‌ను. అత్త‌గారి అండ ఉంది క‌దా అని ఇక్క‌డే ఉంటా అందా. అస‌లు ఆస్తి రాసిస్తాను అన్న తీసుకుందా. పిల్ల‌ల‌ను నువ్వు పెంచుకుంటానంటే ఇచ్చి త‌న సుఖం, సంతోషం చూసుకుంటానంటూ వెళ్లిపోయిందా. ఎక్క‌డ అడ్వాంటేజ్ తీసుకుంది అన్న‌య్య వ‌దిన‌. ఏమీ చేయ‌లేదు అన్న‌య్య వ‌దిన‌. నీ కోస‌మే ఇన్నేళ్లుగా ఎదురుచూస్తూ ఉంది. భ‌ర్త న‌మ్మిన రోజే, ర‌మ్మ‌న్న రోజే వ‌స్తాన‌ని అలాగే ఉండిపోయింది. తిండికి లేక‌పోయినా క‌ష్ట‌ప‌డి కూతురిని పెంచింది. ఎంత పేద‌రికం అనుభ‌వించినా ఏనాడు అమ్మ‌ను గానీ నిన్ను గానీ వాళ్ల నాన్న‌ను గానీ సాయం చేయ‌మ‌ని అడ‌గ‌లేదు. అదే క‌దా అమ్మ అనే సెల్ఫ్ రెస్పెక్ట్. వ‌దినే కాదు ఏ భార్య అయినా ఇదే ఆలోచిస్తుంది. భ‌ర్త‌నే దూరం అయిన‌ప్పుడు ఆస్తుల‌తో ఎందుకు అని భ‌ర్త‌ను కోరుకునే ప్ర‌తి భార్య ఇలానే అనుకుంటుంది. వ‌దిన నీ కోస‌మే బ‌తుకుతుంది అన్న‌య్య‌. నోరు తెరిచి అత్త‌య్య నేను ఇక్క‌డే ఉంటాను నాకు స‌పోర్ట్ చేయండి అంటే అమ్మ నాన్న కాదాంటారా.. నేను, శ్రావ్య వ‌ద్దంటామా.. చెప్పు అన్న‌య్య‌. అయినా స‌రే నీ మాట‌కు హ‌ర్ట్ అయ్యి పిల్ల‌ల‌ను తీసుకొని ఊరే వ‌దిలిపెట్టి వెళ్లిపోయింది. ద‌టీజ్ సెల్ఫ్ రెస్పెక్ట్. నువ్వు, మోనిత చాలా క్లోజ్‌గా ఉంటారు క‌దా. మోనిత ఇంకెవ‌రో డాక్ట‌ర్‌తో క్లోజ్‌గా మాట్లాడితే నువ్వు ఎవ‌రు అత‌డు అని అడిగావా.. అడ‌గ‌వు. ఎందుకంటే నీకు మోనిత అంటే న‌మ్మ‌కం. అదే న‌మ్మ‌కం వ‌దిన మీద ఎందుకు లేదు. మోనిత ఎక్కువ చ‌దువుకుంది. సోష‌ల్‌గా ఉంటుంది అని అనుకుంటున్నావు కాబ‌ట్టి. మోనిత ఆడ‌దే, వ‌దిన ఆడ‌దే. వ‌దిన ఏంటో నువ్వు తెలుసుకునే లోపే తిట్టేసి పంపేశావు. బాగా ఆలోచించు అన్న‌య్య‌. వ‌దిన కోసం కాదు పిల్ల‌ల‌కు అమ్మ‌, నాన్న ఇద్ద‌రు కావాలి. అందుకోసం అయినా ఆలోచించు అని అంటాడు.

  అదే స‌మ‌యానికి శ్రావ్య పైకి వ‌చ్చి ఆదిత్య బావ‌గారికి ఆక‌లి వేస్తుందేమో రండి భోజ‌నం చేద్దాం అని పిలుస్తుంది. దానికి ఆదిత్య‌.. నీకు ఆక‌లి వేస్తుంద‌ని చెప్పు అని అంటాడు. ఇక శ్రావ్య అదేం లేదు. కావాలంటే ఇంకాసేపు ఎదురుచూస్తాను అని అంటుంది. ఇక శ్రావ్య ద‌గ్గ‌ర‌కు వెళ్లి ఆదిత్య క్లోజ్‌గా ఉంటాడు. అది కార్తీక్ చూసి ఆలోచ‌న‌లో ప‌డ‌తాడు.

  మ‌రోవైపు దీప ఇంట్లో ద‌గ్గుతూ ఉంటుంది. పిల్ల‌లు రాగా.. దూరం జ‌ర‌గండి ద‌గ్గ‌ర‌కు రాకండి అని చెబుతుంది. పిల్ల‌లిద్ద‌రు ఏమైంది అమ్మ అని అంటూ నీళ్లు ఇస్తారు. ఇక సౌర్య ఇక్క‌డ‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి నీకు ద‌గ్గు ఎక్కువ అయ్యింది ఏంటమ్మా అన‌గా.. అమ్మ అస‌లు ఒక్క ట్యాబ్లెట్ కూడా3 వేసుకోదు ఏంటి అని హిమ అంటుంది. దానికి దీప‌.. ఏం లేదు అమ్మా. ఇందాక ప‌చ్చి మిర్చి వేయించాను క‌దా ఆ ఘాటుకు వ‌చ్చి ఉంటుంది అని అంటుంది. అది వేయించి చాలా సేపు అయ్యింది అని హిమ అన‌గా.. నీకు ఇది రోజు వ‌స్తుంది. నేను నిన్ను నాన్న ద‌గ్గ‌రికి ట్రీట్‌మెంట్‌కి తీసుకెళ్లిన‌ప్పుడు నీకు ద‌గ్గు వ‌స్తే నిర్ల‌క్ష్యం చేయ‌కుండా నిన్ను హాస్పిట‌ల్‌కి తీసుకుర‌మ్మ‌న్నారు అని సౌర్య అంటుంది. వెంట‌నే హిమ‌.. అయితే వార‌ణాసికి ఫోన్ చేసి ఆటో తీసుకుర‌మ్మ‌ని చెప్పి అమ్మ‌ను హాస్పిట‌ల్‌కి తీసుకెళ్దామా అని అంటుంది. ఇక దీప‌.. వ‌ద్దు. ఈ మాత్రానికే హాస్పిట‌ల్ ఎందుకు. బ్లెడ్ టెస్ట్ అంటారు. అద‌నీ, ఇద‌నీ చాలా ఖ‌ర్చు. ఏం కాదు. మీరేం కంగారు ప‌డ‌కండి అని అంటుంది. పోనీ మందులైనా తీసుకొస్తాం అని సౌర్య అన‌గా.. దీప వ‌ద్దంటుంది. వెంట‌నే హిమ‌.. అమ్మ అలానే అంటుంది కానీ నువ్వు వార‌ణాసికి ఫోన్ చేయి సౌర్య‌. మ‌నం మెడిక‌ల్ షాప్‌కి వెళ్లి మందులు తీసుకొద్దాం అని అంటుంది. ఈ చీక‌ట్లోనా అని దీప అడ్గ‌గా.. ఏమ‌వుతుంది. వార‌ణాసితో ఆటోలోనే క‌దా వెళ్తాం అని సౌర్య అంటుంది.

  ఇక మ‌రోవైపు ముర‌ళీకృష్ణ‌.. దీప‌, పిల్ల‌ల కోసం వెతుకుతూ ఉంటాడు. ఒక‌చోటకు వెళ్లి ఊరంతా జ‌ల్ల‌డ ప‌ట్టినా ఎక్క‌డా దొర‌క‌లేదు. లాభం లేదు. ఇంకో ఊరుకు వెళ్లాల్సిందే. అమ్మ దీప‌. పిల్ల‌ల‌తో ఎన్ని అవ‌స్త‌లు ప‌డుతున్నావ‌మ్మా అని బాధ‌ప‌డుతాడు. మ‌రోవైపు సౌర్య‌, హిమ మెడిక‌ల్ షాప్‌కి వెళ‌తారు. అక్క‌డికి వెళ్లి ట్యాబ్లెట్లు తీసుకొని ఆటో ఎక్కుతారు. అదే స‌మ‌యానికి మెడిక‌ల్ షాప్‌లో ప‌నిచేసే అత‌డికి పిల్ల‌ల ఫొటోలు వ‌స్తాయి. వాటిని సౌర్య‌, హిమ‌ల‌కు ట్యాబ్లెట్లు ఇచ్చిన వ్య‌క్తికి చూపిస్తూ.. రేయ్ వీళ్ల గురించి చెబితే పాతిక వేలు ఇస్తారంట. నాకు క‌నిపిస్తే బావుండు అని అంటాడు. ఆ త‌రువాత ఆ ఫొటోల‌ను చూసిన మ‌రో వ్య‌క్తి.. ఇప్పుడు ఈ పిల్ల‌లు వ‌చ్చి వాళ్ల అమ్మ‌కు ద‌గ్గు మందు కావాల‌ని తీసుకెళ్లార‌న్న అని అంటాడు. ఇక వారి కోసం ఇద్ద‌రు బండిలో బ‌యలుదేరుతారు. ఇక కార్తీక్.. ప‌డుకొని దీప మాట‌ల‌ను, గ‌తాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అటు దీప.. త‌మ పెళ్లి రోజును, కార్తీక్‌తో గ‌డిపిన క్ష‌ణాల‌ను గుర్తు చేసుకుంటుంది. కార్తీక దీపం కొన‌సాగుతుంది. ఇక రేప‌టి ఎపిసోడ్ ప్రోమోలో త‌న‌కు పిల్ల‌లు పుట్టే అవ‌కాశం ఉందో లేదో మ‌రోసారి టెస్ట్ చేయించుకోవాల‌నుకుంటాను అని మోనిత‌తో చెప్తాడు. దాంతో మోనిత షాక్‌కి గురి అవుతుంది.

  Published by:Manjula S
  First published:

  Tags: Karthika deepam, Karthika Deepam serial, Television News

  ఉత్తమ కథలు