హోమ్ /వార్తలు /సినిమా /

Karthika Deepam: మోనిత దగ్గరకు అంజిని తీసుకెళ్లాలనుకున్న కార్తీక్.. మ‌ళ్లీ అంద‌రికీ షాక్ ఇవ్వ‌బోతున్న దీప

Karthika Deepam: మోనిత దగ్గరకు అంజిని తీసుకెళ్లాలనుకున్న కార్తీక్.. మ‌ళ్లీ అంద‌రికీ షాక్ ఇవ్వ‌బోతున్న దీప

Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతోంది. నిన్న‌టి ఎపిసోడ్‌లో కార్తీక్, ఆదిత్య ఆవేశంతో కొట్టుకుంటుండ‌గా.. ఆనంద‌రావుకు హార్ట్ ఎటాక్ వ‌స్తుంది. ఇవాళ్టి ఎపిసోడ్‌లో దీప ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన వార‌ణాసి.. అక్క వంట ఏం చేయలేదా అని అడుగుతాడు.

Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతోంది. నిన్న‌టి ఎపిసోడ్‌లో కార్తీక్, ఆదిత్య ఆవేశంతో కొట్టుకుంటుండ‌గా.. ఆనంద‌రావుకు హార్ట్ ఎటాక్ వ‌స్తుంది. ఇవాళ్టి ఎపిసోడ్‌లో దీప ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన వార‌ణాసి.. అక్క వంట ఏం చేయలేదా అని అడుగుతాడు.

Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతోంది. నిన్న‌టి ఎపిసోడ్‌లో కార్తీక్, ఆదిత్య ఆవేశంతో కొట్టుకుంటుండ‌గా.. ఆనంద‌రావుకు హార్ట్ ఎటాక్ వ‌స్తుంది. ఇవాళ్టి ఎపిసోడ్‌లో దీప ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన వార‌ణాసి.. అక్క వంట ఏం చేయలేదా అని అడుగుతాడు.

ఇంకా చదవండి ...

    Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతోంది. నిన్న‌టి ఎపిసోడ్‌లో కార్తీక్, ఆదిత్య ఆవేశంతో కొట్టుకుంటుండ‌గా.. ఆనంద‌రావుకు హార్ట్ ఎటాక్ వ‌స్తుంది. ఇవాళ్టి ఎపిసోడ్‌లో దీప ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన వార‌ణాసి.. అక్క వంట ఏం చేయలేదా అని అడుగుతాడు. లేదురా అని దీప అన‌గా.. నేను ఇంటికి వెళ్లి వంట చేయించుకొని వ‌స్తాను అని వార‌ణాసి అంటాడు. మాకా అని దీప అడ‌గ్గా.. అవున‌ని వార‌ణాసి అంటాడు. దానికి దీప‌.. వ‌ద్దులేరా నేనే చేస్తాను అని అంటుంది. నువ్వున్న ప‌రిస్థితులో అని వార‌ణాసి అన‌గా.. ఇది రేపు కూడా ఉంటుంది, ఎల్లుండి కూడా ఉంటుంది. ఎన్నేళ్లు గ‌డిచినా ఉంటుంది. అప్ప‌టిదాకా నువ్వే భోజ‌నం చేస్తావా చెప్పు. నా బిడ్డ‌ల‌ను వండి పెట్ట‌డానికైనా నేను బ్ర‌తికి ఉండాలి క‌దా. చేస్తానులేరా అని దీప అంటుంది. ఆ త‌రువాత పిల్ల‌ల‌ను లోప‌ల ప‌డుకోమ‌ని చెప్పి.. వంట అయ్యాక లేపుతానంటుంది దీప‌. వెంట‌నే వార‌ణాసి.. నాకు కూడా ఒక ముద్ద పెడ‌తావా అక్క. ఇక్క‌డే గుమ్మంలో ప‌డి ఉంటాను అని అంటాడు. దానికి దీప‌.. ఏరా విర‌క్తి పుట్టి ఏదైనా చేసుకుంటాన‌ని కాప‌లాగా ప‌డి ఉంటావా అని అన‌గా.. అయ్యో అని వార‌ణాసి అంటాడు. ఇక దీప‌.. ఉండురా. వంట చేసి పిలుస్తాను అని చెబుతుంది.

    ఇక కార్తీక్, ఆనంద‌రావుకు ప‌రీక్ష‌లు చేస్తుంటాడు. ఆ త‌రువాత రిపోర్ట్‌లు రాగా.. వాటిని చూసిన కార్తీక్.. మ‌మ్మీ భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. వీడి(ఆదిత్య‌) ఆవేశంతో ఈయ‌న ఎమోష‌న‌ల్ అయిపోయి మ‌న‌ల్ని కంగారు పెట్టేశాడు అంతే. అన్ని నార్మ‌ల్‌గా ఉన్నాయి. ఒక కొలెస్ట్రాల్ బార్డ‌ర్ లైన్ దాటింది అంతే అంటాడు. ఇక ఆనంద‌రావును పిలిచి.. మీకు స్మోకింగ్, డ్రికింగ్ అల‌వాటు ఉంటే మానేయండి డాడీ. అది ఆరోగ్యానికి హానిక‌రం అని చెప్పే వాడిని. మీకేమో అలాంటి అల‌వాటులు లేవు. కానీ మీ ఇద్ద‌రికి కామ‌న్‌గా ఒక వ్య‌స‌నం ఉంది. ఇద్ద‌రికీ ఒక పాడు అల‌వాటు ఉంది. అది మానుకోమ‌ని చెప్ప‌ద‌లుచుకున్నాను అని అంటాడు. దానికి సౌంద‌ర్య‌.. నువ్వు ఏం మాట్లాడుతున్నావు కార్తీక్ అన‌గా.. ఇప్పుడైనా న‌న్ను మాట్లాడ‌నివ్వు మ‌మ్మీ. మాట్లాడితేనే క‌దా నేను ఏం చెప్పాల‌నుకుంటున్నానో అర్థం అవుతుంది. మీరిద్ద‌రు ఆ దీప గురించి ఆలోచించ‌డం మానేయండి. అది స్మోకింగ్, డ్రింకింగ్ క‌న్నా ప్ర‌మాద‌క‌ర‌మైన‌ది. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ హార్ట్ మీద లంగ్స్ మీద ప్ర‌భావం చూపిస్తే.. ఆ దీప చాలా క‌ష్ట‌ప‌డిపోతుంది. ఆవిడ జీవితాన్ని ఎలా మార్చాలి అన్న ఆలోచ‌న ఉంది చూశారా అది హార్ట్, లంగ్స్, లివ‌ర్, బ్రెయిన్, డైజెస్టివ్ సిస్ట‌మ్ అన్నింటిని డ్యామేజ్ చేసి పూర్తిగా ఆరోగ్యం క్షీణించి మ‌నిషిని కుంగ‌దీస్తుంది. అందుక‌ని నా మాట విని ఆమెను మ‌ర్చిపోయి ప్ర‌శాంతంగా ఉండండి అని అంటాడు.

    ఇక ఆదిత్య‌తో నువ్వు కూడా ఈ క్ల‌బ్‌లో చేరిపోయిన‌ట్లు ఉన్నావు. ఇంకా జీవితాన్ని చూడ‌లేదు. ఉడుకు రక్తం. ఆవేశం ఉంటుంది, జాగ్ర‌త్త. డాడీకి ఏం ప‌ర్వాలేదు ఇంటికి తీసుకెళ్లు అని చెబుతాడు. నువ్వు రారా అని సౌంద‌ర్య అడ‌గ్గా.. నేను సాయంత్రం వ‌స్తాను అని కార్తీక్ చెబుతాడు. అంద‌రితో పాటు ఇంటికి వ‌చ్చేయ్‌రా. నువ్వు ఏం తిన‌లేదు. భోజ‌నం చేశాక కావాలంటే మ‌ళ్లీ హాస్పిటల్‌కి వ‌ద్దువు కానీ అని సౌంద‌ర్య అన‌గా..నాకు ఆక‌లిగా లేదు మ‌మ్మీ. అంత‌గా కావాలంటే జ్యూస్ తెప్పించుకొని తాగుతాను అని కార్తీక్ చెబుతాడు. ఎందుకు అన్న‌య్య ఇది మ‌న హాస్పిట‌ల్ క‌దా ఎందుకు అంత టెన్ష‌న్ ప‌డుతున్నావు అని ఆదిత్య అన‌గా.. అందుకే తీసుకెళ్ల‌మంటున్నాను. ఇంకాసేపు ఇక్క‌డే ఉంటే ఎవ‌రు వ‌స్తారో.. ఈ పాటికి ఫోన్లు వెళ్లే ఉంటాయి. కావాల్సిన వాళ్లు రావ‌డం, ప‌ల‌క‌రింపు, ప‌రామ‌ర్శ‌లు , ఏడుపులు, ఓదార్పులు, నిట్టూర్పులు. చాలా డ్రామాలు క్రియేట్ అయ్యే అవ‌కాశం ఉంది. అవి మీకు ఆనందాన్ని క‌లిగించ‌చ్చేమో. నాకు చిరాకు తెప్పిస్తాయి. బీపీ పెరుగుతుంది. గుండెలు పిండే దృశ్యాలు చూసి నాకు హార్ట్ ఎటాక్ వ‌చ్చినా రావొచ్చు. అప్పుడు నేను కూడా ప‌క్క బెడ్ మీద ప‌డుకోవాల్సి వ‌స్తుంది. మ‌ళ్లీ నాకు స‌ప‌ర్య‌లు, ఓదార్పులు, ఉప‌న్యాసాలు, ఉపోద్ఘాతాలు. ఇవ‌న్నీ అవ‌స‌ర‌మా చెప్పు. బ‌య‌లుదేరండి అని కార్తీక్ అంటాడు.

    బాగా చెప్తున్నావు కానీ.. నువ్వు అదే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు ఉన్నావు అని ఆనంద‌రావు అన‌గా.. అలాగే మీరు జాగ్ర‌త్త అని కార్తీక్ అంటాడు. ఇక సౌంద‌ర్య‌కు రిపోర్ట్‌లు ఇస్తూ ట్యాబ్లెట్లు రెగ్యుల‌ర్‌గా వాడండి అని కార్తీక్ అన‌గా.. ఆదిత్య బిల్లు ఎంత అయ్యిందో అడుగు పే చేద్దాం అని సౌంద‌ర్య అంటుంది. దానికి కార్తీక్ న‌వ్వుతూ.. మ‌మ్మీ ఈ టైమ్‌లో కూడా నీకు సెన్సాఫ్ హ్యూమ‌ర్ త‌గ్గ‌లేదు. మంచిదేలే ఇప్పుడు డాడీకి ఎమోష‌న‌ల్ అయ్యే మాట‌లు చెప్ప‌కుండా ఇలాంటి జోకులు చెప్పి న‌వ్వించు. త్వ‌ర‌గా కోలుకుంటారు. బ‌య‌లుదేరండి అని అంటాడు.

    ఇంట్లో దీప‌, దేవుడి గ‌ది ద‌గ్గ‌ర‌కు వెళ్లి.. ఏం చెప్పుకోవాలి. ఎన్నని అడ‌గాలి. ఎన్నేళ్ల‌ని మిమ్మ‌ల్ని అడ‌గాలి. ఎన్ని మొక్కుల‌ని మొక్కుకోవాలి. ముడుపులు కూడా క‌ట్టానే. గుడికి వ‌చ్చి ప్ర‌ద‌క్ష‌ణాలు చేశానే. ఎంత ఆశ‌గా వెళ్లాను. ఎంత న‌మ్మ‌కంగా వెళ్లాను. ముక్కోటి దేవ‌త‌ల‌ను ఆశీర్వ‌దించ‌మ‌ని మీకు దండం పెట్టుకొని మ‌రీ వెళ్లాను క‌దా. ఒక్క‌రికి కూడా దీవించాల‌నిపించ‌లేదా.. ఏ ఒక్క‌రిలోనూ జాలి అనిపించ‌లేదా.. అయిపోయింది క‌దా అర్జీల‌న్నీ ఆపేస్తాను. ఏదీ చేయ‌రు మీరు. ఏ కోరిక తీర్చ‌రు. ఇంకెందుకు దీపాలు, ఇంకెందుకు దండాలు, ఇంకెందుకు విన్న‌పాలు. విన్న‌వాళ్లెవ‌రు ఎవ‌రూ లేరు. ఇంక నాకు ఎవ్వ‌రూ లేరు. నేను, నా బిడ్డ‌లు అంతే. మళ్లీ నా ఒంట‌రిత‌నం, చీక‌టి అని అక్క‌డి నుంచి వెళ్లి.. కుర్చీలో కూర్చుంటుంది. అదే స‌మ‌యానికి హిమ‌, సౌర్య బ‌య‌టి నుంచి వ‌చ్చి అమ్మా ఫొటోలు ఏవీ అని అడుగుతారు. ఆ త‌రువాత హిమ‌.. స‌ర్దిన సామాన్ల‌లో ఫొటోల‌ను తీసి.. ఇందులో పెట్టావేమ్మా అని అడుగుతుంది. దానికి దీప‌.. ఎక్క‌డో ఒక చోట అయితే ఉన్నాయి క‌ద‌మ్మా అని అంటుంది. అస‌లు ఈ బ్యాగ్‌ల‌న్నీ ఏంట‌మ్మా. చెప్ప‌మ్మా. ఎందుకు ఇవ‌న్నీ బ్యాగ్‌లో స‌ర్దేశావే చెప్పు అని సౌర్య అడ‌గ్గా.. మీ నాన్న మ‌న‌ల్ని తీసుకెళ‌తాడ‌ని, అక్క‌డ గోడ‌కు త‌గిలించాల‌ని అన్నీ స‌ర్దిపెట్టానులే అని దీప అంటుంది. వెంట‌నే హిమ‌.. అయినా ఇంక రాడు క‌దా అన‌గా.. సౌర్య మ‌నం వెళ్లం క‌దా అని అంటుంది. ఇక ఫొటోల‌ను గోడ‌ల‌కు త‌గిలిద్దామ‌ని హిమ వెళుతుండ‌గా.. వ‌ద్ద‌మ్మా అని దీప ఆపుతుంది.అందులోనే పెట్టు అని దీప అన‌గా.. ఎందుకు. నాన్న‌కు ఈ ఫొటోలు ఇష్టం లేద‌నా అని సౌర్య అడుగుతుంది. అయినా ఈ ఫొటోల్లో నాన్న లేరు క‌ద‌మ్మా అని హిమ అడ‌గ్గా.. లేరు కాబ‌ట్టే. ఈ ఫొటోలు చూసిన‌ప్పుడ‌ల్లా మ‌న‌కు మ‌నం ముగ్గుర‌మే క‌నిపిస్తాము. మ‌న‌తో మీ నాన్న లేర‌న్న సంగ‌తి ఫొటో చూసిన ప్ర‌తిసారి గుర్తు వ‌స్తుంది. మ‌న‌తో లేరు, మ‌న ద‌గ్గ‌ర‌కి రారు. మ‌న‌ల్ని పిల‌వ‌రు. ఇది మ‌నం ముందు క‌చ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. గుర్తు పెట్టుకోవాలంటే మ‌ర్చిపోవాలి. మ‌ర్చిపోవాలంటే ఆ ఙ్ఞాప‌కాల‌న్నీ మ‌రుగున‌ప‌డాలి. అందుకే వీటిని అలాగే దాచేద్దాం అని దీప అంటుంది. మ‌న ముగ్గురం ఎదురుగానే ఉన్నాము క‌దా. ఇంక ఫొటోలు వ‌ద్దులే అమ్మ అని సౌర్య అన‌గా.. అవును. మ‌న‌తో ఉన్న వారి ఫొటోలు పెడితే. మ‌న‌తో లేనివాళ్లు గుర్తు వ‌స్తారు. గుర్తు వ‌స్తే మాత్రం వ‌స్తారా అని దీప అంటుంది. ఆ త‌రువాత పిల్ల‌లిద్ద‌రినీ ద‌గ్గ‌ర‌కు తీసుకుంటుంది. ఆ త‌రువాత మీకు నేనున్నాను క‌దా. అమ్మ‌ను నేనే, నాన్న‌ను నేను, తొమ్మిది నెల‌లు క‌డుపులో మోశాను. ఇప్పుడు మోస్తాను అని దీప అంటుంది.

    ఇక మోనిత ఇంటికి కార్తీక్ వెళ్లగా.. మోనిత ఫ్రూట్స్ తెచ్చి తీసుకో కార్తీక్ అంటుంది. దానికి కార్తీక్.. నాకు అస‌లు కూర్చుంటే ప‌డుకోవాల‌ని ఉంది. ప‌డుకుంటే కూర్చోవాల‌ని ఉంది. ఇక్క‌డ‌కు వ‌స్తే ఇంటికి వెళ్లాల‌ని ఉంది. ఇంటికి వెళితే బ‌య‌ట‌కు వెళ్లాల‌ని ఉంది. తిండి మీద‌, నిద్ర మీద దేనిమీద ఆస‌క్తి ఉండ‌టం లేదు. బెంగ‌గా ఉంది. దిగులుగా ఉంది. ఏదో తెలియ‌ని వెలితిగా ఉంది. చాలా కాలం త‌రువాత మందు తాగాల‌నిపిస్తుంది అని అంటాడు. వెంట‌నే మోనిత‌.. ఎందుకు ప్ర‌పంచంలోని నిరాశ అంతా నీకు చుట్టుకుంది. ఈ బెంగ‌లు, ఈ దిగులు, ఈ వెలితి పిల్ల‌లు వెళ్లిపోయినందుకా. పిల్ల త‌ల్లి వెళ్లిపోయింనందుకా అని అంటుంది. వెంట‌నే కార్తీక్.. మా అమ్మ‌లాగా మాట్లాడ‌కు మోనిత అన‌గా.. మీ అమ్మ నాలాగా మాట్లాడ‌దు కార్తీక్ అని మోనిత అంటుంది. నేనేం చెప్పినా నా వైపు నుంచి ఆలోచించ‌దు మా అమ్మ అని కార్తీక్ అన‌గా.. మీ అమ్మ ఆ దీప వైపు నుంచి ఆలోచిస్తుంద‌ని ముల్లోకాల‌కు తెలుసు అని మోనిత అంటుంది. వెంట‌నే కార్తీక్.. నేను నా గురించి మాట్లాడుతున్నాను అనగా.. నేను నీ వెలితి గురించే మాట్లాడుతున్నాను అని మోనిత చెబుతుంది. దానికి కార్తీక్.. అప్పుడు పిల్ల‌ల గురించి మాట్లాడేదానివి, పిల్ల‌ల త‌ల్లి గురించి అడిగేదానివి కాదు అని అంటాడు. ఇక మోనిత‌.. ఇప్పుడు ఏమ‌న్నాను నీ భార్య‌ను. పిల్ల‌ల‌ను తీసుకెళ్లింది. హిమ కోసం త‌ల్లిని తీసుకొస్తావ‌ని ఆశ‌ప‌డింది. హిమ ద్వారా అడిగించింది. ఆ ప‌ప్పులు వ‌డ‌క‌లేదు. ఆ త‌రువాత సౌర్య‌ను దించింది. ఇడ్లీ బండిని ప‌రిచ‌యం చేసింది. ఇంటిపైన చాప మీద ప‌డుకొని చుక్కలు లెక్క‌పెట్ట‌డం ఎలాగో నేర్పింది. నాన్న అని పిలిచి సౌర్యను కూడా తెచ్చుకొని పెంచుకుంటా అని నీతోనే అనిపించేలా చేసింది. అలా సౌర్య‌కు ట్రైనింగ్ ఇచ్చి పంపించింది. ఇప్పుడు ఆ ఇద్ద‌రు పిల్ల‌ల కోసం క‌లిసొచ్చే కాలం వ‌స్తే న‌డిచొచ్చే పెళ్లాం వ‌స్తుంది అని స‌ర్దిచెప్పుకొని తీసుకొచ్చుకోవాల‌నుకుంటున్నావేమో. ఎవ‌రికి తెలుసు అని అంటుంది. వెంట‌నే కార్తీక్ లేచి.. ఇక చాలు, చాలా మాట్లాడావు అనగా.. అరే కూర్చో. ఇప్పుడు సౌర్య కూడా హిమలాగే నీ కూతురు అయ్యింది. నువ్వేమో ఆ రౌడీకి నాన్న‌వు అయ్యావు క‌దా అని మోనిత అన‌గా.. ఆపు నేను వెళుతున్నాను అని కార్తీక్ బ‌య‌లుదేరుతుంటాడు. వెంట‌నే మోనిత‌.. నిజం చెబితే నిష్టూరంలా ఉంది అని అన‌గా.. నిజంగా నేను ఒక ఫూల్‌ని. ఇప్ప‌టిదాకా న‌న్ను న‌న్నుగా అర్థం చేసుకొనే ఒక్క ఫ్రెండ్‌ని కూడా సంపాదించుకోలేక‌పోయాను. ఉన్న‌వాళ్లంతా మా అమ్మలాగా, నీలాగా సెటైర్‌లు వేసే వాళ్లే చీచీ అని అక్క‌డి నుంచి వెళ‌తాడు. ఆ త‌రువాత మోనిత న‌వ్వుతూ పిచ్చి కార్తీక్. అక్క‌డ మీ అమ్మ వేసే సెటైర్లు భ‌రించ‌లేక మ‌ళ్లీ నా ద‌గ్గ‌రికే వస్తావు. ఎక్క‌డికి వెళ‌తావు. మోనిత‌ను దాచుకొని అని అనుకుంటుంది.

    ఇక ఇంట్లో ఆనంద‌రావుకు ట్యాబ్లెట్లు ఇస్తుంది సౌంద‌ర్య‌. కార్తీక్ వ‌చ్చాడా అని ఆనంద‌రావు అడ‌గ్గా.. ఇంకా రాలేదు అని సౌంద‌ర్య చెబుతుంది. ఆదిత్య అని మ‌ళ్లీ ఆనంద‌రావు అడ‌గ్గా.. వాడి గ‌దిలో ఉన్నాడ‌ని చెబుతుంది. ఎలా ఉన్నాడ‌ని ఆనంద‌రావు అడ‌గ్గా.. బానే ఉన్నాడ‌ని సౌంద‌ర్య అంటుంది. ఇక దీప ప‌రిస్థితి ఏంటో. ఫోన్ చేసి మాట్లాడ‌లేక‌పోయావా. అలా ముభావంగా ఉన్నావేంటి అని ఆనంద‌రావు అడ‌గ్గా.. ఇందాక మీకు చెప్ప‌లేదు. నేను హాస్పిట‌ల్ నుంచి ఫోన్ ట్రై చేశాను. అది నా ఫోన్ క‌ట్ చేసి వెంట‌నే స్విచ్ఛాఫ్‌లో పెట్టింది. ఇంత‌వ‌ర‌కు ఆన్ చేయ‌లేదు అని సౌంద‌ర్య అంటుంది. వెంట‌నే ఆనంద‌రావు.. మ‌న‌వాడు దీప జీవితాన్నే స్విచ్ఛాఫ్‌లో పెట్టాడు. త‌ను ఫోన్ స్విచ్ఛాఫ్‌లో పెట్టుకోవ‌డంలో ఆశ్చ‌ర్యం ఏముంది. దీప ఎలా ఉందో పిల్ల‌లు ఎలా ఉన్నారో ఒక‌సారి చూసి రాలేక‌పోయావా అని అడ‌గ్గా.. నాకు వెళ్లాల‌ని ఉంది. కానీ మిమ్మల్ని వ‌దిలేసి వెళ్లలేక అని సౌంద‌ర్య చెబుతుంది. నాకేం కాలేదు. కార్డియాల‌జిస్ట్ ఇంట్లోనే ఉన్నాను. వాళ్ల‌ని ప‌ల‌క‌రించిరా. వాళ్ల‌కు ఈ స‌మ‌యంలో తోడు చాలా అవ‌స‌రం అని ఆనంద‌రావు అంటాడు.

    ఓకే ఆదిత్య‌, శ్రావ్య‌ల‌కు చెప్పి వెళ‌తాను మిమ్మ‌ల్ని చూసుకోమ‌ని అని సౌంద‌ర్య అన‌గా.. నువ్వు బ‌య‌లుదేరు అని ఆనంద‌రావు అంటాడు. ఇక నాకు ఇలా అయ్యింద‌ని దీప‌కు చెప్ప‌కు. మ‌రింత బాధ‌ప‌డుతుంది అని ఆనంద‌రావు అన‌గా.. సౌంద‌ర్య ఓకే అంటుంది. ఇక కార్తీక్ కారులో ఇంటికి వ‌స్తూ హిమ‌, సౌర్య‌ల‌ను గుర్తు చేసుకుంటాడు. అదే స‌మ‌యానికి అంజి ఎదురుగా వ‌స్తుంటాడు. అత‌డిని చూసి అన్నీ గుర్తు చేసుకుంటాడు. ఆ త‌రువాత అంజిని ఆపుతాడు.

    వెంట‌నే ఆగిన అంజి.. ఏంటి సార్ చాలా కోపంగా ఉన్నారు అనుకుంటాడు. ఆ త‌రువాత అంజిని బండి ప‌క్క‌న పెట్టిరా అని చెబుతాడు. అనంత‌రం ఇవాళ వీడిని తీసుకెళ్లి మోనిత ద‌గ్గ‌ర నిల‌బెట్టి అంద‌రి నోరు మూయిస్తాను. ప్ర‌తి ఒక్క‌రు నన్ను, మోనిత‌ను టార్గెట్ చేసే వాళ్లే అని కార్తీక్ మ‌న‌సులో అనుకుంటాడు. ఇక అంజిని కారు ఎక్క‌మ‌ని చెబుతాడు కార్తీక్. కార్తీక దీపం కొన‌సాగుతుంది.

    First published:

    Tags: Karthika deepam, Karthika Deepam serial, Television News

    ఉత్తమ కథలు