హోమ్ /వార్తలు /సినిమా /

Karthika Deepam: నువ్వే తేల్చుకో.. అమ్మ‌ను వ‌దిలి నా ద‌గ్గ‌ర‌కు వ‌స్తావా.. రావా..?.. హిమ‌కు కార్తీక్ సూటి ప్ర‌శ్న‌

Karthika Deepam: నువ్వే తేల్చుకో.. అమ్మ‌ను వ‌దిలి నా ద‌గ్గ‌ర‌కు వ‌స్తావా.. రావా..?.. హిమ‌కు కార్తీక్ సూటి ప్ర‌శ్న‌

తెలుగు రాష్ట్రాలలో కార్తీక దీపం సీరియల్‌కు ఉన్న క్రేజ్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. గ్రంథాలు రాయాల్సి వస్తుంది. అంత గుర్తింపు తెచ్చుకుంది ఈ సీరియల్. 2017 అక్టోబర్‌లో మొదలైన కార్తీక దీపం సీరియల్ టిఆర్పీ రేటింగ్స్‌లో అగ్రస్థానంలో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు దీన్ని బీట్ చేసే సీరియల్ మరోటి రాలేదంటే వంటలక్క రేంజ్ ఏంటో అర్థం అయిపోతుంది. మరి ఇంతటి పాపులర్ సీరియల్‌లో ఉన్న నటుల స్క్రీన్ నేమ్స్ అందరికీ తెలుసు. మరి వంటలక్క నుంచి మోనిత వరకు వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ ఏంటో ఓ సారి చూద్దాం.

తెలుగు రాష్ట్రాలలో కార్తీక దీపం సీరియల్‌కు ఉన్న క్రేజ్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. గ్రంథాలు రాయాల్సి వస్తుంది. అంత గుర్తింపు తెచ్చుకుంది ఈ సీరియల్. 2017 అక్టోబర్‌లో మొదలైన కార్తీక దీపం సీరియల్ టిఆర్పీ రేటింగ్స్‌లో అగ్రస్థానంలో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు దీన్ని బీట్ చేసే సీరియల్ మరోటి రాలేదంటే వంటలక్క రేంజ్ ఏంటో అర్థం అయిపోతుంది. మరి ఇంతటి పాపులర్ సీరియల్‌లో ఉన్న నటుల స్క్రీన్ నేమ్స్ అందరికీ తెలుసు. మరి వంటలక్క నుంచి మోనిత వరకు వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ ఏంటో ఓ సారి చూద్దాం.

ఇవాళ్టి ఎపిసోడ్‌లో ఉద‌యం అవ్వ‌గానే లేచిన దీపకు హిమ క‌నిపించ‌దు. దీంతో హిమ కోసం వెతుకుతుంది. త‌రువాత లోప‌లికి వెళ్లి సౌర్య‌ను లేపి.. హిమ ఇంట్లో లేద‌ని, క‌నిపించ‌డం లేద‌ని చెబుతుంది. దీంతో ఇద్ద‌రు వెతికేందుకు బ‌య‌లుదేరుతారు. అయితే ఎక్క‌డా క‌నిపించ‌దు. మ‌న‌తో చెప్ప‌కుండా ఎక్క‌డికి వెళ్లి ఉంటుంది అని దీప అన‌గా

ఇంకా చదవండి ...

  Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారింది. నిన్న‌టి ఎపిసోడ్‌లో దీప‌కు, అంజినే నిజం చెప్పి ఉంటాడ‌ని భావించిన మౌనిత‌.. అత‌డిని మాయం చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంటుంది. మ‌రోవైపు కార్తీక్‌కి హిమ యాక్సిడెంట్ గురించి చెప్పిన దీప‌.. నిజాలన్నీ బ‌య‌ట‌ప‌డి, మౌనిత గుట్టు డాక్ట‌ర్ బాబుకు తెలియాల‌ని దేవుడిని ప్రార్థిస్తుంది. ఇక ఇవాళ్టి ఎపిసోడ్‌లో ఉద‌యం అవ్వ‌గానే లేచిన దీపకు హిమ క‌నిపించ‌దు. దీంతో హిమ కోసం వెతుకుతుంది. త‌రువాత లోప‌లికి వెళ్లి సౌర్య‌ను లేపి.. హిమ ఇంట్లో లేద‌ని, క‌నిపించ‌డం లేద‌ని చెబుతుంది. దీంతో ఇద్ద‌రు వెతికేందుకు బ‌య‌లుదేరుతారు. అయితే ఎక్క‌డా క‌నిపించ‌దు. మ‌న‌తో చెప్ప‌కుండా ఎక్క‌డికి వెళ్లి ఉంటుంది అని దీప అన‌గా.. రాత్రి మ‌న‌తో స‌ర‌దాగానే ఉంది క‌దా అని సౌర్య అంటుంది. ఉద‌యం 5 గంట‌ల‌కు వాష్ రూమ్‌కి వెళ్లి వ‌చ్చింది అప్పుడు కూడా చూశాను అని దీప అన‌గా.. నాన్న‌ను చూడాల‌నిపించి వెళ్లిందా..? అని సౌర్య అంటుంది. దానికి దీప‌..లేదు లేదు వెళ్ల‌దు. ఈసారి చాలా ప‌ట్టుద‌ల‌గా ఉంది. మీ నాన్న‌నే వ‌చ్చి అంద‌రినీ తీసుకెళ్లాల‌ని పంతంతో ఉంది అని అంటుంది. వెంట‌నే సౌర్య‌, నానమ్మ‌కు ఫోన్ చేస్తే అని అన‌గా.. ఇప్పుడు వ‌ద్దు మ‌నం వెతికిన త‌రువాత చేద్దాం అని దీప అంటుంది. మ‌నం వెతికిన త‌రువాత ఏంటి అమ్మా.. వెత‌క‌డం అయిపోయింది అని సౌర్య అన‌గా.. అంతేనా అని దీప అడుగుతుంది.

  వెంట‌నే సౌర్య‌.. హిమ మ‌న ఇంట్లో లేదు, సౌర్య ఇంట్లో లేదు. ఈ చుట్టుపక్క‌ల ఎక్క‌డా లేదు. అంటే నాన్న‌ను చూడాల‌నిపించి వెళ్లిందేమో అని అంటుంది. వెళితే చెప్ప‌కుండా ఎందుకు వెళుతుంది అత్త‌మ్మా, వెళ‌తానంటే నేను కాదంటానా..? వాళ్లిద్ద‌రికి ఒక‌రంటే ఒక‌రికి ఎంత ప్రేమ ఉందో నాకు తెలీదా..? బ‌ల‌వంతంగా తండ్రిని, బిడ్డ‌ను వేరుచేసే రాక్ష‌సినా..? అని దీప అన‌గా.. హిమ ఒక‌వేళ నాన్న కోసం వెళ్లాలంటే త‌న‌కు ఇల్లు తెలీదు క‌ద‌మ్మా.. వార‌ణాసి ఆటోలో వెళ్లిందేమో అని సౌర్య చెబుతుంది. అవును ఒక‌వేళ వెళ్లి ఉంటే వాడి ఆటోలోనే వెళ్లి ఉండాలి. ఒంట‌రిగా వెళ్ల‌లేదు అని లోప‌లికి వెళ్లి వార‌ణాసికి ఫోన్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసిన వార‌ణాసిని హిమ ఏమైనా ఫోన్ చేసిందా..? అని అడుగుతుంది. లేద‌క్కా.. ఏమైంది అని వార‌ణాసి అడ‌గ్గా.. హిమ ఇంట్లో లేదు వార‌ణాసి ఎంత వెతికినా క‌నిపించ‌డం లేదు అని దీప అంటుంది. అంతా వెతికారా..? అని వార‌ణాసి అడ‌గ్గా.. అంతా వెతికాము. ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. నాకు భ‌యం అవుతుంది. నువ్వు రా అని అన‌గా.. వార‌ణాసి ఇంటి నుంచి బ‌య‌లుదేరుతాడు.

  మ‌న‌తో చెప్ప‌కుండా హిమ ఎక్క‌డికి వెళ్ల‌దు. మ‌రి ఏమై ఉంటుంది..? అని దీప అన‌గా.. నాన్న‌కు ఫోన్ చేస్తే అని సౌర్య అంటుంది. వెంట‌నే దీప‌.. నాన్న‌కా..? హిమ క‌నిపించ‌డం లేద‌నా..? ఈ సంగ‌తి తెలిస్తే న‌న్ను చంపేస్తాడు మీ నాన్న‌..? హిమ ఏద‌ని అడిగితే..? ఏమైంద‌ని నిల‌దీస్తే..? ఏం స‌మాధానం చెప్పాలి..? నేనేం చెప్పాలి..? అని దీప ఏడుస్తూ ఉంటుంది. వెంట‌నే సౌర్య‌.. నాన్న‌కు ఏదైనా చెప్పొచ్చు. ముందు హిమ ఇక్క‌డ ఉందో ఎలా తెలిసేది..? నువ్వు ఏడ‌వ‌క‌మ్మా..? అని అంటుంది. హిమ ఎందుకిలా చేసింది..? ఎక్క‌డికి వెళ్లింది..? మీ నాన్న‌కు ఫోన్ చేసి చెబుదామా.? అంటే డాక్ట‌ర్ బాబుకు తెలిసిపోతుంది. ఆయ‌న‌కు తెలిస్తే క‌చ్చితంగా న‌న్ను బ‌త‌క‌నివ్వ‌రు. ఈయ‌న‌కు భ‌య‌ప‌డాలా.?? హిమ కోసం టెన్ష‌న్ ప‌డాలా..? నాకైతే ఏం అర్థః కావడం లేదు అని అంటుండ‌గా.. ఇందులో మ‌న త‌ప్పు ఏం ఉంద‌మ్మా..? అని సౌర్య అంటుంది.

  కార్తీక దీపం(Hot Star)

  మీ నాన్న‌కు ఎందులోనైనా నా త‌ప్పే క‌నిపడుతుంద‌మ్మా.. నేనే.. పెద్ద ప్ర‌గ‌ల్బాలు ప‌లికి హిమ‌ను ఇక్క‌డ‌కు తీసుకొచ్చాను. హిమ ఎక్క‌డ అని అడిగితే నా ద‌గ్గ‌ర స‌మాధానం ఏముంటుంది. అస‌లు హిమ ఏమై ఉంటుంది. ఎక్క‌డ ఉందో.? అని అంటుండ‌గా.. వార‌ణాసి వ‌స్తే ఆటోలో వెళ్లి వెతుకుదాం. నువ్వు టెన్ష‌న్ ప‌డ‌క‌మ్మా..? నిన్ను చూస్తుంటే నాకు భ‌యం వేస్తుంది. హిమ‌కు ఏం కాదు అని చెబుతుంది. ఇక దీప మ‌న‌సులో భ‌గ‌వంతుడా.. డాక్ట‌ర్ బాబుకు తెలిసే లోపు హిమ తిరిగి రావాలి అని కోరుకుంటుంది. అదే స‌మ‌యానికి కార్తీక్, హిమ‌ను చూసేందుకు దీప ఇంటికి వ‌స్తాడు. కార్తీక్‌ని చూసి సౌర్య కాస్త భ‌యంగా.. అమ్మా అని పిలుస్తుంది. హిమ వ‌స్తుందా..? అని దీప అడ‌గ్గా.. హిమ కాద‌మ్మా నాన్న వ‌స్తున్నాడు అని చెబుతుంది. దాంతో దీప భ‌యం మ‌రింత పెరుగుతుంది. డాక్ట‌ర్ బాబా..? వ‌చ్చేశాడా..? అని అడ‌గ్గా.. సౌర్య అవును అంటుంది. వెంట‌నే హిమ‌.. అయిపోయింది. ఇవాళ ఆయ‌న చేతిలో నాకు ఉంది. హిమ ఎంత‌ప‌ని చేవావ‌మ్మా..? అని అనుకుంటూ ఉంటుంది.

  ఇక దీప ఇంటి గుమ్మం ద‌గ్గ‌రకు రాగా.. సౌర్య అక్క‌డే ఉంటుంది. దాంతో కార్తీక్.. ఏంటే రౌడీ ఇక్క‌డ నిల‌బ‌డ్డావు..? ఏంటే మాట్లాడ‌వు మీ అమ్మ ఏమైనా అనిందా..? అంటే చెప్పు నీది, నాది, హిమ‌ది అన్నీ క‌లిపి అప్ప‌చెబుదాం మీ అమ్మ‌కు అని అంటాడు. ఇక కార్తీక్ లోప‌లికి రాబోతుండ‌గా.. సౌర్య అడ్డుకుంటుంది. దానికి కార్తీక్.. ఏంటే లోప‌లికి రానివ్వ‌వా.?? అని అడుగుతాడు. వెంట‌నే సౌర్య అడ్డుతీస్తుంది. లోప‌లికి వ‌చ్చిన కార్తీక్.. హిమ త‌ల్లి ఇంకా లేవ‌లేదా..? అని అడుగుతాడు. ఇక కార్తీక్‌ని చూసి ఇద్ద‌రూ భ‌య‌ప‌డుతూ ఉంటారు. వెంట‌నే కార్తీక్.. ఏంటి అలా చూస్తున్నావు. క‌న్నప్రేమ గొప్ప‌దా..? పెంచిన ప్రేమ గొప్ప‌దా..? అంటూ ఇప్పుడు క‌నుబొమ్మ పైకెత్తి మ‌రీ ప్ర‌శ్నించాల‌నుకుంటున్నావేమో..? నేను ఇప్పుడు ఏ ప్రేమ‌ను త‌క్కువ చేయ‌డానికి రాలేదు. ఏ ప్రేమ‌ను ఎక్కువ చేసి మాట్లాడ‌టానికి రాలేదు. ఏదో హిమ నా క‌ల‌లోకి వ‌చ్చింది. చూడాల‌ని ఉంది డాడీ అంది. నాకు చూడాల‌ని ఉందమ్మా అన్నాను. అయితే రావ‌చ్చు క‌దా డాడీ అంది. వ‌స్తాన‌మ్మా అన్నాను. కాదు ప్రామిస్ చేయి. అప్పుడే వ‌స్తావ‌ని న‌మ్ముతాను అంది. త‌ప్ప‌లేదు మ‌రి ప్రామిస్ చేశాను. అందుకు నేను వ‌చ్చాను అని అంటాడు. ఇక దీప‌, సౌర్య ఇద్ద‌రు ఏం మాట్లాడ‌క‌పోగా.. ఏంటి మిడిగుడ్లు వేసుకొని చూస్తున్నావు. ఈ రౌడీ అంతే, నువ్వు అంతే.. ఏం భ‌యం ప‌ట్టుకుంది మీకు. హిమ‌కు ఇష్టం లేకుండా బ‌ల‌వంతంగా ఎత్తుకుపోవ‌డానికి వ‌చ్చాను అనుకుంటున్నారా..? ఏడ్చారులే మాట్లాడ‌టానికి వ‌చ్చాను అంతే. ఏది నా బంగారు త‌ల్లి, ఇంకా నిద్ర లేవ‌లేదా..? అక్క‌డైతే నాతో పాటు జాగింగ్‌కి తీసుకెళ్లేదాన్ని. మీ బ‌స్తీలో అలాంటి ఏం ఉంటాయి. ఆన్‌లైన్ క్లాస్‌లే క‌దా.. అందుకే లేటుగా లేస్తుంది అనుకుంటా. కొంచెం లేపుతావా.?? డాడీ వ‌చ్చాడ‌ని చెప్పు అని సౌర్య‌కు చెబుతాడు కార్తీక్. టెన్ష‌న్‌ని భ‌రించ‌లేద‌ని దీప‌.. బాటిల్ నీళ్లు గ‌డ‌గ‌డా తాగేస్తుంది.

  దాంతో కార్తీక్.. ఏంటి ఏదో తేడా కొడుతోంది. ఏం జ‌రిగింది..? అని అడుగుతాడు. వెంట‌నే దీప భ‌య‌ప‌డుతూ హిమ లేదు అని చెబుతుంది. దానికి కార్తీక్.. లేదా..? నా కోసం మా ఇంటికి వెళ్లిందా.? అని అడుగుతాడు. అక్క‌డికి రాలేదా..? అని దీప అడ‌గ్గా.. రాలేదా అంటావేంటి..? వ‌స్తే నేను ఇక్క‌డికి ఎందుకు వ‌స్తాను. నేను బ‌య‌లుదేరాకా వ‌చ్చి ఉంటుందా..? అని కార్తీక్ అన‌గా.. ఉద‌యం ఆరు గంట‌ల నుంచే అని దీప త‌ట‌ప‌టాయిస్తూ ఉంటుంది. ఆరు గంట‌ల నుంచే అని కార్తీక్ అడ‌గ్గా.. క‌నిపించ‌డం లేదు అని దీప చెబుతుంది. వెంట‌నే పైకి లేచిన కార్తీక్.. ఏంటి.? ఏం మాట్లాడుతున్నావే..? హిమ ఇక్క‌డ లేక‌పోవ‌డం ఏంటి..? క‌నిపించ‌క‌పోవ‌డం ఏంటి.? అని అడుగుతాడు. దానికి దీప భ‌య‌ప‌డుతూ.. తెలీడం లేదు డాక్ట‌ర్ బాబు. 5 గంట‌ల‌కు లేచి చూశాను ఉంది. ఆరు గంట‌ల‌కు లేచి చూస్తే లేదు అని అంటుంది. అప్పుడే ఇంట్లోకి వ‌చ్చిన వార‌ణాసి అక్కా.. వెళ్దామా..? అని చెప్పి అక్క‌డ కార్తీక్ ఉండ‌టం చూసి భ‌య‌ప‌డి వెన‌క్కి తిరుగుతుంటాడు.

  వెంట‌నే కార్తీక్.. రేయ్ ఆగు అంటాడు. దానికి వార‌ణాసి.. నాకేం తెలీదు డాక్ట‌ర్ బాబు అంటాడు. వెళ‌దాం అన్నావు ఎక్క‌డికి అని కార్తీక్ ప్ర‌శ్నిస్తాడు. హిమ‌ను వెత‌క‌డానికి అని వార‌ణాసి అంటాడు. దానికి కార్తీక్.. వెత‌క‌డానికా.?? అంటే హిమ నిజంగానే క‌నిపించ‌డం లేదా..? ఏం మాట్లాడవేంటి..? అని దీప‌పై కోపం ప్ర‌ద‌ర్శిస్తాడు. వెంట‌నే సౌర్య‌.. అమ్మ‌ను కొట్ట‌కండి డాక్ట‌ర్ బాబు. అమ్మ‌కు ఏం తెలీదు. లేచి చూసే స‌రికి హిమ ఇంట్లో లేదు అని కార్తీక్ చేయి ప‌ట్టుకుంటుంది.

  కార్తీక దీపం(Hot Star)

  ఇక కార్తీక్.. సౌర్య‌, వార‌ణాసిల‌ను పంపి వెత‌క‌మ‌ని చెబుతాడు. వారు వెళ్లాక.. ఇప్పుడు చెప్ప‌వే ఏం జ‌రిగింది అని కార్తీక్, దీప‌ను అడుగుతాడు. అస‌లు ఏం జ‌ర‌గ‌లేదు డాక్ట‌ర్ బాబు అని దీప చెబుతుంది. రాత్రి కూడా బాగానే ఉంది. సౌర్య‌, హిమ చాలాసేపు క‌బుర్లు చెప్పుకున్నారు. 5 గంట‌ల‌కు హిమ వాష్‌రూమ్ అంటే లేచి తీసుకెళ్లాను. త‌రువాత వ‌చ్చి ప‌డుకున్నాము. నాకు మెలుకువ వ‌చ్చే స‌రికి హిమ లేదు. నాకు గుండె ఆగినంత ప‌ని అయ్యింది. అప్ప‌టి నుంచి వెతుకుతూనే ఉన్నాము. మీ కోసం ఏమైనా వ‌చ్చిందేమోన‌ని అక్క‌డికే రావాల‌నుకున్నాము. అందుకే వార‌ణాసి ర‌మ్మ‌న్నాము అని అంటుంది.

  ఇక కార్తీక్ కోపంతో.. కొట్టేస్తానే నిన్ను. మామూలుగా కొట్ట‌ను. ఏం ఆట‌లుగా ఉందా..? హిమ క‌నిపించ‌కుండా పోవ‌డ‌మేంటే..? నా ద‌గ్గ‌రికి రాకుండా వెళ్ల‌డ‌మేంటి..? నువ్వు ఇంత బాధ్య‌త లేకుండా ఉంటావా..? ఈ మ‌ధ్య‌నీకు రాచ కార్యాలు ఎక్కువ అయ్యాయే. పొద్దున లేస్తే న‌డిచే నిప్పుక‌ణం, ర‌గిలే అగ్ని క‌ణం అంటూ నిప్పులు కురిపిస్తూ తిరుగుతూ ఉంటావు. పిల్ల‌ల‌ను గాలికి వ‌దిలేశావు క‌దే. అన‌వ‌స‌రంగా ఊరి మీద ప‌డ‌తావు. పోలీస్ కంప్లైంట్ అంటావు.. నువ్వు ఏ గంగ‌లోనైనా దూక‌వే నాకెందుకు.. నాకు ఇప్పుడు నా కూతురు కావాలి. ఎలాగైనా కావాలి. నేను ఇప్పుడు దాన్ని చూడ‌లేక‌పోతున్నానే. క‌న‌ప‌డ‌ట్లేదు అంటే ప్రాణాల‌తో ఉంటాను అనుకుంటున్నావా..? అని ఆవేశ‌ప‌డుతాడు. వెంట‌నే దీప‌.. డాక్ట‌ర్ బాబు మీరు కంగారుప‌డ‌కండి. ఏం కాదు. మ‌న హిమ‌కు ఏం కాదు. రాత్రి దాకా బాగానే ఉంది. ఎలాంటి ఆలోచ‌న గానీ, దిగులు కానీ క‌నిపించ‌లేదు. ఎక్క‌డికి వెళ్ల‌దు అని అంటుంది.

  మ‌ళ్లీ ఎక్క‌డికి వెళ్ల‌దు అంటావేంటే..? ఎక్క‌డికి వెళ్ల‌క‌పోతే ఉండాలి క‌దా.. పోనీ నా దగ్గ‌ర‌కు అయినా రావాలి క‌దా..? ఉంటే అక్క‌డా, లేదంటే ఇక్క‌డా ఉండాలి కదా..? నువ్వు నిజంగా ఇంట్లో ఉన్నావా..? దాన్ని అస‌లు ప‌ట్టించుకుంటున్నావా..? ననా మీద ప‌డ్డ నింద‌ను చెరిపేసుకుంటాను అంటూ క‌న్న ప్రేమ‌ను ప‌క్క‌న‌పెట్టి ఊరంతా తిరుగుతున్నావా..? ఏం చేశావు నా కూతురిని నిన్ను అంటూ దీప మెడ పట్టుకునేందుకు వెళ్లి ఆగిపోతాడు. నా క‌న్న బిడ్డ‌నే క‌దా డాక్ట‌ర్ బాబు నేనేం చేస్తాను అని దీప అన‌గా.. పాపిష్టి దానా.. నిన్ను బాగా తిట్టాల‌నిపిస్తుందే.. ఇప్పుడు ఎన్ని తిట్టి ఏం లాభం. నా కూతురిని ముందు నేను వెతుక్కోవాలి. ల‌క్ష్మ‌మ్మ ద‌గ్గ‌రికి వెళ్లి ఉంటుందా..? తుల‌సి ద‌గ్గ‌రికి వెళ్లి ఉంటుందా..? నువ్వు చేసే ప్ర‌య‌త్నాలు చూసి నీలాగే త‌యార‌య్యిందా..? అస‌లు ఏం అర్థం కావ‌డం లేదు అని అక్క‌డి నుంచి వెళుతుంటాడు.

  వెంట‌నే దీప‌.. డాక్ట‌ర్ బాబు ఎక్క‌డికి అని అడ‌గ్గా.. కార్తీక్ ఏట్లోకి. నీకెందుకే, నిన్ను న‌మ్మి నీ ఇంట్లో వ‌దిలిపెట్టాను చూడు. అందుకు న‌న్ను నేను అనుకోవాలి అంటాడు. దానికి దీప.. నేను వ‌స్తాను మీతో అన‌గా..చంపేస్తాను. నా ఏడుపు నేను ఏడుస్తాను. నీ ఏడుపు చూస్తూ కూడా నేను తిర‌గ‌లేను అని చెప్పి కార్తీక్ వెళ‌తాడు. ఇక కార్తీక్ బ‌య‌ట‌కు రాగానే మౌనిత కాల్ చేస్తుంది. హిమ త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన‌ట్లు చెబుతుంది. హిమ అక్క‌డ ఉందా..? స‌రే నేను వ‌స్తాను అని కార్తీక్ బ‌య‌లుదేరుతాడు. ఇక ఇంట్లో హిమ‌కు మౌనిత బిస్కెట్లు తెచ్చి ఇస్తుంది. అప్పుడు ప్రియ‌మ‌ణి మ‌న‌సులో.. అంద‌రికీ బిస్కెట్లు వేస్తోంది. పాపం ప‌సిపిల్ల‌ను కూడా పావుగా వాడుకుంటుంది. దీనికి ఆ దీప‌మ్మే క‌రెక్ట్ అని అనుకుంటుంది.

  కార్తీక దీపం(Hot Star)

  ఇక తీసుకో హిమ అని మౌనిత అన‌గా.. నాకు వ‌ద్దు. అమ్మ నా కోసం టెన్ష‌న్ ప‌డుతూ ఉంటుంది. నేను వెళ్లాలి అని చెబుతుంది. వెళ్దులే కానీ నీ కోసం మీ డాడీ వ‌స్తున్నాడు అని మౌనిత చెబుతుంది. డాడీకి ఎందుకు చెప్పారు అని హిమ అడ‌గ్గా.. నా ద‌గ్గ‌ర ఉన్నావంటే ఏం అన‌డు. మీరు మా అమ్మా నాన్న‌కు తొంద‌ర‌గా క‌ల‌పండి ప్లీజ్.. నాన్న ద‌గ్గ‌రుంటే అమ్మ ఉండదు. అమ్మ ద‌గ్గ‌రుంటే నాన్న ఉండ‌డు. నాకు ఇద్ద‌రు కావాలి అని అడుగుతుంది. ఇక రేప‌టి ఎపిసోడ్ ప్రోమోలో హిమ‌ను ఇంటికి ర‌మ్మ‌ని అడుగుతాడు కార్తీక్. అంతేకాకుండా అమ్మ కావాలో... నేను కావాలో నువ్వే తేల్చుకో అని చెబుతాడు. అదే స‌మ‌యానికి దీప వ‌చ్చి హిమ‌ను తీసుకెళ్తుంది. నా ప‌ర్మిష‌న్ అవస‌రం లేదా.? అని కార్తీక్ అడ‌గడం, లేద‌ని హిమ చెప్ప‌డంతో సీరియ‌ల్ మ‌రింత ఆస‌క్తిక‌రంగా మార‌నుంది.

  Published by:Manjula S
  First published:

  Tags: Karthika deepam, Karthika deepam telugu serial

  ఉత్తమ కథలు